
అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం ఇస్తున్న సమన్వయకర్త జోగారావు తదితరులు
పార్వతీపురం విజయనగరం : ప్రజలహక్కులను కాలరాస్తూ రా జ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్న సర్కారు తీరుపై వైఎస్సార్‌సీపీ నిరసన తెలియజేసింది. ఈ మేరకు పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త అలజంగి జో గారావు ఆధ్వర్యంలో పట్టణంలోని వైఎస్సార్ విగ్రహం నుంచి ఆస్పత్రి కూడలిలోగల అంబేడ్కర్ వి గ్రహం వరకూ శుక్రవారం ప్రదర్శన చేపట్టి అక్కడ అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రాన్ని సమర్పించారు.
ఈ సందర్భంగా జోగారావు మాట్లాడుతూ రాష్ట్రంలో నాలుగేళ్లుగా రాక్షసపాలన సాగుతోందని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు డైరెక్షన్‌లో దిగువస్థాయి నాయకులు ప్రభుత్వ ఉద్యోగులపైన, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపైన దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. పార్వతీపురం పట్టణంలో గురువారం బురదనీరుపై ప్రశ్నించినందుకు ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్, ఆయన అనుచరులు సామాన్యులపై దాడికి పాల్పడడం రాజ్యాంగ విలువలను తుంగలో తొక్కడమేనని చెప్పారు.
వారి దౌర్జన్యాన్ని వ్యతిరేకిస్తూ ర్యాలీ నిర్వహించి రాజ్యాంగాన్ని రచించిన అంబేడ్కర్‌నే రాజ్యంగ విలువలు కాపాడాల్సిందిగా కోరుతూ వినతిపత్రం ఇచ్చినట్లు తెలియజేశారు. రాజ్యాంగం సాక్షిగా ప్రమాణం చేసిన ప్రజాప్రతినిధులు అదే రాజ్యాంగ విలువలను కాపాడకుండా రాక్షసుల్లా ప్రవర్తించడం చూసి సభ్యసమాజం తలదించుకుంటోందని వ్యాఖ్యానించారు.
ఈ కార్యక్రమంలో పార్వతీపురం పట్టణ అధ్యక్షుడు కొండపల్లి బాలకృష్ణ, మునిసిపల్ ఫ్లోర్ లీడర్ మంత్రి రవికుమార్, అరకు పార్లమెంటరీ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంపల గురురాజు, సీనియర్ కౌన్సిలర్లు గొల్లు వెంకటరావు, ఓ.రామారావు, ఎస్.శ్రీనివాసరావు, ఏగిరెడ్డి భాస్కరరావు, బోను ఆదినారాయణ, సర్పంచ్‌లు బొమ్మి రమేష్, ఏగిరెడ్డి తిరుపతిరావు, రణభేరి బంగారునాయుడు, సిగడం భాస్కరరావు, జొన్నాడ శ్రీదేవి, పొట్నూరు జయంతి, గొట్టా శివకేశ్వరరావు, జయంత్, వల్లేపు చిన్నారావు, పాతగోవింద్, పల్లెం కనకరావు, తదితరులు పాల్గొన్నారు.