మేయర్‌ను అనర్హుడిగా ప్రకటించండి
విజయవాడ సెంట్రల్ : అధికార దుర్వినియోగానికి పాల్పడిన మేయర్ కోనేరు శ్రీధర్‌ను అనర్హుడిగా ప్రకటించాలని కోరుతూ వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లు కమిషనర్ జి.వీరపాండియన్‌కు బుధవారం వినతిపత్రం సమర్పించారు. ఫ్లోర్‌లీడర్ బీఎన్.పుణ్యశీల ఆధ్వర్యంలో చాంబర్లో కమిషనర్‌ను కలిశారు. పుణ్యశీల మాట్లాడుతూ మేయర్ పదవిని అడ్డుపెట్టుకొని శ్రీధర్ పుష్కర కాంట్రాక్ట్‌లను తన భార్య డైరెక్టర్‌గా ఉన్న కేఎంకే సంస్థకు దోచిపెట్టారన్నారు. ఈవిషయమై గతంలో తాము వినతిపత్రం అందించామన్న విషయాన్ని గుర్తు చేశారు. దీనిపై స్పందించిన కమిషనర్ మాట్లాడుతూ ఇటీవల కాలంలో తాను పనుల ఒత్తిడిలో ఉండటం వల్ల దృష్టిపెట్టలేకపోయానన్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న కేఎంకే కాంట్రాక్ట్‌కు సంబంధించి త్వరలోనే విచారణ చేపడతానని హామీ ఇచ్చారు. నిబంధనల ప్రకారమే బాధ్యులపై చర్యలు చేపడతామన్నారు. వైఎస్సార్ సీపీ పశ్చిమ నియోజక వర్గ సమస్వయకర్త ఆసిఫ్, కార్పొరేటర్లు షేక్‌బీజాన్‌బీ, జమలపూర్ణమ్మ, బి.సంధ్యారాణి, అవుతు శ్రీ శైలజ పాల్గొన్నారు.