మృతదేహాన్ని పీక్కుతిన్న కుక్కలు
లక్నో : ఆస్పత్రిలో ఓ మహిళ మృతదేహాన్ని కుక్కలు పీక్కుతిన్న దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఇక్కడి డా.రామ్ మనోహర్ లోహియా ప్రభుత్వాసుపత్రిలోని మార్చురీ గదిలో ఈ దారుణం జరిగినట్లు ఆస్పత్రి డైరెక్టర్ దేవేంద్ర నేగీ మీడియాకు తెలిపారు. దీంతో విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు వార్డు బాయ్‌తో పాటు ఇద్దరు భద్రతా సిబ్బందిని తొలగించినట్లు పేర్కొన్నారు.
చిన్‌హట్‌కు చెందిన పుష్పా తివారీ(40) విష ప్రభావంతో శనివారం సాయంత్రం ఎమర్జెన్సీ వార్డులో చికిత్స పొందుతూ మృతిచెందారని నేగీ తెలిపారు. ఇది మెడికో లీగల్ కేసు కావడంతో పోస్టుమార్టం కోసం ఆమె శరీరాన్ని డీప్ ఫ్రీజర్‌లో భద్రపరచినట్లు వెల్లడించారు. డాక్టర్లు ఆదివారం ఉదయం 9 గంటలకు మార్చురీ గదికి చేరుకోగానే సదరు మహిళ మృతదేహం ఫ్రీజర్ నుంచి బయటపడి.. ముఖం ఛిద్రమైన స్థితిలో ఉందని పేర్కొన్నారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు నేగీ తెలిపారు.
ఉత్తరప్రదేశ్‌లో దారుణం
Published Mon, Aug 28 2017 6:11 PM | Last Updated on Tue, Sep 12 2017 1:12 AM
Advertisement
Advertisement