memorandum
-
India-US: సెమీకండక్టర్లపై భారత్‌తో ఒప్పందం
న్యూఢిల్లీ: సెమీ కండక్టర్లకు సంబంధించి భారత్‌తో అవగాహన ఒప్పందం కుదుర్చుకోనున్నట్టు అమెరికా రక్షణ మంత్రి గినా రైమాండో తెలిపారు. ఈ రంగంలో అపార అవాకాశాలున్నాయంటూ, ఇరు దేశాల మధ్య సహకారానికి ఒప్పందం తోడ్పడుతుందన్నారు. ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్లకు సంబంధించి యూఎస్ కంపెనీలు తమ సరఫరా వ్యవస్థను వివిధ దేశాల మధ్య విస్తరించుకోవాలనే (వైవిధ్యం) బలమైన ఆకాంక్షతో ఉన్నట్టు రైమాండో తెలిపారు. భారత్ పర్యటనకు వచ్చిన ఆమె ఢిల్లీలో మీడియాతో మాట్లడారు. ‘‘రెండు దేశాల మధ్య సెమీ కండక్టర్లు, వాటికి సంబంధించి వాణిజ్య అవకాశాలపై మాట్లాడుకున్నాం. సెమీకండక్టర్ల ఎకోసిస్టమ్‌లో పెట్టుబడులను ప్రోత్సహించేందుకు కావాల్సిన విధానాలపై చర్చలను ఏ విధంగా కొసాగించాలనే అంశంపైనా మాట్లాడాం. జాయింట్ వెంచర్లు లేదా టెక్నాలజీ భాగస్వామ్యాలకు సంబంధించి ఈ చర్చలు జరిగాయి’’అని రైమాండో వివరించారు. స్వల్పకాల అవకాశాలతోపాటు, దీర్ఘకాల వ్యూహాత్మక అవకాశాలను కోరుకుంటున్నట్టు చెప్పారు. ఎలక్ట్రానిక్స్ సరఫరా వ్యవస్థలో అమెరికా, భారత్ పెద్ద పాత్రను పోషించగలవన్నారు. రెండు దేశాలూ వేటికవే సెమీకండక్ట్ రాయితీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయంటూ.. ఈ విషయంలో రెండు దేశాలు ఏ విధంగా సహకారం ఇచ్చిపుచ్చుకోగలవనే దానిపై మాట్లాడినట్టు చెప్పారు. భారత్–అమెరికా వాణిజ్య చర్చా కార్యక్రమం, భారత్–అమెరికా సీఈవోల ఫోరం సమావేశం కోసం రైమాండో భారత్‌కు వచ్చారు. ఆమె వెంట అత్యున్నత స్థాయి వాణిజ్య బృందం కూడా ఉంది. -
మా గవర్నర్ అనర్హుడు.. తప్పించండి: డీఎంకే
న్యూఢిల్లీ: తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి తీరుపై.. అక్కడి ప్రభుత్వంలో పేరుకుపోయిన వ్యతిరేకత తారా స్థాయికి చేరుకుంది. శాంతి భద్రతలకు ఆయన్నొక ముప్పుగా పరిణమించారంటూ ఆరోపించిన అధికార డీఎంకే.. ఈ మేరకు ఆయన్ని తప్పించాలంటూ ఏకంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఒక మెమోరాండమ్ సమర్పించింది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని ప్రజలకు సేవ చేయకుండా అడ్డుకోవడం మాత్రమే కాదు.. ఆయన మత విద్వేషాల్ని రెచ్చగొడుతున్నాడు అంటూ మెమోరాండమ్‌లో డీఎంకే, దాని మిత్రపక్షాలు ఆరోపించాయి. రాజ్యాంగాన్ని రక్షిస్తానని, చట్టాన్ని పరిరక్షిస్తానని చేసిన ప్రమాణాన్ని గవర్నర్ ఆర్ఎన్ రవి ఉల్లంఘించారు. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను కావాలనే జాప్యం చేస్తున్నారు. ప్రభుత్వం పట్ల ప్రజల్లో అసంతృప్తిని పెంచేలా ఆయన చేస్తున్న ప్రకటలను.. ఒకరంగా దేశద్రోహంగా కూడా పరిగణించవచ్చు. రాజ్యాంగ బద్ధమైన పదవికి ఆయన అనర్హుడు. కాబట్టి, తొలగింపునకు ఆయన అన్ని విధాల ఆర్హుడు అంటూ డీఎంకే, రాష్ట్రపతి ముర్ముకి నివేదించింది. ఇదీ చదవండి: గవర్నర్ వైఖరిపై ఎల్డీఎఫ్ విస్తృతస్థాయి నిరసన -
టీఎస్ జెన్కో అధికారులకు పులిచింతల ఎస్ఈ మెమోరాండం
సాక్షి, విజయవాడ: ప్రొటోకాల్ ప్రకారం పులిచింతల ప్రాజెక్టులో విద్యుత్ ఉత్పత్తి నిలిపివేయాలని ఎస్ఈ రమేష్‌బాబు ఆదేశించారు. విద్యుదుత్పత్తికి, నీటి కేటాయింపులకు ప్రొటోకాల్ ఉందని తెలిపారు. ఇందుకు సంబంధించి తెలంగాణ అధికారులు, ఏపీ అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు. గడిచిన రెండేళ్లలో ప్రొటోకాల్ ప్రకారమే విద్యుదుత్పత్తి జరిగింది.. కానీ ఇప్పుడు తెలంగాణ అధికారులు ప్రొటోకాల్ పాటించలేదని తెలిపారు. జూన్ 29 నుంచి టీఎస్ జెన్కో విద్యుదుత్పత్తి చేస్తోందన్నారు. డెల్టాలో ఇప్పటివరకు నారుమళ్లు ప్రారంభం కాలేదు, నీటి అవసరాలు లేవని.. ఈ పరిస్థితుల్లో నీటిని కిందకు వదిలితే సముద్రంలో కలుస్తాయని తెలిపారు. ఇరిగేషన్ అవసరాలు ప్రారంభమైన తర్వాతే.. విద్యుదుత్పత్తి ప్రారంభించాలని తెలంగాణ అధికారులను కోరాం అని ఎస్ఈ రమేష్ బాబు తెలిపారు. చదవండి: తెలంగాణను నియంత్రించండి -
మాకు రక్షణ కల్పించండి: ఏపీ బీజేపీ నేతలు
సాక్షి, విజయవాడ: తమకు రక్షణ కల్పించాలని ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలు పోలీసు శాఖను ఆశ్రయించారు. మంగళవారం డీజీపీ కార్యాలయానికి వచ్చిన బీజేపీ నేతలు.. డీజీపీతో పాటు ఉన్నతాధికారులు అందుబాటులో లేకపోవడంతో అక్కడి అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఇటీవల కాలంలో తమ పార్టీ నేతలపై దాడులు జరగడంతో బీజేపీ నేతలు ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ సందర్భంగా బీజేపీ నేతలు మాట్లాడుతూ.. బీజేపీ నేతలకు ఏపీలో రక్షణ లేకుండా పోయిందని మండిపడ్డారు. బీజేపీ నాయకులకు పోలీసులు రక్షణ కల్పించాలని కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఓ మహిళపై బెదిరింపులకు పాల్పడటం దారుణమని అన్నారు. ఆయన వెంటనే బైండోవర్ చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు వ్యాఖ్యలు రెచ్చగొట్టేలా ఉన్నాయని తెలిపారు. టీడీపీ రౌడీలు విజయవాడ నుంచి గుంటూరు వెళ్లి ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఇంటిపై దాడి చేశారని ఆరోపించారు. చంద్రబాబు పద్ధతి మార్చుకోకపోతే ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. -
కలెక్టర్‌కు క్యామ వినతిపత్రం
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : ‘మా పార్టీకి కూడా ఎకరం భూమి కేటాయించండి. జాగ కేటాయిస్తే.. భవనం నిర్మించుకుంటాం’ అని రాజకీయ పార్టీలు అభ్యర్థిస్తున్నాయి. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ఆఫీసులకు జిల్లాలో ఎకరం చొప్పున కేటాయించేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. వారం రోజుల క్రితం జరిగిన కేబినెట్లో జిల్లాకో గులాబీ భవన్‌కు ఎకరం భూమిని కేటాయించిన సర్కారు.. ఇతర పార్టీలకు కూడా ఇదే విధానాన్ని వర్తింపజేస్తామని ప్రకటించింది. గజానికి రూ.వెయ్యి చొప్పున స్థలాలను బదలాయిస్తామని స్పష్టం చేసింది. ఇదే అదనుగా టీడీపీ జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి గురువారం డీఆర్ఓ స్వర్ణలతను కలిసి భూమిని కేటాయించాలని కోరారు. తాజాగా డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేశ్ కూడా కలెక్టర్ రఘునందన్‌రావును ఇదే విషయమై సంప్రదించారు. నూతన కార్యాలయం నిర్మించుకునేందుకు జిల్లా కేంద్రం సమీపంలో ఎకరం భూమిని కేటాయించాలని ఆయన కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. వాస్తవానికి గతంలో టీడీపీకి ఎల్బీనగర్లో పార్టీ ఆఫీసు కోసం అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం విలువైన స్థలాన్ని కేటాయించింది. దీంట్లో పార్టీ కార్యాలయం నిర్మించకపోగా.. అన్యాక్రాంతమైంది. మరోవైపు ఇటీవల శంషాబాద్‌లో సొంత వనరులతో భూమిని సేకరించిన బీజేపీ కార్యాలయాన్ని నిర్మిస్తోంది. ఇక ఉభయ కమ్యూనిస్టులు రాష్ట్ర పార్టీ కార్యాలయంలో కొలువుదీరారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో వామపక్షాలు, వైఎస్సార్ సీపీ, బీజేపీ కూడా స్థలం కోసం కలెక్టరేట్ బాట పట్టే అవకాశం లేకపోలేదు. ఇది ఒక రకంగా జిల్లా యంత్రాంగానికి తలనొప్పి కలిగించే అంశం. భూముల విలువలు ఆకాశాన్నంటుతున్న నేపథ్యంలో కనీస ధరలకు ఎకరం భూమిని కేటాయించాలనే నిర్ణయంపై ప్రజలు మండిపడుతున్నారు. -
రాజ్యాంగాన్ని కాపాడండి ప్లీజ్..
పార్వతీపురం విజయనగరం : ప్రజలహక్కులను కాలరాస్తూ రా జ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్న సర్కారు తీరుపై వైఎస్సార్సీపీ నిరసన తెలియజేసింది. ఈ మేరకు పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త అలజంగి జో గారావు ఆధ్వర్యంలో పట్టణంలోని వైఎస్సార్ విగ్రహం నుంచి ఆస్పత్రి కూడలిలోగల అంబేడ్కర్ వి గ్రహం వరకూ శుక్రవారం ప్రదర్శన చేపట్టి అక్కడ అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా జోగారావు మాట్లాడుతూ రాష్ట్రంలో నాలుగేళ్లుగా రాక్షసపాలన సాగుతోందని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు డైరెక్షన్లో దిగువస్థాయి నాయకులు ప్రభుత్వ ఉద్యోగులపైన, వైఎస్సార్సీపీ కార్యకర్తలపైన దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. పార్వతీపురం పట్టణంలో గురువారం బురదనీరుపై ప్రశ్నించినందుకు ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్, ఆయన అనుచరులు సామాన్యులపై దాడికి పాల్పడడం రాజ్యాంగ విలువలను తుంగలో తొక్కడమేనని చెప్పారు. వారి దౌర్జన్యాన్ని వ్యతిరేకిస్తూ ర్యాలీ నిర్వహించి రాజ్యాంగాన్ని రచించిన అంబేడ్కర్‌నే రాజ్యంగ విలువలు కాపాడాల్సిందిగా కోరుతూ వినతిపత్రం ఇచ్చినట్లు తెలియజేశారు. రాజ్యాంగం సాక్షిగా ప్రమాణం చేసిన ప్రజాప్రతినిధులు అదే రాజ్యాంగ విలువలను కాపాడకుండా రాక్షసుల్లా ప్రవర్తించడం చూసి సభ్యసమాజం తలదించుకుంటోందని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో పార్వతీపురం పట్టణ అధ్యక్షుడు కొండపల్లి బాలకృష్ణ, మునిసిపల్ ఫ్లోర్ లీడర్ మంత్రి రవికుమార్, అరకు పార్లమెంటరీ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంపల గురురాజు, సీనియర్ కౌన్సిలర్లు గొల్లు వెంకటరావు, ఓ.రామారావు, ఎస్.శ్రీనివాసరావు, ఏగిరెడ్డి భాస్కరరావు, బోను ఆదినారాయణ, సర్పంచ్‌లు బొమ్మి రమేష్, ఏగిరెడ్డి తిరుపతిరావు, రణభేరి బంగారునాయుడు, సిగడం భాస్కరరావు, జొన్నాడ శ్రీదేవి, పొట్నూరు జయంతి, గొట్టా శివకేశ్వరరావు, జయంత్, వల్లేపు చిన్నారావు, పాతగోవింద్, పల్లెం కనకరావు, తదితరులు పాల్గొన్నారు. -
టీ–హబ్ మైల్స్టోన్
సాక్షి, సిటీబ్యూరో: అంకుర పరిశ్రమల స్వర్గధామం.. గ్రేటర్‌కు మణిహారమైన ‘టీ–హబ్’ కీర్తికిరీటంలో మరో కలికితురాయి చేరింది. కెనడాకు చెందిన ప్రతిష్ఠాత్మక కెనడా డిజిటల్ మీడియా నెట్వర్క్ (పబ్లిక్–ప్రైవేట్ ఇన్నోవేషన్ హబ్)తో టీ–హబ్ కీలక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో నగరంలో ఇక కెనడా ‘క్లీన్టెక్నాలజీ’అందుబాటులోకి రానుంది. ప్రధానంగా కాలుష్య ఆనవాళ్లు లేకుండా వివిధ రకాల పరిశ్రమల్లో ఉత్పత్తుల పెంపునకు ఈ క్లీన్ టెక్నాలజీ దోహదం చేయనుంది. మరోవైపు బయో టెక్నాలజీ, హెల్త్‌కేర్, సాఫ్ట్వేర్, బిజినెస్ టు బిజినెస్ తదితర రంగాల్లో ఆధునిక సాంకేతికత రానుంది. దీని ఆధారంగా మెరుగైన ఉత్పత్తులు, లక్ష్యాలు, సేవలను పొందడమే ధ్యేయంగా కెనడా అంకుర పరిశ్రమలకు రెడ్ కార్పెట్ స్వాగతం పలికేందుకు ఈ ఒప్పందం దోహదం చేయనుంది. ఈ ఒప్పందంపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో సమక్షంలో ఇటీవల టీ–హబ్– డిజిటల్ మీడియా నెట్వర్క్ సంస్థల మధ్య సంతకాలు జరిగినట్లు టీ హబ్ వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి. కెనడా అంకుర పరిశ్రమలకు ఆహ్వానం బయో టెక్నాలజీ, క్లీన్ టెక్నాలజీ, బిజినెస్ టు బిజినెస్ తదితర రంగాల్లో కెనడాలో విశేషంగా కృషి చేస్తున్న అంకుర పరిశ్రమలను మన నగరానికి ఆహ్వానించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. కెనడియన్ డిజిటల్ మీడియా నెట్వర్క్(సీడీఎంఎన్)కు అనుబంధంగా పనిచేస్తున్న 26 సంస్థలను టీ– హబ్ ఆధ్వర్యంలో త్వరలో జరిగే బ్రిడ్జి ప్రోగ్రాంకు ఆహ్వానించినట్లు టీహబ్ ప్రతినిధులు తెలిపారు. ఇందుకోసం ఇటీవలే ఆసక్తిగల కంపెనీల నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. ఆగస్టు 15 వరకు ఆన్లైన్లోనే దరఖాస్తులు స్వీకరిస్తారు. ఆయా రంగాల్లో అత్యున్నత నాణ్యతా ప్రమాణాలు, ఉత్పత్తుల సాధనే లక్ష్యంగా పనిచేసే సంస్థలకు మన దేశంలో మార్కెట్ అవకాశాలను చూపడంతో పాటు ఇక్కడి పరిశ్రమలకు చేయూతనిచ్చేందుకు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని టీహబ్ సీఈఓ జేజే కృష్ణన్ తెలిపారు. కెనడా నుంచి మెరుగైన సాంకేతికతను పొందడంతో పాటు ఇక్కడి చిన్న పరిశ్రమలకు ప్రోత్సాహంకల్పించడం, నూతన అంకుర పరిశ్రమలకు జీవం పోయడమే తమ ధ్యేయమన్నారు. ప్రధానంగా నిలకడగల అభివృద్ధి సాధన, హెల్త్‌కేర్ రంగంలో మరింత పురోగతి సాధించేందుకు ఈ కార్యక్రమం దోహదం చేస్తుందన్నారు. నూతన అంకుర పరిశ్రమల రాకతో ఉద్యోగవకాశాలు పెరగుతాయని, ఇరు దేశాల మధ్య వాణిజ్య బంధం మరింత బలపడుతుందన్నారు. కెనడా కంపెనీల ఎంపిక ఇలా.. టీ–హబ్‌లో అంకుర పరిశ్రమలు ఏర్పాటు చేయాలనుకున్న కంపెనీలను.. వారి ప్రతిభ, గతంలో చేపట్టిన ప్రాజెక్టుల ఆధారంగా ఎంపిక చేయనున్నారు. ఎంపికైన కంపెనీలకు గచ్చిబౌలిలోని టీ–హబ్ క్యాటలిస్ట్ భవనంలో 75 రోజుల పాటు వర్చువల్ శిక్షణ ఇస్తారు. మరో మూడు వారాలు దేశంలో ఆయా రంగాల్లో ఉన్న మార్కెట్ అవకాశాలు, వాణిజ్య అంశాలపై అవగాహన కల్పిస్తారు. దేశంలోని పలు నగరాల్లో మార్కెట్ మీటింగ్స్‌ను సైతం నిర్వహిస్తారు. టీ–హబ్ చరిత్ర ఇదీ.. తెలంగాణా ప్రభుత్వం 2015లో టీ–హబ్‌ను ఏర్పాటు చేసింది. అంకుర పరిశ్రమలను ఏర్పాటు చేయాలనుకున్న నిపుణులను, కార్పొరేట్ కంపెనీలను, పెట్టుబడిదారులను ఒకే వేదికపైకి తీసుకొచ్చి నూతన ఆవిష్కరణలను సాకారం చేయడం దీని లక్ష్యం. అంతేగాక ఉద్యోగ, ఉపాధి అవకాశాలను సైతం పెంచనున్నారు. ఇప్పటికే ఈ హబ్‌లో దేశ, విదేశాలకు చెందిన 350 అంకుర పరిశ్రమలు పురుడు పోసుకున్నాయి. స్టార్టప్ కంపెనీలు పెట్టాలనుకునే నిపుణులకు టీ–హబ్ దిక్సూచీగా మారిందని నాస్కామ్ తాజా నివేదికలో పేర్కొనడం విశేషం. -
బ్లాక్ మెయిల్ చేస్తున్న వ్యక్తిపై చర్యలు తీసుకోండి
మెదక్ మున్సిపాలిటీ : బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా చెప్పుకుంటూ అధికారులను బ్లాక్ మెయిల్ చేస్తున్న రఘుపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో బుధవారం ఆర్డీఓకు మెమోరాండాం సమర్పించారు. ఈ సందర్భంగా బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర నాయకుడు రమేశ్ మాట్లాడుతూ గతంలో బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా పనిచేసిన రఘు ప్రైవేట్ విద్యా సంస్థలు, వార్డెన్లను బ్లాక్ మెయిల్‌చేస్తూ డబ్బులు వసూలు చేశాడన్నారు. ఈ విషయాన్ని బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య దృష్టికి తీసుకెళ్లగా గతంలోనే రఘును అధ్యక్ష పదవి నుంచి తొలగించడం జరిగిందన్నారు. అయినప్పటికీ అధ్యక్షుడి చెప్పుకుంటూ మళ్లీ బ్లాక్ మెయిల్స్ పాల్పడుతున్నాడని ఆరోపించారు. ఈ విషయంలో రఘుపై చర్యలు తీసుకోవాలని ఆర్డీఓకు మెమోరాండాం సమర్పించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు శ్రీనివాస్‌గౌడ్, పృథ్వి, ఎంఎస్ఎఫ్ నాయకులు శరత్ కుమార్, టీజీవీపీ జిల్లా అధ్యక్షుడు వినోద్, పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు మహేష్, ఎస్ఎఫ్ఐ నాయకులు నీలంబాబుతోపాటు వివిధ విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
40 ఏళ్లకే పింఛన్లు ఇవ్వాలి
లావేరు: దళిత డప్పు కళాకారులకు 40 సంవత్సరాలికే పింఛన్లు మంజూరు చేయాలని, రెండు ఎకరాల సాగు భూమి ఇవ్వాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట కమిటీ జిల్లా ప్రధాన కార్యదర్శి డి.గణేష్, సీఐటీయూ డివిజన్ అధ్యక్షుడు ఎన్వీ రమణ అన్నారు. దళిత డప్పు కళాకారులకు 40 సంవత్సరాలకు పింఛన్లు ఇవ్వాలని, గుర్తింపు కార్డులు మంజూరు చేయాలని, బస్సులు, రైళ్లలో ప్రయాణం చేయడానికి ఉచిత పాస్ సౌకర్యం కల్పించాలని కోరుతూ డప్పు వాయిద్య కళాకారులు సంఘం ఆధ్వర్యంలో లావేరు గ్రామం నుంచి లావేరులోని తహసీల్దార్ కార్యాలయం వరకూ దళిత డప్పు కళాకారులు డప్పు వాయిద్యాల నడుమ వినూత్న రీతిలో మంగళవారం భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో ఆర్ఐ జి.రత్నకుమార్‌కు దళిత డప్పు కళాకారుల సమస్యలు, డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా గణేష్, ఎన్వీ రమణ మాట్లాడుతూ గ్రామాల్లో ఏళ్ల తరబడి దళితులు డప్పు కళాకారులుగా ఉన్నారని, అన్ని రకాల ఉత్సవాలు, ఊరేగింపుల్లో వీరి పాత్ర కీలకమైనదన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలను ప్రజల వద్దకు తీసుకువెళ్లేది డప్పు కళాకారులేనని అయినా వారిని ప్రభుత్వం డప్పు కళాకారులుగా గుర్తించడం లేదన్నారు. 2014 సంవత్సరంలో ఏపీలో డప్పు కళాకారులు సంఘం పెట్టి పోరాటాలు చేసినప్పుడు డప్పు కళాకారులకు పింఛన్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారని, ఆ హామీ నేటికి నెరవేరలేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో లావేరు మండల కమిటీ దళిత డప్పు కళాకారుల సంఘం నాయకులు ఎచ్చెర్ల లక్ష్మీనారాయణ, ఎచ్చెర్ల రాము, ఎన్.శ్రీను, గొల్లబాబు, రాము, మహేష్, నాగరాజు, డప్పు కళాకారులు పాల్గొన్నారు. -
అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం
దోమకొండ : మండలంలోని సంగమేశ్వర్ గ్రామంలోగల గుడ్‌ఫ్రూట్ మినిస్ట్రీస్ ప్రార్థనా మందిరం షెడ్డును కూల్చివేసిన నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని మండలకేంద్రంలో ఆదివారం కామారెడ్డి, మెదక్ జిల్లాలకు చెందిన క్రిస్టియన్ సంఘాల ప్రతినిధులు ధర్నా చేశారు. మొదట సంగమేశ్వర్ గ్రామంలో వారు ధర్నా చేశారు. అక్కడి నుంచి దోమకొండకు చేరుకుని అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా చేశారు. తమకు న్యాయం చేయలంటూ నినాదాలు చేశారు. కావాలనే ప్రార్థన మందిరం షెడ్డును కూల్చివేశారని ఆరోపించారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలన్నారు. కూల్చివేతలో గ్రామానికి చెందిన ప్రజా ప్రతినిధులు పాత్ర ఉందని, వారిపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయాలని కోరారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందించి అక్కడి నుంచి తిరిగి సంగమేశ్వర్ గ్రామ మూలమలపు వద్దకు చేరారు. రోడ్డుపై బైఠాయించి «ధర్నా చేశారు. నిందితులను అరెస్ట్ చేయాలని కోరినా పొలీసులు పట్టించుకోవడంలేదని ఆరోపించారు. దోమకొండతోపాటు సంగమేశ్వర్, మెదక్ జిల్లా రామాయంపేటకు చెందిన క్రిస్టియన్ సంఘాల వారు ధర్నాలో పాల్గొని నినాదాలు చేశారు. సాయంత్రం వరకు కొనసాగిన «ధర్నా పోలీస్ అధికారులు వారిని సముదాయించడంతో విరమించారు. ప్రార్థన మందిరానికి సంబంధించిన షెడ్డు కూల్చివేయడంతో లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయాలని న్యాయం చేస్తామని పోలీసులు వివరించారు. భారీ పోలీస్ బందోబస్తు.. ధర్నా సందర్బంగా ఎలాంటి గొడవలు జరుగకుండా పోలీసులు బందోబస్తు చేశారు. కామారెడ్డి పట్టణ సీఐ శ్రీధర్‌కుమార్, భిక్కనూరు సీఐ కోటేశ్వర్రావ్, మాచారెడ్డి ఎస్ఐ కృష్టమూర్తి, రాజంపేట ఎస్ఐ రవిగౌడ్, భిక్కనూరు ఎస్ఐ రాజుగౌడ్, దోమకొండ ఎస్ఐ నరేందర్‌తో పాటు సిబ్బంది గొడవలు జరుగకుండా బందోబస్తు నిర్వహించారు. కాగా కూల్చివేతకు సంబంధించి సంగమేశ్వర్ గ్రామానికి చెందిన ఏడుగురిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నామని ఎస్ఐ నరేందర్ తెలిపారు. -
సంచలన నిర్ణయం.. తీవ్ర దుమారం
సాక్షి, ముంబై: శివసేన పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. మతాంతర వివాహం సాకుతో ఓ జంటకు పాస్‌పోర్ట్‌లు నిరాకరించి వివాదంలో చిక్కకున్న అధికారికి సన్మానం చేయాలని తీర్మానం చేసింది. ఈ మేరకు శివసేన మీడియాకు ఓ ప్రకటన విడుదల చేసింది. అంతేకాదు సదరు అధికారి వికాస్ మిశ్రా బదిలీ ఆదేశాలను వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరుతూ శనివారం యూపీ గవర్నర్ రామ్ నాయక్‌కు ఓ మెమొరాండం సమర్పించింది. ‘వికాస్ తన విధులను తాను సక్రమంగా నిర్వహించారు. పాస్‌పోర్ట్ వ్యవహారం దేశ భద్రతకు సంబంధించిన అంశం. యూపీ ప్రభుత్వం ముస్లింల సానుభూతి కోసం తీవ్రంగా యత్నిస్తోంది. ఆయనపై చర్యలు తీసుకోవటం సహేతుకం కాదు. అందుకే గవర్నర్‌కు విజ్ఞప్తి చేశాం. ఆయన సానుకూలంగా స్పందించారు. అంతేకాదు వికాస్‌ను ఘనంగా సన్మానించాలని శివసేన నిర్ణయించింది’ అని ఆ పార్టీ ప్రతినిధుల బృందం మీడియాకు తెలిపింది. మరోవైపు ఈ వ్యవహారంపై రాజకీయ దుమారం చెలరేగింది. పలువురు బీజేపీ నేతలు శివసేనపై విరుచుకుపడుతున్నారు. మొహమ్మద్ అనాస్ సిద్దిఖీ 2007లో తన్వీ సేథ్ అనే హిందూ యువతిని ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇద్దరూ ఓ బహుళ జాతి సంస్థలో ఉద్యోగులు. తాజాగా వీరిద్దరూ పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే పాస్‌పోర్ట్ ఆఫీసర్ వికాశ్ మిశ్రా మాత్రం వారి దరఖాస్తులను తిరస్కరించాడు. పైగా మతం మార్చుకోవాలంటూ సిద్ధిఖీకి సూచనలు చేశాడు. దీంతో వారు సుష్మాస్వరాజ్‌ను ఆశ్రయించగా, విదేశాంగ శాఖ చొరవతో వారికి పాస్‌పోర్టులు జారీ అయ్యాయి. మరోపక్క క్రమశిక్షణ చర్యల కింద పాస్‌పోర్ట్ ఆఫీసర్ వికాశ్ మిశ్రాను లక్నో నుంచి గోరఖ్‌పూర్‌కు బదిలీ చేశారు. -
జిల్లాకు రూ.45 కోట్ల ఎన్సీడీసీ రుణాలు
కర్నూలు(అగ్రికల్చర్)/అర్బన్ : గొర్రెల పెంపకాన్ని మరింత ప్రోత్సహించేందుకు జాతీయ సహకార అభివృద్ధి సంస్థ(ఎన్సీడీసీ) ద్వారా జిల్లాకు మూడేళ్లలో రూ.45 కోట్లు వస్తాయని అంధ్రప్రదేశ్ రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సమాఖ్య అధ్యక్షుడు నాగేశ్వరరావు యాదవ్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్లోని పశుసంవర్ధకశాఖ సమావేశ భవనంలో జిల్లా గొర్రెల పెంపకందారుల సహకార యూనియన్ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్సీడీసీ నిధుల వినియోగం పారదర్శకంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. 2018–19లో జిల్లావ్యాప్తంగా రూ.10.58 కోట్లు వ్యయం చేస్తున్నామని తెలిపారు రుణం మొత్తంలో 20 శాతం సబ్సిడీ, 60శాతం ఎన్సీడీసీ నిధులు పోను 20 శాతం లబ్ధిదారులు భరించాల్సి ఉంటుందన్నారు. 60 శాతం లోన్‌కు పావలావడ్డీ వర్తిస్తుందన్నారు. ఆడిట్, ఎన్నికలు జరిగిన సహకార సంఘాల సభ్యులకే రుణాలు పంపిణీ చేస్తామన్నారు. సమాఖ్య మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్రంలో 5,200 గొర్రెల పెంపకందారుల సహకార సంఘాలు ఉన్నాయని, వీటిలో అర్హత కల్గిన సభ్యులకే రుణాలు ఇస్తామని స్పష్టం చేశారు. గొర్రెల పెంపకందారుల సమస్యలను పరిష్కరించేందుకు జీవమిత్రల వ్యవస్థను తీసుకురానున్నట్లు తెలిపారు. పశుసంవర్ధకశాఖ జేడీ డాక్టర్ సుదర్శన్‌కుమార్, జిల్లా గొర్రెల అభివృద్ధి విభాగం ఏడీ డాక్టర్ చంద్రశేఖర్, గొర్రెల పెంపకందారుల సహకార యూనియన్ మాజీ అధ్యక్షుడు శ్రీనివాసరావు, డైరెక్టర్లు పాల్గొన్నారు. అర్హత ఉన్న సొసైటీలకే అందించండి ఎన్సీడీసీ నిధుల(రూ.45 కోట్ల)ను రాజకీయాలకు తావులేకుండా అర్హత కలిగిన సొసైటీలకే రుణాలుగా అందించాలని ఏపీ గొర్రెలు, మేకల పెంపకందారుల సంఘం నేతలు కోరారు. ఈ మేరకు మంగళవారం జిల్లాకు వచ్చిన గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార సంస్థ ఎండీ ఎం శ్రీనివాసరావును సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పీ గోవిందు, నాయకులు జేఎన్ శేషయ్య వినతిపత్రం అందించారు. జీవక్రాంతి, పశుక్రాంతి పథకాల్లో గొర్రెల కాపరుల పిల్లలకు ఉపాధి కల్పించాలని, గడువు ముగిసిన నేపథ్యంలో జిల్లా యూనియన్‌కు ఎన్నికలు నిర్వహించాలని కోరారు. నాయకులు జీ ఆంజనేయులు, కె.మద్దిలేటి, కే రామక్రిష్ణ, జీ రాంమూర్తి, కే రాముడు, చంద్రన్న తదితరులు ఉన్నారు. -
రక్తంతో కలెక్టర్‌కు లేఖ రాసిన మహిళ
సాక్షి, యాదాద్రి : కలెక్టరమ్మ జైహింద్ నాకు న్యాయం చేయండి.. అంటూ భువనగిరి మండలం బొమ్మాయిపల్లికి చెందిన మేడబోయిన స్వప్న రక్తంతో కాగితంపై రాసుకుని కలెక్టరేట్‌కు వచ్చింది. సోమవారం ప్రజావాణిలో వినతిపత్రం ఇవ్వడానికి వచ్చి చేతిపై గాజుతో గాట్లు పెట్టుకుంది. దాంతో వచ్చిన రక్తంతో పలు విధంగా రాసింది. చనిపోయిన తన తండ్రి మంగలి మల్లేశం పేరున గల రెండెకరాల భూమిని గ్రామంలో భిక్షపతి అనే వ్యక్తి కబ్జా చేశాడని ఫి ర్యాదు చేశారు. తాను అత్తగారిల్లు అయిన అల్వాల్‌లో ఉం టున్నానన్నారు. తన తండ్రి భూమి తన పేరున చేయాలని అధికారులను కలిసినా న్యాయం జరగడం లేదని ఆరోపించారు. అధికారులకు లంచాలు ఇవ్వడానికి తాళిబొట్టు తా కట్టు పెట్టి ఇత్తడి తాళిబొట్టు వేసుకున్నానన్నారు. అయినా అధికారులు తన సమస్య పరిష్కరించడం లేదని పలువురు అధికారులపై ఆరోపణలు చేశారు. తనకు న్యాయం చేయాలని కలెక్టర్ దగ్గరికి వచ్చానని వివరించారు. న్యాయం కోసం తాను చనిపోతానని ఇందుకోసం తన వెంట తెచ్చుకున్న చిన్న చిన్న గాజు ముక్కలను నొట్లో వేసుకునే ప్రయత్నం చేసింది. దీంతో పక్కనే ఉన్న పోలీసులు ఆమెను వారించి కొద్ది సేపు కౌన్సెలింగ్ నిర్వహించి ప్రజావాణిలో ఉన్న కలెక్టర్ అనితారామచంద్రన్ వద్దకు తీసుకెళ్లారు. స్వప్న తన సమస్యను వివరించడంతో భువనగిరి ఆర్డీఓతో విచారణ జరిపించి న్యాయం చేస్తానని హామీ ఇవ్వడంతో ఆమె బయటకు వచ్చింది. -
ధాన్యం డబ్బులు ఖాతాల్లో జమ చేయాలి
సాక్షి, టవర్‌సర్కిల్ : ధాన్యం డబ్బులు వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేయాలని, పెంచిన పెట్రో ధరలను వెంటనే తగ్గించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ టీడీపీ ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. మొదట సర్కస్ గ్రౌండ్ నుంచి ర్యాలీగా కలెక్టరేట్‌కు తరలివచ్చారు. సుమారు గంటపాటు ధర్నా నిర్వహించారు. టీడీపీ శ్రేణులు కలెక్టరేట్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఇనుగాల పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటలను గిట్టుబాటు ధరలకు అమ్ముకోలేని దుస్థితి రాష్ట్రంలో ఉందన్నారు. ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ముఖ్యమంత్రి, మంత్రులు చెప్పిన మాటలు నీటి మూటలుగా మారాయని అన్నారు. అంతర్జాతీయ స్థాయిలో క్రూడాయిల్ ధరలు 2014 నాటి స్థాయిలోనే ఉన్నా.. మన దేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పన్ను భారం కారణంగా ధరలు రోజురోజుకు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయన్నారు. కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. జిల్లా అధ్యక్షుడు జోజిరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి దాసరి ప్రవీణ్, నాయకులు వెంకటేశ్వర్లుగౌడ్, కళ్యాడపు ఆగయ్య, ఎడ్ల వెంకటయ్య, జాడి బాల్‌రెడ్డి, కొరటాల శివరామకృష్ణ, ఆడెపు కమలాకర్, దామెర సత్యం, దూలం రాధిక, అనసూర్యనాయక్, కరుణాకర్‌రెడ్డి, తీట్ల ఈశ్వరి, ఆనందరావు, కిశోర్, గట్టయ్య, శ్రీనివాస్‌రెడ్డి, రొడ్డ శ్రీనివాస్, తీగుట్ల రమేశ్, నూజెట్టి వాణి, రవీందర్, ఇందు తదితరులు పాల్గొన్నారు. -
తుమ్మలకు వినతిపత్రం అందించిన సాక్షి ఈడీ..
తల్లాడ ఖమ్మం : పేద, స్థానిక విద్యార్థుల సౌలభ్యం కోసం తల్లాడలో ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఏర్పాటు చేయాలని..ఇక్కడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థులు గురు వారం మంత్రులకు విన్నవించారు. దశాబ్దాల క్రితం ఇక్కడ చదువుకుని..వివిధ హోదాల్లో, తీరొక్క ప్రాంతాల్లో ఉంటున్న వారంతా..ఈ ప్రాంత విద్యార్థుల బాగు కోసం ‘సాక్షి’ ఎడిటోరియల్ డైరెక్టర్ కొండభట్ల రామచంద్రమూర్తితో పాటు..జెడ్పీటీసీ సభ్యుడు మూకర ప్రసాద్, జక్కంపూడి కృష్ణమూర్తి, కొండుభట్ల రాధాకృష్ణమూర్తి, డాక్టర్ వేమిశెట్టి ఉపేందర్‌రావు, బాజోజు శేషభూషణం, రెడ్డెం వీరమోహన్‌రెడ్డి, గుం టుపల్లి వెంకటయ్యలు అంతా కలిసి హైదరాబాద్‌లో ఇద్దరు మంత్రులను కలిశారు. సమస్య తీవ్రతను వివరించారు. విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి, రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావులకు ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు ఆవశ్యకతను వివరించారు. -
డీఈవో కార్యాలయంలో సిబ్బంది లేరా?
మంచిర్యాలటౌన్ : నూతన విద్యా సంవత్సరం ప్రారంభమై మూడు రోజులు దాటినా మంచిర్యాల జిల్లా డీఈవో కార్యాలయంలో అధికా రులు లేక వెలవెల బోవడాన్ని నిరసిస్తూ ఐక్య విద్యార్థి సంఘాల నేతలు సోమవారం మూసి ఉన్న డీఈవో కార్యాలయానికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యా సంవత్సరం ప్రారంభించి ఇప్పటికి మూడు రోజులు దాటినా, కార్యాలయంలో ఒక్క అధికారి, సూపరింటెండెంట్ లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఇక్కడ పనిచేసిన రెగ్యులర్ డీఈవోను సిద్దిపేటకు బదిలీ చేసి, పెద్దపల్లి డీఈవో వెంకటేశ్వర్రావుకు ఇన్చార్జి ఇచ్చారన్నారు. రెండు జిల్లాలకు పనిచేస్తున్న డీఈవో మంచిర్యాల జిల్లాకు సక్రమంగా రాకపోవడంతో, జిల్లాలోని పాఠశాలలు కనీస వసతులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. విద్యాహక్కు చట్టం అమలు చేసేలా, రెగ్యులర్ డీఈవోను ఇచ్చి, సిబ్బంది సరైన సమయానికి వచ్చేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షులు తోట రాజేశ్, బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు జాగిరి రాజేశ్, ఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు జుమ్మిడి గోపాల్, ఏబీఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు మెట్పల్లి రంజిత్‌రావు, ఆప్ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు నల్ల నాగేంద్రప్రసాద్, బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు మామిడాల ప్రవీణ్, ఆప్ విద్యార్థి సంఘం నాయకులు సతీశ్ పాల్గొన్నారు. -
రైతుబంధు చెక్కులు ఇప్పించాలి
ఖానాపూర్ : కడెం మండలం బెల్లాల్ గ్రామానికి చెందిన తమ భూములను టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఓ నాయకుడి చెర నుంచి కాపాడాలని గ్రామానికి చెందిన ఆదివాసీ గిరిజనులు ఆదివారం ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. సంబందిత నాయకుడు ఇదివరకు తమ భూములు పెద్ద సంఖ్యలో కబ్జాకు పాల్పడ్డాడని, సాగులో ఒక్కొక్కరికి ఐదెకరాలకు పైగా ఉన్నప్పటికీ ఒక్కో ఎకరంతో పట్టాలు వచ్చాయని అన్నారు. కబ్జాపోను మిగిలిన ఒక్కో ఎకరం భూమికి ప్రభుత్వం రైతుబంధు ద్వారా చెక్కులు ఇస్తే వాటిని కూడా ఇవ్వకుండా అడ్డుకుంటున్నాడని ఆరోపించారు. గ్రామ శివారులో గల జగిత్యాల నియోజకవర్గం రాయికల్ మండలం బోర్నపెల్లిలో ఉన్న తమ భూములకు ప్రభుత్వం నుంచి రైతుబంధు ద్వారా వచ్చిన చెక్కులను ఇచ్చేలా చూడాలని ఎమ్మెల్యేకు విన్నవించారు. ఈ విషయమై ఎంతటివారైనా సరే తాను సంబందిత అధికారులతో మాట్లాడి న్యాయం చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. కార్యక్రమంలో వెడ్మ గంగు, తోడసం గంగు, వెడ్మ లింగు, వెడ్మ దేవేందర్, ఆత్రం గంగు, లింబారావ్, బాదిరావ్, లింగు, మోహన్, జుగాదిరావ్, శ్రీను, జ్యోతిరాం, మారుతి, ఆనంద్, బుచ్చవ్వ, తదితరులు పాల్గొన్నారు. -
జర్నలిస్టుల సంక్షేమానికి కృషి
ఆదిలాబాద్ టౌన్ : జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. బుధవారం ఆదిలాబాద్ పట్టణంలోని పీఆర్టీయూ సంఘ భవనంలో మంత్రి జోగు రామన్నకు టీయూడబ్ల్యూజే నాయకులు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. మంత్రి రామన్న మాట్లాడుతూ త్వరలో జర్నలిస్టులకు నివాస స్థలాలు అందజేస్తామన్నారు. చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలను ఆదుకుంటామన్నారు. వారి పిల్లల చదువుల బాధ్యత ప్రభుత్వం భరిస్తుందన్నారు. అనంతరం టీయూడబ్ల్యూజే డైరీని ఆవిష్కరించారు. ఏఎంసీ చైర్మన్ ఆరె రాజన్న, జెడ్పీటీసీ సభ్యుడు అశోక్, టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బేత రమేశ్, రాజు, కోశాధికారి ప్రవీణ్‌కుమార్, ఉపాధ్యక్షుడు అన్వర్, సంఘ బాధ్యులు ఆంజనేయులు, రఘునాథ్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు కోసం 13 కిలోమీటర్ల పాదయాత్ర
అవనిగడ్డ : మోపిదేవి మండలంలోని మెరకనపల్లి గ్రామానికి రహదారి నిర్మించాలని కోరుతూ గ్రామస్తులు శనివారం పాదయాత్ర నిర్వహించారు. పదేళ్ల నుంచి గ్రామానికి వెళ్లే 1.2 కిలో మీటర్ల రహదారి దెబ్బతినడంతో ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఎవరూ పట్టించుకోవడంతో గ్రామస్తులు మెరకనపల్లి నుంచి అవనిగడ్డ వరకూ 13 కిలో మీటర్లు మండుటెండలో పాదయాత్ర చేశారు. అనంతరం ఉపసభాపతి మండలి బుద్దప్రసాద్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీపీఎం నాయకులు సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా వారిపై బుద్దప్రసాద్ అసహనం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి మాగంటి హరిబాబు, సీపీఎం నాయకులు శీలం నారాయణరావు, వాకా రామచంద్రరావు, ఆవల బసవయ్య, వై.మధు, మాజీ వైస్ ఎంపీపీ యన్నం శ్రీనివాసరావు, మాజీ సర్పంచి వంగల నాంచారయ్య, రాధాకృష్ణ, యర్రంశెట్టి సునీల్, నాగమల్లేశ్వరరావు పాల్గొన్నారు. -
రోడ్డు కోసం 13 కిలోమీటర్ల పాదయాత్ర
అవనిగడ్డ : మోపిదేవి మండలంలోని మెరకనపల్లి గ్రామానికి రహదారి నిర్మించాలని కోరుతూ గ్రామస్తులు శనివారం పాదయాత్ర నిర్వహించారు. పదేళ్ల నుంచి గ్రామానికి వెళ్లే 1.2 కిలో మీటర్ల రహదారి దెబ్బతినడంతో ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఎవరూ పట్టించుకోవడంతో గ్రామస్తులు మెరకనపల్లి నుంచి అవనిగడ్డ వరకూ 13 కిలో మీటర్లు మండుటెండలో పాదయాత్ర చేశారు. అనంతరం ఉపసభాపతి మండలి బుద్దప్రసాద్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీపీఎం నాయకులు సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా వారిపై బుద్దప్రసాద్ అసహనం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి మాగంటి హరిబాబు, సీపీఎం నాయకులు శీలం నారాయణరావు, వాకా రామచంద్రరావు, ఆవల బసవయ్య, వై.మధు, మాజీ వైస్ ఎంపీపీ యన్నం శ్రీనివాసరావు, మాజీ సర్పంచి వంగల నాంచారయ్య, రాధాకృష్ణ, యర్రంశెట్టి సునీల్, నాగమల్లేశ్వరరావు పాల్గొన్నారు. -
మేయర్‌ను అనర్హుడిగా ప్రకటించండి
విజయవాడ సెంట్రల్ : అధికార దుర్వినియోగానికి పాల్పడిన మేయర్ కోనేరు శ్రీధర్‌ను అనర్హుడిగా ప్రకటించాలని కోరుతూ వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు కమిషనర్ జి.వీరపాండియన్‌కు బుధవారం వినతిపత్రం సమర్పించారు. ఫ్లోర్‌లీడర్ బీఎన్.పుణ్యశీల ఆధ్వర్యంలో చాంబర్లో కమిషనర్‌ను కలిశారు. పుణ్యశీల మాట్లాడుతూ మేయర్ పదవిని అడ్డుపెట్టుకొని శ్రీధర్ పుష్కర కాంట్రాక్ట్‌లను తన భార్య డైరెక్టర్‌గా ఉన్న కేఎంకే సంస్థకు దోచిపెట్టారన్నారు. ఈవిషయమై గతంలో తాము వినతిపత్రం అందించామన్న విషయాన్ని గుర్తు చేశారు. దీనిపై స్పందించిన కమిషనర్ మాట్లాడుతూ ఇటీవల కాలంలో తాను పనుల ఒత్తిడిలో ఉండటం వల్ల దృష్టిపెట్టలేకపోయానన్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న కేఎంకే కాంట్రాక్ట్‌కు సంబంధించి త్వరలోనే విచారణ చేపడతానని హామీ ఇచ్చారు. నిబంధనల ప్రకారమే బాధ్యులపై చర్యలు చేపడతామన్నారు. వైఎస్సార్ సీపీ పశ్చిమ నియోజక వర్గ సమస్వయకర్త ఆసిఫ్, కార్పొరేటర్లు షేక్‌బీజాన్‌బీ, జమలపూర్ణమ్మ, బి.సంధ్యారాణి, అవుతు శ్రీ శైలజ పాల్గొన్నారు. -
పాఠశాల భూమి ఆక్రమించారని కలెక్టర్‌కు వినతి
నకిరేకల్ : నకిరేకల్ మండలం తాటికల్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల భూమిని కొందరు అక్రమంగా ఆక్రమించుకున్నారని జెడ్పీహైస్కూల్, ప్రాథమిక పాఠశాలల యాజమాన్య కమిటీ చైర్మన్లు చెనగాని సైదమ్మ, సిహెచ్ అండాలు ఆధ్వర్యంలో బుధవారం కలెక్టర్‌కు వినతి పత్రం సమర్పించారు. ఆ వివరాలను నకిరేకల్‌లో వెల్లడించారు. గ్రామపరిధిలోని ప్రభుత్వ జెడ్పీహైస్కూల్, ప్రాథమిక పాఠశాలకు సంబంధించిన భూమిని కొందరు గ్రామస్తులు ఆక్రమించుకున్నారని పేర్కొన్నారు. భూమిపై పూర్తి విచారణ జరిపి పాఠశాలకు వర్తించేలా చర్యలు తీసుకోవాలన్నారు. వినతి పత్రం అందించిన వారిలో తాటికల్ సర్పంచ్ చెనగాని మంజుల సుధాకర్, ఎంపీటీసీ మిర్యాల చంద్రశేఖర్, ఉప సర్పంచ్ నిమ్మనగోటి సైదులు, మొగిలి ఉపేందర్, చెనగాని కష్ణ, పిట్టల శ్రావణి, కొండయ్య, జానయ్య, శ్రీధర్, రాంబాబు, ఎల్లయ్య, లింగయ్య, శ్రీను, రామలింగయ్య, నగేష్ ఉన్నారు. -
అధికారుల పెత్తనాన్ని ఊరుకోం
ఏలూరు (మెట్రో): జిల్లాలోని అన్ని మండలాల్లో, పంచాయతీల్లో జెడ్పీటీసీలు, ఎంపీటీసీలను కాదని అధికారులు పెత్తనం చేస్తామంటే చూస్తూ ఊరుకునేది లేదని జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు అన్నారు. జిల్లా పరిషత్, మండల పరిషత్ అధికారాలను హరించే 14వ ఫైనాన్స్ కమిషన్ సిఫార్సులను నిరోధించి స్థానిక సంస్థల బలోపేతానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరుతూ కలెక్టర్ కె.భాస్కర్‌కు బాపిరాజు ఆధ్వర్యంలో ఎంపీపీలు, జెడ్పీటీసీలు వినతిపత్రం సమర్పించారు. అనంతరం జెడ్పీ చైర్మన్ విలేకరులతో మాట్లాడుతూ మండలాల స్థాయిలో ఏ పథకాన్ని ఏ లబ్ధిదారునికి అందించాలనే విషయం స్థానిక ప్రజాప్రతినిధులకే తెలుస్తుందని చెప్పారు ఈ విషయంలో అధికారులు తామే చేస్తామంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. 14వ ఆర్థిక సంఘం నిధులను నేరుగా పంచాయతీలకు కేటాయిస్తూ మండల పరిషత్‌లను నిర్లక్ష్యం చేస్తుందన్నారు. జిల్లాలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను అధికారులు పట్టించుకోవడం లేదని, ప్రోటోకాల్‌ను ఉల్లంఘిస్తున్నారనే విషయాలను కలెక్టర్‌కు విన్నవించుకున్నామని చెప్పారు. జెడ్పీ వైస్ చైర్మన్ వెంకటరమణ, జెడ్పీటీసీలు చలపతిరావు, గంటా సుధీర్‌బాబు పాల్గొన్నారు. -
భక్తుల మనోభావాలు దెబ్బతీయడం దారుణం
నందిగామ రూరల్ : అభివృద్ధి పేరుతో ప్రభుత్వం ఆలయాలు, దర్గాలను కూల్చివేస్తూ, భక్తుల మనోభావాలు దెబ్బతీస్తోందని నందిగామ ముస్లిం సేవా కమిటీ అధ్యక్షుడు షేక్ ఖాజా అన్నారు. అభివృద్ధి పేరిట విజయవాడలో గురువారం ఆలయాలు, దర్గాలను కూల్చివేయడాన్ని నిరసిస్తూ, స్థానిక రెవెన్యూ కార్యాలయంలో శుక్రవారం పలువురు ముస్లింలు వినతిపత్రం సమర్పించారు. అనంతరం ఖాజా మాట్లాడుతూ, అభివృద్ధి పేరుతో పురాతన ఆలయాలు, పవ్రిత దర్గాలు కూల్చివేయడం అమానుషమన్నారు. ఈ విషయమై ఇప్పటికే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. అనంతరం డెప్యూటీ తహసీల్దార్ శ్రీనివాసమూర్తికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ముస్లిం మైనార్టీ నాయకులు ఎస్.ఎం.రబ్బాని, సయ్యద్ మస్తాన్, షేక్ సమీర్ పాల్గొన్నారు. -
మల్లన్న సాగర్ వద్దంటూ ‘మల్లన్న’కు వినతిపత్రం
చేర్యాల: మెదక్ జిల్లా కొండపాక, తొగుట మండలాల పరిధిలో ప్రభుత్వం చేపడుతున్న మల్లన్న సాగర్ రిజర్వాయర్ తమకొద్దంటూ భూ నిర్వాసితులు వరంగల్ జిల్లా చేర్యాల మండలం కొమురవెల్లి మల్లికార్జున స్వామికి ఆదివారం వినూత్నరీతిలో నిరసన తెలిపారు.ఈ విషయంలో ప్రభుత్వ మనసు మార్చాలని కోరుతూ స్వామికి వినతిపత్రం సమర్పించారు. మల్లన్న సాగర్ రిజర్వాయర్ పరిధిలోని 14 గ్రామాల సర్పంచ్ల ఆధ్వర్యంలో సుమారు 50 మంది రైతులు, యువకులు కొమురవెల్లి శ్రీమల్లికార్జున స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రాజెక్టు నిర్మాణం పేరుతో భూమి లాక్కుంటే తమకు భిక్షాటనే గతి అని ఆలయ మెట్ల వద్ద భిక్షాటన చేసి నిరసన తెలిపారు. 2013 చట్టం ప్రకారం 80 శాతం మంది రైతులు ఒప్పుకుంటేనే ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలన్న విషయాన్ని గుర్తు చేశారు. ప్రభుత్వం తమ భూములను బలవంతంగా లాక్కుంటే 14 గ్రామాల ముంపు భాదితులు మూకుమ్మడిగా ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నారని నిర్వాసితులు హెచ్చరించారు.