ప్రధానికి వినతిపత్రాలు ఇవ్వాలని బీజేపీ నేతలకు హరీశ్ సూచన
హైదరాబాద్: రాష్ట్రంలోని సమస్యలపై అంబేద్కర్ విగ్రహానికి కాదు.. ప్రధాని మోదీకి వినతిపత్రాలు ఇచ్చి, పరిష్కారానికి కృషి చేయాలని బీజేపీ నాయకులకు మంత్రి హరీశ్‌రావు హితవు పలికారు. వారు కేవలం ప్రచార కండూతితోనే రాష్ట్ర ప్రభుత్వంపై బురద జల్లే కార్యక్రమాన్ని చేపట్టారని విమర్శించారు. ఆదివారం హరీశ్ సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రానికి ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల కేటాయింపును నాలుగు నెలలైనా పూర్తిచేయకపోవడంతో.. ఇక్కడ పాలనలో జాప్యం నెలకొందని పేర్కొన్నారు.
ప్రధాని ఈ విషయంలో ఎందుకు తాత్సారం చేస్తున్నారో అర్థం కావడం లేదని హరీశ్ పేర్కొన్నారు. రాష్ట్రానికి ద్రోహం చేస్తున్న చంద్రబాబును నిలదీయకుండా, విద్యుత్ సరఫరా చేయని కేంద్రంపై ఒత్తిడి తేకుండా.. రాష్ట్ర ప్రభుత్వంపై బీజేపీ నేతలు నిందలు వేస్తున్నారని మండిపడ్డారు.
అంబేద్కర్‌కు కాదు.. మోదీకి ఇవ్వండి
Published Mon, Oct 20 2014 12:29 AM | Last Updated on Fri, Aug 24 2018 2:17 PM
Advertisement
Advertisement