ప్రభుత్వ అతిథిగృహాల్ని సిద్ధం చేయాలని సీఎం ఆదేశం
సాక్షి, విజయవాడ బ్యూరో: రాష్ర్ట మంత్రులు ఇకనుంచీ స్టార్ హోటళ్లలో బస చేయకూడదని, ప్రభుత్వ అతిథిగృహాల్లోనే బస చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. విజయవాడ క్యాంపు కార్యాలయంలో శుక్రవారం సీఎం చంద్రబాబు ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, మున్సిపల్ మంత్రి నారాయణలతో సమీక్ష నిర్వహించారు. రాష్ర్టంలో మంత్రులు ఎక్కడికెళ్లినా స్టార్ హోటళ్లు, ఖరీదైన హోటళ్లలో బస చేస్తున్న విషయం చర్చకొచ్చినట్టు సమాచారం.
దీంతో మంత్రులు బస చేసేలా ప్రభుత్వ అతిథిగృహాలకు మరమ్మతులు చేపట్టి సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. విజయవాడ, గుంటూరు నగరాల్లో ప్రభుత్వ అతిథిగృహాల్ని మంత్రులకు తాత్కాలిక నివాసాలుగా తీర్చిదిద్దాలని నిర్ణయించారు.
హడ్కో ద్వారా 10వేల ఇళ్లు: యనమల
రాజధాని ప్రాంతంలో అధికారులు నివాసం ఉండేలా హడ్కో సంస్థ 10 వేల ఇళ్లను నిర్మించేందుకు ముందుకొచ్చిందని మంత్రి యనమల రామకృష్ణుడు మీడియాకు చెప్పారు. ఆయన శుక్రవారం నగరంలోని ప్రభుత్వ అతిథిగృహాల్ని పరిశీలించారు.
శుభాకాంక్షలు తెలిపిన సీఎం
సాక్షి, హైదరాబాద్: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సీఎం చంద్రబాబు తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు దేశ, విదేశాల్లో ఉన్న తెలుగు వారికి శుభాకాంక్షలు తెలిపారు.
మంత్రులు స్టార్ హోటళ్లలో ఉండొద్దు
Published Sat, Aug 15 2015 5:41 AM | Last Updated on Sun, Sep 3 2017 7:27 AM
Advertisement