కలెక్టర్‌కు సమస్య వివరిస్తున్న మేడి స్వప్న
సాక్షి, యాదాద్రి : కలెక్టరమ్మ జైహింద్ నాకు న్యాయం చేయండి.. అంటూ భువనగిరి మండలం బొమ్మాయిపల్లికి చెందిన మేడబోయిన స్వప్న రక్తంతో కాగితంపై రాసుకుని కలెక్టరేట్‌కు వచ్చింది. సోమవారం ప్రజావాణిలో వినతిపత్రం ఇవ్వడానికి వచ్చి చేతిపై గాజుతో గాట్లు పెట్టుకుంది. దాంతో వచ్చిన రక్తంతో పలు విధంగా రాసింది. చనిపోయిన తన తండ్రి మంగలి మల్లేశం పేరున గల రెండెకరాల భూమిని గ్రామంలో భిక్షపతి అనే వ్యక్తి కబ్జా చేశాడని ఫి ర్యాదు చేశారు.
తాను అత్తగారిల్లు అయిన అల్వాల్‌లో ఉం టున్నానన్నారు. తన తండ్రి భూమి తన పేరున చేయాలని అధికారులను కలిసినా న్యాయం జరగడం లేదని ఆరోపించారు. అధికారులకు లంచాలు ఇవ్వడానికి తాళిబొట్టు తా కట్టు పెట్టి ఇత్తడి తాళిబొట్టు వేసుకున్నానన్నారు. అయినా అధికారులు తన సమస్య పరిష్కరించడం లేదని పలువురు అధికారులపై ఆరోపణలు చేశారు.
తనకు న్యాయం చేయాలని కలెక్టర్ దగ్గరికి వచ్చానని వివరించారు. న్యాయం కోసం తాను చనిపోతానని ఇందుకోసం తన వెంట తెచ్చుకున్న చిన్న చిన్న గాజు ముక్కలను నొట్లో వేసుకునే ప్రయత్నం చేసింది. దీంతో పక్కనే ఉన్న పోలీసులు ఆమెను వారించి కొద్ది సేపు కౌన్సెలింగ్ నిర్వహించి ప్రజావాణిలో ఉన్న కలెక్టర్ అనితారామచంద్రన్ వద్దకు తీసుకెళ్లారు. స్వప్న తన సమస్యను వివరించడంతో భువనగిరి ఆర్డీఓతో విచారణ జరిపించి న్యాయం చేస్తానని హామీ ఇవ్వడంతో ఆమె బయటకు వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment