మంత్రులు నోటిని అదుపులో పెట్టుకోవాలి
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంగా
దాచేపల్లి : రాష్ట్ర ప్రజల మనస్సుల్లో ఉన్న మాటనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రధాన ప్రతిపక్షనాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీఎంను ఉద్దేశించి మాట్లాడారని, ప్రజల తరఫున మాట్లాడిన మాటలకు మంత్రులు నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం సరికాదని ఆ పార్టీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే జంగా కృష్ణమూర్తి అన్నారు. దాచేపల్లిలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి కూడా నెరవేర్చకుండా సీఎం కాలయాపన చేస్తుండడం వలన ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, అన్ని రంగాల్లో వైఫల్యం చెందడం వలన ప్రజల్లో నెలకొన్న అసంతృప్తిని తమ అధినేత వెల్లడించారని జంగా చెప్పారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీ నేతగా జగన్‌మోహన్‌రెడ్డికి ప్రజల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసే హక్కు ఉందని, ప్రభుత్వం తీరును ఎండగట్టిన ప్రతిసారీ తమ అధినేతపై మంత్రులు అవాకులు చవాకులు పేలుతున్నారని జంగా ధ్వజమెత్తారు. రాష్ట్ర మంత్రులు నోటిని అదుపులో పెట్టుకుని మాట్లాడాలని, బాధ్యత కలిగిన మంత్రులుగా వ్యవహరించకపోతే ప్రజల చేతిలో గుణపాఠం తప్పదని హెచ్చరించారు.
సమావేశంలో దాచేపల్లి, గురజాల, మాచవరం, పిడుగురాళ్ల మండల కన్వీనర్లు షేక్ జాకీర్‌హుస్సేన్, సిద్ధాడపు గాంధీ, సింగరయ్య, చల్లా పిచ్చిరెడ్డి, జెడ్పీటీసీ సభ్యులు మూలగొండ్ల ప్రకాష్‌రెడ్డి, వీరభద్రుని రామిరెడ్డి, జిల్లా ఎగ్జిక్యూటిట్ సభ్యుడు మందపాటి రమేష్‌రెడ్డి, దాచేపల్లి పట్టణ అధ్యక్షుడు మునగా పున్నారావు, పిడుగురాళ్ళ పట్టణ అధ్యక్షుడు చింతా రామారావు తదితరులున్నారు. రాష్ట్ర ప్రజల మనస్సుల్లో ఉన్న మాటనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రధాన ప్రతిపక్షనాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీఎంను ఉద్దేశించి మాట్లాడారని, ప్రజల తరఫున మాట్లాడిన మాటలకు మంత్రులు నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం సరికాదని ఆ పార్టీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే జంగా కృష్ణమూర్తి అన్నారు.
దాచేపల్లిలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి కూడా నెరవేర్చకుండా సీఎం కాలయాపన చేస్తుండడం వలన ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, అన్ని రంగాల్లో వైఫల్యం చెందడం వలన ప్రజల్లో నెలకొన్న అసంతృప్తిని తమ అధినేత వెల్లడించారని జంగా చెప్పారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీ నేతగా జగన్‌మోహన్‌రెడ్డికి ప్రజల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసే హక్కు ఉందని, ప్రభుత్వం తీరును ఎండగట్టిన ప్రతిసారీ తమ అధినేతపై మంత్రులు అవాకులు చవాకులు పేలుతున్నారని జంగా ధ్వజమెత్తారు.
రాష్ట్ర మంత్రులు నోటిని అదుపులో పెట్టుకుని మాట్లాడాలని, బాధ్యత కలిగిన మంత్రులుగా వ్యవహరించకపోతే ప్రజల చేతిలో గుణపాఠం తప్పదని హెచ్చరించారు. సమావేశంలో దాచేపల్లి, గురజాల, మాచవరం, పిడుగురాళ్ల మండల కన్వీనర్లు షేక్ జాకీర్‌హుస్సేన్, సిద్ధాడపు గాంధీ, సింగరయ్య, చల్లా పిచ్చిరెడ్డి, జెడ్పీటీసీ సభ్యులు మూలగొండ్ల ప్రకాష్‌రెడ్డి, వీరభద్రుని రామిరెడ్డి, జిల్లా ఎగ్జిక్యూటిట్ సభ్యుడు మందపాటి రమేష్‌రెడ్డి, దాచేపల్లి పట్టణ అధ్యక్షుడు మునగా పున్నారావు, పిడుగురాళ్ళ పట్టణ అధ్యక్షుడు చింతా రామారావు తదితరులున్నారు.