Deputy CM Damodar Raja Narasimha
-
మా కార్యకర్తల జోలికొస్తే బట్టలూడదీస్తా!
- టీఆర్ఎస్, పోలీసులకు మాజీ డిప్యూటీ సీఎం దామోదర హెచ్చరిక మునిపల్లి: టీఆర్ఎస్ నాయకులు, పోలీసులు తమ పార్టీ కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని, బట్టలూడదీస్తానని కాంగ్రెస్‌నేత, మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ హెచ్చరించారు. శుక్రవారం మెదక్ జిల్లా మునిపల్లి మండలం ఖమ్మంపల్లిలో ఓ కాంగ్రెస్ కార్యకర్త కూతురి వివాహానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు కార్యకర్తలు ఆయనతో మాట్లాడుతూ పోలీసులు తమపై కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టడమేగాకుండా మానసిక క్షోభకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై దామోదర స్పందించి పై వ్యాఖ్యలు చేశారు. -
దామోదర అవినీతిపైవిచారణ చేయిస్తా
డిప్యూటీ సీఎం తీరుపై మాజీ మంత్రి బాబూమోహన్ఆగ్రహం మునిపల్లి, న్యూస్‌లైన్: ‘తెలుగుదేశం అధికారంలోకి రా గానే నేనే మంత్రినవుతా..డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ అవినీ తిపై దర్యాప్తు చేయిస్తా’నని మాజీ మం త్రి బాబూమోహన్ పేర్కొన్నారు. టీడీపీ నేతలను, నాయకులను కాంగ్రెస్ పార్టీ లో చేర్చుకుని కండువాలు కప్పడమే డి ప్యూటీ సీఎం పనిగా పెట్టుకున్నారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సోమవా రం కంకోల్ సమీపంలో పార్టీ మండల అధ్యక్షుడు శ్రీశైలం స్వామి అధ్వర్యంలో కాంగ్రెస్, టీఆర్ఎస్, ఎస్ఎఫ్ఐ కా ర్యకర్తలకు ఆయన కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు. టీడీపీ అధికారం లో ఉండగా పదవులు అనుభవించిన వారు రాజనర్సింహ ఇచ్చే కాంట్రాక్టుల కు, కమీషన్లకు కక్కుర్తిపడి కాంగ్రెస్ పా ర్టీలో చేరే వారిని బాబూమోహన్ వేశ్యలుగా అభివర్ణించారు. డిప్యూటీ సీఎం పనులు చేయకుండానే అధికారులను బెదిరించి వేల కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదిస్తున్నారన్నారు. బా బూమోహన్ అంటే ఏమిటో తెలుసుకుని మాట్లాడాలన్నారు. అక్షర జ్ఞానం లేని మూర్ఖులు తనను విమర్శిస్తున్నార న్నారు. అక్షర జ్ఞానం లేకనే డిప్యూటీ కలెక్టర్ పరీక్ష రాశానా అని ఆయన పేర్కొన్నారు. రాజకీయాల్లోకి రాకుంటే ఈ రోజు కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తూ ఉండేవాడినన్నారు. అందోల్ నియోజకవర్గంలో గెలిచి కార్మిక మంత్రిగా పనిచేసినా పైసా కూడా సంపాదించలేదన్నారు. తన ప్రాణం పోయినా అబద్ధ అడనన్నారు. అలాగే గ్రూపు రాజకీయాలకు పాల్పడవద్దని జహీరాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం ఇన్చార్జి మదన్ మోహన్ ఎదుటే బాబూమోహన్ వ్యాఖ్యానించడంతో టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆశ్చర్యపోయారు. మదన్మోహన్ ఆయన సిబ్బంది కంప్యూటర్ పరిజ్ఞానాన్ని నియోజక వర్గంలో చూపించవద్దని హెచ్చరిం చారు. ఎదైనా చేయాలంటే మిగతా నియోజకవర్గాల్లో చూపించాలని హి తవు పలికారు. దీంతో మదన్మోహన్ నివ్వెరపోయారు. బాబూమోహన్ ఏం మాట్లాడుతున్నదీ ఎవరికీ అర్థం కా కుండా పోయింది. నియోజకవర్గ ఇన్చార్జి మదన్మోహన్రావు మాట్లాడు తూ తమ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు కేంద్రానికి లేఖ ఇవ్వడం వల్లే యూపీఏ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిందన్నారు. కార్యకర్తలు పార్టీని తిరిగి అధికారంలో తెచ్చేందుకు కృషి చేయాలన్నారు. అంతకు ముందు టీ ఎన్ఎస్ఎఫ్ మండల అధ్యక్షునిగా ఇంతియాజన్ను నియమిస్తున్నట్లు బా బూమోహన్ ప్రకటించారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు అమర్‌బాబు, వివిధ గ్రామాల నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. -
తెలంగాణ ఏర్పాటు నిజం కాబోతోంది: దామోదర
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నిజం కాబోతున్నదనే విషయాన్ని ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీ తనతో చెప్పారని, ఆమె మాటలపై తనకు ఎంతో నమ్మకం ఉందని ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. నాంపల్లి పబ్లిక్‌గార్డెన్స్‌లో శనివారం తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో ఇటీవల పదవీ విరమణ పొందిన వాణిజ్య పన్నుల శాఖ అదనపు డెరైక్టర్ టి.వివేక్ సన్మాన సభ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన డిప్యూటీ సీఎం మాట్లాడుతూ... హైదరాబాద్‌లో ఉన్నవారు హైదరాబాదీయులేనని స్పష్టంచేశారు. వివిధ మతాలు, కులాలు, ప్రాంతాల వారు ఇక్కడ స్థిరపడ్డారని, వీరిలో కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలుగా నిలబడ్డవారికి ఓట్లేసి గెలిపించామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ వినోద్‌కుమార్, సీనియర్ జర్నలిస్టు పొత్తూరి వెంకటేశ్వరరావు, దేవీప్రసాద్, శ్రీనివాస్‌గౌడ్, విఠల్, అద్దంకి దయాకర్, తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగ జేఏసీ నేతలు వెంకటేశ్వర్లు, బి.శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. -
తెలంగాణపై అనుమానాలొద్దు
సాక్షి, హైదరాబాద్: డిసెంబర్‌లోగా తెలంగాణ ఏర్పాటుకు అవసరమైన రాజ్యాంగపరమైన ప్రక్రియ పూర్తి అవుతుందని తెలంగాణ ప్రాంత మంత్రులు చెప్పారు. తెలంగాణపై ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గేది లేదని, అధిష్టానం పెద్దలు, కేంద్ర మంత్రులు కూడా ఈ విషయం చాలాసార్లు చెప్పారని అన్నారు. కొందరు ముఖ్య నేతలతో కలిసి వీరు శనివారం హైదరాబాద్ మినిస్టర్స్ క్వార్టర్లలోని క్లబ్‌హౌస్‌లో తెలంగాణ జేఏసీ నేతలతో సమావేశమయ్యారు. , మంత్రులు కె.జానారెడ్డి, బసవరాజు సారయ్య, డి.కె.అరుణ, పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్, ఎంపీ రాజయ్య, మాజీమంత్రి షబ్బీర్ అలీ, జేఏసీ చైర్మన్ ఫ్రొఫెసర్ ఎం.కోదండరాం, కో చైర్మన్లు మల్లేపల్లి లక్ష్మయ్య, దేవీప్రసాద్, వి.శ్రీనివాస్‌గౌడ్, అధికారప్రతినిధులు సి.విఠల్, అద్దంకి దయాకర్, అడ్వకేట్స్ జేఏసీ చైర్మన్ రాజేందర్ రెడ్డి, వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ నిర్ణయం, సీమాంధ్ర ఉద్యమం, సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి వ్యవహారశైలి, కేంద్ర ప్రభుత్వ జాప్యం, తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నేతల మౌనం, ఈ నెల 7న నిర్వహించబోయే మహాశాంతి ర్యాలీ వంటివాటిపై చర్చించారు. మంత్రులు మాట్లాడుతూ.. ‘సీడబ్ల్యూసీ నిర్ణయం అమలయ్యేదాకా పరస్పర అవగాహనతో, జాతీయస్థాయిలో సమన్వయంతో పనిచేయాల్సి ఉంది. తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఉండొద్దు. తెలంగాణపై వెనక్కి తగ్గేది లేదని చాలాసార్లు చెప్పినందున ఇంకా అనుమానాలు అవసరం లేదు. సీమాంధ్ర ప్రాంత ఉద్యోగులను, ప్రజలను రెచ్చగొట్టేవిధంగా మాట్లాడొద్దని అధిష్టానం మాకు సూచించింది. అందుకే కొంత సంయమనంతో ఉంటున్నాం’ అని వివరించారు. తెలంగాణ విజయోత్సవాలతో ప్రజల్లో విశ్వాసం పెరుగుతుందని చెప్పినట్టు సమాచారం. జేఏసీ నేతలు మాట్లాడుతూ ..‘తెలంగాణపై నిర్ణయం ప్రకటించి ఇప్పటికే నెల దాటిపోయింది. ఇంకా కేబినెట్ నోట్ కూడా తయారుకాలేదు. ఎలాంటి రాజ్యాంగపరమైన కదలికలూ లేవు. మరోవైపు సీమాంధ్రలో ఉద్యమాలను, ఏపీఎన్జీఓలను సమ్మెను ప్రోత్సహించే విధంగా ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారు. తెలంగాణలో సకల జనుల సమ్మె జరిగితే విరమించాలంటూ ముఖ్యమంత్రితో పాటు తెలంగాణ ప్రాంత మంత్రులు కూడా విజ్ఞప్తి చేశారు. ఏపీఎన్జీఓల సమ్మె విరమణకు సీఎం ఎందుకు అప్పీల్ చేయరు? సీఎం, ఆ ప్రాంత మంత్రులు ఏం చేస్తున్నారు? తెలంగాణప్రాంత మంత్రులు ఎందుకు మౌనంగా ఉన్నారు? సీఎం ఏం మాట్లాడుతున్నా ఎందుకు ప్రశ్నించరు? కనీసం కేబినెట్ నోట్ కూడా తయారుకాకుంటే నమ్మేదెలా? కాంగ్రెస్‌కు అనుకూలంగా ఎలా మాట్లాడగలం? వ్యతిరేకులపై కనీసం నోరుకూడా విప్పకుండా విజయోత్సవాలు చేసుకుంటే ఎలా?’ అని ప్రశ్నించినట్టు సమాచారం. ఈ నెల 7న నిర్వహించ తలపెట్టిన మహా శాంతి ర్యాలీకి ప్రభుత్వం నుండి అనుమతిని తీసుకురావాల్సిన బాధ్యత కూడా మంత్రులదే అని జేఏసీ నేతలు స్పష్టం చేశారు. అదుపు చేయలేకపోతే సభలకు అనుమతులొద్దు: జానా ఏపీఎన్జీఓలు చేస్తున్న సమ్మెను విరమింపజేసే బాధ్యతను ముఖ్యమంత్రి తీసుకోవాలని జానారెడ్డి డిమాండ్ చేశారు. భేటీ అనంతరం మంత్రులు, జేఏసీ నేతలు మీడియాతో మాట్లాడారు. తెలంగాణ విభజనకు అన్ని పార్టీల నేతలు సహకరించాలని జానారెడ్డి విజ్ఞప్తి చేశారు. అనవసరమైన అల్లర్లు, గొడవలు జరుగకుండా అదుపు చేయగలిగినవారే హైదరాబాద్‌లో సభలు జరపాలని ఆయన సూచించారు. పరిస్థితులను అదుపు చేయలేకపోతే ఇరుప్రాంతాల వారి సభలకు అనుమతులు ఇవ్వొద్దని ప్రభుత్వానికి సూచించారు. కిరణ్‌కుమార్‌రెడ్డికి ముఖ్యమంత్రి పదవిలో కొనసాగే నైతిక అర్హత లేదని జేఏసీ నేతలు కోదండరాం తదితరులు అన్నారు. సీమాంధ్రకు అనుకూలంగా, తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడిన తర్వాత కూడా సీఎం పదవిలో కొనసాగడం అనైతికమన్నారు. -
సీమాంధ్రుల లాబీయింగ్‌కు తలొగ్గొదు
అనంతగిరి, న్యూస్‌లైన్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లును వెంటనే పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని విద్యార్థి జేఏసీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ శుభప్రద్‌పటేల్ రాష్ట్ర డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహకు వినతిపత్రం అందజేశారు. గురువారం వికారాబాద్‌కు విచ్చేసిన రాజనర్సింహను విద్యార్థి జేఏసీ నాయుకులు కలుసుకున్నారు. ఈ సందర్భంగా శుభప్రద్‌పటేల్ వూట్లాడుతూ.. 1956 నుంచి కొనసాగుతున్న తెలంగాణ ఉద్యమంలో ఎంతోమంది విద్యార్థులు, యువకులు ప్రాణాలర్పించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆకాంక్షను చాటారన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రకటనకు కాంగ్రెస్‌పార్టీ కట్టుబడి ఉండాలని, సీమాంధ్రుల లాబీయింగ్‌కు తలొగ్గొదని పేర్కొన్నారు. ఆంధ్ర పెట్టుబడిదారుల ఉద్యమంతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వాయిదా వేస్తారేమోనన్న ఆందోళనలో విద్యార్థులు, ప్రజలున్నట్లు చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులపై ఉన్న కేసులకు ఎత్తివేయాలని, ఉద్యమంలో భాగంగా ఉద్యోగాలు కోల్పోయినవారిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరారు. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ను 10 సంవత్సరాలు కాకుండా 5 సంవత్సరాలకే పరిమితం చేయూలన్నారు. వికారాబాద్ పట్టణాన్ని జిల్లా హెడ్‌క్వార్టర్ చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో విద్యార్థి జేఏసీ జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రకాంత్‌రెడ్డి, యూత్ జేఏసీ జిల్లా అధ్యక్షుడు శంకర్, ప్రధాన కార్యదర్శి కిషోర్, ఉపాధ్యక్షులు సత్యం, శ్రీకాంత్, నాయకులు నాగేష్, ప్రేమ్, శేఖర్, ఇమ్రాన్‌ఖాన్ తదితరులున్నారు. -
ఢిల్లీ వెళ్తున్న డిప్యూటి సీఎం దామెదర రాజనర్సింహ