సాక్షి, హైదరాబాద్: విభిన్న రుచుల చాయ్‌లున్నా హైదరాబాద్ చాయ్ మాత్రం ఎప్పటికీ ప్రత్యేకమే. టీ కొట్టు నుంచి స్టార్ హోటళ్ల వరకూ హైదరాబాద్ ఫ్లేవర్ చాయ్‌కు ప్రత్యేక ఆదరణ ఉంది. ఈ హైదరాబాదీ చాయ్‌ను విశ్వవ్యాప్తం చేయనున్నామని, మొదట దక్షిణాది రాష్ట్రాలకు పరిచయం చేయనున్నామని ప్రముఖ శ్రేయాస్ గ్రూప్ చైర్మన్ శ్రీనివాస్‌రావు తెలిపారు. ఇప్పటికే సినిమా, ఈవెంట్, ఫ్యాషన్ రంగాల్లో తమదైన గుర్తింపు పొందిన శ్రేయాస్ గ్రూప్ ‘దక్కన్ చాయ్’తో మార్కెట్‌లోకి ప్రవేశించింది.
దీనికి సంబంధించిన కార్యక్రమాన్ని శుక్రవారం బంజారాహిల్స్‌లోని రాడిసన్ బ్లూ హోటల్‌లో ఏర్పాటు చేశారు. దేశంలో చాయ్ వ్యాపారం 11 వేల మిలియన్ డాలర్ల మార్కెట్‌కు కలిగి ఉందని, మరో పదేళ్లలో ఇది 18 వేల మిలియన్ డాలర్లకు చేరుకోనుందని తెలిపారు. ఇందులో హైదరాబాదీ చాయ్‌ను మరింత ప్రాచూర్యంలోకి తీసుకురావడంలో భాగంగా తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు, మహా రాష్ట్రలో దాదాపు వెయ్యి ఔట్‌లెట్లను ప్రారంభించనున్నామని శ్రీనివాస్ రావు అన్నారు.
ఇలా వెయ్యి మంది ఎంటర్‌ప్రూనర్స్‌తో పాటు 2 వేల మందికి హైదరాబాదీ చాయ్ తయారీ పై శిక్షణ అందించి ఉద్యోగావకాశాలను కలి్పస్తామన్నారు. ‘దక్కన్ చాయ్’ వ్యవస్థాపకులు వీరన్న మాట్లాడుతూ.. ఇప్పటికే 250 ఔట్‌లెట్‌లతో దక్కన్ చాయ్ తేనీటి విందును అందిస్తున్నాయని, శ్రేయాస్ మీడియా భాగస్వామ్యంతో ఈ సేవలు మరింత పెరగనున్నాయని తెలిపారు. ముఖ్యంగా ఆర్ట్ ఆఫ్ టీ మేకింగ్ కోర్సుతో యువతకు శిక్షణ అందించనున్నామని, కొత్తవాళ్లకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా తామే స్టాల్ వేదికగా డిజిటల్ యాడ్స్, వాల్ మార్ట్ రూపంలో అదనంగా ఆదాయం వచ్చేలా రూపకల్పన చేశామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment