మాకు రక్షణ కల్పించండి: ఏపీ బీజేపీ నేతలు | AP BJP Leaders Give Memorandum At DGP Office For Security | Sakshi
Sakshi News home page

Published Tue, Jan 8 2019 3:11 PM | Last Updated on Fri, Mar 29 2019 9:12 PM

AP BJP Leaders Give Memorandum At DGP Office For Security - Sakshi

సాక్షి, విజయవాడ: తమకు రక్షణ కల్పించాలని ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ నేతలు పోలీసు శాఖను ఆశ్రయించారు. మంగళవారం డీజీపీ కార్యాలయానికి వచ్చిన బీజేపీ నేతలు.. డీజీపీతో పాటు ఉన్నతాధికారులు అందుబాటులో లేకపోవడంతో అక్కడి అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఇటీవల కాలంలో తమ పార్టీ నేతలపై దాడులు జరగడంతో బీజేపీ నేతలు ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది.

ఈ సందర్భంగా బీజేపీ నేతలు మాట్లాడుతూ.. బీజేపీ నేతలకు ఏపీలో రక్షణ లేకుండా పోయిందని మండిపడ్డారు. బీజేపీ నాయకులకు పోలీసులు రక్షణ కల్పించాలని కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఓ మహిళపై బెదిరింపులకు పాల్పడటం దారుణమని అన్నారు. ఆయన వెంటనే బైండోవర్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. చంద్రబాబు వ్యాఖ్యలు రెచ్చగొట్టేలా ఉన్నాయని తెలిపారు. టీడీపీ రౌడీలు విజయవాడ నుంచి గుంటూరు వెళ్లి ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఇంటిపై దాడి చేశారని ఆరోపించారు. చంద్రబాబు పద్ధతి మార్చుకోకపోతే ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement