ఆ రైల్వే లైన్ కు చొరవ చూపండి | Show initiative to Adilabad ARMOOR railway line | Sakshi
Sakshi News home page

ఆ రైల్వే లైన్ కు చొరవ చూపండి

Published Wed, Mar 9 2016 5:03 AM | Last Updated on Fri, Aug 17 2018 2:53 PM

Show initiative to Adilabad ARMOOR railway line

మహారాష్ట్ర గవర్నర్‌కు రాష్ట్ర మంత్రుల వినతి

సాక్షి, హైదరాబాద్: చాలా కాలంగా పెండింగులో ఉన్న ఆదిలాబాద్-ఆర్మూర్ రైల్వే లైన్ పూర్తయ్యేలా చొరవ చూపాలని మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, జోగు రామన్నలు మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగరరావుకు వినతిపత్రం అందజేశారు. మహారాష్ట్రతో సాగునీటి ప్రాజెక్టులపై ఒప్పందం చేసుకునేందుకు సీఎం వెంట ముంబై వెళ్లిన మంత్రులు విద్యాసాగరరావుతో భేటీ అయ్యారు. గతంలోనే ఈ రైల్వే లైనుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన రైల్వే శాఖ పనుల విషయంలో జాప్యం చేస్తోందని పేర్కొన్నారు. ఆదిలాబాద్, నిజామాబాద్ వాసులకు ఇది ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని పేర్కొన్నారు. షోలాపూర్, నాందేడ్, నిజామాబాద్‌ల మధ్య పంట దిగుబడి అమ్ముకునేందుకు రైతులు రాకపోకలు సాగిస్తారని, వారికి ఈ ప్రాజెక్టు ఎంతో ఉపయోగపడుతుందని వివరించారు. ఈ విషయంపై రైల్వే మంత్రితో మాట్లాడి నిధులు విడుదల చేయించి పనులు జరిగేలా చూడాలని వినతిపత్రంలో కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement