State Ministers
-
లీకేజీ సూత్రధారి బండి
సాక్షి, హైదరాబాద్/సాక్షి, నెట్వర్క్: పదవ తరగతి ప్రశ్నపత్రాల లీకేజీ వెనుక బీజేపీ నేతల కుట్రకోణం దాగి ఉందని రాష్ట్ర మంత్రులు ధ్వజమెత్తారు. ప్రభుత్వాన్ని అభాసుపాలు చేసేందుకే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ ఈ పనికి దిగజారి సూత్రధారిగా వ్యవహరించారని వారంతా మండిపడ్డారు. ఈ ఉదంతంపై మంత్రుల స్పందన వారి మాటల్లోనే.. ‘‘ప్రశ్నపత్రాల లీకేజీల వెనుక కుట్ర కోణం ఉంది. బాధ్యులను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. కేంద్రంలోని బీజేపీ పెద్దల సూచనలతోనే ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు, అల్లర్లు సృష్టించేందుకు ఈ పనిచేశారు. – సబితారెడ్డి, విద్యాశాఖ మంత్రి ‘‘బండి సంజయ్ టెన్త్ పేపరు లీకేజీ సూత్రధారి. దీనికి అన్ని ఆధారాలున్నాయి. లక్షల మంది పిల్లల భవిష్యత్తుపై కనీస బాధ్యత లేకుండా బండి సంజయ్ వ్యవహరించారు. ఆయన అరెస్టుపై బీజేపీ నాయకులు సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేస్తే భౌతికదాడులు తప్పవు’’ – వేముల ప్రశాంత్‌రెడ్డి, ఆర్అండ్బీ శాఖ మంత్రి ‘‘వివిధ ప్రభుత్వ శాఖల్లో దాగిన బీజేపీ స్లీపర్‌సెల్స్‌ను గుర్తించి బయటికి లాగుతాం. తెలంగాణలో చిచ్చు పెట్టేందుకు బీజేపీ పన్నిన కుట్రలను ఛేదిస్తాం. తనకు వచ్చిన ప్రశ్నాపత్రంపై పోలీసులకు చెప్పాల్సిన బాధ్యత సంజయ్‌కి లేదా?’’ – గంగుల కమలాకర్, పౌరసరఫరాల శాఖ మంత్రి ‘‘నిరుద్యోగులు, విద్యార్థులను రెచ్చగొట్టి, రాష్ట్రంలో అలజడులు సృష్టించేందుకు బీజేపీ నాయకులు కుట్ర పన్నారు. అడ్డంగా దొరికిపోయిన బండి సంజయ్.. దొంగే ‘దొంగ.. దొంగ’అన్నట్లు మాట్లాడుతున్నారు. బీజేపీ జాతీయ నాయకత్వం సంజయ్‌ను అధ్యక్ష పదవి నుంచి తొలగించి, పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి’’ – గుంటకండ్ల జగదీష్ రెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి ‘‘రాష్ట్రంలో విద్యావ్యవస్థ ప్రతిష్టను దెబ్బతీసే కుట్రలో భాగంగానే లీకేజీ కుట్ర జరిగింది. ఇందుకు బీజేపీ మూల్యం చెల్లించుకోక తప్పదు. బండి ఆటలు సాగనివ్వబోం. పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది’’ – కొప్పుల ఈశ్వర్, ఎస్సీ అభివృద్ధి, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ‘‘టీఎస్పీఎస్సీ, పదో తరగతి పేపర్ లీకేజీ వెనక బీజేపీ నాయకుల కుట్ర ఉంది. తెలంగాణ ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురావాలని చూస్తున్నారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ చేసిన నిందితుడు కూడా బీజేపీ కార్యకర్తే’’ – శ్రీనివాస్‌గౌడ్, ఎక్సైజ్, క్రీడల శాఖ మంత్రి ‘‘ప్రశ్నపత్రాల లీకేజీ బీజేపీ పనే. పథకం ప్రకారమే ప్రశ్నపత్రం లీకేజీ జరిగింది. బండి నిజాయితీపరుడైతే పోలీసులకు ఫోన్ ఎందుకు ఇవ్వలేదు?. సంజయ్ ఫోన్ సంభాషణ బయటపడితే, లీకేజీలో బీజేపీ జాతీయ నాయకత్వం, కేంద్ర ప్రభుత్వ ప్రమేయం బట్టబయలవుతుంది’’ – ఎర్రబెల్లి దయాకర్‌రావు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ‘‘అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి కోసం బీజేపీ నేతలు ప్రశ్నపత్రాల లీకేజీ వంటి కుట్రలకు పాల్పడుతున్నారు. బండి సంజయ్ పార్లమెంటు సభ్యత్వాన్ని లోక్‌సభ స్పీకర్ తక్షణమే రద్దు చేయాలి. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల చర్యలతో రాష్ట్రం భ్రష్టు పడుతోంది.’’ – పువ్వాడ అజయ్‌కుమార్, రవాణా శాఖ మంత్రి -
తెలంగాణ మంత్రుల చలో ఢిల్లీ
సాక్షి, హైదరాబాద్: యాసంగి వరి ధాన్యం కొనుగో లు విషయంలో కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం కార్యాచరణ ప్రారంభించింది. సీఎం కె.చంద్రశేఖర్‌రావు ముందే ప్రకటించినట్టుగా రాష్ట్ర మంత్రుల బృందం ఢిల్లీకి బయలుదేరి వెళ్లింది. సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి నేతృత్వంలో గంగుల కమలాకర్, పువ్వాడ అజయ్, వేముల ప్రశాంత్‌రెడ్డి మంగళవారం రాజధానికి పయనమైవెళ్లారు. రాష్ట్రానికి చెందిన పార్టీ ఎంపీలతో పాటు బుధవారం కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌ను కలవాలని నిర్ణయించుకున్నారు. పంజాబ్, హరియాణా తరహాలో రైతులు పండించిన పంటను కేంద్రం కొనుగోలు చేయాల్సిందేనన్న డిమాండ్‌తో మంత్రులు కేంద్ర మంత్రితో సమావేశం కావాలని భావిస్తున్నారు. కనీస మద్దతు ధరతో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసిన తరువాత కేంద్రం తన అవసరాలకు అనుగుణంగా ఎలా ఉపయోగించుకున్నా తమకు అభ్యంతరం లేదనే వాదనను ఈసారి తెరపైకి తెచ్చారు. సోమవారం టీఆర్ఎస్ విస్తృతస్థాయి భేటీలో కేసీఆర్ ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా కనీస మద్దతు ధర, ధాన్యం కొనుగోలు.. అంశాల పైనే కేంద్రంపై ఒత్తిడి తేవాలని నిర్ణయించారు. బుధవారం గోయల్ ఇచ్చే అపాయింట్మెంట్ను బట్టి ఢిల్లీలో మంత్రులు, ఎంపీల కార్యాచరణ ఉండనుంది. ఇదే విషయాన్ని ఢిల్లీకి బయలుదేరుతూ మంత్రులు మీడియా సమావేశంలో వెల్లడించారు. గోధుమలు, పత్తి తరహాలోనే.. ‘దేశంలో పండిన గోధుమలు, పత్తిని కనీస మద్దతు ధరకు కేంద్రం కొనుగోలు చేస్తోంది తప్ప గోధుమను పిండి చేసి, పత్తిని బేల్ చేసి కొనడం లేదు. మరి వరి ధాన్యం విషయంలో ఈ తేడా ఎందుకు? రైతు పండించిన ధాన్యాన్ని బియ్యంగా సేకరించే ఎఫ్‌సీఐ కేంద్రం చేతుల్లోనే ఉంది. బాయిల్డ్ రైస్‌ను పరిచయం చేసిందే ఈ ఎఫ్‌సీఐ. బాయిల్డ్ రైస్, రా రైస్ అనే దానితో మాకు సంబంధం లేదు. పంజాబ్ తరహాలో రైతులు ఏది పండిస్తే అది కొనాలి..’అని గంగుల కమలాకర్ డిమాండ్ చేశారు. ప్రధానికి సమస్యను వివరిస్తాం.. కేంద్రంతో తాడోపేడో తేల్చుకునే వస్తామని, సానుకూలంగా స్పందన రాకపోతే ఏం చేయాలో సీఎం ఇప్పటికే నిర్ణయించారని తెలిపారు. దానికి అనుగుణంగా తమ కార్యాచరణ ఉంటుందని చెప్పారు. కేంద్రం తెలంగాణపై కక్షపూరితంగా వ్యవహరిస్తోం దని శంషాబాద్ విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడుతూ గంగుల విమర్శించారు. కేంద్రం తీరుతో రైతాంగం అయోమయంలో ఉందన్నారు. ప్రధానిని కలిసి సమస్యను వివరిస్తామని చెప్పారు. బియ్యం తీసుకోకుండా నిందలు.. ‘యాసంగి ధాన్యం కొనుగోలుపై మాకు స్పష్టమైన వైఖరి ఉంది. రైతులు పండించిన పంటను కేంద్రం కొనుగోలు చేయాలన్నదే మా డిమాండ్. ధాన్యం కొనుగోలు విషయంలో వాస్తవాలకు విరుద్ధంగా కేంద్ర మంత్రి మాట్లాడుతున్నారు. రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలి. కేంద్రం సేకరించేందుకు ఒప్పుకుంటే ధాన్యాన్ని బియ్యంగా మార్చి అప్పగిస్తాం. గత సీజన్లో వచ్చిన ధాన్యాన్ని బియ్యం పట్టిస్తే ఎఫ్‌సీఐ తీసుకోకుండా మా మీద నిందలు వేస్తున్నారు. ఈ విషయాలన్నీ కేంద్ర మంత్రులు, అధికారులతో చర్చిస్తాం..’అని నిరంజన్‌రెడ్డి తెలిపారు. ‘వరి ధాన్యం కొనుగోలుపై ఏమైనా మాట్లాడితే ఆ శాఖ మంత్రి మాట్లాడాలి.. లేదంటే సంబంధిత అధికారులు మాట్లాడాలి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కి ఏం సంబంధం?’అని ప్రశ్నించారు. -
చిరుత దాడి నుంచి తమ్ముడిని రక్షించిన బాలిక
పారి: నాలుగేళ్ల తన తమ్ముడిని ఓ చిరుతపులి బారినుంచి కాపాడిందో 11ఏళ్ల అక్క. ఉత్తరాఖండ్‌లోని దేవ్కుందైతల్లి గ్రామంలో జరిగిందీ ఘటన. ఈ నెల నాలుగోతేదీన నాలుగేళ్ళ తమ్ముడితో కలసి రాఖీ (11) ఆడుకుంటోంది. ఇంతలో ఒక్కసారిగా ఒక చిరుత తన తమ్ముడిపై దాడి చేసింది. అయితే రాఖీ ఏమాత్రం ఆ చిరుతకు భయపడకుండా ఎదురొడ్డి ధైర్యంగా నిలబడింది. చిరుత లాక్కెళ్లకుండా రాఖీ తన తమ్ముడిని మీదపడి అడ్డుగా నిలబడింది. ఈ క్రమంలో రాఖీ మెడపై తీవ్రగాయాలయ్యాయి. ఇంతలో గ్రామస్తులు అక్కడకు చేరుకోవడంతో చిరుత పక్కనే ఉన్న అడవిలోకి ఉడాయించింది. ప్రస్తుతం బాలిక ఢిల్లీలోని రామ్మనోహర్ లోహియా ఆస్పత్రిలోకి చికిత్సపొందుతోంది. వైద్య ఖర్చులకు రాష్ట్రమంత్రి బాలికకు రూ.1లక్ష ఆర్థికసాయం చేశారు. -
బడ్జెట్ సమావేశాల్లోనే ‘పంచాయతీ’ బిల్లు
సాక్షి, హైదరాబాద్: వచ్చే రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లోనే కొత్త పంచాయతీరాజ్ చట్టం బిల్లును ప్రవేశపెట్టాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. గ్రామ పంచాయతీలకు జనాభా ప్రాతిపదికన ఏటా రూ.5 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు నిధులు ఇచ్చేలా ఏర్పాటు చేయాలని సూచించారు. గ్రామ పంచాయతీలకు ఉపాధి హామీ పథకం నిధులతోపాటు ఆర్థిక సంఘం, రాష్ట్ర బడ్జెట్, ఆస్తి పన్నుల వసూళ్లు తదితర మార్గాల ద్వారా ఆదాయం సమకూరేలా విధివిధానాలు రూపొందించాలని ఆదేశించారు. కొత్తగా ఏర్పాటు కాబోతున్న పంచాయతీలు ఆర్థిక సంఘం నుంచి నిధులు ఏవిధంగా పొందవచ్చనే దానిపై అధ్యయనం చేయాలని పంచాయతీరాజ్ కమిషనర్‌కు సూచించారు. ఆదివారం పంచాయతీరాజ్ ముసాయిదా బిల్లు పురోగతి, కొత్త పంచాయతీలు, నగర పంచాయతీల ఏర్పాటుపై ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి సమీక్షించారు. అన్ని గ్రామాల్లో నేత్ర శిబిరాలు రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో నేత్ర శిబిరాలు నిర్వహించి, కంటి పరీక్షలు చేయాలని.. అవసరమైన వారికి కళ్లద్దాలను ఉచితంగా అందజేయాలని కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమం మూడు నెలల్లో పూర్తి కావాలని స్పష్టం చేశారు. ఇక ఆరోగ్యానికి సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పెద్ద ఎత్తున ప్రచారం చేసి ప్రజలను చైతన్యవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమం అమలుకు ప్రభుత్వేతర సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, ఆసక్తి గల ఇతర వ్యవస్థలను భాగస్వాములను చేయాలని అధికారులకు సూచించారు. దీనిపై అవలంబించాల్సిన వ్యూహన్ని ఖరారు చేయాల్సిందిగా ఆరోగ్య శాఖ మంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వైద్యారోగ్య శాఖ కార్యదర్శి, కమిషనర్లను ఆదేశించారు. ఇక మార్చి 11న రాష్ట్రవ్యాప్తంగా పట్టాదారు పాసు పుస్తకాలు ఇవ్వాలని నిర్ణయించిన నేపథ్యంలో.. ఆ పాస్ పుస్తకాల ముద్రణ పురోగతి, ధరణి వెబ్సైట్ ఏర్పాటుపై రెవెన్యూ, ఐటీ అధికారులతో ముఖ్యమంత్రి సమీక్షించారు. ఈ పనులన్నీ అనుకున్న సమయంలోగా పూర్తయ్యేలా చూడాలని ప్రభుత్వ సీఎస్‌ను ఆదేశించారు. హైదరాబాద్ చుట్టూ ‘అర్బన్ ఫారెస్ట్’ హైదరాబాద్ నగరం చుట్టూ 50 నుంచి 60 కిలోమీటర్ల పరిధిలో ఉన్న అటవీ భూమిని కాపాడేందుకు తగిన చర్యలు చేపట్టాలని అధికారులను కేసీఆర్ ఆదేశించారు. నగరం పరిధిలో, చుట్టూ ఉన్న అటవీ ప్రాంతాలను పరిశీలించి.. వాటి అభివృద్ధికి ఏం చేయాలో అధ్యయనం చేయాలని సూచించారు. ఈ బాధ్యతలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, మున్సిపల్, అటవీ శాఖల మంత్రులు, చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్‌శర్మ, సీఎంవో ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావులకు అప్పగించారు. ‘సేవ్ హైదరాబాద్’లో భాగంగా ఈ కార్యక్రమాలన్నీ చేపట్టాలన్నారు. హైదరాబాద్ పరిధిలో దాదాపు లక్షన్నర ఎకరాల మేర అటవీ భూమి ఉందని.. దాన్ని కాపాడుకుంటూ ఆరోగ్యకరమైన గాలి పీల్చుకునేలా ‘ఫారెస్ట్ బ్లాక్స్’ను అభివృద్ధి చేయాలని ఆదేశించారు. మూసీ రివర్ ఫ్రంట్, హైదరాబాద్ అర్బన్ ఫారెస్ట్‌ను ప్రత్యేకంగా అభివృద్ధి చేయాలని, అవసరమైనన్ని నిధులు వెచ్చించాలని సూచించారు. జూబ్లీహిల్స్‌లోని కేబీఆర్ పార్క్ తరహాలో మూసీ రివర్ ఫ్రంట్‌లో వాక్‌వే రూపొందించాలన్నారు. సమావేశంలో మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్, తుమ్మల, జూపల్లి, జగదీశ్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, ఎంపీలు సీతారాంనాయక్, గుత్తా సుఖేందర్‌రెడ్డి, మల్లారెడ్డి, ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
‘భూ దందాలకు పాల్పడుతున్న ప్రభుత్వం’
జడ్చర్ల : తెలంగాణ ప్రభుత్వం చట్టాలను, రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి భూ దందాలకు పాల్పడుతోందని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ ఆరోపించారు. మంగళవారం జడ్చర్లలో విలేకరులతో ఆయన మాట్లాడారు. రాష్ట్రం లో ప్రాజెక్టుల కోసం 123 జీఓను అడ్డం పెట్టుకుని బలవంతపు భూసేకరణకు పాల్పడుతోందని విమర్శించారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ఎత్తిపోతలపై రాష్ర్ట నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు అబద్ధాలతో ప్రజలను మభ్య పెడుతున్నారన్నారు. జిల్లా ప్రయోజనాలను రాష్ర్ట మంత్రులు జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి తాకట్టు పెడుతున్నారన్నారు. ఈ అంశంపై వారితో చర్చించేందుకు తాము సిద్ధంగానే ఉన్నామన్నారు. రిజర్వాయర్ల డిజైన్లు మార్చాలి ఆయా ముంపు ప్రాంతాలను తగ్గించేలా రిజర్వాయర్ల డిజైన్లు మార్చాలని వెంకట్ డిమాండ్ చేశారు. తాము ప్రాజెక్టులకు వ్యతిరేకం కాదని, ప్రజలకు నష్టం జరగకుండా చూడాల్సిన బాధ్యత ఎంతైనా ఉందన్నారు. ఉదండాపూర్ నిర్వాసితులకు అండగా ఉంటామని, ఈనెల 25న జడ్చర్లలో సదస్సు నిర్వహిస్తామన్నారు. 29న రాష్ట్రస్థాయిలో హైదరాబాద్ నగరంలో సదస్సు ఉంటుందన్నారు. ఈ సమావేశంలో సంఘం రాష్ట్ర కార్యదర్శి వెంకట్రాములు, తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు జబ్బార్, కార్యదర్శి ఎ.రాములు, సీఐటీయూ ఉపాధ్యక్షుడు దీప్లానాయక్, సీపీఎం మండల కార్యదర్శి తెలుగు సత్తయ్య తదితరులు పాల్గొన్నారు. -
మంత్రులు నోటిని అదుపులో పెట్టుకోవాలి
వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంగా దాచేపల్లి : రాష్ట్ర ప్రజల మనస్సుల్లో ఉన్న మాటనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రధాన ప్రతిపక్షనాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎంను ఉద్దేశించి మాట్లాడారని, ప్రజల తరఫున మాట్లాడిన మాటలకు మంత్రులు నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం సరికాదని ఆ పార్టీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే జంగా కృష్ణమూర్తి అన్నారు. దాచేపల్లిలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి కూడా నెరవేర్చకుండా సీఎం కాలయాపన చేస్తుండడం వలన ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, అన్ని రంగాల్లో వైఫల్యం చెందడం వలన ప్రజల్లో నెలకొన్న అసంతృప్తిని తమ అధినేత వెల్లడించారని జంగా చెప్పారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీ నేతగా జగన్మోహన్రెడ్డికి ప్రజల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసే హక్కు ఉందని, ప్రభుత్వం తీరును ఎండగట్టిన ప్రతిసారీ తమ అధినేతపై మంత్రులు అవాకులు చవాకులు పేలుతున్నారని జంగా ధ్వజమెత్తారు. రాష్ట్ర మంత్రులు నోటిని అదుపులో పెట్టుకుని మాట్లాడాలని, బాధ్యత కలిగిన మంత్రులుగా వ్యవహరించకపోతే ప్రజల చేతిలో గుణపాఠం తప్పదని హెచ్చరించారు. సమావేశంలో దాచేపల్లి, గురజాల, మాచవరం, పిడుగురాళ్ల మండల కన్వీనర్లు షేక్ జాకీర్‌హుస్సేన్, సిద్ధాడపు గాంధీ, సింగరయ్య, చల్లా పిచ్చిరెడ్డి, జెడ్పీటీసీ సభ్యులు మూలగొండ్ల ప్రకాష్‌రెడ్డి, వీరభద్రుని రామిరెడ్డి, జిల్లా ఎగ్జిక్యూటిట్ సభ్యుడు మందపాటి రమేష్‌రెడ్డి, దాచేపల్లి పట్టణ అధ్యక్షుడు మునగా పున్నారావు, పిడుగురాళ్ళ పట్టణ అధ్యక్షుడు చింతా రామారావు తదితరులున్నారు. రాష్ట్ర ప్రజల మనస్సుల్లో ఉన్న మాటనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రధాన ప్రతిపక్షనాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎంను ఉద్దేశించి మాట్లాడారని, ప్రజల తరఫున మాట్లాడిన మాటలకు మంత్రులు నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం సరికాదని ఆ పార్టీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే జంగా కృష్ణమూర్తి అన్నారు. దాచేపల్లిలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి కూడా నెరవేర్చకుండా సీఎం కాలయాపన చేస్తుండడం వలన ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, అన్ని రంగాల్లో వైఫల్యం చెందడం వలన ప్రజల్లో నెలకొన్న అసంతృప్తిని తమ అధినేత వెల్లడించారని జంగా చెప్పారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీ నేతగా జగన్మోహన్రెడ్డికి ప్రజల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసే హక్కు ఉందని, ప్రభుత్వం తీరును ఎండగట్టిన ప్రతిసారీ తమ అధినేతపై మంత్రులు అవాకులు చవాకులు పేలుతున్నారని జంగా ధ్వజమెత్తారు. రాష్ట్ర మంత్రులు నోటిని అదుపులో పెట్టుకుని మాట్లాడాలని, బాధ్యత కలిగిన మంత్రులుగా వ్యవహరించకపోతే ప్రజల చేతిలో గుణపాఠం తప్పదని హెచ్చరించారు. సమావేశంలో దాచేపల్లి, గురజాల, మాచవరం, పిడుగురాళ్ల మండల కన్వీనర్లు షేక్ జాకీర్‌హుస్సేన్, సిద్ధాడపు గాంధీ, సింగరయ్య, చల్లా పిచ్చిరెడ్డి, జెడ్పీటీసీ సభ్యులు మూలగొండ్ల ప్రకాష్‌రెడ్డి, వీరభద్రుని రామిరెడ్డి, జిల్లా ఎగ్జిక్యూటిట్ సభ్యుడు మందపాటి రమేష్‌రెడ్డి, దాచేపల్లి పట్టణ అధ్యక్షుడు మునగా పున్నారావు, పిడుగురాళ్ళ పట్టణ అధ్యక్షుడు చింతా రామారావు తదితరులున్నారు. -
ఆ రైల్వే లైన్ కు చొరవ చూపండి
మహారాష్ట్ర గవర్నర్‌కు రాష్ట్ర మంత్రుల వినతి సాక్షి, హైదరాబాద్: చాలా కాలంగా పెండింగులో ఉన్న ఆదిలాబాద్-ఆర్మూర్ రైల్వే లైన్ పూర్తయ్యేలా చొరవ చూపాలని మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, జోగు రామన్నలు మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగరరావుకు వినతిపత్రం అందజేశారు. మహారాష్ట్రతో సాగునీటి ప్రాజెక్టులపై ఒప్పందం చేసుకునేందుకు సీఎం వెంట ముంబై వెళ్లిన మంత్రులు విద్యాసాగరరావుతో భేటీ అయ్యారు. గతంలోనే ఈ రైల్వే లైనుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన రైల్వే శాఖ పనుల విషయంలో జాప్యం చేస్తోందని పేర్కొన్నారు. ఆదిలాబాద్, నిజామాబాద్ వాసులకు ఇది ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని పేర్కొన్నారు. షోలాపూర్, నాందేడ్, నిజామాబాద్‌ల మధ్య పంట దిగుబడి అమ్ముకునేందుకు రైతులు రాకపోకలు సాగిస్తారని, వారికి ఈ ప్రాజెక్టు ఎంతో ఉపయోగపడుతుందని వివరించారు. ఈ విషయంపై రైల్వే మంత్రితో మాట్లాడి నిధులు విడుదల చేయించి పనులు జరిగేలా చూడాలని వినతిపత్రంలో కోరారు. -
కొన్నవి చూపిస్తే పేదలకు పంచుతాం
♦ సాక్షిలో అవాస్తవాలు రాస్తున్నారు ♦ పత్రిక ఎండీ, ఎడిటర్, ప్రమోటర్లు, విలేకరిపై పరువు నష్టం దావా ♦ భూదురాక్రమణ కథనాలపై మంత్రులు నారాయణ, పుల్లారావు సాక్షి, విజయవాడ బ్యూరో: రాజధానిలో తాము భూములు ఎక్కడ కొన్నామో చూపిస్తే వాటిని పేదలకు పంచుతామని మంత్రులు నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు చెప్పారు. సాక్షి పత్రికలో తమపై కావాలని బురద జల్లుతున్నారని ఆరోపించారు. సాక్షి పత్రికలో బుధవారం ప్రచురితమైన భూదురాక్రమణ కథనాలపై మంత్రులు సీఎం కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడారు. వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి మాట్లాడుతూ.. రాజధానిలో ఏ లావాదేవీ జరిగినా లోకేశ్‌బాబుకు, తనకు, నారాయణకూ సంబంధం ఉందంటున్నారని, ఇలాగైతే పదేళ్లలో రాష్ట్రంలో జరిగిన రిజిస్ట్రేషన్లు, అగ్రిమెంట్లలో జగన్ పాత్ర ఉందని అనాల్సివస్తుందన్నారు. రాసిన వ్యక్తుల్లో ఎవరికి భూములున్నా సాక్షి మేనేజ్మెంట్కు రాసిస్తామని చెప్పారు. ఈ కథనాలు రాసిన సాక్షి ప్రమోటర్, ఎండీ, ఎడిటర్, వార్త పంపిన విలేకరిపై సివిల్, క్రిమినల్ పరువు నష్టం దావా వేస్తామని చెప్పారు. ఎడిటర్స్ గిల్డ్, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేస్తామన్నారు. తప్పుడు వార్తలు రాయడం, దానిపై బొత్స సత్యనారాయణ వంటి నేతలు ఇష్టానుసారం మాట్లాడడం సరికాదన్నారు. పత్రిక, చానల్ ఉంది కదా అని అవాస్తవాలు రాస్తే పత్రికలను ఏంచేస్తున్నారో చూస్తున్నారుగా అంటూ హెచ్చరిక ధోరణిలో మాట్లాడారు. నారాయణ మూడు వేల ఎకరాలు కొన్నాడని ఎవరెవరి పేర్లో చెబుతున్నారని, రాజారెడ్డి, పుల్లారెడ్డి తన బినామీలంటున్నారని, ఇంతవరకూ రాజారెడ్డి పేరే తాను వినలేదన్నారు. సూటిగా సమాధానం చెప్పని పుల్లారావు లింగమనేని ఎస్టేట్స్‌తో క్విడ్‌ప్రోకో జరగడం వాస్తవం కాదా అని విలేకరులు ప్రశ్నించగా పుల్లారావు నేరుగా స్పందించకుండా క్విడ్‌ప్రోకో చర్రిత జగన్‌దేనన్నారు. ఎమ్మెల్యేలు పార్టీలు మారుతున్న విషయాన్ని పక్కదారి పట్టించడానికి ఇలా రాస్తున్నారని ఆరోపించారు. జగన్మోహన్రెడ్డి పద్ధతి మార్చుకోకపోతే ప్రతిపక్ష స్థానాన్ని కోల్పోయే పరిస్థితి వస్తుందన్నారు. బాలకృష్ణ వియ్యంకుడి కోసం సీఆర్డీఏ పరిధిని జగ్గయ్యపేట వరకూ విస్తరించడం వాస్తవం కాదా అని విలేకరుల ప్రశ్నించగా ఒకరి కోసం డిజైన్ మార్చే పరిస్థితి ఉందంటూనే మళ్లీ పాత విషయాలపై మాట్లాడారు. మంత్రి రావెల కిషోర్‌బాబు తన భార్య పేరు మీదే భూములు కొన్న విషయాన్ని ప్రస్తావించగా దానికి సమాధానం చెప్పకుండా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కరపత్రిక మంత్రివర్గంపై ఇలా బురద జల్లుతోందని ఆరోపించారు. సాక్షి కథనాలను ఖండించడానికి ఆవేశంగా మీడియా పాయింట్ వద్దకొచ్చిన మంత్రులు నారాయణ, పుల్లారావు తమ భూముల గురించి లోతుగా ప్రశ్నలు అడిగితే నీళ్లు నమిలారు. ఆశ్చర్యం కలిగించాయి: నారాయణ మంత్రి నారాయణ మాట్లాడుతూ సాక్షిలో వచ్చిన కథనాలు తనకు ఆశ్చర్యం కలిగించాయని, నిజాలు తెలుసుకుని రాయాలని సూచించారు. ఏదో రకంగా రాజధానిని అడ్డంగించాలని ప్రయత్నించి కోర్టులో కేసులు వేయించారని, రైతుల్ని రెచ్చగొట్టారని అయినా రాజధాని నిర్మిస్తుండడంతో ఓర్వలేక ఇలా బురద జల్లుతున్నారని ఆరోపించారు.తాను మూడు వేల ఎకరాలు ఎక్కడ కొన్నానో చూపిస్తే పేదలకు పంచేస్తానన్నారు. అసైన్డ్ భూములకు పరిహారం ఇచ్చే విషయంలో అవకతవకల గురించి ప్రశ్నించగా నిబంధనల ప్రకారమే అంతా చేశామన్నారు. -
సినీ కార్మికులపై మంత్రుల వరాల జల్లు
హైదరాబాద్: సినీ కార్మికులపై రాష్ట్ర మంత్రులు వరాల జల్లు కురిపించారు. గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో వారడిగిన కోరికలన్నింటినీ అక్కడికక్కడే ఓకే చెప్పి వారిని సంతృప్తి పరిచారు. రాజేంద్రనగర్ మండలం మణికొండ పంచాయతీ పరిధిలోని చిత్రపురికాలనీలో మంత్రులు కె.తారకరామారావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, పట్నం మహేందర్‌రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీవాసులు వారి దృష్టికి తెచ్చిన కాలనీ ప్రధానరోడ్డు నిర్మాణానికి జీహెచ్ఎంసీ, పంచాయతీరాజ్ శాఖ నుంచి రూ. కోటిన్నర నిధులను ఖర్చు చేయనున్నట్టు ప్రకటించారు. పట్టణ ఆరోగ్యకేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని, శుక్రవారం నుంచి కాలనీవాసులు ఎటువైపు తిరిగితే అటువైపు బస్‌లను నడుపుతామని హామీ ఇచ్చారు. టింబర్లేక్ కాలనీ మీదుగా రోడ్డును అడ్డుకుంటున్నారని పేర్కొనటంతో వారితో చర్చించి జిల్లా కలెక్టర్ రఘునందన్‌రావు సమస్యను పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు. అలాగే కల్యాణ లక్ష్మి, ఆసరా పింఛన్లు అందిస్తామని, కళాకారుల పింఛన్లు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయని పేర్కొన్నారు. తామంతా 15వేల మంది ఉండగా అందులో కేవలం 4 వేలమందికే గృహాలు ఇచ్చారని మిగతా వారికి పక్కనే ఉన్న మరో 9 ఎకరాల భూమిని కేటాయించాలని కోరటంతో ముఖ్యమంత్రితో చర్చించి కేటాయిస్తామని హామీ ఇచ్చారు. కాలనీకి ఉచిత వైఫై సేవలను అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రఘునందన్‌రావు, కూకట్పల్లి ఎమ్మెల్యే మాదవరం కృష్ణారావు, హెచ్ఎండీఏ కమిషనర్ చిరంజీవులు, జలమండలి డెరైక్టర్ కొండారెడ్డి, టీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జీలు స్వర్ణలతారెడ్డి, శంకర్‌గౌడ్, మణికొండ సర్పంచ్ కె.నరేందర్‌రెడ్డి, ఆర్డీవో సురేశ్ పోద్దార్ తదితరులు పాల్గొన్నారు. -
మంత్రులు స్టార్ హోటళ్లలో ఉండొద్దు
ప్రభుత్వ అతిథిగృహాల్ని సిద్ధం చేయాలని సీఎం ఆదేశం సాక్షి, విజయవాడ బ్యూరో: రాష్ర్ట మంత్రులు ఇకనుంచీ స్టార్ హోటళ్లలో బస చేయకూడదని, ప్రభుత్వ అతిథిగృహాల్లోనే బస చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. విజయవాడ క్యాంపు కార్యాలయంలో శుక్రవారం సీఎం చంద్రబాబు ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, మున్సిపల్ మంత్రి నారాయణలతో సమీక్ష నిర్వహించారు. రాష్ర్టంలో మంత్రులు ఎక్కడికెళ్లినా స్టార్ హోటళ్లు, ఖరీదైన హోటళ్లలో బస చేస్తున్న విషయం చర్చకొచ్చినట్టు సమాచారం. దీంతో మంత్రులు బస చేసేలా ప్రభుత్వ అతిథిగృహాలకు మరమ్మతులు చేపట్టి సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. విజయవాడ, గుంటూరు నగరాల్లో ప్రభుత్వ అతిథిగృహాల్ని మంత్రులకు తాత్కాలిక నివాసాలుగా తీర్చిదిద్దాలని నిర్ణయించారు. హడ్కో ద్వారా 10వేల ఇళ్లు: యనమల రాజధాని ప్రాంతంలో అధికారులు నివాసం ఉండేలా హడ్కో సంస్థ 10 వేల ఇళ్లను నిర్మించేందుకు ముందుకొచ్చిందని మంత్రి యనమల రామకృష్ణుడు మీడియాకు చెప్పారు. ఆయన శుక్రవారం నగరంలోని ప్రభుత్వ అతిథిగృహాల్ని పరిశీలించారు. శుభాకాంక్షలు తెలిపిన సీఎం సాక్షి, హైదరాబాద్: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సీఎం చంద్రబాబు తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు దేశ, విదేశాల్లో ఉన్న తెలుగు వారికి శుభాకాంక్షలు తెలిపారు. -
సమ్మె సక్సెస్
- బెట్టు వీడిన ప్రభుత్వం - రూ.11వేలు జీతం చెల్లించేందుకు అంగీకారం - పోరాడి విజయం సాధించిన ఔట్సోర్సింగ్ కార్మికులు - నేటి నుంచి విధుల్లోకి.. - 15 రోజుల సమ్మెకు తెర విజయవాడ సెంట్రల్ : ఔట్సోర్సింగ్ కార్మికుల సమస్యలపై శనివారం రాజమండ్రిలో ప్రభుత్వం సుదీర్ఘ చర్చలు జరిపింది. ఆర్అండ్బీ అతిథి గృహంలో రాష్ట్ర మంత్రులు యనమల రామకృష్ణుడు, పి.నారాయణ, అచ్చెంనాయుడు రెండు విడతలుగా చర్చలు జరిపారు. నగరం నుంచి ఏఐటీయూసీ, సీఐటీయూ నాయకులు ఆసుల రంగనాయకులు, ఆర్.రవీంద్రనాథ్, కె.ఉమామహేశ్వరరావు వెళ్లారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా కార్మికులు కోరినట్లు రూ.15,420 ఇవ్వలేమని మంత్రులు తేల్చిచెప్పారు. కనీసం రూ.12వేలు ఇవ్వాల్సిందిగా యూనియన్ నేతలు పట్టుబట్టారు. ‘గతంలో రూ.10,300 ఇచ్చేందుకు అంగీకరించాం కాబట్టి, మరో రూ.700 పెంచగలం. అంతకుమించి ఇవ్వలేమని..’ మంత్రులు చేతులెత్తేశారు. దశలవారీగా డిమాండ్లను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కార్మికుల భవిష్యత్ దృష్ట్యా మంత్రుల ప్రతిపాదనకు అంగీకరించామని ఏఐటీయూసీ నాయకుడు ఎ.రంగనాయకులు ‘సాక్షి’కి ఫోన్లో తెలిపారు. డిమాండ్ల ఆమోదం ఇలా.. - పబ్లిక్ హెల్త్, నాన్ పబ్లిక్ హెల్త్ వర్కర్లకు నెలకు రూ.11వేలు జీతంగా చెల్లించడం. - విజయవాడ కార్పొరేషన్, గ్రేటర్ విశాఖపట్నంకు మూడు నెలల్లో 010 ద్వారా జీతాలు చెల్లించేందుకు అంగీకారం. - స్కిల్డ్, సెమీస్కిల్డ్ కార్మికుల జీతాల పెంపుదలపై 15 రోజుల్లో క్యాబినెట్ సబ్‌కమిటీ చర్చించి నిర్ణయం తీసుకుంటుంది. - 16 రోజుల సమ్మె కాలానికి సంబంధించి పనితో కూడిన జీతం చెల్లించేలా ఒప్పందం. శ్రామిక విజయం జీతాల పెంపుదలతో పాటు పలు సమస్యల్ని పరిష్కరించాలని కోరుతూ ఈనెల 9వ తేదీ అర్ధరాత్రి నుంచి ఔట్సోర్సింగ్ కార్మికులు సమ్మెలోకి దిగారు. కాంట్రాక్ట్ కార్మికుల్ని రంగంలోకి దింపడం ద్వారా సమ్మెను విచ్ఛిన్నం చేయాలని ప్రభుత్వం ఎత్తులు వేసింది. సంఘటితంగా పోరాడిన కార్మికులు సర్కార్ ఎత్తుల్ని చిత్తుచేశారు. ప్రజాప్రతినిధుల ఇళ్ల ముట్టడి, ధర్నాలు, ప్రదర్శనలు, మానవహారాలు, భిక్షాటన తదితర రూపాల్లో ఉద్యమాన్ని ఉధృతం చేశారు. విపక్షాల మద్దతు కూడగట్టారు. నాలుగు రోజుల్లో విధుల్లోకి రాకుంటే కాంట్రాక్ట్ రద్దుచేస్తామంటూ ప్రభుత్వం డ్వాక్వా, సీఎంఈవై గ్రూపుల కార్మికులకు తాఖీదులిచ్చింది. దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కార్మికులు, యూనియన్ నాయకులు, రాజకీయపక్షాల సహకారంతో కలెక్టరేట్ల ముట్టడిని హోరెత్తించారు. సమ్మె సెగ రగిలించడం ద్వారా శ్రామిక ‘శక్తి’ని చాటిచెప్పారు. నేటి నుంచి విధుల్లోకి.. జీతాల పెంపుదలకు ప్రభుత్వం అంగీకరించిన నేపథ్యంలో సబ్‌కలెక్టర్ కార్యాలయం వద్ద ఔట్సోర్సింగ్ కార్మికులు టపాసులు పేల్చి సంబరాలు జరుపుకొన్నారు. ఆదివారం నుంచి విధులకు హాజరవుతామని ప్రకటించారు. యూనియన్ నేతలు ప్రభుత్వంతో చర్చించేందుకు శనివారం రాజమండ్రి వెళ్లగా.. కార్మికులు మాత్రం సబ్‌కలెక్టర్ కార్యాలయం వద్ద రిలేదీక్షలు చేపట్టారు. వీరికి మద్దతుగా సీఐటీయూ ఆధ్వర్యంలో యూటీఎఫ్ కార్యాలయంలో రౌండ్‌టేబుల్ సమావేశం జరిగింది. ఏపీఎన్జీవో, బ్యాంక్, రైల్వే, మెడికల్ ఎంప్లాయీస్, ఉపాధ్యాయులు, ట్యాక్స్‌పేయర్స్ అసోసియేషన్, జనవిజ్ఞాన వేదిక సభ్యులు ఇందులో పాల్గొని కార్మికుల సమస్యల్ని వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సమ్మె కథ సుఖాంతమైందని తెలుసుకున్న కార్మికులు టెంట్‌ను తొలగించి సంబరాలు చేసుకున్నారు. అభ్యంతరకరమే.. మున్సిపల్ ఔట్సోర్సింగ్ కార్మికుల విషయంలో ప్రభుత్వ వైఖరి అభ్యంతరకరంగా ఉందని ఏపీ మున్సిపల్ ఎంప్లాయీస్, వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కె.ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. నామమాత్రంగానే ప్రభుత్వం జీతాలు పెంచిందని చెప్పారు. పర్మినెంట్ ఉద్యోగులు, ఇంజినీరింగ్ సిబ్బంది విషయంలో సర్కార్ అన్యాయంగా వ్యవహరిస్తోందని పేర్కొన్నారు. మిగితా యూనియన్లు అంగీకరించిన కారణంగానే తాము సమ్మెను విరమిస్తున్నామన్నారు. -
బలనిరూపణకు రెడీ
♦ అధినేత ఎదుట మంత్రులు అమీతుమీ ♦ నామినేటెడ్ పదవుల కోసం నిరీక్షణ ఫలించేనా ♦ నేడు జిల్లా టీడీపీ విస్తృత స్థాయి సమావేశం ♦ హాజరు కానున్న ముఖ్యమంత్రి చంద్రబాబు సాక్షి, విశాఖపట్నం : అధినేత ఎదుట అమీతుమీ తేల్చుకునేందుకు రాష్ర్టమంత్రులు సిద్ధమవుతున్నారు. త్వరలో మంత్రివర్గ విస్తరణ-శాఖల మార్పులు చేర్పులు జరుగనున్నాయన్న వార్తల నేపథ్యంలో నగరానికి వస్తున్న అధినేత వద్ద బలనిరూపణకు మంత్రులు సన్నద్ధమవుతున్నారు. మరోవైపు నామినేటెడ్ పదవుల ఆశావాహులు అధినేతను ప్రసన్నం చేసుకునేందుకు రెడీ అయ్యారు.జిల్లా టీడీపీలో నెలకొన్న ఆదిపత్య పోరుకు విశాఖపట్నంలో జరుగనున్న పార్టీ జిల్లా విస్తృత స్థాయి సమావేశం వేదిక కానుంది. పార్టీ అధ్యక్షుడు..ముఖ్యమంత్రి చంద్ర బాబు పాల్గొననుండడంతో సమావేశానికి ప్రాధాన్యత ఏర్పంది. నగరంలోని కళావాణి ఆడిటోరియంలో ఉదయం 11.15గంటలకు ప్రారంభమవుతున్న ఈ సమావేశం మధ్యాహ్నం వరకు జరగనుంది. లేని నవ్వులు ముఖాలపై పూసుకుంటున్న మంత్రులు గంటా శ్రీనివాసరావు-చింతకాయల అయ్యన్నపాత్రుడు లోలోన కత్తులు దూసుకుంటున్నారు. వీరి మధ్య ఏర్పడిన అగాధం రోజురోజుకు పెరిగి ప్రస్తుతం పూడ్చలేని స్థాయికి చేరుకుంది. జిల్లాలోని ఎమ్మెల్యేలు..ఇతర ముఖ్యనేతలు కూడా రెండువర్గాలుగా చీలిపోవడంతో పార్టీ శ్రేణులు వీరి ఆదిపత్య పోరు మధ్య నలిగిపోతున్నారు. ఇటీవల జిల్లా పార్టీ అధ్యక్షుడు గవిరెడ్డి రామానాయుడు ఇన్చార్జిగా వ్యవహరిస్తున్న మాడుగుల నియోజకవర్గంలో జరిగిన శంకు స్థాపనలు, ప్రారంభోత్సవాలతో మంత్రుల మధ్య విబేదాలు తారాస్థాయికి చేరాయి. గవిరెడ్డి మరో అడుగువేసి పార్టీ నాయకుడు విశాఖ డెయిరీ చైర్మన్ ఆడారి తులసీరావుపై అవినీతి ఆరోపణలు గుప్పిస్తే. గంటా వర్గీయుడైన ఎంపీ అవంతిశ్రీనివాసరావు మంత్రి అయ్యన్నపై ఫైర్ అయ్యారు. కలెక్టర్‌పై సీఎం చంద్రబాబుకు కూడా ఫిర్యాదు చేశారు. తర్వాత కూడా వీరి విబేధాలు తీవ్ర రూపం దాల్చాయి. ఒకరిపై మరొకరు పరోక్షంగా విమర్శలు కూడా చేసుకున్నారు. ఒకసారి హైదరాబాద్‌లోనూ మరొకసారి నర్సీపట్నంలోనూ మంత్రుల విబేధాల పంచాయతీ పెట్టినప్పటికీ కొలిక్కిరాలేదు. సిటీలో కార్యక్రమానికి మంత్రి గంటా ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేస్తుంటే...గ్రామీణ జిల్లా నుంచి కూడా భారీగా జనసమీకరణకు మంత్రి అయ్యన్న రెడీ అవుతున్నారు. మంత్రుల మధ్య తాము నలిగిపోతున్నామంటూ అధినేత ఎదుట పంచాయతీ పెట్టేందుకు కార్యకర్తలు సన్నద్ధమవుతున్నారు. వీరి ఆదిపత్య పోరు ఇలా ఉంటే అధికారం వచ్చి ఏడాదైనా నామినేటెడ్ పదవుల పందారం జరగకపోవడంతో పార్టీ శ్రేణులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అధినేత మాటలతోనే సరిపెడతారా? లేక పదవులను విదిల్చేది ఏమైనా ఉందా?అని ఆశగా ఎదురు చూస్తున్నారు.పదవులను ఆశిస్తున్న వారు అధినేత దృష్టిలో పడేందుకు నానాతంటాలు పడుతున్నారు. వుడా స్థానంలో ఏర్పాటవుతున్న విశాఖ మెట్రోపాలిటిన్ డెవలప్మెంట్ అథారిటీకి తానే చైర్మన్‌గా ఉంటానని ప్రకటించడంతో వుడా చైర్మన్పదవిపై ఆశలుపెట్టుకున్న వారునీరుగారిపోయారు. కనీసం జీవీఎంసీ ఎన్నికలైనా జరిగితే కార్పొరేట్ పదవులను దక్కించుకోవచ్చునని ఆశిస్తున్న వారు బాబు తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. జీవీఎంసీ ఎన్నికల నిర్వహిస్తారో లేదో అధినేత ఎదుట తేల్చుకునేందుకు సిద్ధమవు తున్నారు. -
ఓదార్పులో మంత్రులు
రాష్ట్ర మంత్రులు, అన్నాడీఎంకే ఎంపీలు, ఎమ్మెల్యేలు ఆదివారం ఓదార్పు యాత్ర చేపట్టారు. తమ అమ్మ కోసం ప్రాణాలు వదిలిన వారి కుటుంబాలను పరామర్శించారు. 34 కుటుంబాల ఇళ్ల వద్దకు వెళ్లి, మృతి చెందిన వారి చిత్ర పటాలకు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. సాక్షి, చెన్నై:అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు జైలు శిక్ష పడ్డ నేపథ్యంలో రాష్ట్రంలో ఆందోళనలు రాజుకున్న విషయం తెలిసిందే. అలాగే, టీవీల్లో ఆ సమాచారం విన్న వారు పదుల సంఖ్యలో గుండె పోటుతో మరణించారు. మరెందరో కార్యకర్తలు ఆత్మహత్య, ఆత్మాహుతి బాట పట్టారు. ఇలా మొత్తం 219 మంది మరణించినట్టు అన్నాడీఎంకే వర్గాల లెక్కల్లో తేలింది. తన కోసం ప్రాణాలు వదిలిన వారి కుటుంబాల్ని ఆదుకునేందుకు జయలలిత నిర్ణయించారు. బెయిల్ మీద బయటకు రాగానే, ఆ మృతులకు సంతాపం తెలియజేశారు. ఆ కుటుంబాల్ని ఓదార్చేందుకు నిర్ణయించారు. మృతుల కుటుంబాలకు తలా రూ.3 లక్షలు ఆర్థిక సాయం ప్రకటించారు. ఈ మొత్తాలను ఆయా కుటుంబాలకు అందజేయడం లక్ష్యంగా శనివారం శ్రీకారం చుట్టారు. తొలి రోజు ఆయా నియోజకవర్గాల పరిధుల్లో ఈ సాయం పంపిణీ సాగింది. ఆదివారం సెలవు దినం కావడంతో మంత్రులందరూ ఓదార్పు బాట పట్టారు. ఆదివారం మంత్రులందరూ తమ తమ నియోజక వర్గాలకు చేరుకున్నారు. ఉదయం నుంచి తమ తమ జిల్లాల పరిధుల్లోని ఎంపీలు, ఎమ్మెల్యేలతో కలిసి మృతుల కుటుంబాల్ని ఓదార్చే పనిలో పడ్డారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఓదార్పుతో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు బిబీబిజీ అయ్యారు. ఆయా మృతుల కుటుంబాల ఇళ్లకు వెళ్లి చిత్ర పటాలకు పుష్పాంజలి ఘటించి, తమ సానుభూతి తెలియజేశారు. సీఎం జయలలిత సంతాపం తెలిపినట్టుగా వారికి కరపత్రాలను అందించినానంతరం రూ.3 లక్షలకు గాను చెక్కులను అందజేశారు. మంత్రులు నత్తం విశ్వనాథన్, వైద్యలింగం, ఎడపాడి పళని స్వామి, సెంథిల్ బాలాజీ, బీవీ రమణ, చిన్నయ్య, గోకుల ఇందిర, వలర్మతి తదితరులు ఓదార్పులో నిమగ్నం అయ్యారు. మొత్తం 34 కుటుంబాలను ఓదార్చి జయలలిత ప్రకటించిన ఆర్థిక సాయాన్ని అందించారు. -
అమాత్యుల రాక నేడు
- జిల్లాకు మంత్రులు ఈటెల, కేటీఆర్ - ఘనస్వాగతం పలికేందుకు ఏర్పాట్లు - తెలంగాణ చౌక్‌లో బహిరంగ సభ, ధూంధాం కరీంనగర్ : రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్, ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె.తారకరామారావు మంగళవారం జిల్లాకు రానున్నారు. రాష్ట్ర మంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన తరువాత మొదటిసారి జిల్లాకు వస్తున్న మంత్రులకు ఘనస్వాగతం పలికేందుకు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. పార్టీ వర్గాల సమాచారం మేరకు... మంత్రులు హైదరాబాద్ నుంచి బయల్దేరి మంగళవారం సాయంత్రం 4గంటలకు జిల్లా సరిహద్దులోని శనిగరం చేరుకుంటారు. అక్కడ హుస్నాబాద్, మానకొండూర్ ఎమ్మెల్యేలు వొడితెల సతీష్‌బాబు, రసమయి బాలకిషన్ ఆధ్వర్యంలో స్వాగతం పలికి ఊరేగింపుగా తీసుకువస్తారు. బెజ్జంకి క్రాసింగ్ వద్ద నుంచి భారీ బైక్‌ర్యాలీతో మంత్రులకు స్వాగతం పలుకనున్నారు. అల్గునూరులోని పెద్దమ్మ దేవాలయంలో మంత్రులు పూజలు నిర్వహిస్తారు. అక్కడే అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తారు. అనంతరం కరీంనగర్ నియోజకవర్గ సరిహద్దులోని మానేరు బ్రిడ్జి వద్ద స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నేతృత్వంలో పార్టీ నేతలు మంత్రులకు ఘనస్వాగతం పలుకుతారు. అక్కడినుంచి భారీ ఊరేగింపుతో నగరంలోకి ప్రవేశించి మహాత్మా జ్యోతిరావుపూలే, మహాత్మగాంధీ విగ్రహాలకు, తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తారు. సాయంత్రం నగరంలోని తెలంగాణ చౌక్‌లో రాత్రి 7గంటలకు నిర్వహించే బహిరంగసభ, ధూంధాంలో మంత్రులతో పాటు జిల్లా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొంటారు. ఇప్పటికే టీఆర్ఎస్ ఆధ్వర్యంలో నగరంలోని పలు కూడళ్లలో కటౌట్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి గులాబీమయం చేశారు. ఆయా ప్రాంతాల్లో మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికేందుకు, యువకులతో బైక్‌ర్యాలీ నిర్వహించేందుకు స్థానిక కార్పొరేటర్ల ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. మంత్రుల పర్యటనను విజయంతం చేయాలని ఎమ్మెల్యే గంగుల కమలాకర్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్‌రెడ్డి కోరారు. -
కాంగ్రెస్ పెద్దోళ్ల డిపాజిట్లు గల్లంతు
రాష్ట్ర విభజన పాపాన్ని మూటగట్టుకున్న కాంగ్రెస్ పార్టీలో గొప్పగొప్ప నాయకులు, తురుంఖాన్లు అనుకున్నవాళ్ల డిపాజిట్లన్నీ గల్లంతయ్యాయి. ఇప్పటివరకు తన సుదీర్ఘ రాజకీయ చరిత్రలో ఒక్కసారి కూడా ఓటమి అన్నదే ఎరుగని అత్యంత సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి కిశోర్ చంద్రదేవ్‌కు సైతం డిపాజిట్ దక్కలేదు. విశాఖ జిల్లా అరకు నుంచి పోటీ చేసిన ఆయనకు కేవలం 51,898 ఓట్లు మాత్రమే వచ్చాయి. కిశోర్ చంద్రదేవ్‌తో పాటు రాష్ట్ర విభజన విషయంలో అత్యంత బాధ్యతారహితంగా వ్యవహరించిన కేంద్ర మంత్రులకు కూడా ఇదే తరహా పరాభవం ఎదురైంది. శ్రీకాకుళంలో కిల్లి కృపారాణికి 24,163 ఓట్లు, అరకులో కిశోర్ చంద్రదేవ్‌కు 51,898 ఓట్లు, కాకినాడలో పళ్లంరాజు 18,875 ఓట్లు, బాపట్లలో పనబాక లక్ష్మికి 17563 ఓట్లు మాత్రమే వచ్చాయి. దాంతో వాళ్లంతా కూడా డిపాజిట్లు కోల్పోయారు. అయితే, కాంగ్రెస్ పార్టీకి ఇంత ఎదురు గాలి ఉన్నా, రైల్వే శాఖ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, విజయనగరంలో బొత్స ఝాన్సీ మాత్రం లక్ష ఓట్లకు పైగా సాధించి.. కాస్త గౌరవప్రదంగా ఓడిపోయారు. ఇక కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి, బీజేపీ తరఫున రాజంపేటలో పోటీచేసిన కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి మాత్రం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మిథున్ రెడ్డి చేతిలో దాదాపు 1.75 లక్షల ఓట్ల తేడాతో ఓడిపోయినా, తనకంటూ దాదాపు మూడు లక్షలకు పైగా ఓట్లు సంపాదించుకోవడం కొద్దిలో కొద్ది ఊరట. కేంద్రంలో మంత్రులుగా పనిచేసి, ఆంధ్రప్రదేశ్ నుంచి పోటీచేసిన కేంద్ర మంత్రుల్లో అత్యధిక సంఖ్యలో ఓట్లు వచ్చినది ఆమెకే. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తరఫున కీలక పదవులు పోషించిన చాలామంది కూడా డిపాజిట్లు కోల్పోయారు. రాష్ట్ర విభజన విషయాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా.. చట్టంత తన పని తాను చేసుకుపోతుంది అన్నట్లు వ్యవహరించినందుకు తగిన మూల్యం చెల్లించుకున్నారు. అసెంబ్లీ స్పీకర్ నాదెండ్ల మనోహర్‌తో పాటు.. రాష్ట్ర మంత్రులు నీలకంఠాపురం రఘువీరారెడ్డి, కన్నా లక్ష్మీనారాయణ, ఆనం రామనారాయణరెడ్డి, కోండ్రు మురళీ మోహన్, పసుపులేటి బాలరాజు.. అందరూ డిపాజిట్లు కోల్పోయారు. ఒక్క బొత్స సత్యనారాయణ మాత్రమే డిపాజిట్ దక్కించుకున్నారు. -
నేతల ఫొటోలు తొలగించండి: భన్వర్‌లాల్
అధికారులకు సీఈఓ భన్వర్‌లాల్ ఆదేశం సాక్షి, హైదరాబాద్: సాధారణ ఎన్నికల ప్రవర్తనా నియమావళిలో భాగంగా ప్రభుత్వ ఆస్తులపై ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రి, రాష్ర్ట మంత్రులు, రాజకీయపార్టీల నాయకుల ఫొటోలను తక్షణం తొలగించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ ఆదేశించారు. ఈ మేరకు కలెక్టర్లు, అన్ని శాఖల ఉన్నతాధికారులు, డీజీపీ, ఆర్టీసీ, జీహెచ్ఎంసీ అధికారులకు మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. ఆర్టీసీతోసహా అన్ని ప్రభుత్వ వాహనాలపైనా ఈ ఫొటోలను తొలగించాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ భవనాలతోపాటు వెబ్సైట్ల నుంచి పైన పేర్కొన్నవారి ఫొటోలను తొలగించాలని భన్వర్‌లాల్ స్పష్టం చేశారు. అలాగే జంటనగరాలతోపాటు రాష్ట్రమంతటా పలుచోట్ల ఏర్పాటు చేసిన ప్రభుత్వ పెద్దల ఫొటోలతో కూడిన హోర్డింగ్స్‌ను కూడా తీసేయాలని ఆదేశించారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నిధి నుంచి ఎన్నికల కోడ్ ముగిసేవరకు ఏ పథకానికీ నిధులను విడుదల చేయరాదన్నారు. -
అదే నిర్లక్ష్యం...
సీఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఆగ్రహం సమస్యలు పట్టించుకోవడం లేదంటూ అసంతృప్తి ఇలాగే ఉంటే లోక్‌సభ ఎన్నికల్లో ఎదురు దెబ్బలు తప్పవని హెచ్చరిక ‘ఆప్’ విధేయ ఐఏఎస్ అధికారిపై మండిపాటు ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ సాక్షి, బెంగళూరు : రాష్ట్ర మంత్రులు ఎప్పటి లాగానే తమను నిర్లక్ష్యం చేస్తున్నారని పలువురు ఎమ్మెల్యేలు ధ్వజమెత్తారు. విధాన సౌధలో గురువారం జరిగిన సీఎల్పీ సమావేశంలో బిజాపుర, గుల్బర్గ, హావేరి జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులు ఎంబీ. పాటిల్, ఖమరుల్ ఇస్లాం, ప్రకాశ్ హుక్కేరిల వ్యవహార శైలిపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. తమ జిల్లాల సమస్యలు చెప్పుకోవడానికి ఎప్పుడు వెళ్లినా సమయం లేదనే సమాధానం ఎదురవుతోందని వాపోయారు. తద్వారా అభివృద్ధి పనుల్లో వెనుకబడి పోతున్నామని వాపోయారు. వీరి వైఖరి వల్ల తాము కార్యకర్తల వద్ద తలెత్తుకోలేక పోతున్నామని ఫిర్యాదు చేశారు. పరిస్థితి ఇదే మాదిరి కొనసాగితే లోక్‌సభ ఎన్నికల్లో ఎదురు దెబ్బలు తప్పవని హెచ్చరించారు. కనుక ఆ ముగ్గురినీ ఇన్‌చార్జ్‌లుగా తొలగించాలని డిమాండ్ చేశారు. కొందరు ఎమ్మెల్యేలు నేరుగా తన వ్యవహార శైలినే ప్రశ్నించడంతో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మౌనాన్ని ఆశ్రయించాల్సి వచ్చింది. మంత్రులు టీబీ. జయచంద్ర, కేజే. జార్జ్‌లు వారిని అనునయించడానికి ప్రయత్నించారు. సీఎల్పీ సమావేశం 8.30 గంటలకు ప్రారంభమైనా మొదట్లో 20 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మాత్రమే హాజరయ్యారు. తర్వాత ఒక్కొక్కరుగా 45 మంది వచ్చారు. ఐఏఎస్ అధికారిపై ఆగ్రహం సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీవత్స కృష్ణ ‘ఆమ్ ఆద్మీ పార్టీ’ (ఆప్) అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్‌ను ఆకాశానికెత్తేస్తూ ఓ ఆంగ్ల పత్రికలో రాసిన వ్యాసంపై సీఎల్పీ సమావేశంలో దుమారం చెలరేగింది. ఆ అధికారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని పలువురు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని డిమాండ్ చేశారు. ఢిల్లీ శాసన సభ ఎన్నికల్లో ‘ఆప్’ విజయం సాధించడం ద్వారా భారతీయ రాజకీయాల్లో అసాధ్యాన్ని సుసాధ్యం చేసిందంటూ వ్యాసంలో పొగడ్తలతో ముంచెత్తారని తెలిపారు. యూపీఏ సర్కారు కుంభకోణాలైన బొగ్గు, 2జీ స్కామ్‌లను కూడా ప్రస్తావించారని పేర్కొన్నారు. దీని వల్ల కాంగ్రెస్ పార్టీకి ముఖం చెల్లకుండా పోయే పరిస్థితి తలెత్తిందని, కనుక ఆయనపై చర్యలకు ఉపక్రమించాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే ప్రియాంక ఖర్గే ఏకంగా ఆ వ్యాసాన్ని ముఖ్యమంత్రికి చూపించారు. ఫొటోస్టాట్ ప్రతులను సహచర ఎమ్మెల్యేలకు పంచి పెట్టారు. ఆ అధికారిని పిలిపించి వివరణ కోరతానని సీఎం హామీ ఇవ్వడంతో ఎమ్మెల్యేలు శాంతించినట్లు తెలిసింది.