జాబ్‌మేళా సందర్శన | Job Mela | Sakshi
Sakshi News home page

జాబ్‌మేళా సందర్శన

Published Thu, Oct 20 2016 11:54 PM | Last Updated on Mon, Sep 4 2017 5:48 PM

జాబ్‌మేళా సందర్శన

జాబ్‌మేళా సందర్శన

జూపూడి (ఇబ్రహీంపట్నం) :    నోవా ఇంజినీరింగ్‌ కళాశాలలో నిర్వహిస్తున్న జాబ్‌మేళాను డిప్యూటీ స్పీకర్‌ మండలి బుద్ధప్రసాద్‌ గురువారం పరిశీలించారు. అభ్యర్థులు రిజిస్ట్రేషన్‌ చేయించుకునే బ్లాక్‌ను సందర్శించి ఆన్‌లైన్‌ విధానం, కౌన్సెలింగ్, అడ్మిట్‌ కార్డులు పొందే ప్రక్రియను వలంటీర్లను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర కాపు కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాబ్‌మేళాకు విశేష స్పందన ఉందని చెప్పారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఆయన వెంట కాపు కార్పొరేషన్‌ రాష్ట్ర చైర్మన్‌ చలమలశెట్టి రామానుజయ, కళాశాల డైరెక్టర్‌ జె.శ్రీనివాసరావు, ప్రిన్సిపాల్‌ శ్రీనాథ్‌ తదితరులు ఉన్నారు.  


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement