‘కాళేశ్వరంపై కోదండరాం వ్యాఖ్యలు తగవు’ | Chandramouli on kodandaram's commentes on kaleswaram project | Sakshi
Sakshi News home page

‘కాళేశ్వరంపై కోదండరాం వ్యాఖ్యలు తగవు’

Published Tue, May 1 2018 12:58 AM | Last Updated on Mon, Jul 29 2019 2:51 PM

Chandramouli on kodandaram's commentes on kaleswaram project

సాక్షి, హైదరాబాద్‌: కాళేశ్వరం ప్రాజెక్టుపై తెలంగాణ జన సమితి పార్టీ అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరాం చేసిన ఆరోపణలు సరికావని తెలంగాణ రిటైర్డ్‌ ఇంజనీర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు సంగెం చంద్రమౌళి, ప్రధాన కార్యదర్శి మేరెడ్డి శ్యాంప్రసాద్‌రెడ్డి అన్నారు. ప్రాజెక్టుపై ఆయన వ్యక్తం చేసిన అనుమానాలను నివృత్తి చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు.

కాళేశ్వరం రీ డిజైన్‌లో భాగంగా నిర్మిస్తున్న మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల ద్వారా ఎలాంటి ముంపు లేకుండా రోజుకు 2 టీఎంసీల నీటిని 90 రోజుల పాటు తరలించవచ్చని తెలిపారు. గోదావరిలో 365 రోజులు నీరు ఉండటంతో 150 కి.మీ. మేర అంతర్గత జల రవాణా అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. ఈ జలాశయాల్లో చేపల పెంప కం ద్వారా మత్స్య పరిశ్రమ, పర్యాటకాన్ని అభివృద్ధి చేయడం ద్వారా ప్రజలకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement