కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్
విద్యుత్ రంగంపైనా ఇవ్వాలని పీసీసీ నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో విద్యుత్ రంగం, కాళేశ్వరం ప్రాజెక్టులపై వేర్వేరుగా రెండు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌లను ఇవ్వాలని పీసీసీ నిర్ణయించింది. తెలంగాణ ఏర్పాటయ్యేనాటికి రాష్ట్రంలో పూర్తయిన విద్యుత్ ప్రాజెక్టులు, పూర్తికావచ్చిన ప్రాజెక్టులు, ఉత్పత్తి అయ్యే విద్యుత్ వంటి వివరాలను ప్రజల ముందు ఉంచడానికి భారీ కసరత్తు చేసింది. యూపీఏ అధికా రంలో ఉన్నప్పుడు తీసుకున్న చర్యల కార ణంగా ప్రస్తుతం దేశంలో విద్యుత్ మిగులు ఉందని, దేశవ్యాప్తంగా 50 వేల మెగావాట్ల మిగులు ఉందని పీసీసీ వర్గాలు చెబుతు న్నాయి. ఈ నేపథ్యంలో టీఆర్‌ఎస్ అధికా రంలోకి వచ్చిన తర్వాత కొత్త ప్రాజెక్టులేమీ రాకున్నా కరెంటును ఇవ్వడానికి కారణ మిదేనని, ఈ విషయాన్ని క్షేత్రస్థాయిలో విస్తృతంగా ప్రచారం చేయడానికి ప్రజెంటేషన్‌ను రూపొందించారు.
ఆరునెలల ముందుగానే మేనిఫెస్టో, అభ్యర్థులు...
ఎన్నికలకు ఆరు నెలలు ముందుగానే అభ్య ర్థులను ప్రకటించాలని పీసీసీ నిర్ణయిం చింది. అభ్యర్థులను ప్రకటించి, మేనిఫెస్టో విడుదల చేసి, ప్రజల్లోకి పోవాలని నిర్ణయిం చింది. దీనికి అనుగుణంగానే ఇప్పటికే పలు నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటిం చినట్టుగా పీసీసీ నేతలు వెల్లడించారు. నర్సాపూర్, హుజూరాబాద్ వంటి స్థానా లకు అభ్యర్థుల పేర్లను ఈ నిర్ణయంలో భాగంగానే ప్రకటించినట్టుగా తెలిపారు. ఈనెల 15 లోగా కాంగ్రెస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పూర్తి చేయాలని పీసీసీ నిర్ణయించింది. దీనికి అనుగుణంగా డీసీసీ లకు సూచనలను ఇచ్చింది.