Powerpoint presentation
-
ప్రాణహిత–చేవెళ్లను పక్కనపెట్టడం పెద్ద తప్పిదం!
సాక్షి, హైదరాబాద్: కొందరి నిర్దిష్ట ప్రయోజనాల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టును రీ–ఇంజనీరింగ్ చేశారని కేంద్ర జలశక్తి శాఖ సలహాదారు వెదిరె శ్రీరామ్ ఆరోపించారు. మేడిగడ్డ బరాజ్ స్థలం ఎంపిక పెద్ద తప్పిదమని పేర్కొన్నారు. చిన్న కారణాలు చూపి ప్రాణహిత– చేవెళ్ల పథకాన్ని పక్కనపెట్టి.. దాని స్థానంలో కాళేశ్వరం ప్రాజెక్టును తెరమీదికి తీసుకొచ్చారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్లను ఆమోదించినది కూడా రాష్ట్ర ప్రభుత్వంలోని సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్(సీడీవో) అని, దీనికి కేంద్రానికి సంబంధం లేదని స్పష్టం చేశారు. మంగళవారం వెదిరె శ్రీరామ్ కాళేశ్వరం బరాజ్‌ల నిర్మాణం, లోపాలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ ముందు హాజరై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తన ఫిర్యాదుకు మద్దతుగా వాదనలు వినిపించారు. అనంతరం వెదిరె శ్రీరామ్ మీడియాతో మాట్లాడారు. ప్రాణహిత– చేవెళ్ల పథకాన్ని రీడిజైన్ చేసి.. కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టడం వెనుక ఎన్నో తప్పులు ఉన్నాయని ఆరోపించారు.సీడబ్ల్యూసీ నీటి లభ్యత ఉందనే చెప్పింది!గత ప్రభుత్వం తుమ్మిడిహెట్టిని నాలుగు కారణా లతో పక్కనపెట్టిందని.. అక్కడ నీటి లభ్యత లేదన డం అందులో ఒకటని వెదిరె శ్రీరామ్ చెప్పారు. కానీ 75 శాతం లభ్యత (డిపెండబిలిటీ/నాలుగేళ్లలో కచ్చితంగా మూడేళ్లు వచ్చే వరద) ఆధారంగా 165 టీఎంసీలు అందుబాటులో ఉంటాయని సీడబ్ల్యూసీ పేర్కొందని తెలిపారు. ఇక నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచుకోవడానికి రిజర్వాయర్ల సంఖ్యను పెంచాల ని సీడబ్ల్యూసీ సిఫార్సు చేసిందని గత ప్రభుత్వం మరో కారణంగా చూపిందని.. కానీ ప్రాణహిత– చేవెళ్ల పథకం కింద కూడా అలా కట్టేందుకు అవకా శం ఉండేదని వివరించారు. దీనికితోడు తుమ్మిడి హెట్టి వద్ద బరాజ్ నిర్మిస్తే మహారాష్ట్రలో 3,600 ఎక రాల ముంపు ఉంటుందని, ఆ రాష్ట్రం ఒప్పుకోదని మూడో కారణంగా చూపారన్నారు. అయితే ఎప్పుడైనా భారీ ప్రాజెక్టులకు భూసేకరణ సమస్య ఉంటుందని.. సేకరించాలనే తపన ఉంటే మహా రాష్ట్రలో 3 వేల ఎకరాలు సేకరించడం పెద్ద విషయమేమీ కాదని వ్యాఖ్యానించారు. ప్రాణహిత–చేవెళ్ల ప్రాజె క్టు కోసం 2015 సంవత్సరం నాటికి రూ.11,917 కోట్లు ఖర్చ య్యాయని.. ఆ దశలో ప్రాజెక్టును పక్కనపెట్టడం సహేతుకం కాదని స్పష్టం చేశారు. తుమ్మిడిహెట్టి వద్ద బరాజ్ కట్టి ఉంటే గ్రావిటీతో నీరు అందేదని.. అదే మేడిగడ్డ వద్ద కట్టడంతో ఏటా నీటి పంపింగ్కే రూ.11 వేల కోట్ల అనవసర వ్యయం అవుతుందని వివరించారు.బ్యారేజీల వద్ద పరీక్షల వివరాలు రావాలి..కాళేశ్వరం బరాజ్ వైఫల్యాలపై గత ఏడాది నవంబర్‌లో ఒక నివేదిక, తర్వాత మేలో మరో నివేదికను ఎన్డీఎస్ఏ ఇచ్చిందని వెదిరె శ్రీరామ్ చెప్పారు. బరాజ్‌ల వద్ద జియో టెక్నికల్, జియో ఫిజికల్, స్ట్రక్చరల్ స్టెబిలిటీ పరీక్షలు పూర్తి చేసి, వివరాలను ఎన్డీఎస్ఏకు నివేదిస్తే.. ఎన్డీఎస్ఏ బరాజ్‌ల పరిస్థితి, భవిష్యత్తు చర్యలపై తుది నివేదికను అందించే అవకాశాలు ఉన్నాయని వివరించారు.డీపీఆర్ ఆమోదానికి ముందే నిర్మాణంకాళేశ్వరం ప్రాజెక్టు డీపీఆర్ ఆమోదానికి ముందే బరాజ్‌ల నిర్మాణం సగానికిపైగా పూర్తయిందని వెదిరే శ్రీరామ్ పేర్కొన్నారు. బరాజ్‌ల నిర్మాణంలో పలు లోపాలు ఉన్నట్టు ఎన్డీఎస్ఏ గుర్తించిందన్నా రు. గేట్ల నిర్వహణలోనూ వైఫల్యాలు ఉన్నాయన్నా రు. 2019లోనే బరాజ్‌లలో సమస్యలు వచ్చినా పరిష్కరించలేదన్నారు. డిజైన్ ఒక విధంగా ఉంటే, నిర్మాణం మరో విధంగా జరిగిందని పేర్కొన్నారు. నీటిని నిల్వ చేయడమే ముఖ్యమైతే.. రిజర్వాయర్లు కట్టి ఉండాల్సిందని.. బరాజ్‌లు కట్టి, రిజర్వాయ ర్లుగా వాడుకోవడం తప్పేనని స్పష్టం చేశారు.వైఫల్యానికి కారణాలు అనేకంకాళేశ్వరం బరాజ్‌ల వైఫల్యానికి ప్లానింగ్, డిజైన్, క్వాలిటీ కంట్రోల్, ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్, బ్యారేజీలు కట్టడానికి ముందు తగిన సాంకేతిక పరీక్షలు చేయకపోవడమే కారణమని వెదిరె శ్రీరామ్ ఆరోపించారు. డీపీఆర్ తయారీలో సాంకేతిక అంశాలు పట్టించుకోలేదని.. బరాజ్‌ల ఎంపిక ప్రదేశా ల్లో లోపాలున్నాయని పేర్కొన్నారు. డిజైన్ల తయారీ కోసం నీటిపారుదల శాఖలోని సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్(సీడీవో)కు తగి నంత సమయం ఇవ్వలేదని.. ఉన్నత స్థాయిలో ఒత్తిడి చేసి, డిజైన్లకు ఆమోదం తీసుకున్నారని చెప్పారు. తాను నివేదించిన అంశాలతో వారంలో అఫిడవిట్ దాఖలు చే యాలని కమిషన్ ఆదేశించిందని, అఫిడవిట్ అందిస్తానని తెలిపారు. -
పోలవరం విషయంలో మేం ఎలాంటి తప్పిదాలు చేయలేదు
-
Next Generation Launch Vehicle: ఇస్రో అమ్ములపొదిలో ఎన్జీఎల్వీ!
సూళ్లూరుపేట (తిరుపతి జిల్లా): సమీప భవిష్యత్తులో భారీ ప్రయోగాలకు తెర తీస్తున్న ఇస్రో, అందుకు తగ్గట్టుగా అత్యాధునిక రాకెట్ తయారీ ప్రయత్నాలను వేగవంతం చేసింది. ఈ రాకెట్‌కు న్యూ జనరేషన్ లాంచింగ్ వెహికల్ (ఎన్జీఎల్వీ)గా నామకరణం చేశారు. తొలి నాళ్లలో చేపట్టిన రోహిణి సౌండింగ్ రాకెట్ల ప్రయోగాల తరువాత 40 కిలోల నుంచి 5,000 కిలోల ఉపగ్రహాలను మోసుకెళ్లే ఎస్ఎల్వీ, ఏఏస్ఎల్వీ, పీఎస్ఎల్వీ, జీఎస్ఎల్వీ, ఎల్వీఎం03, ఎస్ఎస్ఎల్వీ... ఇలా ఆరు రకాల రాకెట్లను ఇప్పటిదాకా ఇస్రో అభివృద్ది చేసింది. గగన్‌యాన్ ప్రయోగంలో భాగంగా త్వరలో మానవసహిత అంతరిక్ష ప్రయోగంతో పాటు చంద్రుడిపై వ్యోమగాములను తీసుకెళ్లి సురక్షితంగా తీసుకొచ్చే ప్రయోగాన్నీ చేపట్టాలని భావిస్తోంది. వీటితో పాటు అత్యంత బరువుండే సమాచార ఉపగ్రహాలను జీటీఓ కక్ష్యలోకి పంపే సాంకేతిక పరిజ్ఞానాన్నీ సమకూర్చుకుంటున్నారు. ఈ క్రమంలో ఏకంగా 20 వేల కిలోల బరువున్న ఉపగ్రహాలను భూమికి సమీపంలోని లియో అర్బిట్‌లోకి, 10 వేల కిలోల ఉపగ్రహాలను జీటీఓ ఆర్బిట్‌లోకి ప్రవేశపెట్టే సామర్థ్యంతో ఎన్జీఎల్వీ తయారీకి ఇస్రో తెర తీసింది. రూ.1,798 కోట్ల అంచనా వ్యయంతో కూడిన ఈ ప్రాజెక్టును 2008లోనే కేంద్రం ఆమోదించింది. సెమీ క్రయోజనిక్ దశను అభివృద్దితో పాటు రాకెట్ విడి భాగాలను దేశీయంగానే రూపొందించేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు. 6న ‘ఎల్పీ1’ వద్దకు ఆదిత్య ఎల్1: సౌర ప్రయోగాల నిమిత్తం గత సెపె్టంబర్ 2న ఇస్రో ప్రయోగించిన ఆదిత్య ఎల్1 ఉపగ్రహం జనవరి 6 సాయంత్రం సూర్యుడికి సమీపంలోని లాంగ్రేజియన్ పాయింట్ 1ను చేరనుంది. భూమికి 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని ఈ పాయింట్‌ను చేరాక సూర్యుని రహస్యాలను అధ్యయనం చేయనుంది. సౌర తుఫాన్ సమయంలో వెలువడే రేణువుల వల్ల భూమిపై సమాచార వ్యవస్థకు అవరోధాలు ఏర్పడుతున్నాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. వీటితో పాటు ఫోటోస్పియర్, క్రోమోస్పియర్, సూర్యు డి వెలుపలి వలయమైన కరోనాపై అధ్యయనాలు చేయనున్నారు. ఎన్జీఎల్వీ విశేషాలు... ► ఎన్జీఎల్వీ రాకెట్ ఎత్తు 75 మీటర్లు ► వెడల్పు 5 మీటర్లు. ► పీఎస్ఎల్వీ ఎక్స్ఎల్ తరహాలోనే దీనికీ ఆరు స్ట్రాపాన్ బూస్టర్లుంటాయి. ► ప్రయోగ సమయంలో 600 టన్నుల నుంచి 770 టన్నులు ► రాకెట్‌ను మూడు దశల్లో ప్రయోగిస్తారు. ► ఇది ఫాల్కన్, అట్లాస్–వీ, ప్రొటాన్–ఎం, లాంగ్ మార్చ్–58 రాకెట్లకు దీటుగా ఉంటుంది. ► ఇస్రో ౖచైర్మన్ సోమ నాథ్ ఇటీవలే ఎన్జీఎల్వీపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ► 2030–35 నాటికి మానవ అంతరిక్ష యానం, అత్యంత బరువైన ఉపగ్రహ ప్రయోగాలకు ఇది వీలుగా ఉంటుందని వివరించారు. -
మేడిగడ్డ బ్యారేజీ.. వాటిని కూల్చాల్సిందే
సాక్షి, హైదరాబాద్/ సాక్షి ప్రతినిధి వరంగల్: కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ బ్యారేజీలో కుంగిపోయిన 7వ నంబర్ బ్లాక్‌లోని 18, 19, 20వ నంబర్ పియర్లు, వీటికి సంబంధించిన 3 రేడియల్ గేట్లు, 3 స్లాబులను పూర్తిగా కూల్చి వేయాల్సిందేనని నీటిపారుదల శాఖ ఈఎన్సీ సి.మురళీధర్ స్పష్టం చేశారు. కూల్చివేతకు డైమండ్ వైర్ కటింగ్, డ్రిల్ అండ్ బ్లాస్ట్, డ్రిల్ అండ్ వన్ టైం బ్లాస్ట్ అనే 3 ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్నట్టు వెల్లడించారు. బ్యారేజీ మిగతా స్ట్రక్చర్‌కు నష్టం జరగకుండా దెబ్బతిన్న బ్లాక్‌లోని వించ్, వాక్ వే –1, యాక్సెస్ లా డర్, గంట్రీ ట్రాక్ గ్రైడర్, గాంట్రీ బీమ్వంటి భాగాలను అ త్యంత జాగ్రత్తగా తొలగించాల్సి ఉంటుందన్నారు. నీటిపారుదల శాఖమంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి నేతృత్వంలో శుక్రవారం కాళేశ్వరం ప్రాజెక్టు పరిశీలనకు వచ్చిన మంత్రుల బృందానికి, మేడిగడ్డ బ్యారేజీ వద్ద పైన పేర్కొన్న అంశాలపై మురళీధర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. రెండు నెలల్లోగా బుంగల పూడ్చివేత కొత్త బ్లాక్ కట్టడం కంటే కూల్చి వేతకు అధిక సమయం పడుతుందని ఈఎన్సీ చెప్పారు. డైమండ్ వైర్ కటింగ్ టెక్నాలజీతో కూల్చివేత పనులు చేపట్టాలని భావిస్తున్నా, ఇందుకు చాలా సమయం పడుతుందన్నారు. డ్రిల్ అండ్ బ్లాస్ట్ పద్ధతిని వినియోగిస్తే పక్కనే ఉన్న ఇతర బ్లాకులకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలకు ఏర్పడిన బుంగలను రెండు నెలల్లోగా గ్రౌటింగ్ ద్వారా పూడ్చి వేస్తామని, నిర్మాణ సంస్థలే వ్యయాన్ని భరిస్తాయని ఈఎన్సీ చెప్పారు. బ్యారేజీకి త్వరలో పరీక్షలు మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటనకు కారణాలను తెలుసుకోవడానికి త్వరలో గ్రౌండ్ పెనట్రేటింగ్ రాడార్ సర్వే, ఎలక్ట్రికల్ రెసెస్టివిటీ పరీక్షలను నిర్వహించనున్నట్లు మురళీధర్ తెలిపారు. బ్యారేజీ పునాదుల కింద జరిగిన మార్పులను, ఏర్పడిన లోపాలను తెలుసుకోవడానికి ఈ పరీక్షలతో వీలుంటుందన్నారు. ఏడవ బ్లాక్‌లోని పియర్ల పునరుద్ధరణ కోసం నిర్మిస్తున్న కాఫర్ డ్యామ్ పనులు వారం రోజుల్లో పూర్తి చేయనున్నట్లు తెలిపారు. ఈఎన్సీ చెప్పిన మరికొన్ని ముఖ్యాంశాలు.. ♦ కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం అంచనా వ్యయం రూ.1.28 లక్షల కోట్లు ♦ ఇప్పటివరకు చేసిన ఖర్చు రూ.93,800 కోట్లు ♦ 2 టీఎంసీల నీటి ఎత్తిపోతలకు ఐదు వేల మెగావాట్ల కరెంటు ♦ మూడో టీఎంసీ పనులు చేస్తే 8,450 మెగావాట్ల కరెంటు ♦ ఐదేళ్లలో కాళేశ్వరం నుంచి లిఫ్ట్ చేసింది 173 టీఎంసీలు ♦ ప్రాజెక్టు కింద సాగైంది 98,570 ఎకరాలు (నిర్మాణం పూర్తయ్యాక ఇచ్చిన నీరు స్థిరీకరణకు మాత్రమే) ♦ మూడో టీఎంసీ కోసం రూ.33,400 కోట్లతో ప్రతిపాదన ♦ ఏడాదిన్నరగా రూ.3 వేల కోట్లకు పైగా బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి ♦ పాలమూరు ప్రాజెక్టుకు కాళేశ్వరం పేరుతో అప్పులు డైమండ్ వైర్ కటింగ్ అంటే.. మేడిగడ్డ ఏడవ బ్లాక్‌లోని మూడు పియర్లు, స్లాబులు తొలగించేందుకు డైమండ్ వైర్ కటింగ్ విధానాన్ని అవలంభించాలని ఇంజనీర్లు నిర్ణయించినట్లు తెలుస్తోంది. పక్కనున్న పియర్లు, పైనున్న ఇతర స్లాబులకు ఎలాంటి నష్టం జరగకుండా తొలగించేందుకు ఇది ఉపయోగపడుతుందని భావిస్తున్నట్టు సమాచారం. అయితే ఇది అధిక వ్యయంతో కూడిన, ఎక్కువ సమయం పట్టే విధానమని చెబుతున్నారు. ఈ విధానంలో.. వజ్రాల పొడి పొదిగిన లోహపు వైర్ రంపం వినియోగించి కాంక్రీట్ దిమ్మెలను కట్ చేస్తారు. దీనివల్ల ఎలాంటి ప్రకంపనలకు తావుండదు. ఎలాంటి పేలుడు పదార్థాలు ఉపయోగించరు. కాబట్టి పక్కన, పైన ఉన్న దిమ్మెలకు నష్టం వాటిల్లదు. -
కర్ణాటకలో ఏం జరుగుతోంది?
సాక్షి, హైదరాబాద్: కర్ణాటకలో గ్యారంటీ కార్డు స్కీం అమలు తీరు గురించి తెలంగాణ ప్రజలకు వివరించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఎన్నికల సమయంలో ఆ రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలుపై బీజేపీసహా తెలంగాణ సీఎం కేసీఆర్ ఇటీవల కొన్ని ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడ కాంగ్రెస్ పరిపాలన, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి వివరించడం ద్వారా తాము ఇక్కడ అధికారంలోకి వస్తే హమీలను కచ్చితంగా అమలు చేస్తామని ప్రజలకు భరోసా ఇచ్చేలా ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఇందుకోసం కర్ణాటక ఉప ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ ట్రబుల్ షూటర్ డి.కె.శివకుమార్ త్వరలోనే హైదరాబాద్‌కు రానున్నట్టు కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆయన పర్యటనలో భాగంగా గ్యారంటీ కార్డు స్కీంల అమలుపై సెమినార్ నిర్వహిస్తామని, కర్ణాటకలో ఏం జరుగుతుందన్న దానిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా శివకుమార్ వివరిస్తారని గాందీభవన్ వర్గాలు చెబుతున్నాయి. అయితే, దీనికి సంబంధించిన షెడ్యూల్ ఇంకా ఖరారు కాలేదని, త్వరలోనే ఆయన హైదరాబాద్‌కు వస్తారని తెలుస్తోంది. -
ఎంత కష్టం.. ఎంత నష్టం
భూపాలపల్లి అర్బన్/ములుగు, ఏటూరునాగారం: ఇటీవల భారీ వరద తాకిడికి గురైన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మోరంచపల్లి గ్రామాన్ని బుధవారం కేంద్ర బృందం పరిశీలించింది. భారీ వర్షాలు, వరద ఉధృతికి మోరంచపల్లి గ్రామంలో జరిగిన ప్రాణ, ఆస్తినష్టం గురించి కలెక్టర్ భవేష్‌మిశ్రా వివరించారు. దెబ్బతిన్న ఇళ్లను పరిశీలిస్తూ కేంద్ర బృందం సభ్యులు బాధితులతో మాట్లాడారు. మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆ తర్వాత ములుగు జిల్లాకు చేరుకున్న బృందానికి కలెక్టర్ ఇలా త్రిపాఠి వర్షం, వరదల నష్టాన్ని పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం పస్రా సమీపంలో గుండ్లవాగు వద్ద కొట్టుకుపోయిన జాతీయ రహదారిని, ఎస్ఎస్ తాడ్వాయి మండల పరిధిలోని జలగలంచ దారిని పరిశీలించారు. సాయంత్రం ఏటూరునాగారం మండలంలోని కొండాయి, మల్యాల వరద ముంపు గ్రామాలను కేంద్ర బృందం పరిశీలించింది. వరద ఉధృతి ఏ మేరకు వచ్చింది.. ఎనిమిది మంది ఎలా కొట్టుకుపోయారు.. వంటి వివరాలను సర్పంచ్ కాక వెంకటేశ్వర్లును అడిగి తెలుసుకున్నారు. కేంద్ర బృందంలో ఎన్డీఎంఏ జాయింట్ సెక్రటరీ కునాల్ సత్యారి్థ తదితరులు ఉన్నారు. -
బాబు కమీషన్ల కక్కుర్తే పోలవరానికి శాపం
సాక్షి, అమరావతి : కమీషన్లు కాజేయాలనే దుర్బుద్ధితోనే 2014–19 మధ్య సీఎంగా ఉన్న చంద్రబాబు ప్రొటోకాల్‌కు విరుద్ధంగా పనులు చేపట్టి, పోలవరం ప్రాజెక్టును ముంచేశారని జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. లేదంటే.. 2022 నాటికే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పోలవరాన్ని పూర్తి చేసేవారని పునరుద్ఘాటించారు. విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో శనివారం ఆయన పోలవరం ప్రాజెక్టు పనులపై ప్రత్యేకంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. టీడీపీ సర్కార్ తప్పిదాలను ఎత్తిచూపుతూ.. చంద్రబాబు చేసిన విమర్శలను ఆధారాలతో తిప్పికొడుతూ.. ప్రణాళికాబద్ధంగా పనులు చేపట్టి సీఎం వైఎస్ జగన్ ప్రాజెక్టును పూర్తి చేస్తున్న తీరును కళ్లకు కట్టినట్లు వివరించారు. రాజకీయాల్లో తనను మించిన మహానటుడు లేరని చంద్రబాబు నిరూపించుకున్నారని చెప్పారు. సాగునీటి ప్రాజెక్టుల గురించి మూడు రోజులపాటు నవరసాలు పండించారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు నటనకు ఆస్కార్ ఇచ్చినా తప్పు లేదన్నారు. పోలవరాన్ని 2018 నాటికే పూర్తి చేసి.. గ్రావిటీపై ఆయకట్టుకు నీళ్లందిస్తానని చంద్రబాబు శాసనసభ సాక్షిగా హామీ ఇచ్చారు(ఆ వీడియోను ప్రదర్శిస్తూ). నాటి మంత్రి దేవినేని ఉమా కూడా 2018 నాటికే పూర్తి చేస్తామని సవాల్ చేశారు. కానీ ఎందుకు పూర్తి చేయలేకపోయారని ప్రశ్నిస్తుంటే ఇద్దరూ నోరు మెదపడం లేదు. పోలవరానికి పట్టిన శని, పీడ, చీడ చంద్రబాబే’ అని ధ్వజమెత్తారు. ఈ సమావేశంలో మంత్రి అంబటి ఇంకా ఏం చెప్పారంటే.. డయాఫ్రమ్ వాల్ విధ్వంసం నిర్వాకం చంద్రబాబుదే ♦ పోలవరం ప్రాజెక్టు ఈసీఆర్ఎఫ్(ఎర్త్ కమ్ రాక్ ఫిల్) డ్యామ్ పునాదికి డయాఫ్రమ్ వాల్ అత్యంత కీలకం. గోదా వరి ప్రవాహ దిశను కృత్రిమంగా మళ్లించేలా అప్రోచ్ ఛానల్, స్పిల్ వే, స్పిల్ ఛానల్, పైలట్ ఛానల్.. ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లను పూర్తి చేశాకే డయాఫ్రమ్ వాల్ నిర్మించాలి. కానీ.. ప్రాజెక్టు ప్రొటోకాల్‌ను చంద్రబాబు తుంగలో తొక్కి, గోదావరి ప్రవాహ దిశను మళ్లించకుండానే బావర్ కంపెనీతో రూ.400 కోట్లు వెచ్చించి డయాఫ్రమ్ వాల్‌ను నిర్మించేశారు. ♦ స్పిల్ వేను పునాది స్థాయిలో వదిలేసి.. 41.15 మీటర్ల కాంటూర్ పరిధిలోని నిర్వాసితులకు పునరావాసం కల్పించకుండా ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లను చేపట్టి.. వాటిని పూర్తి చేయలేక.. వాటికి ఇరు వైపులా ఖాళీ ప్రదేశాలను వదిలేసి చంద్రబాబు చెతులెత్తేశారు. వైఎస్ జగన్ సీఎంగా 2019 మే 30న ప్రమాణ స్వీకారం చేశాక జూన్ నాలుగో వారంలో వరద వచ్చింది. ఆ ప్రవాహానికి ఎగువ కాఫర్ డ్యామ్ అడ్డంకిగా మారడంతో.. దానికి ఇరువైపులా వదిలిన ఖాళీ ప్రదేశాల గుండా అధిక ఉద్ధృతితో ప్రవహించడం వల్ల డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది. ఈసీఆర్ఎఫ్ డ్యామ్ నిర్మాణ ప్రాంతం కోతకు గురై నాలుగు చోట్ల భారీ అగాధాలు(స్కవర్స్) ఏర్పడ్డాయి. ఈ విధ్వంసానికి బాధ్యత ఎవరిది? ఇది చంద్రబాబు చేసిన చారిత్రక తప్పిదం కాదా? ♦ స్పిల్ వే పూర్తి కాకుండానే.. రెండు పియర్స్ మధ్య ఇనుప రేకు పెట్టి.. దాన్నే గేటుగా చిత్రీకరిస్తూ.. ప్రాజెక్టును పూర్తి చేసినట్లు రూ.83 కోట్లు వెచ్చించి బస్సుల్లో జనాన్ని తీసుకెళ్లి ‘జయము జయము చంద్రన్న’ అంటూ చంద్రబాబు భజన చేయించుకున్నారు. ఇది ప్రజలను మోసం చేయడం కాదా? కేంద్రమే కట్టాల్సిన ప్రాజెక్టు పోలవరం ♦ మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించిన పోలవరం ప్రాజెక్టును విభజన చట్టంలో సెక్షన్ 90 ప్రకారం వంద శాతం వ్యయాన్ని భరించి తామే పూర్తి చేస్తామని కేంద్రం అంగీకరించింది. అలాంటప్పుడు ఈ ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను ఎందుకు తీసుకున్నావని 15 నెలలుగా ప్రశ్నిస్తుంటే చంద్రబాబు సమాధానం చెప్పడం లేదు. కమీషన్లు కాజేయాలన్న దుర్బుద్ధితోనే పోలవరం నిర్మాణ బాధ్యతలను దక్కించుకున్నారు. ♦ 2016 సెప్టెంబర్ 7న పోలవరం నిర్మాణ బాధ్యతలను దక్కించుకునే క్రమంలో 2013–14 ధరల ప్రకారం రూ.20,398.61 కోట్లతోనే పూర్తి చేయడానికి చంద్రబాబు అంగీకరించారు. వాస్తవంగా 2017–18 ధరల ప్రకారం ప్రాజెక్టు వ్యయం రూ. 55,656.87 కోట్లు. కానీ 2013–14 ధరలతోనే ప్రాజెక్టు ను పూర్తి చేస్తానని కేంద్రం వద్ద అంగీకరించిన చంద్రబాబు.. 2016–17 ధరలతో ‘ఈనాడు’ రామోజీరావు బంధువుకు చెందిన నవయుగకు కాంట్రాక్టు పనులను నామినేషన్ పై కట్టబెట్టారు. ఇదంతా కమీషన్ల కోసమే అని స్పష్టమవుతోంది. అందుకే ప్రధాని మాదీ.. ఈ ప్రాజెక్టును బాబు ఏటీఎంలా వాడుకుంటున్నారని చెప్పిన విషయం తెలిసిందే. శరవేగంగా పూర్తి చేస్తుంటే ఎందుకంత కడుపుమంట? ♦ వైఎస్ జగన్ సీఎం అయ్యాక చంద్రబాబు తప్పిదాలు సరిదిద్దుతూ అప్రోచ్ ఛానల్, స్పిల్ వే(48 గేట్లతో సహా), స్పిల్ ఛానల్, పైలట్ ఛానల్, ఎగువ కాఫర్ డ్యామ్‌ను పూర్తి చేసి.. 2021 జూన్ 11నే 6.1 కి.మీల పొడవున మళ్లించారు. ♦ కోతకు గురైన దిగువ కాఫర్ డ్యామ్‌ను సీడబ్ల్యూసీ, డీడీఆర్పీ మార్గదర్శకాల మేరకు జియోమెంబ్రేన్ బ్యాగ్‌లలో ఇసుకను నింపి, కోతకు గురైన ప్రాంతంలో వేసి.. వైబ్రో కాంపాక్షన్ చేస్తూ ఈ ఏడాది ఫిబ్రవరి 15కు 31.5 మీటర్ల ఎత్తుతో పూర్తి చేయించారు. ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లు పూర్తయ్యాయి. ఇప్పుడు డయాఫ్రమ్ వాల్ నిర్మించాలి. ♦ గోదావరి వరదలకు దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్‌ను మార్చి 3, 4 తేదీల్లో సీడబ్ల్యూసీ, డీడీఆర్పీ, ఎన్‌హెచ్‌పీసీ బృందం తనిఖీ చేసి.. దెబ్బతినిందని తేల్చింది. ఇప్పుడు వారి మార్గదర్శకాల మేరకు డయాఫ్రమ్ వాల్ చేపట్టి.. దానిపై ఈసీఆర్ఎఫ్ డ్యామ్‌ను నిర్మించి.. ప్రాజెక్టును పూర్తి చేసే దిశగా సీఎం వైఎస్ జగన్ అడుగులు వేస్తున్నారు. ♦ చంద్రబాబు అంగీకరించిన మేరకు 2013–14 ధరల ప్రకారం పోలవరాన్ని పూర్తి చేయడం సాధ్యం కాదని.. 2017–18 ధరల ప్రకారం నిధులు ఇచ్చి ప్రాజెక్టును పూర్తి చేయడానికి సహకరించాలని నాలుగేళ్లుగా ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులకు సీఎం వైఎస్ జగన్ విజ్ఞప్తి చేస్తున్నారు. ఫలితంగా తొలి దశ పూర్తి చేసేందుకు అవసరమైన రూ.12,911.15 కోట్లు ఇచ్చేందుకు కేంద్రం ఇటీవల అంగీకరించింది. పూర్తి స్థాయిలో అంటే 45.72 మీటర్ల మేరకు ప్రాజెక్టును పూర్తి చేసేందుకు అవసరమైన నిధులను కేంద్రం ఇస్తుంది. ప్రాజెక్టు ఎత్తు ఒక్క అంగుళం కూడా తగ్గదని ఇటు సీఎం వైఎస్ జగన్.. అటు కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి షెకావత్ స్పష్టం చేసినా.. ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తున్నారంటూ చంద్రబాబుతో పాటు ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తోంది. 9 ఏళ్లలో ఒక్క ప్రాజెక్టు గురించైనా ఆలోచించావా? ♦ 14 ఏళ్లు అధికారంలో ఉన్న చంద్రబాబు ఒక్కటంటే ఒక్క ప్రాజెక్టును డిజైన్ చేసి, టెండర్లు పిలిచి, పూర్తి చేయలేదు. నువ్వు చెబుతున్నట్లుగా ఎన్టీఆర్ డిజైన్ చేయించిన గాలేరు–నగరి, హంద్రీ–నీవాను కూడా చేపట్టకుండా ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచినట్లు వాటికీ వెన్నుపోటు పొడిచి ప్రజలను మోసం చేసింది నువ్వు కాదా బాబూ? ♦ మహానేత వైఎస్సార్ 2004లో సీఎంగా బాధ్యతలు చేపట్టాక.. సముద్రంలో కలుస్తున్న నదీ జలాలను బంజరు భూములకు మళ్లించి.. రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడానికి హంద్రీ–నీవా, గాలేరు–నగరిసహా 84 ప్రాజెక్టులను జలయజ్ఞం కింద చేపట్టారు. అందులో భాగంగానే పోలవరాన్నీ చేపట్టారు. తాను సీఎంగా ఉన్న ఐదేళ్ల మూడు నెలల్లోనే ప్రాజెక్టుల పనులను పరుగులు పెట్టించారు. పోలవరానికి రూ.4,730.61 కోట్లను వ్యయం చేశారు. మహానేత వైఎస్ చేపట్టిన ప్రతి ప్రాజెక్టును.. పోలవరం సహా పూర్తి చేసి, జాతికి అంకితం చేసేది సీఎం వైఎస్ జగనే. ఈ నేపథ్యంలో శని చంద్రబాబు ప్రాజెక్టుల వద్దకు వెళ్తానంటున్నారు. ఆయన వెళ్తే వాటికి ఏ ముప్పు వాటిల్లుతుందోననే భయం ప్రజల్లో ఉంది. ఆంబోతుల వద్దకు ఆవులను పంపిందెవరు? చంద్రబాబుకు వయసు పెరిగిన కొద్దీ పైత్యం పెరుగుతోంది. అధికారంలో లేనని.. మళ్లీ ఇక అధికారంలోకి రాలేననే నిరాశ, నిస్పృహలతో పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారు. నన్ను ఆంబోతు రాంబాబు అంటూ సంస్కారం లేకుండా దూషిస్తున్నాను. నేనూ చంద్రబాబును దూషించగలరు. కానీ నాకు సంస్కారం ఉంది. కానీ.. చంద్రబాబు పదే పదే దూషిస్తున్నారు. ఎన్టీఆర్‌కు అల్లుడివి కాకపోతే చంద్రబాబు సీఎంగా అయ్యేవారా? పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి, పార్టీని, అధికారాన్ని దక్కించుకున్న చంద్రబాబు.. సైకిల్ గుర్తును దక్కించుకోవడానికి ఆంబోతుల వద్దకు ఆవులను పంపలేదా? నన్ను చంద్రబాబు ఆంబోతు అన్నప్పుడల్లా.. ఆంబోతులకు ఆవులను సరఫరా చేసే నీచుడు చంద్రబాబు అనే వాస్తవాన్ని కూడా నేను చెబుతాను. నేను డ్యాన్స్ చేస్తే సంక్రాంతి..పవన్ చేస్తే చీకటిరాత్రి ‘సత్తెనపల్లిలో ఎమ్మెల్యేగా నేను గెలిచి.. ముగ్గుల పోటీ పెట్టి.. సంక్రాంతి రోజున ఆనందతాండవం చేస్తా. డ్యాన్స్ నేను చేస్తే సంక్రాంతి.. నువ్వు చేస్తే చీకటిరాత్రి’ అంటూ జనసేన అధ్యక్షుడు, సినీ నటుడు పవన్ కళ్యాణ్‌పై మంత్రి అంబటి రాంబాబు వ్యంగ్యోక్తులు విసిరారు. ‘బ్రో’ సినిమాలో తనను అనుకరిస్తూ డ్యాన్స్ చేసిన నటుడిపై పవన్ కళ్యాణ్ సెటైర్లు వేసి ఆత్మ సంతృప్తి పొందారన్నారు. పవన్ కళ్యాణ్‌ది శునకానందమేనన్నారు. తాను ఎవరి వద్ద ప్యాకేజీలు తీసుకుని డ్యాన్స్‌లు చేయనని.. చంద్రబాబు వద్ద ప్యాకేజీలు తీసుకుని డ్యాన్స్‌లు చేసే పవన్ కళ్యాణ్ తన డ్యాన్స్‌పై సెటైర్లు వేసే స్థాయికి దిగజారినందుకు జాలి పడుతున్నానని చెప్పారు. రాజకీయంగా తనను ఎదుర్కోలేకే, ఎవరో ఖర్చు పెట్టి తీసిన సినిమాలో, పారితోషికం తీసుకుని తనపై పవన్ సెటైర్లు వేయడం సిగ్గుచేటన్నారు. తన అన్న సినిమా నటుడు కాదని.. మామ సీఎంగా పని చేయలేదని.. విద్యార్థి దశ నుంచి నిత్యం ప్రజలతో మమేకమవుతూ 1989లో రేపల్లె నుంచి, 2019లో సత్తెనపల్లి నుంచి ఎమ్మెల్యేగా గెలిచానంటూ పవన్ కళ్యాణ్, చంద్రబాబులకు చురకలు అంటించారు. -
పోలవరం నిధులపై ముందడుగు
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనా వ్యయాన్ని ఆమోదించే ప్రక్రియలో ముందడుగు పడింది. ప్రాజెక్టు తొలిదశ పూర్తికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.16,952.07 కోట్లతో పంపిన సవరించిన అంచనా వ్యయ ప్రతిపాదనను మదింపు చేసి.. త్వరితగతిన నివేదిక ఇవ్వాలని పీపీఏ (పోలవరం ప్రాజెక్టు అథారిటీ), సీడబ్ల్యూసీ (కేంద్ర జలసంఘం) అధికారులను కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్ ఆదేశించారు. ఆ నివేదిక ఆధారంగా కేంద్ర మంత్రిమండలికి సవరించిన అంచనా వ్యయ ప్రతిపాదనను పంపుతామన్నారు. దానిపై కేంద్ర మంత్రిమండలి ఆమోదముద్ర వేస్తే నిధుల విడుదలకు మార్గం సుగమమవుతుందని చెప్పారు. నిధుల సమస్యను పరిష్కరించడం ద్వారా పోలవరం ప్రాజెక్టును గడువులోగా పూర్తిచేయడానికి అవకాశం ఉంటుందన్నారు. పోలవరం ప్రాజెక్టు తొలిదశ సవరించిన అంచనా వ్యయ ప్రతిపాదనపై గురువారం ఢిల్లీలో కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యాలయంలో పీపీఏ సీఈఓ శివ్‌నందన్‌కుమార్, సభ్య కార్యదర్శి రఘురాం, సీడబ్ల్యూసీ చైర్మన్ కుస్విందర్‌సింగ్ వోరా, సీడబ్ల్యూసీ వాటర్ ప్లానింగ్, ప్రాజెక్టŠస్ విభాగం సభ్యులు నవీన్‌కుమార్ తదితరులతో ఆ శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్ సమీక్ష సమావేశం నిర్వహించారు. షెడ్యూలు ప్రకారం పనులు.. తొలుత ప్రాజెక్టు పనుల పురోగతిని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పీపీఏ సీఈఓ శివ్‌నందన్‌కుమార్ వివరించారు. ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లు, స్పిల్ వే, స్పిల్ ఛానల్‌ను పూర్తిచేసి.. గోదావరి ప్రవాహాన్ని 2021, జూన్ 11న స్పిల్ వే మీదుగా ఏపీ ప్రభుత్వం మళ్లించిందన్నారు. ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌ల మధ్య ప్రధాన డ్యామ్ నిర్మాణ ప్రాంతంలో గోదావరి వరదల ఉధృతికి ఇసుక తిన్నెలు కో తకు గురై ఏర్పడిన అగాధాలను పూడ్చివేసి, యథాస్థితికి తెచ్చే పనులు ప్రారంభమయ్యాయని.. వరదలు వచ్చేలోగా ఆ పనులు పూర్తిచేసే దిశగా చర్యలు చేపట్టారని వివరించారు. ఆ తర్వాత ప్రధాన డ్యామ్ గ్యాప్–2లో డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్న చోట్ల సమాంతరంగా కొత్తగా డయాఫ్రమ్ వాల్ నిర్మించే పనులు ప్రారంభిస్తారని.. వాటికి సమాంతరంగా గ్యాప్–1లో ప్రధా న డ్యామ్ పనులు చేపడతారని చెప్పారు. షె డ్యూలు ప్రకారం ప్రభుత్వం ప్రాజెక్టు పనులు చేస్తోందన్నారు. 41.15 మీటర్ల కాంటూర్ పరిధిలోని నిర్వాసితులకు పునరావాసం కల్పిం చే ప నులను కూడా వేగవంతం చేసిందన్నారు. నిర్ణయించిన షెడ్యూలు ప్రకారం ప్రాజెక్టు పనులు జరుగుతుండటంపై పంకజ్‌కుమార్ సంతృప్తి వ్యక్తం చేశారు. సమగ్రంగా పరిశీలించి నివేదిక.. పోలవరం ప్రాజెక్టు తొలిదశ పూర్తికి రాష్ట్ర ప్రభుత్వం పంపిన సవరించిన అంచనా వ్యయ ప్రతిపాదనను సమగ్రంగా పరిశీలించి నివేదిక ఇవ్వాలని పీపీఏ, సీడబ్ల్యూసీ అధికారులను కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్ ఆదేశించారు. ప్రధానంగా 41.15 మీటర్ల కాంటూర్ పరిధిలో ముంపునకు గురయ్యే గ్రామాల సంఖ్యను పక్కాగా తేల్చి.. ఆ గ్రామాల్లో నిర్వాసితులకు పునరావాసం కల్పిం చడం, భూసేకరణకు ఎంత నిధులు అవసరమో తేల్చాలని దిశానిర్దేశం చేశారు. ప్రధాన డ్యామ్, కుడి, ఎడమ కాలువలు.. తొలిదశలో ఆయకట్టుకు నీళ్లందించడానికి చేపట్టాల్సిన డిస్ట్రిబ్యూటరీలకు ఎంత వ్యయం అవసరమో తేల్చాలని సూచించారు. భూసేకరణ, నిర్వాసితులకు పునరావాసం కల్పిం చడం.. ప్రధాన డ్యామ్, కాలువల పనులకు అయ్యే వ్యయాన్ని విడివిడిగా లెక్కించి, త్వరగా నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. దీనిపై సీడబ్ల్యూసీ చైర్మన్ వోరా పీపీఏ సీఈఓ శివ్‌నందన్‌కుమార్‌లు స్పందిస్తూ.. సవరించిన అంచనా వ్యయాన్ని తేల్చి, నివేదిక ఇస్తామన్నారు. -
ఆధార్ వ్యవస్థ పటిష్టం!
న్యూఢిల్లీ: ఆధార్ కార్డు లేకపోవడం వల్ల ఎంత మంది ప్రభుత్వ సంక్షేమ పథకాలకు దూరమయ్యారో తమ వద్ద అధికారిక సమాచారం లేదని ఆధార్ ప్రాధికార సంస్థ(యూఐడీఏఐ) సుప్రీంకోర్టుకు తెలిపింది. ఆధార్ వల్ల పౌరులకు పటిష్టమైన, జీవితాంతం ఆన్లైన్లో ధ్రువీకరించుకోగల గుర్తింపుకార్డు లభించిందని ఉద్ఘాటించింది. ఆధార్ నమోదుకు వ్యక్తి ఫొటో, వేలి ముద్రలు, కంటి పాపకు సంబంధించిన వివరాలు మినహా కులం, మతం, భాష లాంటి సమాచారం కోరడం లేదంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ముందు యూఐడీఏఐ సీఈఓ అజయ్ పాండే ఆధార్ నిర్వహణ, అమలు తీరుతెన్నులను వివరిస్తూ గురువారం పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. సమాచార భద్రత, ఆధార్ సాకుతో ప్రజలకు ప్రభుత్వ పథకాల నిరాకరణ వంటి అంశాలపై బెంచ్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు.ఆధార్‌తో జరిపే లావాదేవీలపై యూఐడీఏఐ నిఘా పెట్టదని పేర్కొన్నారు. ప్రామాణిక ఎన్క్రిప్షన్ రేటు 256 కాగా, ఆధార్ వ్యవస్థ నిర్వహణకు 2048 బిట్ల ఎన్క్రిప్షన్ను వినియోగిస్తున్నట్లు చెప్పారు. అసంపూర్తిగా ముగిసిన ఈ ప్రజెంటేషన్ ఈనెల 27న కొనసాగుతుంది. -
ఆధార్: కేంద్రానికి ఊరట
సాక్షి, న్యూఢిల్లీ: ఆధార్‌పై సుప్రీంకోర్టులో కొనసాగుతున్న ఆధార్ విచారణలో కేంద్రానికి స్వల్ప ఊరట లభించింది. ఆధార్ గోప్యతపై దాఖలైన పిటిషన్లు విచారిస్తున్న అత్యున్నత న్యాయస్థానం..ఆధార్ కార్డు జారీ సంస్థ యుఐడీఏఐ (యూనిక్ ఐడెంటిఫికేషన్ ఆథారిటీ ఆఫ్ ఇండియా) గురువారం కీలక అనుమతి నిచ్చింది. సాంకేతిక సమస్యలపై పలువురు లేవనెత్తిన అంశాల నేపథ్యంలో పవర్ పాయింట్ ప్రెజంటేషన్‌ను ఇవ్వనున్నారు.. దీంతో యుఐడీఏఐ సీఈవో అజయ్ భూషణ్ పాండే ఈ మధ్యాహ్నం 2.30గంటలకు కోర్టుముందు ఈ ప్రెజంటేషన్ ఇవ్వనున్నారు. మరోవైపు యుఐడీఏఐ పీపీపీ ప్రదర్శన అనంతర తమ ప్రశ్నల జాబితాను సిద్ధం చేయాలని పిటిషనర్లను సుప్రీం కోరింది. అనేకమంది లేవనెత్తిన సందేహాలు, భయాలకు ఈ పీపీపీలో సంస్థ నివృత్తి చేయనుందని అంచనా. -
కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్
విద్యుత్ రంగంపైనా ఇవ్వాలని పీసీసీ నిర్ణయం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో విద్యుత్ రంగం, కాళేశ్వరం ప్రాజెక్టులపై వేర్వేరుగా రెండు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్లను ఇవ్వాలని పీసీసీ నిర్ణయించింది. తెలంగాణ ఏర్పాటయ్యేనాటికి రాష్ట్రంలో పూర్తయిన విద్యుత్ ప్రాజెక్టులు, పూర్తికావచ్చిన ప్రాజెక్టులు, ఉత్పత్తి అయ్యే విద్యుత్ వంటి వివరాలను ప్రజల ముందు ఉంచడానికి భారీ కసరత్తు చేసింది. యూపీఏ అధికా రంలో ఉన్నప్పుడు తీసుకున్న చర్యల కార ణంగా ప్రస్తుతం దేశంలో విద్యుత్ మిగులు ఉందని, దేశవ్యాప్తంగా 50 వేల మెగావాట్ల మిగులు ఉందని పీసీసీ వర్గాలు చెబుతు న్నాయి. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ అధికా రంలోకి వచ్చిన తర్వాత కొత్త ప్రాజెక్టులేమీ రాకున్నా కరెంటును ఇవ్వడానికి కారణ మిదేనని, ఈ విషయాన్ని క్షేత్రస్థాయిలో విస్తృతంగా ప్రచారం చేయడానికి ప్రజెంటేషన్‌ను రూపొందించారు. ఆరునెలల ముందుగానే మేనిఫెస్టో, అభ్యర్థులు... ఎన్నికలకు ఆరు నెలలు ముందుగానే అభ్య ర్థులను ప్రకటించాలని పీసీసీ నిర్ణయిం చింది. అభ్యర్థులను ప్రకటించి, మేనిఫెస్టో విడుదల చేసి, ప్రజల్లోకి పోవాలని నిర్ణయిం చింది. దీనికి అనుగుణంగానే ఇప్పటికే పలు నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటిం చినట్టుగా పీసీసీ నేతలు వెల్లడించారు. నర్సాపూర్, హుజూరాబాద్ వంటి స్థానా లకు అభ్యర్థుల పేర్లను ఈ నిర్ణయంలో భాగంగానే ప్రకటించినట్టుగా తెలిపారు. ఈనెల 15 లోగా కాంగ్రెస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పూర్తి చేయాలని పీసీసీ నిర్ణయించింది. దీనికి అనుగుణంగా డీసీసీ లకు సూచనలను ఇచ్చింది. -
900 ఎకరాల్లో ఏపీ రాజధాని అడ్మినిస్ట్రేటివ్ సిటీ
-
ఎవర్ని మోసం చేయడానికి...
-
900 ఎకరాల్లో ఏపీ రాజధాని అడ్మినిస్ట్రేటివ్ సిటీ
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధానిని అద్భుతంగా నిర్మిస్తామని మూడేళ్లుగా ఘనంగా చెప్పుకుంటున్న చంద్రబాబు ప్రభుత్వం రాజధాని పరిపాలన నగరాన్ని 900 ఎకరాలకే పరిమితం చేయబోతోంది. అందులోనే అసెంబ్లీ, సచివాలయం,హైకోర్టు ఉండబోతున్నాయి. నదీ అభిముఖంగా అమరావతి నగరం 27 కిలోమీటర్ల పరిధిలో ఉంటుందని ప్రకటించింది. నార్మన్ ఫోస్టర్ సంస్థ రూపొందించిన డిజైన్లను రాష్ట్ర ప్రభుత్వం శనివారం అసెంబ్లీలో ప్రదర్శించింది. డిజైన్ల కోసం రకరకాల సంస్థల సేవలు ఉపయోగించుకుంటున్న ప్రభుత్వం ఇప్పుడు రాజధాని నిర్మాణంలో సలహాలు, సూచనలు తీసుకునేందుకు ప్రపంచ ప్రసిద్ధి చెందిన కన్సల్టెంట్లను నియమించుకునే ఆలోచనలో ఉంది. రాజధాని పరిధిలో మొత్తం తొమ్మిది థీమ్ సిటీల నిర్మాణం చేపడతామని ప్రకటించింది. అలాగే రాజధానికి దారితీసే ఏడు ప్రాధాన్య రహదారులకు ఉగాది రోజున సీఎం శంకుస్థాపన చేయనున్నారు. అయితే ఈ డిజైన్లు కూడా తుది డిజైన్లు కాకపోవడం గమనార్హం. అయితే ఏప్రిల్ నెలాఖరు నాటికి తుది ప్రణాళిక ఖరారు చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. 2018 డిసెంబర్ నాటికి ఐకానిక్ భవంతుల నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిపింది. కాగా రాజధాని డిజైన్ ప్రజంటేషన్పై ప్రశ్నల పరంపరతో సర్కార్ ఉక్కిరిబిక్కిరి అయ్యింది. ఫోస్టర్ ప్రతినిధితో పాటు ఐఏఎస్ అధికారి శ్రీధర్‌కు ఎమ్మెల్యేలు ప్రశ్నలు సంధించారు. కొత్త రాజధాని డిజైన్‌లో రోడ్లు ఇరుకుగా ఉన్నాయని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అనగా, క్యాపిటర్ వాటర్ బాడీస్‌కు నీళ్లు ఎక్కడ నుంచి తెస్తారని అధికారపార్టీ సభ్యుడు వేణుగోపాల్ రెడ్డి ప్రశ్నించారు. హైకోర్టు సరే, న్యాయమూర్తులు ఉండే ప్రాంతానికి డిజైన్ ఎలా ఉంటుందని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ అడిగారు. అయితే ఫోస్టర్ ప్రతినిధి ఇంగ్లీష్‌లో సమాధానం చెప్పడంతో ఎమ్మెల్యేలు అసహనం వ్యక్తం చేశారు. దీంతో ఐఏఎస్ అధికారి శ్రీధర్ తెలుగులో అనువదించి సమాధాలు చెప్పారు. ఎమ్మెల్యేల ప్రశ్నల పరంపర కొనసాగడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు జోక్యం చేసుకుని ఇది తొలి కాపీ మాత్రమే అని చెప్పారు. ఇందులో చాలా మార్పులు ఉన్నాయని, ఎవరైనా సూచనలు ఇస్తే మార్పులు చేస్తామన్నారు. -
చెవిలో కాలీఫ్లవర్లు పెడుతున్నారు: రోజా
అమరావతి: శాసనసభ సాక్షిగా చంద్రబాబు నాయుడు మరో డ్రామాకు తెర లేపారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఏపీ రాజధానిని సింగపూర్‌లా కడతామంటూ గ్రాఫిక్స్ చూపించి ప్రజలను మోసం చేశారని ఆమె ఆరోపించారు. ఎమ్మెల్యే రోజా శనివారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ రాజధానిపై ప్రజలను మభ్యపెట్టిన చంద్రబాబు...సింగపూర్ డిజైన్లను గాలికొదిలేశారా అని ప్రశ్నించారు. మాకీ సంస్థతో ఒప్పందాలు కుదుర్చుకుని మరో సంస్థకు మార్చడం వెనుక మతలబు ఏంటో చెప్పాలన్నారు. ఎవరితో చర్చించకుండానే చంద్రబాబు రాజధానిని ఎంపిక చేశారని,ఆనాడు రాజధాని ఎంపిక విషయంలో ప్రతిపక్షాన్ని, అఖిలపక్షాన్ని ఎందుకు పిలవలేదని రోజా సూటిగా ప్రశ్నించారు. రాజధానిలో డిజైన్లలో 51 శాతం గ్రీనరీకి ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పుకునే చంద్రబాబు ....మూడు పంటలు పండే 33వేల ఎకకాల భూమిని లాక్కుని ఎక్కడ నుంచో తెచ్చి చెట్లు పెడతానని చెవిలో కాలీఫ్లవర్లు పెడుతున్నారని రోజా ఎద్దేవా చేశారు. ప్రస్తుత రాజధానిలో చూసేందుకు ఓ చెట్టుకూడా లేదని అన్నారు. ఇక మహిళా మంత్రులు, ప్రతినిధులు వెళ్లేందుకు టాయిలెట్లు కూడా లేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నామని ఆమె పేర్కొన్నారు. మొదట సింగపూర్ డిజైన్లు, తర్వాత పొగ గొట్టాల డిజైన్లను తెర మీదకు తెచ్చారని, తాజాగా ఫోస్టర్ సంస్థ డిజైన్లపై ప్రజంటేషన్ ఇస్తున్నారని ఎమ్మెల్యే రోజా అన్నారు. ఆ రెండు గ్రాఫిక్‌లను పక్కనపెట్టి ఇప్పుడు మూడో గ్రాఫిక్‌ను తెచ్చారని, దాన్ని కూడా ఖరారు చేస్తారో లేదో తెలియదన్నారు. రైతుల సమస్యలపై చర్చించాలని తాము కోరితే, గ్రాఫిక్ డిజైన్ల పేరుతో సభా సమయాన్ని వృధా చేస్తున్నారన్నారు. గతంలో సింగపూర్ సంస్థతో కుదుర్చుకున్న సీల్డ్ కవర్ ఒప్పందాన్ని అసెంబ్లీలో ఎందుకు బయటపెట్టలేదని రోజా డిమాండ్ చేశారు. అలాగే రాజధాని డిజైన్లలో ఏపీ సర్కార్ తమతో ఒప్పందాన్ని రద్దు చేసుకోవడంపై మకీ సంస్థ కేంద్రానికి ఫిర్యాదు చేసిందన్నారు. దానిపై ముఖ్యమంత్రి ఎందుకు నోరు మెదపడంలేదని ఆమె ప్రశ్నించారు. ప్రజలకు చూపించాల్సింది బొమ్మలు కాదనీ, భవిష్యత్ తరాలకు ఉపయోగపడే రాజధాని కావాలన్నారు. శాశ్వత రాజధాని డిజైన్లను సభలో ప్రదర్శించాలని రోజా డిమాండ్ చేశారు. గొప్పలు చెప్పుకుంటూ డిజైన్ల పేరుతో కాలయాపన చేస్తున్న ప్రభుత్వ వైఖరికి నిరసనగానే, పవర్ పాయింట్ ప్రజంటేషన్‌కు వైఎస్ఆర్ సీపీ హాజరు కాలేదని ఆమె తెలిపారు. -
చెవిలో కాలీఫ్లవర్లు పెడుతున్నారు
-
ఎవర్ని మోసం చేయడానికి...: వైఎస్ జగన్
అమరావతి: మూడేళ్లు అయినా ఏపీ రాజధాని నిర్మాణానికి ఇటుక కూడా పెట్టలేదని ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. రాజధాని డిజైన్లను ఇవాళ అసెంబ్లీలో ప్రదర్శించారు. అయితే ఆ ప్రజంటేషన్‌కు వైఎస్ జగన్ హాజరు కాలేదు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ ఎవరిని మోసం చేయడానికి రాజధాని డిజైన్లపై పవర్ పాయింట్ ప్రజంటేషన్లు ఇస్తున్నారని వ్యాఖ్యానించారు. ప్రజంటేషన్‌తో మరో గంట సమయం వృథా తప్ప ఒరిగేదేమీ లేదన్నారు. కాగా మాస్టర్ ఆర్కిటెక్ట్ నార్మన్ ఫోస్టర్ ఇచ్చిన రాజధాని పరిపాలనా నగరం వ్యూహ డిజైన్లకు ముఖ్యమంత్రి చంద్రబాబు మళ్లీ కొన్ని మార్పులు సూచించిన విషయం తెలిసిందే. పాలనా నగరం మీదగా నిర్మించాలనుకుంటున్న జలమార్గం, అందుకు అవసరం అయిన నీరు, రాజధాని భవిష్యత్ జల అవసరాలు, పులిచింతల ప్రాజెక్టు దిగువన నిర్మించబోయే బ్యారేజీ నుంచి వచ్చే నీటిపై జలవనరుల శాఖ, బ్లూ, గ్రీన్ కన్సల్టెంట్లతో చర్చించి తుది ప్రణాళిక ఇవ్వాలని సీఎం సూచనలు చేశారు. -
అధికారులు సమన్వయంతో పనిచేయాలి
నల్లగొండ క్రైం :జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో కృషి చేసి.. ప్రమాద రహిత జిల్లాగా మార్చాలని కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ పిలుపునిచ్చారు. స్థానిక ఎస్పీ కార్యాలయంలో మంగళవారం ఆయన ఎస్పీ ప్రకాశ్‌రెడ్డితో కలిసి జాతీయ, రాష్ట్ర, ఆర్అండ్బీ, పంచాయతీరాజ్, జీఎంఆర్ రహదారుల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఎస్పీ జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారుల్లో ప్రమాద స్థలాలను పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. దయ్యాలగండి వద్ద జరిగిన సంఘటనపై కలెక్టర్ ఆరా తీశారు. రోడ్డు వెడల్పు లేదని, రేడియం లైట్స్, సైన్ బోర్డులు, సమ్మక్క–సారక్క నుంచి విజయ్ విహార్ వరకు ఎలాంటి హెచ్చరిక బోర్డులను ఆర్అండ్బీ అధికారులు ఏర్పాటు చేయలేదని సీఐ వివరించారు. ఆ తర్వాత కలెక్టర్ మాట్లాడుతూ ఈ ప్రమాదంలో హోంగార్డు, సామాన్య పౌరులు మరణించారని ఆవేదన వ్యక్తం చేశారు. డ్రైవర్‌పై కేసు నమోదు చేసినప్పుడు.. రోడ్డు భవనాల శాఖాధికారులుగా నిర్లక్ష్యం వహించినందుకు మీపై ఎందుకు కేసు పెట్టకూడదని ప్రశ్నించారు. కనీస జాగ్రత్త చర్యలు, సూచన బోర్డులు ఏర్పాటు చేయకపోతే మీరేం చేస్తున్నట్లు.. ప్రాణాలు పోతే కొన్ని కుటుంబాలు రోడ్డున పడతాయి.. ఒక్కసారి ఆలోచించండి సమన్వయంతో పనిచేస్తే ఇలాంటి సంఘటనలు జరగవన్నారు. ఏ రోడ్డులో ప్రమాద స్థలాలున్నాయో గుర్తించి.. పరిష్కారాలు సూచిస్తూ నివేదిక అందించాలని సంబంధిత అధికారులకు సూచించారు. కాగా, రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేసిన ట్రాఫిక్ సీఐ ఆదిరెడ్డి, ఎస్ఐ శ్రీనయ్యను, హరితాహారంలో మొక్కలు పెంచినందుకు ఎస్ఐ రాఘవేందర్, గౌరీనాయుడు, సతీష్‌కు కలెక్టర్ బహుమతులు అందజేశారు. పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన రాష్ట్రస్థాయి వీడియోగ్రఫి పోటీల్లో విజేతలకు జ్ఞాపికలను అందజేశారు. సమావేశంలో డీటీసీ చంద్రశేఖర్‌గౌడ్, ఓఎస్డీ వెంకటేశ్వర్లు, జిల్లా ఫారెస్ట్ అధికారి శాంతారామ్ పాల్గొన్నారు. -
ఖర్చు బారెడు.. లబ్ధి మూరెడు..!
► కాళేశ్వరం ప్రాజెక్టుపై నిపుణుల అభిప్రాయం ► టీజేఏసీ ఆధ్వర్యంలో పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం చేపడుతున్న కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ప్రజలపై అదనపు భారం తప్పితే ప్రయోజనమేమీ లేదని సాగునీటి రంగ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రాజెక్టు అంచనా వ్యయం, దాని కింది ఆయకట్టును పరిగణనలోకి తీసు కుంటే ఏటా ప్రాజెక్టు నిర్వహణకయ్యే ఖర్చు రూ.17వేల కోట్లు ఉంటుందని, ఆదాయం మాత్రం రూ.4 వేల కోట్లేనని తేల్చి చెప్పారు. భవిష్యత్తులో ప్రాజెక్టు వ్యయం పెరిగితే నిర్వహణ భారం రూ.33వేల కోట్లకు పెరగొ చ్చని హెచ్చరించారు. ఆదివారం తెలంగాణ జేఏసీ ఆధ్వర్యంలో ‘కాళేశ్వరం ఎత్తిపోతల రాష్ట్రానికి మేలు చేస్తుందా’ అన్న అంశంపై టీజేఏసీ నివేదిక విడుదల చేసింది. అస్కీ మాజీ డీన్ గౌతమ్ పింగలే నివేదికను విడు దల చేయగా, నీటి పారుదల, విద్యుత్ రంగ నిపుణులు గుజ్జా భిక్షం, శివకుమార్, కె.రఘు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. డీపీఆర్ లేకుండానే.. ‘ఏ నిర్మాణం చేపట్టినా డీపీఆర్‌లు తప్పని సరి. కానీ ఈ ప్రాజెక్టు డీపీఆర్ ఇప్పటికీ అం దుబాటులో లేదు. మేడిగడ్డతోపాటు తమ్మి డిహెట్టి వద్ద కూడా నీటి లభ్యత ఉంది. తమ్మిడిహెట్టి వద్ద గరిష్టంగా రోజుకు 2 టీఎం సీల చొప్పున 165 రోజులు, కనిష్టంగా 81 రోజులు నీటిని తీసుకో వచ్చు. సరాసరి 177 టీఎంసీల లభ్యత అక్కడ ఉంది’ అని నిపుణులు తెలిపారు. పొంతనెక్కడ..? కాళేశ్వరం వ్యయం, ఆదాయం, విద్యుత్ ఖర్చులను నిపుణులు వివరించారు. ‘ప్రస్తుత అంచనాల ప్రకారం కాళేశ్వరం వ్యయం రూ.71,600 కోట్ల వరకు ఉంది. ఆ ప్రకారం ఏటా రూ.2వేల కోట్ల నుంచి 4వేల కోట్ల ఆదాయమే వస్తుంది. నిర్వహణకు 17 వేల కోట్ల ఖర్చవుతుంది. ప్రాజెక్టు పూర్త య్యే నాటికి వ్యయం రూ.1.50 లక్షల కోట్లకు చేరితే ఏటా ఖర్చు రూ.33,070 కోట్లకు పెరగొచ్చు. మల్లన్న సాగర్ వంటి ప్రాజెక్టు ప్రపంచంలోనే ఎక్కడా లేదు’ అన్నారు. ఖర్చు తగ్గించాలి: కోదండరాం ‘కాళేశ్వరం నిర్మాణంలో ఖర్చు తగ్గించుకునే యత్నాలు చేయాలి. శాస్త్రీయ అధ్య యనం, హేతుబద్ధ జరిగాక ముందుకు పోవాలి’ అని కోదండరాం అన్నారు. -
ప్రజెంటేషన్లలో కాదు పనుల్లో అభివృద్ధి చూపండి
-
ప్రజెంటేషన్లలో కాదు పనుల్లో అభివృద్ధి చూపండి
కలెక్టర్లు, మంత్రులపై సీఎం ఆగ్రహం * కలెక్టర్లు ప్రత్యేక ప్రణాళికలతో ముందుకు రావాలి * లక్ష్యాలు సాధించలేదంటూ గంటాపై మండిపాటు * యూనివర్సిటీలకు ర్యాంకులపై వీసీలకు అభినందన సాక్షి, అమరావతి: జిల్లాల్లో అభివృద్ధిని పవర్‌పాయింట్ ప్రజెంటేషన్లలో కాకుండా పనుల్లో చూపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులు, జిల్లా కలెక్టర్లు, అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సాధారణ పరిపాలనపై దృష్టి పెట్టాలని, జిల్లాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక ప్రణాళికలతో కలెక్టర్లు ముందుకు రావాలని ఆదేశించారు. మంత్రులు, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రులు, కలెక్టర్లు ఉమ్మడిగా అభివృద్ధి ప్రణాళిక రూపొందించి అమలుకు కార్యాచరణ రూపొందించాలన్నారు. జిల్లా కలెక్టర్ల సమావేశం రెండో రోజు గురువారం విజయవాడలో జరిగింది. సమావేశంలో జిల్లాల వారీగా ప్రగతిని చంద్రబాబు సమీక్షించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్లు ఏడేసి నిమిషాలు తమ జిల్లాపై పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఇదే సమావేశంలో విశ్వవిద్యాలయాల ఉప కులపతులు పాల్గొన్నారు. మధ్యాహ్న భోజన విరామ సమయంలో చంద్రబాబు జిల్లా కలెక్టర్లతో విడిగా సమావేశమయ్యారు. జిల్లాల్లో మంత్రులు, పార్టీ నేతల మధ్య విభేదాలు నెలకొని అభివృద్ధికి ఆటంకంగా మారితే పరిష్కారానికి చొరవ చూపాలని వారికి సూచించారు. ఆ తర్వాత రాత్రి పొద్దు పోయే వరకూ జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో ఉమ్మడిగా సమావేశం నిర్వహించారు. ఆధార్ ఆధారంగా ఇంటినుంచే పౌరసేవలను అందించే యాప్‌ను తయారు చే యించిన పశ్చిమ గోదావరి కలెక్టర్ భాస్కర్‌ను అభినందించారు. మూడేళ్లవుతున్నా ఏం సాధించారు? అధికారంలోకి వచ్చి మూడేళ్లయినా, వేలకోట్లు బడ్జెట్ ఇస్తున్నా... అనుకున్న లక్ష్యాల్లో ఒక్కటైనా సాధించారా? అంటూ మానవవనరుల అభివృద్ధి శాఖమంత్రి గంటా శ్రీనివాసరావుపై సీఎం ఆగ్రహం వ్యక్తంచేశారు. బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయాలని సూచించి మూడేళ్లయినా ఒక్క అడుగూ ముందుకు వేయలేకపోయారని అసంతృప్తి వ్యక్తంచేశారు. రాష్ట్రంలోని కొన్ని యూనివర్సిటీలకు ప్రపంచస్థాయి ర్యాంకులు రావడంపై వీసీలను, ఉన్నత విద్యాశాఖ అధికారులను అభినందించారు. సైనికులకు వందనం : దేశ సార్వభౌమాధికారానికి ఎవరి నుంచి ఎటునుంచైనా భంగం వాటిల్లితే సమర్థంగా ఎదుర్కొంటామని మరోసారి రుజువు చేసిన సైనికులకు వందనాలు అర్పిస్తున్నట్లు సీఎం చెప్పారు. ఉగ్రవాదులను కట్టడి చేసేందుకు ప్రధాని మోదీ తీసుకున్న చర్యలను కేంద్ర మంత్రి సుజనా చౌదరి స్వాగతించారు. ముఖ్యమంత్రి స్వచ్ఛభారత్‌పై నిర్వహించే సమావేశంలో పాల్గొనే నిమిత్తం శుక్రవారం ఢి ల్లీ వెళ్లనున్నారు. వృద్ధి రేటులో విశాఖ ప్రథమం.. రాష్ట్రంలోని జిల్లాలకు వృద్ధి రేటు ఆధారంగా ఇచ్చిన ర్యాంకింగ్‌లో విశాఖ జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. కృష్ణా జిల్లా రెండవ స్థానంలోను, పశ్చిమ గోదావరి జిల్లా మూడో స్థానంలోను నిలిచాయి. వాటి తరువాత నెల్లూరు, గుంటూరు, ప్రకాశం, తూర్పుగోదావరి, చిత్తూరు, వైఎస్సార్ కడప, అనంతపురం, కర్నూలు, విజయనగరం జిల్లాలు వరస స్థానాల్లో నిలిచాయి. -
రెండు రోజుల్లో మరమ్మతులు పూర్తిచేయండి
విజయవాడ సెంట్రల్ : మరుగుదొడ్ల మరమ్మతుల్ని రెండు రోజుల్లో పూర్తి చేయాలని కమిషనర్ జి.వీరపాండియన్ ఆదేశించారు. బుధవారం తన చాంబర్లో ఇంజినీరింగ్ అధికారులతో సమీక్షించారు. 59 డివిజన్లలో మరుగుదొడ్ల పరిస్థితిపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరాలు సేకరించారు. పబ్లిక్, కమ్యూనిటీ, స్కూళ్లలో మరుగుదొడ్ల మరమ్మతుల్ని రెండు రోజుల్లోపూర్తి చేయాలన్నారు. పలు ప్రాంతాల్లో 102 నమ్మా టాయ్‌లెట్స్ చేపట్టాలని నిర్ణయించగా 45 మాత్రమే పూర్తవ్వడంపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. మిగిలిన 57 టాయ్‌లెట్స్ పనుల్ని వెంటనే చేపట్టాల్సిందిగా ఆదేశించారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం 99 శాతం పూర్తయిందని, ఆ ఒక్క శాతం కూడా పూర్తి చేయాల్సిందిగా పేర్కొన్నారు. చీఫ్ ఇంజినీర్ ఎంఏ.షుకూర్, ఈఈలు జీఆర్టి. ఓంప్రకాష్, పీవీకే భాస్కర్, ధనుంజయ, గోవిందరావు, హెల్త్ ఆఫీసర్ బాబూ శ్రీనివాసరావు, ఐటీ నిపుణులు దిలీప్, కి షోర్ తదితరులు పాల్గొన్నారు. -
లక్ష కోట్ల ప్రాజెక్టులకు డీపీఆర్ లేకపోతే ఎలా?
-
కేసీఆర్ ప్రజెంటేషన్ తప్పులతడక
హైదరాబాద్: సాగునీటి ప్రాజెక్టులపై తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అసెంబ్లీలో ఇచ్చిన ప్రజెంటేషన్ తప్పులతడకని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. కేసీఆర్ బూటకపు వాగ్ధానాలతో అధికారంలోకి వచ్చి, సాగునీటి వ్యవస్థను అస్తవ్యస్థం చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలోని ప్రాజెక్టులపై కాంగ్రెస్ పార్టీ బుధవారం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది. ఈ కార్యక్రమంలో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు ఏఐసీసీ నేతలు దిగ్విజయ్ సింగ్, కుంతియా, టీకాంగ్రెస్ సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. నిజాలు నిగ్గుతేల్చేందుకే తాము ప్రజెంటేషన్ ఇస్తున్నామన్నారు. కోటి ఎకరాలకు సాగునీరు అందించాలనే ప్రణాళికను రూపొందించింది కాంగ్రెస్ పార్టీయేనని చెప్పారు. లక్ష కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 33 ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టి, 52 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరిచ్చింది కాంగ్రెస్ పార్టీయేనని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. 'పెండింగ్ ప్రాజెక్టులపై కేసీఆర్ వివక్ష చూపుతున్నారు. ప్రాణహిత డిజైన్ మార్చి తెలంగాణ భవిష్యత్‌ను తాకట్టుపెట్టారు. జలం పేరుతో ప్రభుత్వం దోపిడీ చేస్తోంది. అసెంబ్లీ వేదికగా కేసీఆర్ కాకిలెక్కలు చెప్పారు. కోటి ఎకరాలకు నీరు అందిస్తామని కేసీఆర్ పచ్చి అబద్ధాలు చెప్పారు. లక్షా యాభైవేల కోట్ల రూపాయలకు టెండర్లు పిలిచి దోపిడీకి తెరతీశారు' అని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. -
నేడు టీపీసీసీ ‘వాస్తవ జలదృశ్యం’
* ప్రభుత్వాన్ని ఎండగడుతూ సాగునీటి * ప్రాజెక్టులపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ సాక్షి, హైదరాబాద్: సాగునీటి ప్రాజెక్టులపై అసెంబ్లీలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఇచ్చిన పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌లో అబద్ధాలు, అవాస్తవాలను ఎండటట్టేందుకు టీపీసీసీ సిద్ధమైంది. ‘వాస్తవ జలదృశ్యం’ పేరిట పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌ను ఆవిష్కరించేందుకు సమాయత్తమైంది. హైదరాబాద్‌లో రావినారాయణ రెడ్డి ఆడిటోరియంలో బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి దీన్ని వివరించనున్నారు. సాగునీటి ప్రాజెక్టులు, వాటి రీ డిజైన్లకు సంబంధించి సీఎం ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌కు దీటుగా జవాబివ్వడానికి దాదాపు మూడు నెలలుగా టీపీసీసీ ముఖ్యులు కసరత్తు చేశారు. ముఖ్యమంత్రి ప్రధానంగా ప్రచారం చేసుకుంటున్న కోటి ఎకరాల సాగులో అబద్ధాలు, వాస్తవ పరిస్థితులపై దృష్టిని కేంద్రీకరించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే లక్షల ఎకరాలు సాగులోకి వచ్చిందనే విషయాన్ని చెప్పనున్నారు. వీటికి సంబంధించిన అన్ని గణాంకాలను ఈ వేదికగా ప్రజల ముందు పెట్టడానికి కసరత్తును పూర్తిచేసింది. 2004లో కాంగ్రెస్‌లో అధికారంలోకి వచ్చే నాటికే తెలంగాణలో నిజాంసాగర్,శ్రీరాంసాగర్, సింగూరు, నాగార్జునసాగర్ వంటి భారీ ప్రాజెక్టులు, ఇతర మధ్య, చిన్న తరహా ప్రాజెక్టుల కింద మొత్తంగా సుమారు 50 లక్షల మేర ఆయకట్టు అందుబాటులో ఉందని పవర్‌పాయిట్ ప్రజెంటేషన్‌లో వివరించనున్నారు. కాంగ్రెస్ హయాంలో పూర్తయిన ప్రాజెక్టులు, వాటి కింద సాగులోకి వచ్చిన సాగుభూమి తదితర వివరాలను ఇందులో పొందుపరిచారు. కమీషన్ల కోసమే రీ డిజైన్.. పాలమూరు, కాళేశ్వరం ప్రాజెక్టుల రీ డిజైన్ కేవలం కమీషన్ల కోసమే అన్న వాదనను టీపీసీసీ వినిపించనుంది. రూ.38 వేల కోట్లు ఉన్న కాళేశ్వరాన్ని రూ.83 వేల కోట్లకు పెంచడం, రూ.10 వేల కోట్లతో వేసిన పాలమూరు అంచనాను రూ.48 వేల కోట్లకు పెంచడంపై నిలదీయనుంది. కాగా, ఈ పవర్‌పాయింట్ ప్రజేంటేషన్‌కు తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరాం, ఇతర ముఖ్యులను ఆహ్వానించారు. వీరితోపాటు జస్టిస్ చంద్రకుమార్, నైనాల గోవర్ధన్, గాదె ఇన్నయ్య, విమల, తెలంగాణ జర్నలిస్టు సంఘాలు, అన్ని పత్రికల ఎడిటర్లు, వివిధ రంగాల్లో ముఖ్యులను ఆహ్వానించారు. మూడున్నర గంటలపాటు ఈ కార్యక్రమం సాగనుంది. -
రైతుల సూచనలు సీఎం దృష్టికి తీసుకెళ్తాం
సీఆర్డీఏ నిర్వహించిన సమావేశంలో రైతులు ప్రస్తావించిన ప్రతి సమస్యనూ ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని సీఆర్డీఏ అదనపు కమిషనర్ శ్రీధర్ హామీ ఇచ్చారు. మంగళగిరి, తాడేపల్లి మండలాల రైతులకు రాజధానిలో రోడ్డు, ప్లాట్లు, జోనింగ్ నిబంధనలు తదితర అంశాలపై పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. రాజధాని ప్రాంతంలో ఉచిత విద్య, వైద్యం అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ల్యాండ్ పూలింగ్ అమలైన నాటి నుంచి దీన్ని వర్తింపజేసి రీయింబర్స్మెంట్ ఇవ్వాలన్న ప్రతిపాదన సీఎం దృష్టికి తీసుకుని వెళ్తామన్నారు. నేలపాడును నమూనాగా తీసుకుని ప్లాట్ల విభజన చేపట్టామని, ఇలాగే అన్ని గ్రామాల్లోనూ పూర్తి చేస్తామని శ్రీధర్ చెప్పారు. ప్రతి గ్రామానికీ డ్రాఫ్ట్ లేఅవుట్ ఇచ్చి దానిపై 30 రోజుల్లో రైతుల అభిప్రాయాలు స్వీకరిస్తామన్నారు. ఆ ప్రక్రియ పూర్తయ్యాక లేఅవుట్ ప్లాన్‌ను ఫైనల్ చేస్తామని చెప్పారు. ప్లాట్ల విషయంలో 9.18 పత్రాలను రైతులు ఇవ్వాల్సి ఉంటుందని, ప్లాట్లు ఎలా కావాలనే దానిపై ఆ అంగీకార పత్రంలో తెలపాల్సి ఉంటుందని వివరించారు. ఇద్దరు, ముగ్గురు, ఎంతమందైనా కలిసి ఒకేచోట ప్లాట్లు తీసుకోవచ్చని, వాటిని అమ్ముకోవచ్చని అన్నారు. లేఅవుట్లో రైతులకు కేటాయించిన నిర్దిష్ట కొలతలతో కూడిన ప్లాట్లు కాకుండా మిగిలిన ప్లాట్లను వేలం వేసి ఆ మొత్తాన్ని రైతులకు పంచనున్నట్లు చెప్పారు. లేఅవుట్లలో మొదటి ఏడాది 50 నుంచి 80 అడుగుల వెడల్పుతో గ్రావెల్ రోడ్డు, రానున్న మూడేళ్లలో తారు రోడ్లు వేసి అభివృద్ధి చేస్తామన్నారు. లేఅవుట్లను నార్త్ ఈస్ట్ ప్రకారం పక్కా వాస్తుతో వేస్తావని, కొన్ని సౌత్‌కు కూడా ఉంటాయని చెప్పారు. ఎకనామిక్స్ యాక్టివిటీ కోసమే కమర్షియల్ ప్లాట్లలో ప్రభుత్వం 18 అంతస్తుల వరకు నిర్మించుకోవచ్చని, రైతులు 11 అంతస్తుల వరకే నిర్మించుకోవాలనే నిబంధన పెట్టినట్లు తెలిపారు. -
ఆనాడు అడగలేదేం..
♦ఎస్సారెస్పీ కాలువను పొడిగిస్తే ఎందుకు ఊరుకున్నారు... ♦ ఎక్కడా లేని విధంగా ఎస్సెల్బీసీ టన్నెల్ రూపొందిస్తే మాట్లాడలేదేం.. ♦ అప్పులు తెచ్చిన పార్టీల్లోనే మీరు పనిచేయలేదా.. ♦ జానా, ఉత్తమ్, సుఖేందర్, కోమటిరెడ్డి అప్పుడేం చేశారు.. ♦ కాంగ్రెస్ దిగ్గజాలపై మంత్రి జగదీశ్‌రెడ్డి ఫైర్ సాక్షి ప్రతినిధి, నల్లగొండ : సాగునీటి ప్రాజెక్ట్‌లపై అసెంబ్లీలో సీఎం ఇచ్చిన పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ వినకుండా.. దొంగల్లా పారిపోయిన కాంగ్రెస్ నేతలు చిలువలు పలువలు చేసి మాట్లాడుతున్నారని, 30 ఏళ్ల పాటు ప్రజలకు ప్రాతినిధ్యం వహించిన ఘనత కలిగిన ఈ నేతలు సమైక్య రాష్ట్రంలో నల్లగొండ జిల్లాకు జరిగిన అన్యా యం గురించి ఎందుకు మాట్లాడలేదని రాష్ట్ర మంత్రి జి.జగదీశ్‌రెడ్డి ప్రశ్నించారు. నాడు పదవుల కోసం, బీ ఫారాల కోసం పెద్ద బానిసలుగా పనిచేసిన కాంగ్రెస్ నేతలు... ఇప్పుడు కేసీఆర్ స్పష్టమైన అవగాహనతో తెలంగాణను బాగు చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలను తట్టుకోలేకపోతున్నారని విమర్శించారు. జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బండా నరేందర్‌రెడ్డి, నల్లగొండ నియోజకవర్గ ఇన్చార్జి దుబ్బాక నర్సింహారెడ్డితో కలిసి మాట్లాడారు. జిల్లాకు చెందిన కాంగ్రెస్ పెద్దలపై ఫైర్ అయ్యారు. జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, గుత్తా సుఖేందర్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి నాడు నల్లగొండకు జరుగుతున్న అన్యాయం గురించి ఎందుకు ప్రశ్నించలేదని అడిగారు. సీఎం అసెంబ్లీలో చేసిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై జిల్లా కాంగ్రెస్ నేతలు తలోరకంగా మాట్లాడుతున్నారని, అసలు వారు మాట్లాడేది వాళ్లకు అర్థం అవుతుందా అని ప్రశ్నించారు. తామేమీ అసెంబ్లీలో వారి నోట్లో గుడ్డలు పెట్టలేదని, కళ్లకు గంతలు కట్టలేదని, తెలంగాణ ప్రజలకు నీళ్లెలా తాపాలో చెప్పామన్నారు. అయినా.. కాంగ్రెస్ నేతలు పారిపోయారని, ఓట్లేసిన ప్రజలు నిలదీస్తారనే అక్కసుతోనే చిల్లర రాజకీయాలకు కాంగ్రెస్ నేతలు పాల్పడుతున్నారన్నారు. అందుకే ఓ నాయకుడు ప్రాజెక్టుల్లో కుంభకోణం జరుగుతుందంటే... మరో నేత తాను ప్రిపేర్ అయి రాలేదని, ఇంకో నాయకుడు అప్పులివ్వద్దని లేఖలు రాస్తున్నామని అంటున్నారని కాంగ్రెస్ నేతలనుద్దేశించి వ్యాఖ్యానించారు. 30 ఏళ్లుగా ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్నామని గొప్పలకు పోతున్న కాంగ్రెస్ నేతలు ఒక్కరోజైనా ప్రజల గురించి ఆలోచించలేదన్నారు. తాము కాంగ్రెస్ నాయకుల్లా డప్పాలు కొట్టలేమని.. చేసిన పనిని చూసిన తర్వాతే ఓట్లేయమని ప్రజలను అడుగుతామని.. అదే టీఆర్ఎస్, కేసీఆర్ నైజమని అన్నారు. ఆ ఆలోచన ఎందుకు రాలేదు... జిల్లా కాంగ్రెస్ నేతలు అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడాల్సిన మాటలను ఎందుకు మాట్లాడలేకపో5యారని, ప్రపంచంలో ఎక్కడా లేని సమస్యలు తెలంగాణ ప్రాజెక్ట్‌లకే ఎందుకు వస్తాయని, అన్ని సమస్యలూ తెలంగాణ చుట్టూనే ఎందుకు తిరుగుతాయనే ఆలోచన కాంగ్రెస్ నేతలకు ఎందుకు రాలేదని మంత్రి జగదీశ్ నిలదీశారు. ‘నీటి సామర్థ్యంతో సంబంధం లేకుండా శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ (ఎస్సారెస్పీ) కాల్వలను హనుమంతుడి తోకలా పెంచుకుంటూ పోతుంటే ప్రశ్నించే దమ్ము ఈ కాంగ్రెస్ నేతలకు ఎందుకు లేదు.. ఎందుకు దద్దమ్మల్లా కూర్చున్నారు.. 10 టీఎంసీల నీటిని 16లక్షల ఎకరాలకు పారిస్తామని చెప్పి ప్రాణహిత - చేవెళ్ల ప్రారంభించినప్పుడు ఎందుకు సంకలు గుద్దుకుని కొ బ్బరికాయలు కొట్టి వచ్చారు.. ఆనాడు ఏ క్షణమైనా ఆలోచించారా.. ప్రపంచం లో ఎవరికీ అర్థం కాని విధంగా శ్రీశైలం ఎడమగట్టు కాల్వ (ఎస్సెల్బీసీ) సొ రం గం డిజైన్ రూపొందించినప్పుడు ఏం చేశారు.. నాలుగు దశాబ్దాలైనా ఈ ప్రాజెక్ట్ పూర్తి కాకపోతే ఏం చేశారు..’ అని ప్రశ్నించారు. తామేదో అప్పులు తెస్తున్నామని కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారని... అప్పులు తేవడం నేర్పిన కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల్లో ఎంపీ సుఖేందర్‌రెడ్డి పనిచేయలేదా అని అడిగారు. మున్సిపల్ వైస్‌చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి, టీఆర్ఎస్ నేతలు రేగట్టె మల్లికార్జున్‌రెడ్డి, మాలె శరణ్యారెడ్డి, అబ్బగోని రమేశ్‌గౌడ్, బకరం వెంకన్న పాల్గొన్నారు. -
ప్రాజెక్టులపై సీఎం ప్రజెంటేషన్ ఆకట్టుకుంది
♦ డబుల్ బెడ్రూం ఇళ్లు, ముస్లిం, ♦ గిరిజనులకు రిజర్వేషన్లు సాధ్యం కాదు ♦ సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నల్లగొండ టూ టౌన్: రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులపై అసెం బ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ బాగుందని, రైతుల గురించి ఆలోచించే వ్యక్తిగా తనను ఆకట్టుకుందని సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. శనివారం నల్లగొండలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రైతుల కోసం ప్రాజెక్టులు కట్టాల్సిన అవసరముందని, వీటి నిర్మాణాల్లో అభ్యంతరాలుంటే ఉండవచ్చని, కానీ, రీ డిజైనింగ్ చేయడంలో తప్పులేదన్నారు. భారతదేశంలోనే మొట్టమొదటిసారి అసెంబ్లీలో ముఖ్యమంత్రి మూడు గంటలపాటు ప్రజెంటేషన్ ఇచ్చిన విధానం బాగుందని కితాబిచ్చారు. అయితే, కేవలం మాటలకే పరిమితం కాకుండా ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయాలని కోరారు. ప్రాణహిత - చేవెళ్లపై అసెం బ్లీలో చర్చకు వచ్చినప్పుడు ఓ కాంగ్రెస్ నేత తాను ప్రిపేర్ అయి రాలేదని చెప్పాడని, ఇది సరైంది కాదన్నారు. సాధ్యంకానివి.. కావు అని చెప్పండి టీఆర్ఎస్తో పాటు సీఎం కేసీఆర్ చెబుతున్న విధంగా రాష్ట్రంలో డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం, గిరిజనులకు, ముస్లింలకు అదనపు రిజర్వేషన్లు సాధ్యమయ్యే పని కాదని కోమటిరెడ్డి అన్నారు. సాధ్యం కాని పనులను.. కావు అని సీఎం కేసీఆర్ ప్రజలకు చెప్పాలన్నారు. అయితే గ్రామానికి 50 చొప్పున, హైదరాబాద్‌లో లక్ష డబుల్ బెడ్రూం ఇళ్లను నిర్మిస్తే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్ను గెలిపించాలని తానే ప్రజలను కోరుతానన్నారు. వచ్చే ఎన్నికల్లో ఒకవేళ తాను పోటీ చేయకపోయినా టీఆర్ఎస్ తరఫున ప్రచారం చేస్తానని చెప్పారు. ఎస్సెల్బీసీ టన్నెల్‌ను మూడేళ్లలో, బ్రాహ్మణ వెల్లెంల ప్రాజెక్టు పనులను ఏడాదిలో పూర్తి చేస్తానని చెప్పిన సీఎం కేసీఆర్‌కు నల్లగొండ జిల్లా ప్రజల పక్షాన తాను కృతజ్ఞతలు తెలుపుతున్నానని కోమటిరెడ్డి పేర్కొన్నారు. -
నా తెలంగాణ.. కోటి ఎకరాల మాగాణ
- ప్రాణం పోయినా నీళ్లు పారిస్తా - అసెంబ్లీలో సాగునీటి విధానం ప్రజెంటేషన్‌లో సీఎం కేసీఆర్ - ఐదేళ్లలో కోటి ఎకరాలకు సాగునీరు - మూడేళ్లలోనే 70% దాకా లక్ష్యాన్ని చేరుకుంటాం - ప్రాజెక్టులన్నీ కడతాం.. రైతుల కన్నీళ్లు తుడుస్తాం - సాగునీటికి రూ. 25 వేల కోట్లిచ్చాం.. - వచ్చే బడ్జెట్లో మరో 5 వేల కోట్లు పెంచుతాం - గత పాలకులు మన ప్రాజెక్టులను వివాదాల్లో పెట్టారు - మోసం చేసి నీటిని తరలించుకుపోయే యత్నం చేశారు - మహారాష్ట్ర, కర్ణాటక ప్రాజెక్టులతో ముప్పు - మనకు గోదావరి తప్ప గత్యంతరం లేదు - ఇంద్రావతి, ప్రాణహితలో తప్ప నీళ్లు లేవు - అందుకే ప్రాజెక్టులకు రీఇంజనీరింగ్ చేస్తున్నాం - ప్రాణహిత-చేవెళ్ల, దుమ్ముగూడెం ప్రాజెక్టులు రద్దు - కాళేశ్వరం ప్రాజెక్టుకు త్వరలోనే పునాది రాయి - గూగుల్ మ్యాప్‌లతో ప్రజెంటేషన్ ఇచ్చిన సీఎం సాక్షి. హైదరాబాద్: ‘‘నా ప్రాణం పోయినా సరే... రాబోయే ఐదేళ్లలో కోటి ఎకరాలకు సాగునీటిని అందిస్తా... నా తెలంగాణ కోటి రతనాల వీణ అని నిరూపించి తీరుతా.. ఆరు నూరైనా, ఎన్ని ఆటంకాలు కల్పించినా, అవరోధాలు సృష్టించినా మా ప్రస్థానం ఆగేది కాదు. మమ్మల్నెవరూ ఆపలేరు. ఆపుదామనుకుంటే అది భ్రమే..’’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. ప్రజల సహకారంతో ప్రాజెక్టులు కట్టి తీరుతామని... హరిత తెలంగాణ సాధించడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ‘తప్పకుండా సాగునీటిని తెస్తాం.. రైతుల కన్నీళ్లు తుడుస్తా’మని ప్రతినబూనారు. శాసనసభలో గురువారం సాగునీటి ప్రాజెక్టుల రీఇంజనీరింగ్‌పై ముఖ్యమంత్రి సమగ్ర వివరణ ఇచ్చారు. పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా గూగుల్ మ్యాప్‌ల సాయంతో ప్రాజెక్టుల వివరాలను డిజిటల్ స్క్రీన్లపై చూపుతూ.. వివరాలు తెలిపారు. ఇదే సమయంలో ప్రాజెక్టుల విషయంలో గత ప్రభుత్వాలు వ్యవహరించిన తీరును సీఎం కేసీఆర్ ఎండగట్టారు. రీఇంజనీరింగ్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో విశ్లేషించారు. ప్రజలకు తెలియజెప్పడంతోపాటు, అసెంబ్లీ రికార్డుల్లో ఉంచేందుకే తాను ప్రజెంటేషన్ ఇచ్చినట్లు తెలిపారు. తెలంగాణను ప్రస్తుతం వేధిస్తున్న ప్రధాన సమస్య నీటి కొరతేనని చెప్పారు. తెలంగాణ ఉద్యమమే నీళ్లు, నిధులు, నియామకాల నినాదంగా ఏర్పడిందని.. ప్రజల ఆశలను నెరవేర్చే బాధ్యత తమ ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు. కేసీఆర్ చెప్పిన అంశాలు ఆయన మాటల్లోనే... కోటి ఎకరాలకు నీళ్లిస్తాం ‘‘గోదావరిలో 954 టీఎంసీల వాటాను వాడుకుని తీరుతాం. ఐదేళ్లలో అన్ని జిల్లాల పరిధిలో కోటి ఎకరాలకు సాగునీటిని అందించేలా ప్రాజెక్టులు పూర్తిచేస్తాం. మూడేళ్ల వ్యవధిలోనే 60 నుంచి 70 శాతం లక్ష్యం సాధిస్తం. గతంలో ప్రాజెక్టులంటే పదేళ్ల పాటు కొనసాగేవి. ఆ సంప్రదాయాన్ని తుడిచిపారేసే నిర్ణయాలు తీసుకున్నాం. ఆర్థిక శాఖ, నీటిపారుదల శాఖల మధ్య సమన్వయంతో నిధుల వినియోగానికి గ్రీన్‌చానల్ ఏర్పా టైంది. ఈ ఏడాది బడ్జెట్లో ఇరిగేషన్‌కు రూ.25 వేల కోట్లు కేటాయించాం. ఇదేదో తమాషాకో, చక్కిలిగింతలు పెట్టేందుకో చెప్పే విషయం కాదు. వచ్చే ఏడాది బడ్జెట్లో మరో రూ.5,000 కోట్లు ఎక్కువ కేటాయిస్తాం. ప్రాణహిత-చేవెళ్ల లేనే లేదు ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు రద్దయింది. ఇకపై ఆ పేరు కూడా ఉండదు. దాని స్థానంలోనే తమ్మిడిహెట్టి బ్యారేజీ ద్వారా ఆదిలాబాద్ జిల్లాకు నీరందిస్తాం. మహారాష్ట్ర సీఎంను పిలిచి కాళేశ్వరం ప్రాజెక్టుకు త్వరలోనే పునాది రాయి వేస్తాం. మహారాష్ట్రతో పంచాయితీ కావాలా.. పొలాలకు నీళ్లు రావాలా.. అని సభ్యులే ఆలోచించాలి. గోదావరి నీటిని వాడుకోవడం తప్ప గత్యంతరం లేదు. ఇంద్రావతి, ప్రాణహితలో తప్ప నీళ్లు లేవు. తెలంగాణ భవిష్యత్తు అవసరాల దృష్ట్యా కాళేశ్వరం నిర్మించాల్సి ఉంది. దీంతోనే నిజాంసాగర్‌కు పూర్వవైభవం. మేడిగడ్డ నుంచి శ్రీరాంసాగర్ వరకు 250 కిలోమీటర్ల పొడవునా గోదావరికి జలకళ, జీవకళ వస్తుంది. మహారాష్ట్ర ప్రాజెక్టులతో ముప్పు గోదావరి, కృష్ణా వాటి ఉప నదులపై మహారాష్ట్ర, కర్ణాటక నిర్మిస్తున్న ప్రాజెక్టులతో తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు ముప్పే. రెండు రాష్ట్రాలు దాదాపు 450 బ్యారేజీలు నిర్మించాయి. పెన్‌గంగపై మహారాష్ట్ర ఇప్పటికే 31 ప్రాజెక్టులు కట్టింది. మరో 9 కడుతున్నారు. వాటితో దాదాపు 1,300 టీఎంసీల నీరు ఆగిపోతోంది. ప్రతి నదిపై ఇబ్బడి ముబ్బడిగా బ్యారేజీలు కట్టి లిఫ్ట్‌లతో నీటిని తరలించుకుపోతున్నారు. దాంతో మంజీరా, ఎస్సారెస్పీ, శ్రీశైలం ప్రాజెక్టులకు చుక్కనీరు రాక ఎండిపోతున్నాయి. ఎగువన భారీగా వర్షాలు కురిసి చెరువులు, ప్రాజెక్టులన్నీ నిండితే తప్ప తెలంగాణకు నీళ్లు రావు. కేంద్రం, సీడబ్ల్యూసీ, సుప్రీంకోర్టుకు వెళ్లినా వివాదాలే తప్ప నీళ్లు వచ్చే పరిస్థితి లేదు. తెలంగాణ ప్రాజెక్టులంటేనే కిరికిరి సమైక్య పాలకులకు సద్భుద్ధి లేదు. నీళ్లిచ్చే ఉద్దేశం లేదు. తెలంగాణ ప్రాజెక్టులంటేనే వివాదంలో పెట్టారు. అంతర్రాష్ర్ట వివాదాల్లో కూరుకుపోయేలా కుట్రలు చేశారు. పర్యావరణ అనుమతుల నెపంతో మోసం చేశారు. ఇచ్చంపల్లి ప్రాజెక్టు నిర్మాణానికి అప్పట్లో బీజేపీ నేతలు గోదావరి జల యాత్ర చేశారు. అప్పట్నుంచీ ఇదే దుస్థితి. నిజాంసాగర్ వట్టి పోయేటట్లు చేసిన ఘనత సమైక్య పాలకులదే. వాటా ఉన్నా నీరు ఎందుకు రాలేదు ఉమ్మడి రాష్ట్ర లెక్కల ప్రకారమే తెలంగాణ వాటాగా గోదావరిలో 954 టీఎంసీలు, కృష్ణాలో 299 టీఎంసీల నికర జలాలు, 77 టీఎంసీల మిగులు జలాలున్నాయి. మైనర్ ఇరిగేషన్ చెరువులు, కుంటల కింద 259 టీఎం సీలు, మధ్యస్థాయి, పెద్ద ప్రాజెక్టుల కింద 1,071 టీ ఎంసీల వాటా ఉంది. ఇప్పుడున్న ఒక లెక్క ప్రకారం తెలంగాణలో 1.65 కోట్ల ఎకరాల సాగు యోగ్య భూ మి ఉంది. మరో లెక్క ప్రకారం 1.11 కోట్ల ఎకరాలుం ది. గోదావరి, కృష్ణాలలో 1,330 టీఎంసీలు వాటా ఉంటే ఈ మాత్రం భూమికి నీరు ఎందుకు అందలేదు. మూర్ఖపు కుట్రలు 1960లోనే సమైక్య ప్రభుత్వం కిన్నెరసాని ప్రాజెక్టును కేవలం విద్యుత్ కోసం చేపట్టింది. అదో కుట్ర. 20వేల ఎకరాలకు నీటిని అందించాలని గిరిజనులు కోరినా పట్టించుకోలేదు. రీజనరేటెడ్ నీటిని తమ ప్రాంతానికి మళ్లించుకునే మోసం అది. 1996-99లో ఈ ప్రాజెక్టును వన్యప్రాణి సంరక్షణ ప్రాంతంలోని ఎకో జోన్‌గా గుర్తించారు. దీంతో మరో నష్టం జరిగింది. 18 కిలోమీటర్లు ఎకో జోన్, 22కిలోమీటర్లు అటవీ భూములు.. ఇలా 40 కిలోమీటర్ల పొడవునా రాజీవ్‌సాగర్ పైపులైన్ పనులు మధ్యలో ఆగిపోయాయి. మిగతా పనులకు మాత్రం రూ.150 కోట్లు అంచనాలు పెంచారు. ప్రాజెక్టు పూర్తయ్యాక చేయాల్సిన మోటార్లు, పంపుల కొనుగోళ్లకు రూ.750 కోట్లు బిల్లులు ముందే చెల్లించారు. ఎవరి కమీషన్లు వాళ్లు తీసుకుని, పైపులు పక్కన పడేశారు. దుమ్ముగూడెం టెయిల్‌పాండ్‌తో తెలంగాణకు లాభమేమీ లేదు. సాగర్ ఎడమకాల్వకు నీటిని బంద్‌పెట్టి టెయిల్‌పాండ్ నీటిని లిఫ్ట్ ద్వారా పాలేరులో ఎత్తిపోస్తారట. ధవళేశ్వరానికి గోదావరి నీటిని తరలించే కుట్ర ఇది. ఇక రుద్రంకోట వద్ద ఇందిరాసాగర్ ప్రాజెక్టును నిర్మించాల్సిన అవసరం లేదు. ఏడు మండలాలు ఏపీలో కలవడంతో ఆ ప్రాజెక్టు వాళ్ల భూభాగంలోకి వెళ్లింది. అలాంటప్పుడు ఇందిరాసాగర్, రాజీవ్‌సాగర్ రీడిజైనింగ్ అవసరమా, కాదా ఆలోచించండి. కంతనపల్లితో ఆదివాసీల ముంపు: 2001లో టీఆర్ఎస్ వరంగల్‌లో బహిరంగ సభ పెట్టంగానే... ఆగమాగం దేవాదుల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. 50 టీఎంసీల నీటితో ఐదు లక్షల ఎకరాలకు నీరందించే ఈ ప్రాజెక్టును 18 నెలల్లో పూర్తి చేస్తామన్నారు. ఇప్పుడు 2016. అది పూర్తి కాలేదు. ఇప్పటికే రూ.8,000 కోట్లు ఖర్చయింది. ఆ ప్రాజెక్టును వినియోగంలోకి తెచ్చుకోవాల్సి ఉంది. దేవాదుల పంప్‌హౌజ్‌కు నీటిని అందించే కంతనపల్లి దగ్గర బ్యారేజీ మరో కుట్ర. అది నిర్మిస్తే 11,500 ఎకరాల ఆదివాసీల భూములు ముంపునకు గురవుతాయి. ఛత్తీస్‌గఢ్‌తోనూ అంతర్రాష్ట వివాదం పెట్టారు. తుపాకులగూడెం దగ్గర బ్యారేజీ కడతాం. ముంపు లేకుండా చేస్తాం. ఇది రీడిజైన్ చేయాల్సిన అవసరం లేదా.. సొరంగంలో ఆగిన ఎస్ఎల్బీసీ కొనసాగించడం తప్ప గత్యంతరం లేని ప్రాజెక్టు ఎస్ఎల్బీసీ. లిఫ్టా, సొరంగమా అన్న చర్చల తర్వాత ప్రపంచంలోనే పొడవైన టన్నెల్‌తో ప్రాజెక్టు చేపట్టారు. ఇప్పటికీ సొరంగం తవ్వకం పూర్తికాలేదు. టన్నెల్ బోర్ మెషీన్లు భూగర్భంలోనే ఉన్నాయి. ఎప్పుడు తవ్వకం పూర్తవుతదంటే ఇంకో మూడేళ్లు పడుతుందంటున్నారు. అప్పటిదాకా ఎదురుచూడ్డం తప్ప చేసేదేం లేదు. ఈ ప్రాజెక్టును కూడా టైగర్ వ్యాలీ జోన్‌తో ముడిపెట్టారు. పాలమూరును సస్యశ్యామలం చేస్తాం పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేస్తాం, వలసలను నివారిస్తాం. పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని అత్యంత వేగంగా పూర్తి చేస్తాం. దీనిద్వారా దక్షిణ తెలంగాణకు పూర్తిస్థాయిలో నీళ్లు వస్తాయి. ఈ ప్రాజెక్టులో అవకతవకలు ఉన్నాయని ఆ జిల్లా నేతలే కోర్టులో పిటిషన్ వేయడం సరికాదు. కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా జూన్ నాటికి 1.50 లక్షల ఎకరాలకు నీళ్లిస్తాం. నార్లాపూర్, వట్టెం, కరివెన, ఉద్దండపూర్ రిజర్వాయర్లను పూర్తిచేస్తాం. ఈ ప్రాజెక్టు ద్వారా 8 లక్షల ఎకరాలకు నీళ్లిస్తాం. నెట్టెంపాడు నిర్మాణం పూర్తికావచ్చింది. దీనిలో ప్రతిపాదిత ఆయకట్టు కంటే అదనంగా 25 వేల ఎకరాలకు నీరు అందిస్తాం. భీమా ప్రాజెక్టు వచ్చే ఏడాదికల్లా పూర్తవుతుంది. ఆర్డీఎస్ కింద నష్టపోయిన ఆయకట్టును తుమ్మిళ్ల వద్ద లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి తిరిగి రాబట్టుకుంటం. నెట్టెంపాడు రెండో దశలో గట్టు మండలంలో అదనంగా 20 వేల ఎకరాలకు నీరిస్తాం. డిండి రిజర్వాయర్ నుంచి దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాలకు సాగునీటిని అందిస్తాం. ఇదే నీటిని రాచకొండ వరకు తరలించి హైదరాబాద్‌కు తాగునీటి అవసరాలు తీర్చే రిజర్వాయర్‌ను నింపుతాం. ఎస్ఎల్బీసీలో అంతర్భాగమైన ఉదయసముద్రం నుంచి బ్రాహ్మణవెల్లెంల ప్రాజెక్టుకు నీటిని తరలిస్తాం. ఈ ఏడాదిలోనే ఆయకట్టుకు నీటిని అందిస్తాం. ఖమ్మం జిల్లాలో చేపట్టనున్న భక్త రామదాసు, శ్రీసీతారామ ప్రాజెక్టులను మూడేళ్లలో పూర్తి చేస్తాం. ఆదిలాబాద్ జిల్లాలో మధ్యతరహా ప్రాజెక్టులైన రోళ్లవాగు, మత్తడివాగు ఈ సీజన్లోనే పూర్తవుతాయి. గొల్లవాగు, జగన్నాథపూర్ ప్రాజెక్టులు వచ్చే సీజన్లో, కొమురం భీమ్ ప్రాజెక్టును 2018లో పూర్తిచేస్తాం. సదర్మాట్ వద్ద బ్యారేజీ నిర్మించి ఆయకట్టును 20 వేల ఎకరాలకు పెంచుతాం. కడెం వాగుపైన 6.5 టీఎంసీలతో కుట్టి ప్రాజెక్టు నిర్మిస్తాం. డీపీఆర్‌లు తయారవుతున్నాయి. కుంటాల జలపాతం జీవంగా ఉండటంతో పాటు కడెం ప్రాజెక్టుకు నీటి నిల్వకు ఢోకా ఉండదు. ఈ ప్రాజెక్టులో ఉన్న లోటు ఆయకట్టుకు నీటిని అందించేందుకు గూడెం ఎత్తిపోతల పథకం నిర్మించాం. లోయర్ పెన్‌గంగ ప్రాజెక్టు తెలంగాణలో పెద్ద జోక్. మరో యాభై ఏళ్లు నిరీక్షించినా జరిగే పని కాదు. లెండి ప్రాజెక్టు దొంగది కాదు.. దొడ్లకు రాదు అన్నట్లుగా ఆగిపోయింది. అందుకే 50 వేల ఎకరాలకు నీటిని అందించేందుకు ఛనఖా-కొరటా బ్యారేజీని కడుతున్నాం. బాసర దగ్గర గోదావరిపై చెక్‌డ్యామ్ నిర్మిస్తున్నాం...’’ -
కేసీఆర్ పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ చరిత్రాత్మకం
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులపై గురువారం అసెంబ్లీలో సీఎం కేసీఆర్ చేసిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చరిత్రాత్మకమని రాష్ట్ర ఇంధన, దళిత అభివృద్ధి, సహకార శాఖల మంత్రి జి. జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. తన అద్భుత ప్రెజెంటేషన్‌తో తెలంగాణ సమాజాన్ని జాగృతం చేసిన ముఖ్యమంత్రి అభినందనీయుడని తెలిపారు. సీఎం పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ పూర్తయిన అనంతరం ఆయన గురువారం సాయంత్రం మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. ‘ జిల్లాలో విస్తరించిన ఫోర్లిన్ పాపానికి ఆరు దశాబ్దాలు పాలించిన కాంగ్రెస్, టీడీపీలే కారకులు. పరిష్కార మార్గాలున్నా ఇంతకాలం పాలించి పరిష్కరించకుండా, ఫ్లోరిన్ బాధితుల పాపాన్ని కాంగ్రెస్, టీడీపీ నాయకులు మూట కట్టుకున్నారు. అటువంటి పరిస్థితుల్లో చేసిన పాపం బయటపడుతుందనే సభ కు రాకుండా మొహం చాటేశారు.’ అని ఆ ప్రకటనలో ఆయన ఎద్దేవా చేశారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలలో అధికారం అనుభవించిన జి ల్లాకు చెందిన జానారెడ్డి, సుఖేందర్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీలో మంత్రి పదవులు పొందిన దామోదర్‌రెడ్డి, వెంకటరెడ్డిలు ఆంధ్ర పాలకులకు వంత పాడి పదవులు దక్కించుకున్నారని, దేవరకొండ, మునుగోడు ప్రాంతాల్లో ఫ్లోరిన్ విస్తరించడానికి వారే కారకులని ఆ ప్రకటనలో ఆయన ఆరోపించారు. ఎస్సెల్బీసీ, ఎస్సారెస్పీ ప్రాజెక్టులను పూర్తి చేయాలని నాటి పాలకులపై ఒత్తిడి చేయలేని జిల్లా నాయకులు, రాష్ట్ర కాంగ్రెస్‌కు నాయకత్వం వహిస్తూ తెలంగాణ రాష్ట్రానికే ద్రోహం చేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ప్రాజెక్టుల రీడిజైనింగ్ను వ్యతిరేకించడం, మిషన్ భగీరథకు మోకాలడ్డేలా ఉత్తరాలు రా యడం ద్వారా కొత్త కుట్రలకు తెరతీస్తున్నారని ఆరోపించారు.ఈ ప్రాజెక్టులు పూర్తయితే తమకు పదవులు రా వని, ఎమ్మెల్యేలు, ఎం పీలుగా గెలవలేరనే నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ రాజకీయాలు గమనించి అపరభగీరథుడిలా శ్రమిస్తున్న కేసీఆర్‌కు ప్రజలుఅండగా నిలవాలని ఆయన కోరారు. -
అది సభా నిబంధనలకు విరుద్ధం: షబ్బీర్ అలీ
హైదరాబాద్: అసెంబ్లీ హాలులో పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం సభా నిబంధనలకు విరుద్ధమని తెలంగాణ శాసనమండలిలో ప్రతిపక్షనేత షబ్బీర్ అలీ అన్నారు. పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌కు ఏ ప్రాతిపదికన అనుమతి ఇస్తున్నారని అడుగుతూ తాము స్పీకర్‌కు రెండు సార్లు లేఖ రాసినా సమాధానం ఇవ్వలేదని ఆయన విమర్శించారు. బడ్జెట్ మాదిరిగానే పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఉండాలని తాము సూచించామన్నారు. కమిటీ హాలులో ప్రజెంటేషన్, అసెంబ్లీ హాలులో చర్చ జరపాలని తాము సూచించినా ప్రభుత్వం పట్టించుకోలేదని షబ్బీర్ అలీ ఆవేదన వ్యక్తం చేశారు. పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌కు దూరంగా ఉండటం ద్వారా కాంగ్రెస్ పారిపోవటం లేదని, అసెంబ్లీ గౌరవాన్ని కాపాడటానికే దూరంగా ఉన్నాం అని ఆయన స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ మొండిగా వ్యవహరించి సభలోనే ప్రజెంటేషన్ ఇవ్వడం, ఆయన చెప్పినట్లుగానే సభ జరగాలనడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. -
ప్రతిపక్షాలకు అవకాశం లేకుంటే సభలో ఎందుకు..?
♦ సాగునీటి ప్రాజెక్టులపై ప్రభుత్వ ప్రెజెంటేషన్‌కు వ్యతిరేకత ♦ సభలో సమయం ఇవ్వకుంటే జనంలోకి వెళ్తామంటున్న కాంగ్రెస్ సాక్షి, హైదరాబాద్: సాగునీటి ప్రాజెక్టులపై శాసనసభలో ప్రభుత్వం ఇవ్వదలిచిన పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్‌పై కాంగ్రెస్‌పార్టీలో చర్చ తీవ్రం అవుతోంది. భావితరాలపై కీలకప్రభావం చూపించే సాగునీటి ప్రాజెక్టులపై నిర్ణయాలను తీసుకోవడానికి ముందు ప్రతిపక్షాలను విశ్వాసంలోకి తీసుకోకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్న ప్రభుత్వం.. ఇప్పుడు చర్చకు పెట్టడం వల్ల ప్రజలకు ఉపయోగం లేదని కాంగ్రెస్‌పార్టీ వాదిస్తోంది. తెలంగాణలోని ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, నల్లగొండ, రంగారెడ్డి, వరంగల్ జిల్లాలపై ప్రభావం చూపించే ప్రాణహిత డిజైన్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ ఇష్టం వచ్చినట్టుగా మార్చేశారని కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తోంది. ముఖ్యమంత్రిగా వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి ఉన్నప్పుడు తమ్మిడిహెట్టి వద్ద 152 మీటర్ల ఎత్తుతో నిర్మించ తలపెట్టిన ప్రాణహితను 148 మీటర్లకు తగ్గించడం వల్ల తెలంగాణకు భవిష్యత్తులో తీవ్ర నష్టమని, దీన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. అయితే ప్రాణహిత ప్రాజెక్టు ఎత్తును 4 మీటర్ల మేర తగ్గిస్తూ మహారాష్ట్రతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం చేసుకోవడాన్ని సమర్థించుకోవడానికి శాసనసభను వేదికగా చేసుకోవాలనే వ్యూహంతో సీఎం కేసీఆర్ ఉన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ అంచనా వేస్తోంది. ప్రాణహిత ఎత్తును తగ్గిస్తూ తెలంగాణ ప్రయోజనాలను సీఎం కేసీఆర్ తాకట్టుపెట్టారనే ప్రచారం క్రమంగా ప్రజల్లోకి వెళుతున్నదని.. దీనికి భయపడిన ప్రభుత్వం పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా దాన్ని అడ్డుకోవాలని అనుకుంటుందని కాంగ్రెస్‌పార్టీ సీనియర్ ఎమ్మెల్యేలు విశ్లేషిస్తున్నారు. ప్రజెంటేషన్‌పై చర్చకు ఒత్తిడి అధికారపక్షమే ఏకపక్షంగా తన వాదనను శాసనసభలో వినిపించి, ప్రతిపక్షాల వాదనలను వినిపించకుండా గొంతునొక్కే కుట్రలకు దిగుతుందని కాంగ్రెస్ పార్టీ అంచనా వేస్తోంది. దీనిని అడ్డుకునేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరించాలని, అవసరమైతే శాసనసభలో మిగిలిన పార్టీలతో సమన్వయం చేసుకుని ఈ అంశంపై చర్చకు ఒత్తిడి తేవాలని భావిస్తోంది. ‘ఒక్క అధికారపక్ష వాదనకే పరిమితమై పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వాలనుకుంటే కమిటీ హాలులోనూ, పార్టీ కార్యాలయంలోనూ చేసుకోవచ్చు. శాసనసభలోనే మాట్లాడాలనుకుంటే సభలోని అన్ని పక్షాలకు సమానమైన అవకాశం, సమయం ఇవ్వాలి. 152 మీటర్లున్న ప్రాజెక్టు ఎత్తును 148 మీటర్లకు ఎందుకు తగ్గించిందో? తమ్మిడిహెట్టి వద్ద 152 మీటర్ల ఎత్తుతో ప్రాజెక్టును నిర్మిస్తే గ్రావిటీ ద్వారా వచ్చే అవకాశముంది. అలా కాకుండా గోదావరిపై కిందభాగంలో తక్కువ ఎత్తు ప్రాజెక్టులను నిర్మించడం వల్ల శాశ్వతంగా లిఫ్టుల ద్వారా నీటిని అందించాల్సి ఉంటుంది. సహజంగా నీటి పారుదలను కాదని, లిఫ్టులను నిర్మించడం, వాటికి శాశ్వతంగా నిర్వహణ వ్యయం వంటి పెనుభారాలను రాష్ట్ర ప్రజలపై మోపాల్సిన అవసరం ఏమిటి? ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే నిర్ణయం తీసుకుంటుంది. తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఇందుకు భిన్నంగా 152 మీటర్ల ప్రాజెక్టు ఎత్తును తగ్గిస్తూ 148 మీటర్లకు అంగీకరిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. తెలంగాణ ప్రజలకు అన్యాయం చేస్తూ, తెలంగాణ ప్రభుత్వమే మహారాష్ట్ర ప్రతినిధిగా వ్యవహరించింది. పాలమూరు ఎత్తిపోతల పథకంలోనూ జూరాల నుంచి కాకుండా శ్రీశైలం నుంచి ఎత్తిపోతలకోసం లిఫ్టులను నిర్మించాలని ప్రతిపాదించింది. దీనివల్ల కూడా ఇలాంటి సమస్యలు వస్తాయి. వీటిని శాసనసభలో మాట్లాడే విధంగా ప్రతిపక్షాలకు అవకాశం ఇస్తామంటే శాసనసభలో అధికారపక్షం చేస్తున్న ప్రతిపాదనను అంగీకరిస్తాం. లేకుంటే అడ్డుకోవడానికి అన్ని మార్గాలను అనుసరిస్తాం. అవసరమైతే జనంలోకి వెళ్తాం’ అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ శాసనసభ్యుడొకరు స్పష్టం చేశారు. అయితే ప్రతిపక్షాల అభిప్రాయాలను పట్టించుకోకుండా, అధికారపక్షం ఏకపక్షంగా వ్యవహరిస్తే ఈ అంశాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుపోతామని చెప్పారు. -
ఎత్తిపోతలపై సీఎం ‘పవర్’ పాయింట్!
- నిర్మాణంలో ఉన్న, నిర్మాణం చేయనున్న16 ప్రాజెక్టులకు 10 వేల మెగావాట్లు అవసరమని ప్రభుత్వ అంచనా - ఈ జూన్ నాటికే 2 వేల మెగావాట్ల విద్యుత్ అవసరం - ఏటా విద్యుత్ వినియోగానికి అవసరమయ్యే ఖర్చు రూ.12 వేల కోట్లపైనే - అంచనాలు సిద్ధం చేసిన నీటి పారుదల శాఖ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎత్తిపోతల ప్రాజక్టులకు విద్యుత్ అవసరాలు హెచ్చుగానే ఉండనున్నాయి. ఇప్పటికే నిర్మాణంలో ఉన్న, నిర్మాణం చేయనున్న 16 ప్రాజెక్టులకు 10 వేల మెగావాట్లకుపైగా విద్యుత్ అవసరం ఉంటుందని అంచనా. ఈ ఏడాది జూన్-జులై నాటికి అందుబాటులోకి వచ్చే ఎత్తిపోతల పథకాలకు సుమారు 2 వేల మెగావాట్ల విద్యుత్ అవసరం ఉంటుందని నీటి పారుదల శాఖ నివేదిక తయారు చేసింది. ఈ ఎత్తిపోతల విద్యుత్ అవసరాలు, వాటికయ్యే ఖర్చు తదితరాలపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తన ‘పవర్’ పాయింట్ ప్రజెంటేషన్‌లో వివరణ ఇచ్చే అవకాశం ఉంది. 16 ఎత్తిపోతల ప్రాజెక్టులతో సుమారు 50 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు ఇవ్వాలని, మరో 3 లక్షల ఎకరాలను స్థిరీకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఎత్తిపోతల పథకాలతో సుమారు 507 టీఎంసీల నీటిని వినియోగంలోకి తేవాలని లక్ష్యంగా నిర్ణయించింది. ప్రాణహిత, కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి వంటి ఎత్తిపోతల పథకాలను మినహాయిస్తేనే పాక్షికంగా నిర్మితమైన దేవాదుల, ఎల్లంపల్లి, భీమా, కల్వకుర్తి, నెట్టెంపాడు, సీతారామ ప్రాజెక్టులకే సుమారు 2,800 మెగావాట్ల వరకు విద్యుత్ అవసరం ఉంది. కొత్తగా చేపట్టిన ప్రాణహిత, కాళేశ్వరాలకు సుమారు 3,640 మెగావాట్లు, పాలమూరు, డిండికి కలిపి 3,500 మెగావాట్లు అవసరమని అధికారులు లెక్కించారు. ప్రస్తుతం కొనసాగుతున్న ప్రాజెక్టులన్నీ వినియోగంలోకి వచ్చి 9,975 మెగావాట్ల విద్యుత్‌ను వాడుకుంటే యూనిట్‌కు రూ.5 చొప్పున చెల్లించినా ఏటా మొత్తంగా సుమారు రూ.12 వేల కోట్ల భారం ఉంటుందని నీటిపారుదల శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఈ విద్యుత్ అవసరాలను తీర్చేందుకు ప్రభుత్వం యాదాద్రి, భద్రాద్రి, సింగరేణి-జైపూర్, ఎన్టీపీసీ విద్యుత్ ప్లాంట్ల నిర్మాణాలను చేపట్టేందుకు కసరత్తు చేస్తోంది. అయితే ఏ జిల్లా ఎత్తిపోతల పథకాల అవసరాలను ఎలా తీర్చుతామన్న దానిపై సీఎం స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. -
ఎమ్మెల్యేల కోసం జబర్దస్త్.. జలపాఠం!
- ఈ నెల 30 లేదా 31 తేదీల్లో ప్రకటించనున్న ముఖ్యమంత్రి - అసెంబ్లీ, మండలిలో వేర్వేరుగా జల విధానం ప్రకటన - తర్వాత అఖిలపక్ష భేటీలో పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ - జల విధానంలో ప్రాజెక్టుల రీ డిజైనింగ్.. కొత్త లక్ష్యాల విశ్లేషణ - జిల్లాలవారీగా ప్రణాళికల తయారీ.. కృష్ణా, గోదావరిలో మన వాటాను సంపూర్ణంగా వాడుకోవడమే లక్ష్యం - ప్రతి నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు - ప్రెజెంటేషన్‌లో అన్ని అంశాలను సమగ్రంగా వివరించండి అధికారులకు సీఎం దిశానిర్దేశం సాక్షి, హైదరాబాద్: కృష్ణా, గోదావరి నదీ జలాల్లో రాష్ట్రానికి ఉన్న నిర్ణీత వాటాలను సంపూర్ణంగా వినియోగంలోకి తెచ్చేలా ప్రభుత్వం సాగునీటి జల విధాన ప్రణాళికను సిద్ధం చేసింది. ప్రతి నియోజకవర్గంలో లక్ష ఎకరాల భూమిని సాగులోకి తేవడమే లక్ష్యంగా జిల్లాల వారీగా ప్రణాళిక రూపొందించింది. ఈ సమగ్ర జల విధానాన్ని త్వరలోనే ఆవిష్కరించనుంది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సూచనల మేరకు ఇరిగేషన్ విభాగం ఇందుకు సంబంధించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ను సిద్ధం చేసింది. దాదాపు వందకుపైగా టెంప్లెట్లతో ఈ ప్రజెంటేషన్‌ను తయారుచేసింది. రాష్ట్ర భౌగోళిక పరిస్థితులతోపాటు హైదరాబాద్ రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రంలో విలీనమైనప్పుడు సాగునీటి ప్రాజెక్టులకు జరిగిన అన్యాయాన్ని ఇందులో చూపింది. దీంతోపాటు తెలంగాణ ప్రాజెక్టులపై నిర్లక్ష్యం, నిరాదరణను ప్రస్తావించింది. ప్రాజెక్టులను ఎందుకు రీడిజైన్ చేయాల్సి వచ్చిందనే అంశాన్ని ఉటంకించింది. జిల్లాల వారీగా ఆయకట్టు వివరాలు, ప్రాజెక్టుల అంచనా వ్యయం, కొత్తగా సమకూరే ఆయకట్టు, ఎత్తిపోతల పథకాలకు అవసరమయ్యే విద్యుత్ అవసరాలను అందులో పేర్కొన్నారు. వీటితో పాటు జిల్లాల వారీగా ప్రాజెక్టులు, వాటి పరిధిలోని ఆయకట్టు, కొత్త ప్రాజెక్టులు, రీడిజైనింగ్ ద్వారా ఒనగూరే ప్రయోజనాలను విడివిడిగా సమగ్రంగా విశ్లేషించింది. రీడిజైనింగ్ ఎందుకంటే..? ప్రాజెక్టుల రీడిజైనింగ్ అవశ్యకతను జలవిధానంలో వివరించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గోదావరి, కృష్ణా జలాలను నేరుగా లేదా పరోక్షంగా మళ్లించుకునే ఆలోచనతోనే ప్రాణహిత-చేవెళ్ల, దేవాదుల, కంతనపల్లి, దుమ్ముగూడెం-నాగార్జునసాగర్ టెయిల్‌పాండ్ ప్రాజెక్టులు తలపెట్టాయని అందులో పేర్కొన్నారు. భవిష్యత్తులో ఎప్పటికీ ఈ ప్రాజెక్టులు పూర్తవకుండా అంతర్రాష్ట్ర వివాదాలు, చిక్కులతో ముడిపెట్టి జటిలం చేశారని వివరించారు. ప్రాణహిత- చేవెళ్ల, కంతనపల్లి ప్రాజెక్టుల ముంపు ప్రాంతం, హద్దులపై పొరుగు రాష్ట్రంతో సంప్రదించకుండానే నిర్ణయించుకున్నారన్నారు. ఎత్తిపోతలకు అవసరమయ్యే నీరు అందుబాటులో ఉంటుందా.. ఏడాదిలో ఎంత కాలం నీరు నిల్వ ఉంటుందనే కనీస అంచనా లేకుండానే దేవాదులకు డిజైన్ చేశారని పేర్కొన్నారు. మొత్తమ్మీద రాష్ట్ర వాటా కింద ఉన్న ప్రతి నీటి చుక్కను ఆయకట్టుకు మళ్లించడం, అవసరాలకు తగ్గట్టుగా నిల్వ చేసుకునేలా ప్రణాళిక రూపొందించింది. ఎంసీహెచ్ఆర్డీలో ప్రజెంటేషన్ ఈ నెల 30 లేదా 31వ తేదీల్లో అసెంబ్లీలో ఉభయ సభల సంయుక్త సమావేశం ఏర్పాటు చేసి జల విధానాన్ని ఆవిష్కరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ భావించారు. కానీ నిబంధనల దృష్ట్యా ఉభయ సభల సమావేశం వీలుకాక పోవడంతో అసెంబ్లీ, మండలిలో జల విధానంపై వేర్వేరుగా ప్రకటనలు చేయాలని నిర్ణయించారు. తర్వాత ఎంసీహెచ్ఆర్డీలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేలా కార్యాచరణ రూపొందించారు. అన్ని పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు అఖిలపక్ష నేతలను దీనికి ఆహ్వానించే అవకాశం ఉంది. గత అసెంబ్లీ సమావేశాల సందర్భంలోనే జల విధానాన్ని ప్రకటించాలని ప్రభుత్వం భావించింది. కానీ ప్రతిపక్షాలు రైతు రుణమాఫీ అంశంపై సభకు అడ్డుపడటం, ఉభయ సభల సమావేశంపై మల్లగుల్లాలతో వెనక్కి తగ్గింది. అన్ని అంశాలను ప్రజల ముందుంచండి రాష్ట్ర జల విధానం ప్రకటించనున్న నేపథ్యంలో శుక్రవారం ముఖ్యమంత్రి కేసీఆర్ క్యాంపు కార్యాలయంలో నీటి పారుదల శాఖ అధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈఎన్సీ మురళీధర్, విజయ్ప్రకాశ్తోపాటు ప్రాణహిత సీఈ హరిరామ్, కాళేశ్వరం సీఈ వెంకటేశ్వర్లు, ఎస్సారెస్పీ సీఈ శంకర్‌తోపాటు ఇతర శాఖల అధికారులు హాజరయ్యారు. కాళేశ్వరం, ప్రాణహిత, తుపాకులగూడెం బ్యారేజీలకు త్వరగా టెండర్లు పిలవాలని సీఎం ఈ సందర్భంగా అధికారులకు సూచించారు. ఇప్పటికే నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులతోపాటు కొత్త వాటిని నిర్మించి మొత్తంగా 1.12 కోట్ల ఎకరాలకు నీరివ్వాలని, తద్వారా ప్రతి నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు నీరిచ్చేలా కార్యాచరణ ఉండాలని సూచించారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు రీ డిజైనింగ్‌లో భాగంగా చేపట్టిన కాళేశ్వరం ఎత్తిపోతల ద్వారా ఇప్పటికే ఉన్న నిర్ణీత 16.4 లక్షల ఎకరాల ఆయకట్టుతో పాటు శ్రీరాంసాగర్, సింగూరు, నిజాంసాగర్ ఆయకట్టుకు నీరందించే ప్రణాళికను ప్రజల ముందు పెట్టాలని సీఎం సూచించినట్లు సమాచారం. ప్రాణహిత ద్వారా ఆదిలాబాద్ జిల్లాలో గతంలో నిర్ణయించిన 56 వేల ఎకరాల కన్నా అధికంగా 1.44 లక్షల ఎకరాలకు నీరందించే ప్రణాళికలను వివరించాలన్నారు. చొక్కారావు దేవాదుల ప్రాజెక్టు ఆయకట్టును ఇందిరమ్మ వరద కాల్వ(ఎఫ్ఎఫ్సీ) పరిధిలోకి తెచ్చేందుకు కారణాలేమిటీ, దేవాదుల కింద నిర్ణయించిన ఆయకట్టులోంచి 1.90 లక్షల ఎకరాలను వరద కాల్వలోకి ఎలా మారుస్తారో స్పష్టంగా తెలియజేయాలని సమావేశంలో నిర్ణయించారు. కంతనపల్లికి ప్రత్యామ్నాయంగా వచ్చిన తుపాకులగూడెం ప్రాజెక్టుతో ఎస్సారెస్పీ ఆయకట్టు స్థిరీకరణ, 50 టీఎంసీలను హైదరాబాద్ తాగునీటి అవసరాలకు మళ్లించుకునే అవకాశాలను ప్రజెంటేషన్‌లో పొందుపరచాలని సీఎం అధికారులకు సూచించారు. గవర్నర్‌తో సీఎం భేటీ సీఎం కేసీఆర్ గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌తో భేటీ అయ్యారు. శుక్రవారం మధ్యాహ్నం రాజ్‌భవన్‌కు వెళ్లిన సీఎం దాదాపు రెండు గంటల పాటు గవర్నర్‌తో సమావేశమయ్యారు. బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న తీరు, రాష్ట్రంలో తాజా పరిస్థితులు, సమగ్రజల విధానంపై వీరిరువురు చర్చించినట్లు సమాచారం. ఇటీవల కంటి ఆపరేషన్ చేయించుకున్న గవర్నర్ సతీమణి విమలా నరసింహన్‌ను ఈ సందర్భంగా సీఎం పరామర్శించినట్లు తెలిసింది. -
జిల్లాకు కేంద్ర బృందం
భువనగిరి : ఉపాధి హామీ పథకంలో జాతీయస్థాయిలో గుర్తింపు పొందిన జిల్లాకు కేంద్ర బృందం వారం రోజుల్లో రానుంది. ఉపాధి హామీ పథకంలో ఉత్తమ ఫలితాలను సాధించి జాతీయస్థాయిలో ఎంపికైన 11 జిల్లాల్లో మన జిల్లా ఉంది. ఇటీవల కలెక్టర్ చిరంజీవులు ఢిల్లీ వెళ్లి జిల్లాలో ఉపాధి హామీ పనులు జరుగుతున్న తీరును పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. 2013- 14 ఆర్థిక సంవత్సరానికి పనులు జరిగిన తీరు, రికార్డుల నిర్వహణ, కూలి చెల్లింపు, పనుల ద్వా రా జరిగిన అభివృద్ధి అంశాలను పరిగణలోకి తీసుకున్నారు. ఇందులో మెరుగైన ఫలితాలను సాధించినట్లు అధికారులు నివేదికలు ఉండడంతో వాటిని అధ్యయనం చేయడానికి కేంద్రబృందం వచ్చే వారంలో రాబోతుంది. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో అధికారుల బృందం ఎంపిక చేసిన మండలాల్లో పర్యటించనుంది. ప్రధానంగా పండ్లతోటల పెంపకం, పందిరి కూరగాయల సాగు, భూమి అభివృద్ధి, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, డంపింగ్ యా ర్డు, టేకు మొక్కల పెంపకం తదితర పనులు జరిగిన తీరును పరిశీలించనున్నారు. ఇందుకోసం జిల్లా అధికారులు కొన్ని గ్రామాలను ఎంపిక చేశారు. భువ నగిరి మండలం రెడ్డినాయక్ తండాలో హార్టికల్చర్, బొమ్మలరామారం మం డలం జలాల్పూర్లో పందిరి కూరగాయల సాగు, భూమి అభివృద్ధి, ఆలేరు మండలం బహుద్దూర్పేటలో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, డంపింగ్ యార్డులో జరిగిన పనులను పరిశీలించే అవకాశం ఉంది. ఇవేకాకుండా జిల్లాలోని మరికొన్ని మండలాల్లో కేంద్ర బృందం పర్యటించే అవకాశం ఉంది. బహుద్దూర్పేటలో వందశాతం మరుగుదొడ్లు ఉపాధి హామీకింద ఇంటింటికి మరుగుదొడ్డి నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయిం చింది. దీంతో ఇప్పటికే పలువురు మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టి ఆర్థిక స్థోమత లేకపోవడంతో అర్ధంతరంగా నిలిపివేశారు. గ్రామ సర్పంచ్ జంపాల దశరథ గ్రామస్తులను ఒప్పించి ఉపాధి హామీ పథకంలో మరుగుదొడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఒక్కో మరుగుదొడ్డికి రూ.5 వేల చొప్పున రుణం తీసుకున్న గ్రామస్తులు మిగ తా డబ్బులు నిర్మాణం పూర్తయిన తర్వాత బిల్లు రాగానే డబ్బులు ఇస్తామన్న ఒప్పందంతో వాటిని పూర్తి చేసుకున్నారు. దీంతోపాటు గ్రామంలో డంపింగ్ యార్డు ఏర్పాటు చేశారు. చెత్త సేకరణకు రిక్షాలను కొనుగోలు చేసి వాటి ద్వారా రోజూ ఇళ్ల నుంచి చెత్తను సేకరించి డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. ఈ రెండు అంశాల ఆధారంగా ఈ గ్రామానికి కేంద్ర అధికారుల బృందం రానుంది. పరిశీలనకు వచ్చే ఆవకాశం ఉంది : శ్యామల ఏపీడీ, భువనగిరి ఉపాధి హామీ పథకంలో చేపట్టిన పనులను పరిశీలించడానికి కేంద్ర అధికారు ల బృందం వచ్చే సోమ లేదా మంగళవారాల్లో రానున్నదని సమాచారం. కేంద్ర అధికారులు ఇక్కడ ఉపాధి హామీలో చేపట్టిన పనులను చూడడానికి వస్తున్నారని సమాచారం ఉంది. ఆదర్శంగా ఉండాలనే : జంపాల దశరథ, సర్పంచ్, బహుద్దూర్ పేట మా గ్రామం అభివృద్ధితోపాటు, ఆదర్శంగా ఉండాలనే వ్యక్తిగత మరుగుదొడ్లు, ఇంటింటి చెత్త సేకరణ, డంపింగ్ యార్డు పనులను ఉపాధిహామీలో చేపట్టాం. ప్రధాన మంత్రి మోదీ చెప్పిన ‘స్వచ్ఛభారత్’ మా ఊర్లో రోజూ జరుగుతోంది. -
బ్యాంక్ ఉద్యోగం..ప్రణాళిక ముఖ్యం
కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: చక్కని ప్రణాళిక ఉంటే బ్యాంక్ ఉద్యోగం సాధించడం అంత కష్టమేమీ కాదని ట్రూఫెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్(టైమ్) ఫ్యాకల్టీ ప్రొఫెసర్ రామన్ తెలిపారు. అలాగే అభ్యర్థుల్లో పట్టుదల, క్రమశిక్షణ కూడా ముఖ్యంగా ఉండాలని చెప్పారు. కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో సాక్షి, టీఐఎంఇ సంయుక్తంగా శనివారం బ్యాంక్ ప్రొబేషనరీ ఆఫీసర్స్, క్లరికల్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్షలు, అలాగే ఐసెట్‌కు ఎలా సిద్ధం కావాలనే విషయంపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. రెండుపూటల జరిగిన ఈ సదస్సుకు దాదాపు 800 మంది డిగ్రీ, ఇంజనీరింగ్ విద్యార్థులు హాజరయ్యారు. ఈ సదస్సులో బ్యాంకు ఉద్యోగాలకు సంబంధించి నమూనా పరీక్ష నిర్వహించి ప్రశ్నపత్రం ఏ విధంగా ఉంటుందనే దానిపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ రామన్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని దానిని సాధించేందుకు క్రమశిక్షణతో చదవాలని తెలిపారు. బ్యాంకింగ్ రంగంతోపాటు ప్రభుత్వ ఉద్యోగాలూ భారీగానే ఉన్నాయని చెప్పారు. ఆంగ్లం, గణితం, లాజిక్ రీజనింగ్‌లో పట్టు ఉంటే ఉద్యోగాలు సాధించడం తేలిక అవుతుందని పేర్కొన్నారు. ఇంజనీరింగ్ విద్యార్థులు కూడా బ్యాంకు ఉద్యోగాలు, ఇతర ప్రభుత్వ ఉద్యోగాల వైపు దృష్టి సారించాలని సూచించారు. బ్యాంకు ఉద్యోగాలకు సంబంధించిన ప్రశ్నలు పదో తరగతి స్థాయిలోనే ఉంటాయని, అయితే సమయం తక్కువ పోటీ ఎక్కువగా ఉండటంతో కొంత గందరగోళానికి గురవుతుంటారని తెలిపారు. నిర్ణీత సమయంలో పరీక్ష రాయడానికి తగిన క్రమశిక్షణ, ప్రణాళిక అవసరమని పేర్కొన్నారు. వివిధ పోటీ పరీక్షలు రాయడానికి ఎలా ప్రణాళిక రూపొందించుకోవాలో వివరించారు. బ్యాంకు ఆఫీసర్‌గా ఉద్యోగంలో చేరి చైర్మన్ హోదాలను పొందే అవకాశం ఉందన్నారు. ఇంటర్వ్యూ అంటే భయపడాల్సిన అవసరం లేదని, అది ముఖాముఖిగా మాట్లాడుకోవడమే అని తెలుసుకోవాలన్నారు. ఐ-సెట్, స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ సీజీఎల్ పరీక్షలకు ఏ విధంగా సిద్ధం కావాలనే పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ కార్యక్రమంలో టీఐఎంఇ ప్రతినిధులు కిరణ్, పవన్, హితేందర్, సత్యనారాయణ, ప్రేమ్‌సాయి, నజీర్ తదితరులు పాల్గొన్నారు. సదస్సు ద్వారా తాము ఎన్నో విషయాలు తెలుసుకున్నామని విద్యార్థులు తెలిపారు.