
రోడ్డు కోసం 13 కిలోమీటర్ల పాదయాత్ర
అవనిగడ్డ : మోపిదేవి మండలంలోని మెరకనపల్లి గ్రామానికి రహదారి నిర్మించాలని కోరుతూ గ్రామస్తులు శనివారం పాదయాత్ర నిర్వహించారు. పదేళ్ల నుంచి గ్రామానికి వెళ్లే 1.2 కిలో మీటర్ల రహదారి దెబ్బతినడంతో ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఎవరూ పట్టించుకోవడంతో గ్రామస్తులు మెరకనపల్లి నుంచి అవనిగడ్డ వరకూ 13 కిలో మీటర్లు మండుటెండలో పాదయాత్ర చేశారు. అనంతరం ఉపసభాపతి మండలి బుద్దప్రసాద్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీపీఎం నాయకులు సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా వారిపై బుద్దప్రసాద్ అసహనం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి మాగంటి హరిబాబు, సీపీఎం నాయకులు శీలం నారాయణరావు, వాకా రామచంద్రరావు, ఆవల బసవయ్య, వై.మధు, మాజీ వైస్ ఎంపీపీ యన్నం శ్రీనివాసరావు, మాజీ సర్పంచి వంగల నాంచారయ్య, రాధాకృష్ణ, యర్రంశెట్టి సునీల్, నాగమల్లేశ్వరరావు పాల్గొన్నారు.