సాక్షి, విజయవాడ: ప్రొటోకాల్ ప్రకారం పులిచింతల ప్రాజెక్టులో విద్యుత్ ఉత్పత్తి నిలిపివేయాలని ఎస్‌ఈ రమేష్‌బాబు ఆదేశించారు. విద్యుదుత్పత్తికి, నీటి కేటాయింపులకు ప్రొటోకాల్ ఉందని తెలిపారు. ఇందుకు సంబంధించి తెలంగాణ అధికారులు, ఏపీ అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు. గడిచిన రెండేళ్లలో ప్రొటోకాల్ ప్రకారమే విద్యుదుత్పత్తి జరిగింది.. కానీ ఇప్పుడు తెలంగాణ అధికారులు ప్రొటోకాల్ పాటించలేదని తెలిపారు.
జూన్ 29 నుంచి టీఎస్ జెన్‌కో విద్యుదుత్పత్తి చేస్తోందన్నారు. డెల్టాలో ఇప్పటివరకు నారుమళ్లు ప్రారంభం కాలేదు, నీటి అవసరాలు లేవని.. ఈ పరిస్థితుల్లో నీటిని కిందకు వదిలితే సముద్రంలో కలుస్తాయని తెలిపారు. ఇరిగేషన్ అవసరాలు ప్రారంభమైన తర్వాతే.. విద్యుదుత్పత్తి ప్రారంభించాలని తెలంగాణ అధికారులను కోరాం అని ఎస్‌ఈ రమేష్ బాబు తెలిపారు.
చదవండి: తెలంగాణను నియంత్రించండి
Comments
Please login to add a commentAdd a comment