Dy.Speakar
-
రోడ్డు కోసం 13 కిలోమీటర్ల పాదయాత్ర
అవనిగడ్డ : మోపిదేవి మండలంలోని మెరకనపల్లి గ్రామానికి రహదారి నిర్మించాలని కోరుతూ గ్రామస్తులు శనివారం పాదయాత్ర నిర్వహించారు. పదేళ్ల నుంచి గ్రామానికి వెళ్లే 1.2 కిలో మీటర్ల రహదారి దెబ్బతినడంతో ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఎవరూ పట్టించుకోవడంతో గ్రామస్తులు మెరకనపల్లి నుంచి అవనిగడ్డ వరకూ 13 కిలో మీటర్లు మండుటెండలో పాదయాత్ర చేశారు. అనంతరం ఉపసభాపతి మండలి బుద్దప్రసాద్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీపీఎం నాయకులు సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా వారిపై బుద్దప్రసాద్ అసహనం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి మాగంటి హరిబాబు, సీపీఎం నాయకులు శీలం నారాయణరావు, వాకా రామచంద్రరావు, ఆవల బసవయ్య, వై.మధు, మాజీ వైస్ ఎంపీపీ యన్నం శ్రీనివాసరావు, మాజీ సర్పంచి వంగల నాంచారయ్య, రాధాకృష్ణ, యర్రంశెట్టి సునీల్, నాగమల్లేశ్వరరావు పాల్గొన్నారు. -

జాబ్‌మేళా సందర్శన
జూపూడి (ఇబ్రహీంపట్నం) : నోవా ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహిస్తున్న జాబ్‌మేళాను డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ గురువారం పరిశీలించారు. అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేయించుకునే బ్లాక్‌ను సందర్శించి ఆన్లైన్ విధానం, కౌన్సెలింగ్, అడ్మిట్ కార్డులు పొందే ప్రక్రియను వలంటీర్లను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర కాపు కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాబ్‌మేళాకు విశేష స్పందన ఉందని చెప్పారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఆయన వెంట కాపు కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ చలమలశెట్టి రామానుజయ, కళాశాల డైరెక్టర్ జె.శ్రీనివాసరావు, ప్రిన్సిపాల్ శ్రీనాథ్ తదితరులు ఉన్నారు.