ram manohar lohia hospital
-
కోవాగ్జిన్ వద్దు.. కోవిషీల్డ్ కావాలి
న్యూఢిల్లీ/హైదరాబాద్: ఆక్స్ఫర్డ్–ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేసిన కోవిషీల్డ్ టీకా మాత్రమే తమకు ఇవ్వాలని ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా(ఆర్ఎంఎల్) ఆసుపత్రి రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్(ఆర్డీఏ) మెడికల్ సూపరింటెండెంట్‌ను కోరింది. ఈ మేరకు లేఖ రాసింది. హైదరాబాద్‌లోని భారత్ బయోటెక్ సంస్థ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్ పట్ల తమ వైద్యుల్లో కొన్ని సందేహాలు, స్వల్పంగా భయాందోళనలు ఉన్నాయని పేర్కొంది. ఆర్ఎంఎల్లో కోవిషీల్డ్ కాకుండా కోవాగ్జిన్ మాత్రమే ఇవ్వనున్నట్లు తమకు సమాచారం అందిందని తెలిపింది. కోవాగ్జిన్ విషయంలో అన్ని ట్రయల్స్ పూర్తి కాలేదని వెల్లడించింది. కోవిషీల్డ్ విషయంలో అన్ని స్థాయిల్లో ట్రయల్స్ పూర్తయ్యాయని గుర్తుచేసింది. కోవాగ్జిన్‌తో తీవ్ర దుష్ప్రభావాలు తలెత్తితే నష్టపరిహారం కరోనా టీకా తీసుకునేందుకు వచ్చిన వారితో అంగీకార పత్రంపై సంతకం చేయించుకుంటున్నారు. కోవాగ్జిన్ తీసుకున్న వారిలో వారం రోజుల్లోగా తీవ్ర దుష్ప్రభావాలు తలెత్తితే నష్ట పరిహారం ఇవ్వనున్నట్లు పత్రంలో స్పష్టం చేశారు. ఇలాంటి వారిని ఆసుపత్రుల్లో చేర్చి, చికిత్స అందిస్తామని పేర్కొన్నారు. వ్యాక్సిన్ వల్లనే దుష్భ్రభావాలు తలెత్తినట్లు తేలితే దాని తయారీదారు భారత్ బయోటెక్ నష్టపరిహారం చెల్లిస్తుందని వెల్లడించారు. -
ఆర్ఎంఎల్ డీన్‌కు కరోనా పాజిటివ్
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధానిలో కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉన్నాయి. ఢిల్లీలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండంతోపాటు వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలు కూడా వైరస్ బారిన పడుతున్నారు. తాజాగా రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్‌పైనా కరోనా మహమ్మారి తన ప్రతాపం చూపింది. ఆర్ఎంఎల్ మెడికల్ కళాశాల డీన్, యూరాలజీ విభాగం అధిపతి రాజీవ్ సూద్‌కు కరోనా వైరస్ సోకింది. ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించగా, పాజిటివ్ రావడంతో డాక్టర్ రాజీవ్ సూద్‌ను అధికారులు హోం క్వారంటైన్‌కు పంపించారు. ఈ నేపధ్యంలో ఆయనతో సంబంధం ఉన్నవారందరికీ వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆర్ఎంఎల్లో హాస్పటల్లో చాలా కాలం నుంచి కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న విషయం తెలిసిందే. ఆస్పత్రి క్యాంటిన్లో14 మందిని కరోనా పాజిటివ్ తేలింది. ఢిల్లీలో 12,910 కేసులు నమోదు కాగా 231మంది మరణించారు. (కరోనా.. భారత్‌లో రికార్డు స్థాయిలో కేసులు) కరోనాతో డాక్టర్ పాండే మృతి మరోవైపు ప్రముఖ పల్మనాలజిస్ట్, ఢిల్లీ ఎయిమ్స్ డిపార్టుమెంట్ ఆఫ్ మెడిసిన్ మాజీ అధిపతి డాక్టర్ జితేంద్రనాథ్ పాండే (79) మృతి చెందారు. కరోనా సోకడంతో తన నివాసంలో ఐసోలేషన్‌లో ఉన్న ఆయన శనివారం తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. కాగా దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులో నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 6,767 కరోనా కేసులు నమోదు కాగా, 147మంది మృతి చెందారు. భారత్‌లో ఇప్పటివరకూ 1.31 లక్షలమంది కరోనా బారిన పడ్డారు. -
కరోనాపై పారాసిట్మాల్తో యుద్ధం చేసి..
-
చిరుత దాడి నుంచి తమ్ముడిని రక్షించిన బాలిక
పారి: నాలుగేళ్ల తన తమ్ముడిని ఓ చిరుతపులి బారినుంచి కాపాడిందో 11ఏళ్ల అక్క. ఉత్తరాఖండ్‌లోని దేవ్కుందైతల్లి గ్రామంలో జరిగిందీ ఘటన. ఈ నెల నాలుగోతేదీన నాలుగేళ్ళ తమ్ముడితో కలసి రాఖీ (11) ఆడుకుంటోంది. ఇంతలో ఒక్కసారిగా ఒక చిరుత తన తమ్ముడిపై దాడి చేసింది. అయితే రాఖీ ఏమాత్రం ఆ చిరుతకు భయపడకుండా ఎదురొడ్డి ధైర్యంగా నిలబడింది. చిరుత లాక్కెళ్లకుండా రాఖీ తన తమ్ముడిని మీదపడి అడ్డుగా నిలబడింది. ఈ క్రమంలో రాఖీ మెడపై తీవ్రగాయాలయ్యాయి. ఇంతలో గ్రామస్తులు అక్కడకు చేరుకోవడంతో చిరుత పక్కనే ఉన్న అడవిలోకి ఉడాయించింది. ప్రస్తుతం బాలిక ఢిల్లీలోని రామ్మనోహర్ లోహియా ఆస్పత్రిలోకి చికిత్సపొందుతోంది. వైద్య ఖర్చులకు రాష్ట్రమంత్రి బాలికకు రూ.1లక్ష ఆర్థికసాయం చేశారు. -
కేంద్ర మంత్రి ఇంట్లో విషాదం..
న్యూఢిల్లీ : కేంద్ర మంత్రి, ఎల్జేపీ నాయకుడు రాంవిలాస్ పాశ్వాన్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయన సోదరుడు, లోక్‌సభ సభ్యుడు రామచంద్ర పాశ్వాన్(56) ఆదివారం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రామచంద్ర పాశ్వాన్ నేడు రామ్ మనోహార్ లోహియా ఆస్పత్రిలో గుండెపోటుతో మరణించారని కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా, ప్రస్తుతం రామచంద్ర పాశ్వాన్ బిహార్‌లోని సమస్తిపూర్ పార్లమెంట్ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అతనికి భార్య, ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. రామచంద్ర పాశ్వాన్ మృతిపట్ల ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి రామ్నాథ్కోవింద్, బీజేపీ నాయకురాలు సుష్మా స్వరాజ్ సంతాపం తెలిపారు. ఆయన మరణం బాధ కలిగించిందని మోదీ పేర్కొన్నారు. ప్రజలకు ఆయన చేసిన సేవ వెల కట్టలేనిదన్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. రామచంద్ర పాశ్వాన్ భౌతికకాయానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాంవిలాస్ పాశ్వాన్‌తో పాటు ఇతర కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. Shri Ram Chandra Paswan Ji worked tirelessly for the poor and downtrodden. At every forum he spoke unequivocally for the rights of farmers and youngsters. His social service efforts were noteworthy. Pained by his demise. Condolences to his family and supporters. Om Shanti. — Narendra Modi (@narendramodi) July 21, 2019 -
బీజేపీ నేత రాంమాధవ్‌కు మాతృ వియోగం
-
బీజేపీ నేత రాంమాధవ్ నివాసంలో విషాదం
సాక్షి, న్యూఢిల్లీ : బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌కు మాతృ వియోగం కలిగింది. ఢిల్లీలోని రాంమనోహర్ లోహియా ఆస్పత్రి (ఆర్ఎంఎల్)లో చికిత్స పొందుతూ జానకిదేవి బుధవారం కన్నుమూశారు. కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. జానకిదేవి అంత్యక్రియలు రేపు (గురువారం) హైదరాబాద్‌లో అంత్యక్రియలు జరగనున్నాయి. రాంమాధవ్‌కు బీజేపీ నేతలు సంతాపం తెలిపారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఎంపీలకు బలవంతంగా ప్లూయిడ్స్
సాక్షి, న్యూఢిల్లీ: నిరాహార దీక్షలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు మిథున్‌రెడ్డి, వైఎస్ అవినాష్‌రెడ్డిలను బలవంతంగా ఆస్పత్రికి తరలించినా.. వైద్యం చేయించుకునేందుకు నిరాకరించారు. గత ఆరు రోజులుగా దీక్ష చేస్తున్న మిథున్, అవినాష్‌ల ఆరోగ్యం విషమించడంతో వారిని బుధవారం రాంమనోహర్ లోహియా ఆస్పత్రికి తరలించిన సంగతి తెలిసిందే. ఆస్పత్రిలో ఎంపీలకు ఫ్లూయిడ్స్ ఎక్కించేందుకు వైద్యులు ప్రయత్నించినా.. అందుకు వారు నిరాకరించారు. దీక్ష కొనసాగించాలన్న సంకల్పాన్ని ప్రదర్శించారు. దీంతో అక్కడ ఉన్న పార్టీ నేతలు, మీడియాను పోలీసులు బయటకు పంపించారు. దీంతో లోపల ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. ఆర్ఎంఎల్ ఆస్పత్రి సీనియర్ వైద్యుల పర్యవేక్షణలో ప్రస్తుతం ఎంపీలు మిథున్, అవినాష్ ఉన్నారు. దీక్షతో ఆరోగ్యం తీవ్రంగా విషమించిన కారణంగా ఫ్లూయిడ్స్ ఎక్కించుకోవాలని వైద్యులు ఎంపీలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. వారు వినిపించుకోకపోవడంతో బలవంతంగా ప్లూయిడ్స్ ఎక్కించారు. -
ఉత్తరప్రదేశ్‌లో దారుణం
మృతదేహాన్ని పీక్కుతిన్న కుక్కలు లక్నో : ఆస్పత్రిలో ఓ మహిళ మృతదేహాన్ని కుక్కలు పీక్కుతిన్న దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఇక్కడి డా.రామ్ మనోహర్ లోహియా ప్రభుత్వాసుపత్రిలోని మార్చురీ గదిలో ఈ దారుణం జరిగినట్లు ఆస్పత్రి డైరెక్టర్ దేవేంద్ర నేగీ మీడియాకు తెలిపారు. దీంతో విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు వార్డు బాయ్‌తో పాటు ఇద్దరు భద్రతా సిబ్బందిని తొలగించినట్లు పేర్కొన్నారు. చిన్హట్కు చెందిన పుష్పా తివారీ(40) విష ప్రభావంతో శనివారం సాయంత్రం ఎమర్జెన్సీ వార్డులో చికిత్స పొందుతూ మృతిచెందారని నేగీ తెలిపారు. ఇది మెడికో లీగల్ కేసు కావడంతో పోస్టుమార్టం కోసం ఆమె శరీరాన్ని డీప్ ఫ్రీజర్‌లో భద్రపరచినట్లు వెల్లడించారు. డాక్టర్లు ఆదివారం ఉదయం 9 గంటలకు మార్చురీ గదికి చేరుకోగానే సదరు మహిళ మృతదేహం ఫ్రీజర్ నుంచి బయటపడి.. ముఖం ఛిద్రమైన స్థితిలో ఉందని పేర్కొన్నారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు నేగీ తెలిపారు. -
స్కానింగ్ రిపోర్టు చూసి కంగుతిన్న డాక్టర్లు
న్యూఢిల్లీ: యోగాతో ఏదైనా సాధ్యమని, ఏం తిన్నా కడుపులో ఎంచక్కా జీర్ణమవుతాయని భావించాడు. గతంలో కొన్ని రోజులపాటు ఇనుప ముక్కలు తిన్నాడు. బ్లేడ్లు, ట్యూబ్లైట్లను సైతం బొజ్జలో వేసుకున్నాడు. చివరికి తీవ్ర కడుపునొప్పితో ఆస్పత్రి పాలయ్యాడు. కొన్ని రోజుల ట్రీట్మెంట్ తర్వాత వైద్యులు అతడికి పునర్జన్మ ప్రసాదించారు. ఆ వివరాలు.. స్థానిక అశోక్ విహార్‌కు చెందిన శైలేంద్ర సింద్ర(52)కు కొంతకాలం కింద తీవ్ర కడుపునొప్పి రావడంతో ఆయనను ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రికి తరలించారు. ఆయన బాడీని స్కాన్ చేసిన వైద్యులు అప్పట్లో కంగుతిన్నారు. యోగాతో ఏదైనా కరిగించవచ్చని భావించి ఇనుము వస్తువులు, బ్లేడ్లు, ట్యూబ్‌లైట్ అద్దాలు లాంటి పదార్థాలు తిన్నానని డాక్టర్లకు చెప్పాడు. వారి స్కానింగ్‌లో అది నిజమని తేలింది. దీంతో కొన్ని రోజులపాటు వైద్యులు ఆయనకు చికిత్స అందించారు. ఆయనకు యాంటీ సైకోటిక్ థెరపీ చేసి మెడిసిన్ ఇస్తూ రోజు పరీక్షించినట్లు డాక్టర్ ఆర్పీ బెనివాల్ తెలిపారు. ఎట్టకేలకు ఆపరేషన్ చేసి రెండు లోహపు ప్లేట్లు, ఆరు సూదులు, కొన్ని బ్లేడ్లు, ట్యూబ్‌లైట్ అద్దాలను బయటకు తీసినట్లు వివరించారు. నాలుగు నెలల తమ శ్రమ ఫలించిందని వైద్యులు చెబుతున్నారు. శైలేంద్ర ఒంటరిగా ఉంటున్నాడని ఈ క్రమంలో ఆర్ఎంఎల్ ఆస్పత్రికి తీసుకురాగా కడుపులో లోహాలు, సూదులు, బ్లేడ్లు ఉన్నాయని డాక్టర్లు చెప్పేసరికి ఆశ్చర్యానికి లోనైనట్లు ఆయన సోదరి ఉమ తెలిపారు. అతడు ఇలా చేస్తుంటాడని ఎప్పుడు సందేహం రాలేదన్నారు. అయితే సోదరుడు శైలేంద్ర.. ఆస్పత్రిలో ఉన్నన్ని రోజులు హార్మోనియం వాయిస్తూ తోటి పేషెంట్లకు ఊరట కలిగించేవాడని, ప్రస్తుతం అతడి ఆరోగ్యం కుదుట పడుతున్నందుకు ఆమె హర్షం వ్యక్తం చేశారు. 'నేను ఆర్మీలో చేరాలలనుకున్నాను. కానీ నా పేగులలో సమస్య ఉందని, బతకడం కష్టని చెప్పడంతో ఆశను వదులుకున్నాను. ఇప్పటివరకూ నాకేం కాలేదు. యోగాతో ఏదైనా సాధ్యమని విన్నాను. అందుకే దాదాపు తొమ్మిదేళ్ల కిందట లోహాలు, అద్దాలు, బ్లేడ్లు, సూదులు మింగాను. యోగా వల్ల నేటికీ ప్రాణాలతో ఉన్నాను. ఒక్కోక్కరికి ఒకో రకమైన విశిష్టిత ఉంటుందని' పేషెంట్ శైలేంద్ర సింగ్ వివరించాడు. -
ఐసీయూలో బీజేపీ చీఫ్
-
ఐసీయూలో బీజేపీ చీఫ్
ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీకి ఘన విజయాన్ని అందించిన ఆ పార్టీ యూపీ శాఖ అధ్యక్షుడు కేశవ్ ప్రసాద్ మౌర్య అనారోగ్యంతో ఆస్పత్రి పాలయ్యారు. బీపీ సంబంధిత సమస్యలు రావడంతో ఆయనను ఢిల్లీలోని రాం మనోహర్ లోహియా ఆస్పత్రిలోని ఐసీయూలో చేర్చారు. ఆస్పత్రి వైద్యులు ఆయన ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తున్నారని, పరిస్థితి మెరుగుపడితే ఆయనను శుక్రవారమే ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. మౌర్య ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా తెలిపారు. 403 మంది సభ్యులున్న యూపీ అసెంబ్లీలో బీజేపీ ఒక్కటే 312 స్థానాలను గెలుచుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎవరిని ఎంపిక చేయాలన్న విషయమై ఢిల్లీ స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. కేశవ్ ప్రసాద్ మౌర్య సహా పలు పేర్లు వినిపిస్తున్నాయి. కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పేరు గట్టిగా వినిపిస్తోంది. ఈ పరిణామాలు ఇలా ఉండగానే మౌర్య ఆస్పత్రి పాలు కావడం గమనార్హం. -
సీపీఐ అగ్రనేత బర్దన్‌కు తీవ్ర అస్వస్థత
ఢిల్లీ: సీపీఐ సీనియర్ నేత ఏబీ బర్ధన్ సోమవారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను జీబీ పంత్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. కాగా బర్థన్ పక్షవాతంతో బాధపడుతున్నారని సీపీఐ నేత అతుల్ అంజాన్ తెలిపారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఆర్ఎంఎల్లో పారిశుధ్యంపై కేంద్ర మంత్రి సమీక్ష
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రారంభించిన పారిశుధ్య కార్యక్రమంలో భాగంగా ఆ విభాగం మంత్రి హర్షవర్ధన్ బుధవారం ఇక్కడి రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రిని సందర్శించారు. దాదాపు గంట సమయం ఆస్పత్రిలో గడిపిన మంత్రి పారిశుధ్య పరిస్థితిపై సమీక్షించారు. ఎమర్జెన్సీ, కార్డియాలజీ విభాగాలతో పాటు ప్లాస్టిక్ సర్జరీ, కాలిన గాయాలకు చికిత్స చేసే విభాగాలను కూడా సందర్శించారు. ఆస్పత్రి ఆవరణలోని సెంట్రల్ పార్కును, ఎదురుగా ఉన్న పచ్చదనాన్ని పరిశీలించిన వర్ధన్ మొక్కలు, చెట్ల పరిరక్షణకు ఆస్పత్రి యాజమాన్యం చూపుతున్న శ్రద్ధను ప్రశంసించారు. ఆ తరువాత పీజీఐఎంఆర్‌కు చెందిన వివిధ విభాగాధిపతులను ఉద్దేశించి వర్ధన్ ప్రసంగిస్తూ ఆర్ఎంఎల్ ఆస్పత్రిని ఓ విశిష్టమైన వైద్య కేంద్రంగా మార్చాలని కోరుకుంటున్నట్లు తెలి పారు. ఖాళీగా ఉన్న డాక్టర్లు, నర్సులు, పారా మెడికల్ సిబ్బంది పోస్టుల సమస్యపై చర్చించిన వర్ధన్ ఆస్పత్రిలో సౌరశక్తి వినియోగానికి ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పారు. ఆస్పత్రిలో 280 డాక్టర్ పోస్టులకు గాను 80 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 800 నర్సుల ఉద్యోగాలకు గాను 200 ఖాళీగా ఉన్నాయి. ఇక పారా మెడికల్ సిబ్బంది పోస్టులు మూడింట ఒకవంతు చాలా కాలంగా ఖాళీగా ఉన్నాయని ఆర్ఎంఎల్ ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ హెచ్‌కే కర్ చెప్పారు. వ్యర్ధ జలాల శుద్ధీకరణ ప్లాంటు ఏర్పాటుకు ప్రభుత్వం ఇటీవల రూ.3.6 కోట్లు మంజూరు చేసిందని తెలిపారు. ప్రైవేటు ఆస్పత్రి మూసివేతకు ఆదేశం న్యూఢిల్లీ: అర్హతలేని వైద్యుడి చికిత్స కారణంగా రోగి మృతి ఘటన నేపథ్యంలో పశ్చిమ ఢిల్లీలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిని మూసివేయాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది. రోహిణీ ప్రాంతంలోని సెక్టార్-16లోగల సత్యం ఆస్పత్రి మూసివేతకు ఆదేశాలు జారీఅయ్యాయి. ఈ మేరకు ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఢిల్లీ మెడికల్ కౌన్సిల్ (డీఎంసీ) నివేదికను పరిశీలించిన అనంతరం లెసైన్సును తక్షణమే రద్దు చేస్తున్నట్టు ఆరోగ్య శాఖ సంచాలకుడు డాక్టర్ ఎన్.వి.కామత్ ఆస్పత్రికి సమాచారం అందించారు. కాగా అర్హతలేని వ్యక్తి వైద్యసేవలు అందించిన కారణంగానే సదరు ఆస్పత్రిలో చేరిన కామిని సోలంకి అనే రోగి మృతి చెందిందని నివేదిక పేర్కొంది. -
రాష్ట్రపతి భవన్ ఎదుట యువజంట వస్త్రత్యాగం
న్యూఢిల్లీ: రాష్ట్రపతి భవన్ ఎదుట ఒక యువజంట వస్త్రత్యాగం చేసిన సంఘటన సోమవారం కలకలం రేపింది. ప్రభాత్, అనూరాధ అనే జంట రాష్ట్రపతి భవన్ ప్రధాన ద్వారం వద్దకు చేరుకుని, తాము రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలుసుకోవాలనుకుంటున్నామని భద్రతా సిబ్బందికి చెప్పా రు. వారు తగిన కారణం చెప్పకపోవడంతో భద్రతా సిబ్బంది వారిని లోపలకు అనుమతించేందుకు నిరాకరించారు. దీనికి నిరసనగా వారు అకస్మాత్తుగా దుస్తులు విప్పేసుకున్నారు. ఈ ఆకస్మిక చర్యకు నిశ్చేష్టులైన భద్రతా సిబ్బంది, హుటాహుటిన వారిచేత బలవంతంగా కొన్ని దుస్తులు తొడిగించారు. అయినప్పటికీ, జంటలోని పురుషుడు భద్రతా సిబ్బంది తనకు బలవంతంగా తొడిగిన ధోతీని విడిచేసి, పరుగులు తీశాడు. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని, బలవంతంగా జీపులోకి ఎక్కించారు. యువజంటను తొలుత పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కు తీసుకు వెళ్లిన పోలీసులు, వారి ప్రవర్తన సాధారణంగా లేకపోవడంతో రామ్మనోహర్ లోహియా ఆస్పత్రిలో వైద్య పరీక్షలు జరిపించారు. వారిని సబ్‌డివిజనల్ మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచి, తర్వాత తూర్పు ఢిల్లీలోని మానసిక చికిత్సా కేంద్రానికి తరలించారు.