warned
-
అమెరికా ఖలిస్థానీలకు ఎఫ్‌బీఐ హెచ్చరికలు
న్యూయార్క్: కెనడాలో హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య తర్వాత అమెరికాలోని ఖలిస్థానీలకు ఎఫ్‌బీఐ హెచ్చరికలు జారీ చేసింది. ఖలిస్థానీ నేతల జీవితాలు ప్రమాదంలో ఉన్నాయని పేర్కొంది. ప్రమాదం ఏ రూపంలో వస్తుందో తెలియనందున జాగ్రత్తగా ఉండాలని సూచించినట్లు అమెరికా ఖలిస్థానీ నేతలు చెప్పారు. ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్‌ను గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. జూన్ 18న బ్రిటీష్ కొలంబియాలోని సుర్రే గురుద్వారాలో ఉండగా.. కాల్పులు జరిపి నిజ్జర్‌ను హత్య చేశారు. ఈ కేసులో భారత్-కెనడా మధ్య వివాదం కొనసాగుతోంది. అయితే.. నిజ్జర్ హత్య తర్వాత ఎఫ్‌బీఐ అమెరికా ఖలిస్థానీలను హెచ్చరించింది. నిజ్జర్ హత్య తర్వాత ఇద్దరు ఎఫ్‌బీఐ అధికారులు తనను కలిసినట్లు అమెరికన్ సిక్కుల కోఆర్డినేటర్ ప్రతిపాల్ సింగ్ తెలిపారు. ప్రమాదం పొంచి ఉందని సూచించారు. జాగ్రత్తగా ఉండాలని కోరారు. తనతోపాటు మరో ఇద్దరు సిక్కు నేతలను కూడా ఎఫ్‌బీఐ అధికారులు కలిశారు. నిజ్జర్ హత్యకు ముందే హెచ్చరికలు.. నిజ్జర్ హత్యకంటే ముందే కెనడాలో సిక్కు నేతలను నిఘా వర్గాలు హెచ్చరించాయంట. ఈ విషయాన్ని బ్రిటీష్ కొలంబియా గురుద్వారా కౌన్సిల్ ప్రతినిధి మోనిందర్ సింగ్ తెలిపారు. సిక్కు నేతల ప్రాణాలకు ముప్పు ఉందని అంతకంటే ముందే సమాచారం అందిందని ఆయన వెల్లడించారు. ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్‌పై ఎన్ఐఏ అప్పట్లో కేసులు నమోదు చేసింది. అతనిపై రూ.10 లక్షల రివార్డ్‌ను కూడా ప్రకటించింది. మోహాలీలోని కోర్టులో అతనిపై ఛార్జీషీటు దాఖలు చేసింది. అయితే.. ఆయన్ను జూన్ 18న దుండగులు హత్య చేశారు. ఈ కేసులో భారత్ ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించడం ఇరు దేశాల మధ్య వివాదాస్పదంగా మారింది. నిజ్జర్ హత్య తర్వాత ఖలిస్థానీ మరో ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ ఆస్తులను ఎన్ఐఏ జప్తు చేసింది. పన్నూన్ 'జస్టిస్ ఫర్ సిక్' అనే అమెరికా ఆధారిత సంస్థకు చీఫ్‌గా ఉన్నాడు. చంఢీగర్, అమృత్సర్లోనూ ఈ సంస్థ కార్యకలాపాలు నడిచాయి. ఉపా చట్టం కింద భారత్ అతన్ని ఉగ్రవాదిగా గుర్తించింది. ఇదీ చదవండి: కెనడాలో పిల్లలు.. భారతీయ తల్లిదండ్రుల్లో ఆందోళన -
ట్విట్టర్ ని దివాలా తీయించడానికి కంకణం కట్టుకున్న మస్క్
-
ట్విట్టర్ ఆర్థిక పరిస్థితిపై ఎలాన్ మస్క్ హెచ్చరిక
-
చైనాకి వంతపాడుతున్న రష్యా! ముమ్మాటికి రెచ్చగొట్టే చర్యే!
Russia On Nancy Pelosi's Taiwan Visit: అగ్రరాజ్యం సెనేట్ స్పీకర్ నాన్సీ పెలోసీ తైవాన్ పర్యటిస్తున్నారని వస్తున్న వార్తలు పెను వివాదానికి దారితీశాయి. ఒక పక్క తైవాన్‌లో అడుగుపెడితే ఊరుకునేదే లేదంటూ అమెరికాకు పదే పదే చైనా హెచ్చరిస్తోంది. పైగా దీనికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదంటూ స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చింది. ఇదిలా ఉంటే మరోవైపు రష్యా కూడా అమెరికా తీరుని తప్పుపట్టింది. చైనాకి వత్తాసు పలుకుతూ...అమెరికాకు గట్టి వార్నింగ్ ఇచ్చింది. ఇది ముమ్మాటికి రెచ్చగొట్టే చర్యని తేల్చి చెప్పారు మాస్కో ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్. యూఎస్ సెనెట్ స్పీకర్ నాన్సీ పెలోసి తైవాన్‌ని సందర్శించడం వల్ల చైనాతో యుద్ధానికి దారితీస్తుందని హెచ్చరించారు. ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు చోటు చేసుకునే అవకాశం కూడా ఉందన్నారు. అయినా తైవాన్ తమది అని నొక్కి చెబుతూ పదేపదే హెచ్చరించినా... అమెరికా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. పైగా వాషింగ్టన్ వన్ చైనా సూత్రానికి కట్టుబడి ఉంటానంటూ ప్రతిజ్ఞ చేసి మరీ ఇలా యూఎస్ పెలోసి తైవాన్ పర్యటన ఖరారు చేయడం అంటే బీజింగ్‌కి విరుద్ధంగా వ్యవహరించడమేని నొక్కి చెప్పారు. మరోవైపు ఈ పెలోసీ పర్యటనను సీరియస్‌గా తీసుకున్న చైనా ఇప్పటికే తైవాన్‌కి సంబంధించిన సుమారు 35 ఆహర ఎగుమతులను నిషేధించింది. (చదవండి: చైనా వార్నింగ్‌తో అలర్ట్.. తైవాన్ చుట్టూ అమెరికా యుద్ధ నౌకల మోహరింపు) -
అలా చేయకండి.. అమెరికాకు తాలిబన్లు వార్నింగ్
కాబుల్: తమ ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి ప్రయత్నిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని అమెరికాను తాలిబన్లు హెచ్చరించారు. కాగా అఫ్గన్ నుంచి అమెరికా నాటో దళాలు వైదొలగిన తర్వాత తొలిసారి తాలిబన్ తాత్కాలిక ప్రభుత్వంతో ముఖాముఖి చర్చలు జరిగిన సందర్భంగా తాలిబన్లు ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఈ చర్చల అనంతరం అఫ్గన్ విదేశాంగ మంత్రి అమిర్ ఖాన్ ముత్తాఖీ దీనిపై మాట్లాడుతూ.. ‘అఫ్గన్‌లో ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు చేసే ప్రయత్నాలు ఏ ఒక్కరికీ మంచిది కాదన్న విషయాన్ని స్పష్టం చేశారు. "అఫ్గనిస్తాన్‌తో సత్సంబంధాలు అందరికీ మంచిది. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వానికి ఆటంకం కలిగించేలా ఎవరూ ప్రయత్నించిన ఉపేక్షించమని, పైగా ఇటువంటి చర్యలు ప్రజా సమస్యలకు దారీ తీస్తాయని హెచ్చరించారు. అనంతరం కరోనాను ఎదుర్కోవడానికి అమెరికా సహకరిస్తుందని చర్చల్లో పాల్గొన్న ప్రతినిధులు హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఖతార్ రాజధాని దోహా వేదికగా అమెరికా, తాలిబన్ తాత్కాలిక ప్రతినిధుల మధ్య రెండు రోజుల పాటు చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో అమెరికా విదేశాంగ శాఖకు చెందిన ప్రత్యేక ప్రతినిధి టామ్ వెస్ట్, అమెరికా మానవతా సాయం విభాగం అధికారి సారా చార్లెస్ పాల్గొన్నారు. అఫ్గన్‌లో సుమారు రెండు దశాబ్దాల తర్వాత అమెరికా దళాలు ఆగస్టు 31తో సైన్యాన్ని ఉపసంహరించుకోవడంతో తాలిబన్లు మళ్లీ అఫ్గన్‌ను ఆక్రమించుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే, తాలిబన్ల ప్రభుత్వానికి అంతర్జాతీయంగా గుర్తింపు మాత్రం దక్కలేదు. చదవండి: Toddler Admitted To Hospital : బుడిబుడి నడకల బుడతడు డ్యాన్స్ చేసి అదరగొడుతున్నాడు -
మీ ప్లాన్ కోసం కరోనా వేచి ఉండదు
సాక్షి, హైదరాబాద్: కరోనా మూడో దశ ప్రభావం దేశంలో అక్కడక్కడా కనిపిస్తున్నా.. కరోనా కట్టడికి ఇంకా ప్రణాళికలు రూపొందిస్తున్నామంటూ రాష్ట్ర ప్రభుత్వం పేర్కొనడంపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. సరైన వైద్యం అందకపోయినా, జాప్యం జరిగినా రెప్పపాటు కాలంలోనే ప్రాణాలు పోయే పరిస్థితి ఉంటుందని హెచ్చరించింది. మొదటి, రెండో దశలో ఎన్నో ప్రాణాలు పోయాయని, ఆక్సిజన్ అందక మృతి చెందినవారూ ఉన్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ప్రణాళికలు రూపొందించి తగిన చర్యలు చేపట్టే వరకూ కరోనా వైరస్ ఆగదనే విషయాన్ని గుర్తించాలని స్పష్టం చేసింది. మూడో దశ ముప్పు ముంచుకొస్తోందని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశించింది. కరోనా కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకునేలా ఆదేశించాలంటూ దాఖలైన పలు ప్రజాహిత వ్యాజ్యాలను తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎంఎస్ రామచందర్‌రావు, జస్టిస్ టి.వినోద్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం మరోసారి విచారించింది. నిపుణుల సమావేశం ఎందుకు నిర్వహించలేదు? ‘తాజా సెరో సర్వైలెన్స్ నివేదిక, విపత్తు నిర్వహణ చట్టం నిర్దేశించిన మేరకు నిపుణులతో కూడిన కమిటీ సమావేశాలకు సంబంధించిన మినిట్స్ సమర్పించాలని గత నెల 11న ఆదేశించాం. అలాగే మూడో దశ కట్టడికి తీసుకుంటున్న చర్యలను సవివరంగా పేర్కొనాలని చెప్పాం. అయినా రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన నివేదికలో అవేవీ లేవు’అని ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. అసలు నిపుణులతో కూడిన కమిటీ సమావేశం నిర్వహించారా? అని అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్‌ను ప్రశ్నించింది. సమావేశం జరిగినట్లు లేదని, రెండు వారాల సమయం ఇస్తే పూర్తి వివరాలు సమర్పిస్తామని ఆయన చెప్పారు. దీంతో తమ ఆదేశాలను ఎందుకు అమలు చేయలేదని ధర్మాసనం ప్రశ్నించింది. మూడో దశ కట్టడికి తగిన ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించినా ఇప్పటికీ ప్రభుత్వం ఎందుకు స్పందించలేదని నిలదీసింది. ఇంత తీవ్రమైన పరిస్థితుల్లో, ప్రజల ప్రాణాలతో ముడిపడి ఉన్న అంశంలో ప్రభుత్వం ఇంత ఉదాసీనంగా వ్యవహరించడం తగదని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా పలు ఆదేశాలు జారీ చేస్తూ తదుపరి విచారణను ఈ నెల 22కు వాయిదా వేసింది. కోర్టు ఆదేశాలివీ.. ►వారం రోజుల్లో నిపుణుల కమిటీ సమావేశం నిర్వహించి కరోనా కట్టడికి తగిన ప్రణాళికలు రూపొందించాలి. ►రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో తేలిన కేసుల సంఖ్య ఆధారంగా పాజిటివిటీ రేట్ ఎంత ఉందో జిల్లాల వారీగా నివేదిక ఇవ్వాలి. ►మూడో దశ కట్టడికి తీసుకున్న చర్యలపై రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ సమగ్ర నివేదిక సమర్పించాలి. ఈ నెల 22 విచారణకు రాష్ట్ర ప్రజా ఆరోగ్య విభాగం సంచాలకులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరుకావాలి. ►కరోనా చికిత్సలో భాగంగా వినియోగించే ఔషధాలను అత్యవసర మందుల జాబితాలో చేర్చేలా కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలి. గతంలో ధర్మాసనం ఆదేశించిన మేరకు చర్యలు తీసుకోవడంలో ఎందుకు జాప్యం జరిగిందో కేంద్ర వైద్య ఆరోగ్య విభాగం కార్యదర్శి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరై వివరణ ఇవ్వాలి. ►రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్సీ), ఇతర ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎంతమంది చిన్న పిల్లల వైద్యులు విధులు నిర్వహిస్తున్నారో తెలియజేయండి. ►చిన్నారుల చికిత్సకు నీలోఫర్, ఇతర ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉన్న సాధారణ, ఆక్సిజన్, ఐసీయూ పడకలు, ఇతర సౌకర్యాలపై జిల్లాల వారీగా వివరాలు సమర్పించండి. ►ప్రభుత్వ ఆసుపత్రుల్లో డాక్టర్లు, ఇతర పారామెడికల్ సిబ్బంది నియామకానికి తీసుకున్న చర్యలేంటో తెలియజేయాలి. -
ఒకే రోజు లక్షా 36 వేల కేసులు
జెనీవా: ప్రపంచ దేశాల్లో రోజురోజుకీ కోవిడ్ విజృంభిస్తోందని, ఈ వైరస్‌పై నిర్లక్ష్యం వద్దని డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించింది. అమెరికా, దక్షిణాసియా దేశాల్లో అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయని డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రాస్ అద్నామ్ ఘెబ్రెయాసస్ చెప్పారు. ఆదివారం ఒక్క రోజే ప్రపంచవ్యాప్తంగా 1,36,000 పైగా కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. ‘కరోనా వైరస్ బట్టబయలై ఆరు నెలలైంది. ఇప్పటివరకు ఈ స్థాయిలో భారీగా కేసులు వెలుగులోకి రావడం ఇదే తొలిసారి. ఏ దేశం కూడా ఈ వైరస్‌ను నిర్లక్ష్యం చేయకూడదు. కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడంలో వెనుకడుగు వెయ్యకూడదు’ అని అన్నారు. ఈ కేసుల్లో 75శాతం అమెరికా, బ్రెజిల్, దక్షిణాసియా దేశాలకు చెందినవేనని వెల్లడించారు. యూరప్‌లో కేసులు తగ్గుముఖం పడితే ఆఫ్రికా దేశాల్లో వైరస్ విస్తరిస్తోందన్నారు. అదే సమయంలో చాలా దేశాలు వైరస్‌పై విజయం సాధించడం ఊరట కలిగించే అంశమని అన్నారు. అయితే నిర్లక్ష్యంతో ఉంటే మళ్లీ వైరస్ విజృంభించే అవకాశాలున్నాయని టెడ్రాస్ హెచ్చరించారు. నిరసన ప్రదర్శనల్లో జాగ్రత్తలు వహించాలి ఆఫ్రికా అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్ మృతికి వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా భారీ సంఖ్యలో ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసన ప్రదర్శనలు నిర్వహించేటప్పుడు మరిన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ టెడ్రాస్ అన్నారు. జాతివివక్షకు వ్యతిరేకంగా జరిగే ప్రపంచవ్యాప్తంగా ఉవ్వెత్తున ఎగసిపడుతున్న ఉద్యమానికి తాము ఎప్పుడూ మద్దతుగా ఉంటామని, అయితే ఈ ప్రదర్శనలన్నీ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హితవు పలికారు. ప్రతీ నిరసనకారుడు ఒక మీటర్ దూరాన్ని పాటించాలని, దగ్గినప్పుడు చెయ్యి అడ్డుపెట్టుకోవడం వంటివి చేయాలని అన్నారు. -
మావోలతో జతకడితే ఖబర్దార్
సాక్షి, ఆదిలాబాద్ : మావోయిస్టులు, అనుబంధ సంఘలతో సంబంధాలు నేరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని ఏజెన్సీ ప్రాంత ప్రజలను డీజీపీ హెచ్చరించారు. ఆదివాసీలు-లంబాడాల గొడవల నేపధ్యంలో మావోలు అదనుగా తీసుకునే అవకాశం ఉందని ఆయన పోలీసులను హెచ్చరించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆదివారం ఉట్నూరులో పర్యటించిన డీజీపీ మహేందర్‌రెడ్డి శాంతిభద్రతలు, లంబాడీ - ఆదివాసీల వివాదంపై పోలీసు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. సమీక్షలో ఐజీలు, కమిషనర్లు, ఎస్పీలు, డీఐజీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీజీపీ మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ స్వప్రయోజనాల కోసం చట్టాలను చేతుల్లోకి తీసుకుంటే ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. జనజీవనం, విద్యార్థుల చదువుకు విఘాతం కలిగిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రెవెన్యూ, ఐటీడీఏ అధికారులతో కలిసి శాంతి భద్రతల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులకు మహేందర్‌రెడ్డి సూచించారు. పూర్వ ఆదిలాబాద్ జిల్లాలో లంబాడాలు-ఆదివాసీల మధ్య ఘర్షణలు తెలుత్తుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పెద్దఎత్తున ఘర్షణలు చోటుచేసుకుని పలువురు గాయపడ్డారు. ప్రస్తుతం నివురుగప్పిన నిప్పులా అక్కడి పరిస్థితి ఉంది. కాగా... ఘర్షణలను ముందే పసిగట్టలేకపోవడం, వాటిని అదుపు చేయలేకపోయారన్న కారణంతో మూడు జిల్లాల కలెక్టర్లు, ఓ డీఐజీని ప్రభుత్వం బదిలీ చేసిన సంగతి తెలిసిందే. ఘర్షణలను అరికట్టలేకపోయారన్న అపవాదును పోలీస్ శాఖ మూటకట్టుకున్న నేపధ్యంలో డీజీపీయే స్వయంగా రంగంలోకి దిగి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. -
పన్ను చెల్లింపుదారులకు ఐటీ హెచ్చరిక
పన్ను చెల్లింపుదారులు తమ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌ను ఎవరితో పంచుకోవద్దని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ హెచ్చరించింది. ఒకవేళ పాస్‌వర్డు, ఐడీ అనధికారిక వ్యక్తుల చేతులోకి వెళ్తే యూజర్ల కీలక సమాచారం దుర్వినియోగానికి పాల్పడే అవకాశముందని పేర్కొంది. టీడీఎస్ సెంట్రలైజడ్ ప్రాసెసింగ్ ఈ మేరకు హెచ్చరికలను పన్ను చెల్లింపుదారులకు జారీచేసింది. పన్ను చెల్లింపుదారులు యూజర్ ఐడీ, పాస్‌వర్డు ఎంతో కీలకమైన సమాచారం, వీటితో టీడీఎస్ సంబంధిత రహస్య సమాచారం, కీలకమైన డేటా దిద్దుబాటుకు గురయ్యే అవకాశముంటుందని పేర్కొంది. ఒకవేళ పాస్వర్డ్ హ్యాక్ అయిన లేదా దొంగతనానికి గురైనా, సమాచారం భద్రత ఉల్లంఘనకు గురయ్యే అవకాశముంటుందని వెల్లడించింది. దీనివల్ల ఎన్నో సమస్యలు తలెత్తుతాయని తెలిపింది. కనీసం ఎనిమిది క్యారెక్టర్లు ఉండేలా యూజర్లు పాస్వర్డ్లు క్రియేట్ చేసుకోవాలని, దానిలో నెంబర్లు, స్పెషల్ క్యారెక్టర్లు కూడా ఉండేలా చూసుకోవాలని సూచించింది. అయితే ఈ పాస్‌వర్డ్‌ను తమ డెస్క్‌పై ఉన్న నోట్‌ప్యాడ్స్ లేదా వైట్బోర్డులపై రాయవద్దని తెలిపింది. ఈ-మెయిల్స్, ఫోల్డర్స్, ఫైల్స్ వంటి వాటి పాస్వర్డ్లు కూడా కంప్యూటర్లపై ఉంచుకోవడం ఇబ్బందులు కలుగజేయవచ్చని హెచ్చరించింది. ఒకవేళ యూజర్లు ఈ-మెయిల్ లేదా కంప్యూటర్ అకౌంట్ హ్యాక్ అయితే, పాస్‌వర్డ్‌లను దుర్వినియోగానికి పాల్పడే అవకాశం ఉంటుందని, మీ ఈ-మెయిల్ అకౌంట్ ద్వారా క్రెడిట్/డెబిట్ కార్డుల కీలక సమాచారం కూడా ఇతర వ్యక్తుల చేతిలోకి పోతుందని తెలిపింది. -
భారత్‌పై దాడులు ప్రపంచానికి హెచ్చరికే..!
వాషింగ్టన్: భారత్ లక్ష్యంగా ఉగ్రవాదులు దాడికి దిగడంపట్ల అమెరికాకు చెందిన కాంగ్రెస్ సభ్యుడు ఆందోళన వ్యక్తం చేశారు. ఇది అంత తేలిగ్గా తీసుకోవడానికి వీల్లేదని ప్రపంచానికి ఉగ్రవాదం నుంచి భారీ ముంపు పొంచి ఉందనడానికి ఇదొక హెచ్చరికలాంటిదని అన్నారు. పంజాబ్ లోని పఠాన్ కోట్ వైమానిక స్థావరంపైనా, మరోపక్క, అఫ్గానిస్థాన్‌లోని భారత దౌత్య కార్యాలయంపైన ఉగ్రవాదులు దాడులు జరిపిన విషయం తెలిసిందే. ఈ దాడులపై అమెరికా విదేశాంగ వ్యవహారాల కమిటీలో కాంగ్రెస్ నేత బ్రాడ్ షెర్మాన్(61) ఆందోళన వ్యక్తం చేశారు. ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ ప్రధాని నరేంద్రమోదీ పాకిస్తాన్లో పర్యటించిన మూలంగానే ఈ దాడి జరిగిందని ఊహాగానాలు వెలువడుతున్నాయని, అయినా, ఆ రెండు దేశాల నేతల ఏ మాత్రం వీటికి వెరువకుండా పరిష్కార మార్గాలకోసం ముందుకు వెళ్లాలని చెప్పారు. ఉగ్రవాదాన్ని అంతం చేయడంకోసం చిన్న మూలాన్ని కూడా వదిలిపెట్టవద్దని, దాన్ని రూపుమాపి ఇరు దేశాలకు న్యాయం చేసుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా ఉగ్రవాదాన్ని తుదముట్టించే క్రమంలో భారత్, పాకిస్థాన్ కు అమెరికా సంయుక్త రాష్ట్రాలు సహకారం అందించాలని కోరారు. ఈ దాడులు ప్రపంచ దేశాలకు మరో హెచ్చరిక అనే విషయం ఏ మాత్రం మర్చిపోకూడదని చెప్పారు. -
గుంతకల్లు డిపో ఎదుట ఉద్రిక్తత
అనంతపురం: ఆర్టీసీ కార్మికుల సమ్మెతో ప్రయాణికులకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో అధికారులు తీసుకుంటున్న ప్రత్యామ్నాయ చర్యలకు పలు కార్మిక సంఘాలు విఘాతం కలిగిస్తున్నాయి. అనంతపురం జిల్లా గుంతకల్లు ఆర్టీసీ డిపో నుంచి గురువారం ప్రయాణికుల సౌకర్యార్థం నాలుగు బస్సులను ప్రైవేటు సిబ్బంది బయటకు తీశారు. ఈ విషయం తెలుసుకున్న ఆర్టీసీ కార్మికులు డిపో వద్దకు వచ్చి ప్రైవేటు డ్రైవర్లతో వాగ్వాదానికి దిగడంతోపాటు వారిపై దాడి చేయడానికి యత్నించారు. దీంతో ఆర్టీసీ కార్మికులను చెదరగొట్టెందుకు పోలీసులు రంగంలోకి దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. -
మా కార్యకర్తల జోలికొస్తే బట్టలూడదీస్తా!
- టీఆర్ఎస్, పోలీసులకు మాజీ డిప్యూటీ సీఎం దామోదర హెచ్చరిక మునిపల్లి: టీఆర్ఎస్ నాయకులు, పోలీసులు తమ పార్టీ కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని, బట్టలూడదీస్తానని కాంగ్రెస్‌నేత, మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ హెచ్చరించారు. శుక్రవారం మెదక్ జిల్లా మునిపల్లి మండలం ఖమ్మంపల్లిలో ఓ కాంగ్రెస్ కార్యకర్త కూతురి వివాహానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు కార్యకర్తలు ఆయనతో మాట్లాడుతూ పోలీసులు తమపై కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టడమేగాకుండా మానసిక క్షోభకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై దామోదర స్పందించి పై వ్యాఖ్యలు చేశారు.