
మా కార్యకర్తల జోలికొస్తే బట్టలూడదీస్తా!
- టీఆర్‌ఎస్, పోలీసులకు మాజీ డిప్యూటీ సీఎం దామోదర హెచ్చరిక
మునిపల్లి: టీఆర్‌ఎస్ నాయకులు, పోలీసులు తమ పార్టీ కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని, బట్టలూడదీస్తానని కాంగ్రెస్‌నేత, మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ హెచ్చరించారు. శుక్రవారం మెదక్ జిల్లా మునిపల్లి మండలం ఖమ్మంపల్లిలో ఓ కాంగ్రెస్ కార్యకర్త కూతురి వివాహానికి ఆయన హాజరయ్యారు.
ఈ సందర్భంగా పలువురు కార్యకర్తలు ఆయనతో మాట్లాడుతూ పోలీసులు తమపై కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టడమేగాకుండా మానసిక క్షోభకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై దామోదర స్పందించి పై వ్యాఖ్యలు చేశారు.