తెలంగాణ ఏర్పాటు నిజం కాబోతోంది: దామోదర | Formation of Telangana state to be truth, says Damodara Raja narashima | Sakshi
Sakshi News home page

తెలంగాణ ఏర్పాటు నిజం కాబోతోంది: దామోదర

Published Sun, Sep 1 2013 3:04 AM | Last Updated on Sun, Apr 7 2019 4:30 PM

Formation of Telangana state to be truth, says Damodara Raja narashima

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నిజం కాబోతున్నదనే విషయాన్ని ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీ తనతో చెప్పారని, ఆమె మాటలపై తనకు ఎంతో నమ్మకం ఉందని ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. నాంపల్లి పబ్లిక్‌గార్డెన్స్‌లో శనివారం తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో ఇటీవల పదవీ విరమణ పొందిన వాణిజ్య పన్నుల శాఖ అదనపు డెరైక్టర్ టి.వివేక్ సన్మాన సభ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన డిప్యూటీ సీఎం మాట్లాడుతూ... హైదరాబాద్‌లో ఉన్నవారు హైదరాబాదీయులేనని స్పష్టంచేశారు. వివిధ మతాలు, కులాలు, ప్రాంతాల వారు ఇక్కడ స్థిరపడ్డారని, వీరిలో కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలుగా నిలబడ్డవారికి ఓట్లేసి గెలిపించామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ వినోద్‌కుమార్, సీనియర్ జర్నలిస్టు పొత్తూరి వెంకటేశ్వరరావు, దేవీప్రసాద్, శ్రీనివాస్‌గౌడ్, విఠల్, అద్దంకి దయాకర్, తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగ జేఏసీ నేతలు వెంకటేశ్వర్లు, బి.శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement