భక్తుల మనోభావాలు దెబ్బతీయడం దారుణం
నందిగామ రూరల్ : అభివృద్ధి పేరుతో ప్రభుత్వం ఆలయాలు, దర్గాలను కూల్చివేస్తూ, భక్తుల మనోభావాలు దెబ్బతీస్తోందని నందిగామ ముస్లిం సేవా కమిటీ అధ్యక్షుడు షేక్ ఖాజా అన్నారు. అభివృద్ధి పేరిట విజయవాడలో గురువారం ఆలయాలు, దర్గాలను కూల్చివేయడాన్ని నిరసిస్తూ, స్థానిక రెవెన్యూ కార్యాలయంలో శుక్రవారం పలువురు ముస్లింలు వినతిపత్రం సమర్పించారు. అనంతరం ఖాజా మాట్లాడుతూ, అభివృద్ధి పేరుతో పురాతన ఆలయాలు, పవ్రిత దర్గాలు కూల్చివేయడం అమానుషమన్నారు.
ఈ విషయమై ఇప్పటికే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. అనంతరం డెప్యూటీ తహసీల్దార్ శ్రీనివాసమూర్తికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ముస్లిం మైనార్టీ నాయకులు ఎస్.ఎం.రబ్బాని, సయ్యద్ మస్తాన్, షేక్ సమీర్ పాల్గొన్నారు.