
రాహుల్ పోస్ట్ చేసిన ఫోటోలు
సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీకి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గట్టి కౌంటర్ ఇచ్చారు. అంబేద్కర్ ను గౌరవించే విషయంలో బీజేపీ అవలంభిస్తున్న విధానాలను చూడండంటూ శుక్రవారం ఆయన తన ట్విటర్లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేశారు. గత కొంతకాలంగా దేశవ్యాప్తంగా జరిగిన పలు ఘటనల్లో ధ్వంసమైన అంబేద్కర్ విగ్రహాల తాలుకూ ఫోటోలవి.
‘బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్ పాలిత దేశంలో అంబేద్కర్ కు దక్కిన గౌరవాన్ని చూడండి. దేశంలోని దళితులను, అంబేద్కర్ ను బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్‌లు ఎన్నటికీ గౌరవించవు. రాజ్యాంగపితను గౌరవిస్తున్నామని చెప్పుకుంటున్న మోదీ.. ముందు ఆయన(అంబేద్కర్) విగ్రహాలను ధ్వంసానికి గురికాకుండా చూసుకోవాలి' అని రాహుల్ హితవు పలికారు.
కాగా, బుధవారం పార్టీ ఎంపీలతో జరిగిన సమావేశంలో ప్రధాని మాట్లాడుతూ.. స్వాతంత్ర్యానంతరం దేశాన్నేలిన ప్రభుత్వాలు బాబాసాహెబ్ అంబేద్కర్ కు సరైన గౌరవాన్ని ఇవ్వలేకపోయానని.. పరోక్షంగా కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి విమర్శలు చేసిన విషయం తెలిసిందే.
मोदीजी, जिस दमनकारी विचारधारा से आप आते हैं वो दलितों और बाबासाहेब का सम्मान कभी कर ही नहीं सकती| भाजपा/RSS विचारधारा द्वारा बाबासाहेब के सम्मान के कुछ उदाहरण... pic.twitter.com/7QXCKUoGMe
— Rahul Gandhi (@RahulGandhi) April 6, 2018
Comments
Please login to add a commentAdd a comment