vmc commissoner
-
భిక్షగాళ్లు లేని బెజవాడగా మార్చేస్తాం
సాక్షి,అమరావతి బ్యూరో: నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో భిక్షగాళ్లు లేని బెజవాడగా మార్చేందుకు చర్యలు చేపడుతున్నామని వీఎంసీ కమిషనర్ జె.నివాస్ పేర్కొన్నారు. శుక్రవారం నగరంలోని నవజీవన్ బాల భవన్లో విజయవాడ రైల్వేస్టేషన్ పరిసర ప్రాంతాల్లోని భిక్షగాళ్లను వీఎంసీ ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. గుర్తించిన 80 భిక్షగాళ్లను తెలంగాణకు చెందిన అమ్మ, నాన్న అనాథాశ్రయానికి అప్పగించే కార్యక్రమాన్ని కమిషనర్ నివాస్ పర్యవేక్షించారు. ఈసందర్భంగా భిక్షగాళ్లకు బిస్కెట్లు అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్‌కు చెందిన అమ్మ, నాన్న ఫౌండేషన్ భిక్షగాళ్లను, అనాథలను అక్కున చేర్చుకొనే మంచి çసంస్థ అని చెప్పారు. సంస్థకు అప్పగించే ప్రతిఒక్కరి ఫొటోలు పూర్తి వివరాలు సేకరించినట్లు వివరించారు. అలాగే వారికి ప్రభుత్వ పథకాలు వర్తింపజేసేందుకు రేషన్ కార్డులు ఇచ్చేలా ఈ సంస్థ నిర్వాహకులు ఏర్పాటు చేస్తారని ఆయన పేర్కొన్నారు. భిక్షగాళ్లు్ల లేని బెజవాడగా తీర్చిదిద్దేందుకు ఇది తొలిఅడుగు అని అభిప్రాయపడ్డారు. త్వరలోనే మిగిలిన భిక్షగాళ్లను కూడా ప్రత్యేక డ్రైవ్ ద్వారా అమ్మ, నాన్న ఎన్జీవో సంస్థకు అప్పగించనున్నట్లు వెల్లడించారు.. రాజీవ్ గాంధీ హోల్‌సేల్ మార్కెట్ తరలింపు విజయవాడ: నగరంలో రాజీవ్‌గాంధీ హోల్‌సేల్ మార్కెట్, పూల మార్కెట్లు వేరే ప్రాంతాలకు తరలించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ జె.నివాస్ తెలిపారు. నగర పాలక సంస్థ కార్యాలయంంలో తన చాంబర్లో హోల్‌సేల్ మార్కెట్ వ్యాపారులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. కమిషనర్ మాట్లాడుతూ మార్కెట్ తరలింపునకు సహకరించాలని కోరారు. విజయవాడ– అమరావతి గేట్‌వే ప్రాజెక్ట్ కింద ప్రకాశం బ్యారేజ్ నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు ఉన్న ప్రాంతాన్ని అభివృద్ధి చేయనున్నమని వివరించారు. దీని దృష్ట్యా హోల్‌సేల్ మార్కెట్లను వేరే ప్రాంతాలకు తరలించాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. అమరావతి రాజధానికి సమీపంలో విజయవాడ కేంద్ర బిందువు అయిందన్నారు. అందు వలన వ్యాపారాలు మార్కెట్లను తరలించేందుకు సహకరించాలని మున్సిపల్ కమిషనర్ కోరారు. సమావేశంలో కార్పొరేషన్ ఎస్టేట్ ఆఫీసర్ సి.హెచ్.కృష్ణమూర్తి పాల్గొన్నారు. -
మేయర్‌ను అనర్హుడిగా ప్రకటించండి
విజయవాడ సెంట్రల్ : అధికార దుర్వినియోగానికి పాల్పడిన మేయర్ కోనేరు శ్రీధర్‌ను అనర్హుడిగా ప్రకటించాలని కోరుతూ వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు కమిషనర్ జి.వీరపాండియన్‌కు బుధవారం వినతిపత్రం సమర్పించారు. ఫ్లోర్‌లీడర్ బీఎన్.పుణ్యశీల ఆధ్వర్యంలో చాంబర్లో కమిషనర్‌ను కలిశారు. పుణ్యశీల మాట్లాడుతూ మేయర్ పదవిని అడ్డుపెట్టుకొని శ్రీధర్ పుష్కర కాంట్రాక్ట్‌లను తన భార్య డైరెక్టర్‌గా ఉన్న కేఎంకే సంస్థకు దోచిపెట్టారన్నారు. ఈవిషయమై గతంలో తాము వినతిపత్రం అందించామన్న విషయాన్ని గుర్తు చేశారు. దీనిపై స్పందించిన కమిషనర్ మాట్లాడుతూ ఇటీవల కాలంలో తాను పనుల ఒత్తిడిలో ఉండటం వల్ల దృష్టిపెట్టలేకపోయానన్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న కేఎంకే కాంట్రాక్ట్‌కు సంబంధించి త్వరలోనే విచారణ చేపడతానని హామీ ఇచ్చారు. నిబంధనల ప్రకారమే బాధ్యులపై చర్యలు చేపడతామన్నారు. వైఎస్సార్ సీపీ పశ్చిమ నియోజక వర్గ సమస్వయకర్త ఆసిఫ్, కార్పొరేటర్లు షేక్‌బీజాన్‌బీ, జమలపూర్ణమ్మ, బి.సంధ్యారాణి, అవుతు శ్రీ శైలజ పాల్గొన్నారు. -
రెండు రోజుల్లో మరమ్మతులు పూర్తిచేయండి
విజయవాడ సెంట్రల్ : మరుగుదొడ్ల మరమ్మతుల్ని రెండు రోజుల్లో పూర్తి చేయాలని కమిషనర్ జి.వీరపాండియన్ ఆదేశించారు. బుధవారం తన చాంబర్లో ఇంజినీరింగ్ అధికారులతో సమీక్షించారు. 59 డివిజన్లలో మరుగుదొడ్ల పరిస్థితిపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరాలు సేకరించారు. పబ్లిక్, కమ్యూనిటీ, స్కూళ్లలో మరుగుదొడ్ల మరమ్మతుల్ని రెండు రోజుల్లోపూర్తి చేయాలన్నారు. పలు ప్రాంతాల్లో 102 నమ్మా టాయ్‌లెట్స్ చేపట్టాలని నిర్ణయించగా 45 మాత్రమే పూర్తవ్వడంపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. మిగిలిన 57 టాయ్‌లెట్స్ పనుల్ని వెంటనే చేపట్టాల్సిందిగా ఆదేశించారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం 99 శాతం పూర్తయిందని, ఆ ఒక్క శాతం కూడా పూర్తి చేయాల్సిందిగా పేర్కొన్నారు. చీఫ్ ఇంజినీర్ ఎంఏ.షుకూర్, ఈఈలు జీఆర్టి. ఓంప్రకాష్, పీవీకే భాస్కర్, ధనుంజయ, గోవిందరావు, హెల్త్ ఆఫీసర్ బాబూ శ్రీనివాసరావు, ఐటీ నిపుణులు దిలీప్, కి షోర్ తదితరులు పాల్గొన్నారు.