డిప్యూటీ సీఎం తీరుపై మాజీ మంత్రి బాబూమోహన్ఆగ్రహం
మునిపల్లి, న్యూస్‌లైన్:
‘తెలుగుదేశం అధికారంలోకి రా గానే నేనే మంత్రినవుతా..డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ అవినీ తిపై దర్యాప్తు చేయిస్తా’నని మాజీ మం త్రి బాబూమోహన్ పేర్కొన్నారు. టీడీపీ నేతలను, నాయకులను కాంగ్రెస్ పార్టీ లో చేర్చుకుని కండువాలు కప్పడమే డి ప్యూటీ సీఎం పనిగా పెట్టుకున్నారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సోమవా రం కంకోల్ సమీపంలో పార్టీ మండల అధ్యక్షుడు శ్రీశైలం స్వామి అధ్వర్యంలో కాంగ్రెస్, టీఆర్‌ఎస్, ఎస్‌ఎఫ్‌ఐ కా ర్యకర్తలకు ఆయన కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు. టీడీపీ అధికారం లో ఉండగా పదవులు అనుభవించిన వారు రాజనర్సింహ ఇచ్చే కాంట్రాక్టుల కు, కమీషన్లకు కక్కుర్తిపడి కాంగ్రెస్ పా ర్టీలో చేరే వారిని బాబూమోహన్ వేశ్యలుగా అభివర్ణించారు. డిప్యూటీ సీఎం పనులు చేయకుండానే అధికారులను బెదిరించి వేల కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదిస్తున్నారన్నారు. బా బూమోహన్ అంటే ఏమిటో తెలుసుకుని మాట్లాడాలన్నారు. అక్షర జ్ఞానం లేని మూర్ఖులు తనను విమర్శిస్తున్నార న్నారు. అక్షర జ్ఞానం లేకనే డిప్యూటీ కలెక్టర్ పరీక్ష రాశానా అని ఆయన పేర్కొన్నారు.
రాజకీయాల్లోకి రాకుంటే ఈ రోజు కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తూ ఉండేవాడినన్నారు. అందోల్ నియోజకవర్గంలో గెలిచి కార్మిక మంత్రిగా పనిచేసినా పైసా కూడా సంపాదించలేదన్నారు. తన ప్రాణం పోయినా అబద్ధ అడనన్నారు. అలాగే గ్రూపు రాజకీయాలకు పాల్పడవద్దని జహీరాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం ఇన్‌చార్జి మదన్ మోహన్ ఎదుటే బాబూమోహన్ వ్యాఖ్యానించడంతో టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆశ్చర్యపోయారు. మదన్‌మోహన్ ఆయన సిబ్బంది కంప్యూటర్ పరిజ్ఞానాన్ని నియోజక వర్గంలో చూపించవద్దని హెచ్చరిం చారు. ఎదైనా చేయాలంటే మిగతా నియోజకవర్గాల్లో చూపించాలని హి తవు పలికారు. దీంతో మదన్‌మోహన్ నివ్వెరపోయారు. బాబూమోహన్ ఏం మాట్లాడుతున్నదీ ఎవరికీ అర్థం కా కుండా పోయింది. నియోజకవర్గ ఇన్‌చార్జి మదన్‌మోహన్‌రావు మాట్లాడు తూ తమ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు కేంద్రానికి లేఖ ఇవ్వడం వల్లే యూపీఏ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిందన్నారు. కార్యకర్తలు పార్టీని తిరిగి అధికారంలో తెచ్చేందుకు కృషి చేయాలన్నారు. అంతకు ముందు టీ ఎన్‌ఎస్‌ఎఫ్ మండల అధ్యక్షునిగా ఇంతియాజన్‌ను నియమిస్తున్నట్లు బా బూమోహన్ ప్రకటించారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు అమర్‌బాబు, వివిధ గ్రామాల నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
దామోదర అవినీతిపైవిచారణ చేయిస్తా
Published Mon, Jan 20 2014 11:44 PM | Last Updated on Fri, Aug 10 2018 5:38 PM
Advertisement