
పారి: నాలుగేళ్ల తన తమ్ముడిని ఓ చిరుతపులి బారినుంచి కాపాడిందో 11ఏళ్ల అక్క. ఉత్తరాఖండ్‌లోని దేవ్‌కుందైతల్లి గ్రామంలో జరిగిందీ ఘటన. ఈ నెల నాలుగోతేదీన నాలుగేళ్ళ తమ్ముడితో కలసి రాఖీ (11) ఆడుకుంటోంది. ఇంతలో ఒక్కసారిగా ఒక చిరుత తన తమ్ముడిపై దాడి చేసింది. అయితే రాఖీ ఏమాత్రం ఆ చిరుతకు భయపడకుండా ఎదురొడ్డి ధైర్యంగా నిలబడింది. చిరుత లాక్కెళ్లకుండా రాఖీ తన తమ్ముడిని మీదపడి అడ్డుగా నిలబడింది. ఈ క్రమంలో రాఖీ మెడపై తీవ్రగాయాలయ్యాయి. ఇంతలో గ్రామస్తులు అక్కడకు చేరుకోవడంతో చిరుత పక్కనే ఉన్న అడవిలోకి ఉడాయించింది. ప్రస్తుతం బాలిక ఢిల్లీలోని రామ్‌మనోహర్ లోహియా ఆస్పత్రిలోకి చికిత్సపొందుతోంది. వైద్య ఖర్చులకు రాష్ట్రమంత్రి బాలికకు రూ.1లక్ష ఆర్థికసాయం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment