ఆర్‌ఎంఎల్‌ డీన్‌కు కరోనా పాజిటివ్‌ | RML hospital Dean Doctor Rajeev Sood tests positive for Corona | Sakshi
Sakshi News home page

ఆర్‌ఎంఎల్‌ డీన్‌కు కరోనా పాజిటివ్‌

Published Sun, May 24 2020 11:35 AM | Last Updated on Sun, May 24 2020 11:52 AM

RML hospital Dean Doctor Rajeev Sood tests positive for Corona - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధానిలో కరోనా వైరస్‌ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉన్నాయి. ఢిల్లీలో కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతుండంతోపాటు వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలు కూడా వైరస్‌ బారిన పడుతున్నారు. తాజాగా రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్‌పైనా కరోనా మహమ్మారి తన ప్రతాపం చూపింది. ఆర్ఎంఎల్‌  మెడికల్ కళాశాల డీన్, యూరాలజీ విభాగం అధిపతి రాజీవ్ సూద్‌కు కరోనా వైరస్ సోకింది. ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించగా, పాజిటివ్‌ రావడంతో డాక్టర్ రాజీవ్ సూద్‌ను అధికారులు హోం క్వారంటైన్‌కు పంపించారు. ఈ నేప‌ధ్యంలో ఆయనతో సం‌బంధం ఉన్న‌వారంద‌రికీ వైద్య ప‌రీక్ష‌లు నిర్వహిస్తున్నారు. ఆర్ఎంఎల్‌లో హాస్పటల్‌లో చాలా కాలం నుంచి క‌రోనా రోగుల‌కు చికిత్స అందిస్తున్న విషయం తెలిసిందే. ఆస్పత్రి క్యాంటిన్‌లో14 మందిని కరోనా పాజిటివ్‌ తేలింది. ఢిల్లీలో 12,910 కేసులు నమోదు కాగా 231మంది మరణించారు. (కరోనా.. భారత్లో రికార్డు స్థాయిలో కేసులు)

కరోనాతో డాక్టర్‌ పాండే మృతి
మరోవైపు ప్రముఖ పల్మనాలజిస్ట్‌, ఢిల్లీ ఎయిమ్స్‌ డిపార్టుమెంట్‌ ఆఫ్‌ మెడిసిన్‌ మాజీ అధిపతి డాక్టర్‌ జితేంద్రనాథ్‌ పాండే (79) మృతి చెందారు. కరోనా సోకడంతో తన నివాసంలో ఐసోలేషన్‌లో ఉన్న ఆయన శనివారం తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. కాగా దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్‌ కేసులో నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 6,767 కరోనా కేసులు నమోదు కాగా, 147మంది మృతి చెందారు. భారత్‌లో ఇప్పటివరకూ 1.31 లక్షలమంది కరోనా బారిన పడ్డారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement