ఖర్చు బారెడు.. లబ్ధి మూరెడు..!
► కాళేశ్వరం ప్రాజెక్టుపై నిపుణుల అభిప్రాయం
► టీజేఏసీ ఆధ్వర్యంలో పవర్‌పాయింట్ ప్రజెంటేషన్
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం చేపడుతున్న కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ప్రజలపై అదనపు భారం తప్పితే ప్రయోజనమేమీ లేదని సాగునీటి రంగ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రాజెక్టు అంచనా వ్యయం, దాని కింది ఆయకట్టును పరిగణనలోకి తీసు కుంటే ఏటా ప్రాజెక్టు నిర్వహణకయ్యే ఖర్చు రూ.17వేల కోట్లు ఉంటుందని, ఆదాయం మాత్రం రూ.4 వేల కోట్లేనని తేల్చి చెప్పారు. భవిష్యత్తులో ప్రాజెక్టు వ్యయం పెరిగితే నిర్వహణ భారం రూ.33వేల కోట్లకు పెరగొ చ్చని హెచ్చరించారు. ఆదివారం తెలంగాణ జేఏసీ ఆధ్వర్యంలో ‘కాళేశ్వరం ఎత్తిపోతల రాష్ట్రానికి మేలు చేస్తుందా’ అన్న అంశంపై టీజేఏసీ నివేదిక విడుదల చేసింది. అస్కీ మాజీ డీన్ గౌతమ్ పింగలే నివేదికను విడు దల చేయగా, నీటి పారుదల, విద్యుత్ రంగ నిపుణులు గుజ్జా భిక్షం, శివకుమార్, కె.రఘు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
డీపీఆర్ లేకుండానే..
‘ఏ నిర్మాణం చేపట్టినా డీపీఆర్‌లు తప్పని సరి. కానీ ఈ ప్రాజెక్టు డీపీఆర్ ఇప్పటికీ అం దుబాటులో లేదు. మేడిగడ్డతోపాటు తమ్మి డిహెట్టి వద్ద కూడా నీటి లభ్యత ఉంది. తమ్మిడిహెట్టి వద్ద గరిష్టంగా రోజుకు 2 టీఎం సీల చొప్పున 165 రోజులు, కనిష్టంగా 81 రోజులు నీటిని తీసుకో వచ్చు. సరాసరి 177 టీఎంసీల లభ్యత అక్కడ ఉంది’ అని నిపుణులు తెలిపారు.
పొంతనెక్కడ..?
కాళేశ్వరం వ్యయం, ఆదాయం, విద్యుత్ ఖర్చులను నిపుణులు వివరించారు. ‘ప్రస్తుత అంచనాల ప్రకారం కాళేశ్వరం వ్యయం రూ.71,600 కోట్ల వరకు ఉంది. ఆ ప్రకారం ఏటా రూ.2వేల కోట్ల నుంచి 4వేల కోట్ల ఆదాయమే వస్తుంది. నిర్వహణకు 17 వేల కోట్ల ఖర్చవుతుంది. ప్రాజెక్టు పూర్త య్యే నాటికి వ్యయం రూ.1.50 లక్షల కోట్లకు చేరితే ఏటా ఖర్చు రూ.33,070 కోట్లకు పెరగొచ్చు. మల్లన్న సాగర్ వంటి ప్రాజెక్టు ప్రపంచంలోనే ఎక్కడా లేదు’ అన్నారు.
ఖర్చు తగ్గించాలి: కోదండరాం
‘కాళేశ్వరం నిర్మాణంలో ఖర్చు తగ్గించుకునే యత్నాలు చేయాలి. శాస్త్రీయ అధ్య యనం, హేతుబద్ధ జరిగాక ముందుకు పోవాలి’ అని కోదండరాం అన్నారు.