అనంతగిరి, న్యూస్‌లైన్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లును వెంటనే పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలని విద్యార్థి జేఏసీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ శుభప్రద్‌పటేల్ రాష్ట్ర డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహకు వినతిపత్రం అందజేశారు. గురువారం వికారాబాద్‌కు విచ్చేసిన రాజనర్సింహను విద్యార్థి జేఏసీ నాయుకులు కలుసుకున్నారు. ఈ సందర్భంగా శుభప్రద్‌పటేల్ వూట్లాడుతూ.. 1956 నుంచి కొనసాగుతున్న తెలంగాణ ఉద్యమంలో ఎంతోమంది విద్యార్థులు, యువకులు ప్రాణాలర్పించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆకాంక్షను చాటారన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రకటనకు కాంగ్రెస్‌పార్టీ కట్టుబడి ఉండాలని, సీమాంధ్రుల లాబీయింగ్‌కు తలొగ్గొదని పేర్కొన్నారు. ఆంధ్ర పెట్టుబడిదారుల ఉద్యమంతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వాయిదా వేస్తారేమోనన్న ఆందోళనలో విద్యార్థులు, ప్రజలున్నట్లు చెప్పారు.
తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులపై ఉన్న కేసులకు ఎత్తివేయాలని, ఉద్యమంలో భాగంగా ఉద్యోగాలు కోల్పోయినవారిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరారు. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ను 10 సంవత్సరాలు కాకుండా 5 సంవత్సరాలకే పరిమితం చేయూలన్నారు. వికారాబాద్ పట్టణాన్ని జిల్లా హెడ్‌క్వార్టర్ చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో విద్యార్థి జేఏసీ జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రకాంత్‌రెడ్డి, యూత్ జేఏసీ జిల్లా అధ్యక్షుడు శంకర్, ప్రధాన కార్యదర్శి కిషోర్, ఉపాధ్యక్షులు సత్యం, శ్రీకాంత్, నాయకులు నాగేష్, ప్రేమ్, శేఖర్, ఇమ్రాన్‌ఖాన్ తదితరులున్నారు.
సీమాంధ్రుల లాబీయింగ్‌కు తలొగ్గొదు
Published Fri, Aug 23 2013 12:03 AM | Last Updated on Sun, Apr 7 2019 4:30 PM
Advertisement
Advertisement