రెండు రోజుల్లో మరమ్మతులు పూర్తిచేయండి
రెండు రోజుల్లో మరమ్మతులు పూర్తిచేయండి
Published Wed, Sep 14 2016 8:40 PM | Last Updated on Mon, Sep 4 2017 1:29 PM
విజయవాడ సెంట్రల్ : మరుగుదొడ్ల మరమ్మతుల్ని రెండు రోజుల్లో పూర్తి చేయాలని కమిషనర్ జి.వీరపాండియన్ ఆదేశించారు. బుధవారం తన చాంబర్లో ఇంజినీరింగ్ అధికారులతో సమీక్షించారు. 59 డివిజన్లలో మరుగుదొడ్ల పరిస్థితిపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరాలు సేకరించారు. పబ్లిక్, కమ్యూనిటీ, స్కూళ్లలో మరుగుదొడ్ల మరమ్మతుల్ని రెండు రోజుల్లోపూర్తి చేయాలన్నారు. పలు ప్రాంతాల్లో 102 నమ్మా టాయ్‌లెట్స్ చేపట్టాలని నిర్ణయించగా 45 మాత్రమే పూర్తవ్వడంపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. మిగిలిన 57 టాయ్‌లెట్స్ పనుల్ని వెంటనే చేపట్టాల్సిందిగా ఆదేశించారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం 99 శాతం పూర్తయిందని, ఆ ఒక్క శాతం కూడా పూర్తి చేయాల్సిందిగా పేర్కొన్నారు. చీఫ్ ఇంజినీర్ ఎంఏ.షుకూర్, ఈఈలు జీఆర్‌టి. ఓంప్రకాష్, పీవీకే భాస్కర్, ధనుంజయ, గోవిందరావు, హెల్త్ ఆఫీసర్ బాబూ శ్రీనివాసరావు, ఐటీ నిపుణులు దిలీప్, కి షోర్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement