హోటళ్లు, ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు
పరుగులు పెట్టిన పోలీసులు ∙ఉలిక్కిపడిన తిరుపతి
తిరుపతి అర్బన్: నగరంలోని స్టార్ హోటళ్లకు గుర్తుతెలియని వ్యక్తు లు గురువారం రాత్రి బాంబు బెదిరింపులకు పాల్పడ్డారు. ప్రధానంగా లీలామహల్ సర్కిల్, కపిలతీర్థం, అలిపిరి సమీపంలోని నాలుగు గుర్తింపు పొందిన హోటళ్లకు మెయిల్స్ ద్వారా బెదిరింపులకు దిగారు. నగదు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు చర్చసాగుతోంది. లేదంటే చంపుతామని, మీ హోటళ్లలో పలుచోట్ల బాంబులు పె ట్టామని హెచ్చరించినట్లు సమాచారం.
వెంటనే హోటళ్ల యాజ మాన్యం పోలీసులకు సమాచారం ఇచ్చారు. అప్రమత్తమైన పోలీసులు హోటల్స్‌లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. బాంబు బూచీ సమాచారంతో తిరుపతి నగర వాసులు ఉలిక్కి పడ్డారు. గురువారం రాత్రి ఆ హోటల్స్‌తోపాటు నగరంలోని అన్ని ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. కానీ ఎక్కడా పేలుడు పదార్థాలు లేవని నిర్ధారించారు.
విమానాశ్రయానికి..
ఏర్పేడు: బాంబు బెదిరింపు ఈ మెయిల్‌పై తిరుపతి విమానాశ్రయ స్టార్ ఎయిర్‌లైన్స్ అసిస్టెంట్ సెక్యూరిటీ మేనేజర్ షబీర్ గురువారం ఫిర్యాదు చేసినట్లు ఏర్పేడు సీఐ జయచంద్ర తెలిపారు. బెంగళూరులోని స్టార్ ఎయిర్ హెడ్ ఆఫీస్‌తో అనుబంధించిన తిరుపతి ఎయిర్ ఫోర్ట్ అధికారిక స్టార్ ఎయిర్ ట్విట్టర్ ఖాతాకు గుర్తుతెలియని వ్యక్తి గురువారం బాంబు బెదిరింపు సందేశాన్ని పంపినట్లు చెప్పారు. విమానాలను ఎస్5–154(టీఐఆర్–ఐఎక్స్‌జీ) ప్రధాన అ««ధి కారుల అనుమతి పొందిన అనంతరం మధ్యాహ్నం 1.21 గంటలకు బయలుదేరి వెళ్లినట్లు చెప్పారు. గుర్తుతెలియని వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు సీఐ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment