Chandramouli
-
లోకేష్ సన్నిహితుడు గుణ్ణం చంద్రమౌళి ఇంట్లో ఐటీ సోదాలు
-
టీటీడీ ఈవో ధర్మారెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన సీఎం జగన్
-
టీటీడీ ఈఓ ధర్మారెడ్డి కుమారుడి నేత్రదానం
సాక్షి, తిరుమల: తాను కన్నుమూసినా.. మరొకరికి చూపునివ్వాలన్న సంకల్పంతో టీటీడీ ఈఓ కుమారుడు నేత్రదానం చేశారు. వివరాల్లోకి వెళితే.. టీటీ డీ ఈఓ ఏవీ ధర్మారెడ్డి కుమారుడు చంద్రమౌళిరెడ్డి బుధవారం ఉదయం చెన్నై కావేరి ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆయన ఆదివారం మధ్యాహ్నం కార్డియాక్ అరెస్ట్‌తో కావేరి ఆస్పత్రిలో చికిత్సకోసం చేరారు. (టీటీడీ ఈఓ ధర్మారెడ్డి ఇంట్లో విషాదం.. గుండెపోటుతో కుమారుడు మృతి) క్లిష్ట పరిస్థితిలో ఉన్న ఆయన్ను కాపాడడానికి వైద్యులు అనేక రకాల ప్రయత్నాలు చేశారు. అయినప్పటికీ ఆయన తుదిశ్వాస విడిచారు. చంద్రమౌళిరెడ్డి గతంలోనే నేత్రదానానికి అంగీకారం తెలుపు తూ సంతకం చేసినందువల్ల అతని కోరిక మేరకు ఆయన కళ్లను వైద్యులు సేకరించారు. ఇదిలా ఉండగా గురువారం ఉదయం నంద్యాల జిల్లా, నందికొట్కూరు సమీపంలోని పారు మంచ గ్రామంలో చంద్రమౌళిరెడ్డి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. చంద్రమౌళి రెడ్డి మృతికి పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. చదవండి: (తుమ్మలగుంటకు సీఎం జగన్.. ఎమ్మెల్యే చెవిరెడ్డి కుటుంబానికి పరామర్శ) -
ఇది కదా జగనన్న పాలన..
నరసన్నపేట: అర్హత మాత్రమే ప్రామాణికంగా ప్రభుత్వం సంక్షేమ పథకాలను అందజేస్తోందనడానికి ఇది మరో ఉదాహరణ. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం ఉర్లాంలో టీడీపీ సీనియర్ నాయకుడు, తెలుగు రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి, సర్పంచ్ల సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు జల్లు చంద్రమౌళికి మూడున్నరేళ్లుగా ప్రభుత్వం అన్ని సంక్షేమ పథకాలు అందజేస్తోంది. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఆయన ఇంటికి వెళ్లిన ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ ఈ విషయాలన్నీ వివరించారు. చంద్రమౌళికి రైతు భరోసా కింద రూ. 38,500, సున్నా వడ్డీ కింద రూ.1,168, వైఎస్సార్ ఆసరా కింద రూ. 11,640 ప్రయోజనం కలిగినట్లు వివరించారు. బుక్‌లెట్‌ను ఎమ్మెల్యే కృష్ణదాస్ జల్లు చంద్రమౌళికి ఇచ్చారు. ఇది కదా జగనన్న పాలన అంటే.. అని స్థానికులు చర్చించుకున్నారు. -
జైహింద్ స్పెషల్: గాంధీజీ గ్రామ స్వరాజ్యానికి చంద్రమౌళి చెక్ పవర్
మన దేశంలో పంచాయతీ చట్టం 1951 ఏప్రిల్ నుంచి అమల్లోకి వచ్చింది. స్వేచ్ఛా భారతంలో గ్రామాలు ప్రతి చిన్న విషయానికీ రాష్ట్రానికేసి చూడకూడదు, స్వశక్తితో స్వయం పోషకత్వం స్థితికి రావాలనే భావనతో పంచాయతీ చట్టం తీసుకొచ్చింది వుద్రాస్ ప్రావిన్స్. ఈ చట్టానికి ఇప్పుడు 71 ఏళ్లు. 2010 నుంచి ఏటా ఏప్రిల్ 24 న జాతీయ పంచాయతీ దినోత్సవం జరుపుకుంటున్నాం. విశేషం ఏంటంటే.. ఈ చట్టం రూపకల్పన, అవులులో ఒక తెలుగు వ్యక్తి పాత్ర ఉండటం తెలుగు వారందరికీ గర్వకారణం. ఆ వ్యక్తే.. కాంగ్రెస్‌లో తిరుగులేని నాయకుడిగా దశాబ్దాలకాలం పార్టీని ముందుకు నడిపించిన కల్లూరి చంద్రమౌళి. దేశంలో మరే ప్రజాప్రతినిధికీ లేనటువంటి చెక్ పవర్‌ను పంచాయతీ సర్పంచ్‌కు కట్టబెట్టారాయన. చదవండి: హైదరాబాద్‌లో 75 ఫ్రీడమ్ పార్కులు మోపర్రుకు గాంధీజీ! తెనాలికి సమీపంలోని మోపర్రు చంద్రమౌళి స్వస్థలం. 1898లో జన్మించారు. హైస్కూలు విద్యలోనే సంస్కృతాంధ్ర భాషలు అధ్యయనం చేశారు. తెనాలి, గుంటూరు, కలకత్తాలలో విద్యాభ్యాసం జరిగింది. 1919లో వివాహమైంది. 1920లో ఇంగ్లండ్ వెళ్లి అగ్రికల్చర్ బీఎస్సీ చదివి 1924లో ఇండియా తిరిగొచ్చారు. భారతీయ సంస్కృతిని రక్షించాలన్నా, ఇంగ్లండ్ దేశంలా వునదేశం అభివృద్ధి చెందాలన్నా స్వపరిపాలన అవసరవుని ఆయన భావించారు. దేశవ్యాప్తంగా పర్యటించి గాంధీజీ ఆశ్రవూనికి చేరి ఆయన సేవచేశారు. స్వగ్రామం మోపర్రుకు చేరుకుని స్వరాజ్య ఉద్యవూన్ని ఆరంభించారు. 1929లో గాంధీజీని మోపర్రుకు రప్పించారు. తెనాలి నుంచి ఎక్కువవుంది యువకులను స్వరాజ్య ఉద్యవుంవైపు వుళ్లించారు. అనేకసార్లు జైలుకెళ్లారు. 1933–62 వరకు జిల్లా కాంగ్రెస్ రాజకీయాలకు పెద్ద దిక్కుగా నిలిచారు. 1934లో పార్టీ జిల్లా అధ్యక్షుడిగా, జిల్లా కాంగ్రెస్ కార్యాలయాన్ని తెనాలిలోనే ఏర్పాటుచేశారు. తెనాలి కేంద్రంగానే జిల్లా కాంగ్రెస్ రాజకీయాలు నడిపారు. జిల్లా బోర్డు అధ్యక్షుడిగా సావుర్ధ్యాన్ని నిరూపించుకొని 1964లో తెనాలి నుండి శాసనసభ సభ్యునిగా, 1947లో భారత రాజ్యాంగసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 1947 వూర్చిలో ఏర్పాటైన మద్రాస్ ప్రావిన్స్‌లో ఓవుండూరి రావుస్వామి రెడ్డియార్ వుంత్రివర్గంలో స్థానిక స్వపరిపాలన, సహకార వుంత్రిగా నియమితులయ్యారు. స్వరాజ్య ఉద్యవుంలో పాల్గొన్నవారికి భూవుులు ఇచ్చే ఏర్పాటు చేశారు. తర్వాత 1949లో కువూరస్వామి రాజా వుంత్రివర్గంలోనూ సహకార, స్థానిక స్వపరిపాలన వుంత్రిగా పనిచేశారు. సవుగ్ర పంచాయతీ చట్టం మంత్రిగా ఉన్న ఆ సమయంలోనే చంద్రమౌళి వుహాత్మాగాంధీ ప్రధాన ఆశయమైన గ్రామ స్వరాజ్యం కోసం దేశంలోనే మెుదటగా సవుగ్ర పంచాయతీ చట్టాన్ని తీసుకొచ్చారు. ఉమ్మడి మద్రాసు రాష్ట్ర గ్రామ పంచాయతి చట్టం–1950తో గ్రామాలు పంచాయతీలుగా ఏర్పడ్డాయి. వాస్తవమైన అధికారాన్ని ప్రజల చేతుల్లో పెట్టి అన్ని రంగాల్లోనూ గ్రామ జీవనాన్ని వారే నిర్వహించుకొంటూ, గ్రావూల సర్వతోముఖాభివృద్ధికి కృషి జరగాలనేది చట్టం ప్రధాన ఉద్దేశం. అందుకే గ్రామ పంచాయతీ సర్పంచ్‌కు చెక్‌పవర్ కల్పించారు. ఇళ్లు, వ్యవసాయ ఉత్పత్తులు, వూర్కెట్లపై పన్ను వసూలు అధికారాన్ని కల్పించారు. ఆవిధంగా గ్రామ ప్రభుత్వాలు ఆవిర్భవించాయి. రూ.100 వరకు సివిల్ వివాదాలనూ గ్రామ పంచాయతీ కోర్టు పరిధిలోకి తెచ్చారు. నాడు వుద్రాస్ ప్రావిన్సులో తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్ర రాష్ట్రాలుండేవి. స్వయం నిర్ణయ ఉద్దేశం చట్టం అవుల్లోకి వస్తున్నపుడు చంద్రవ˜ళి చేసిన రేడియో ప్రసంగం అప్పట్లో ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. గ్రావుసీవుల అభివృద్ధికి సంబంధించి తన అభిప్రాయాలను ఆయన సూటిగా వెల్లడించారు. ‘‘పంచాయతీలు ప్రతి అల్ప విషయానికి రాష్ట్ర ప్రభుత్వంకేసి చూడరాదు. ప్రతి స్వల్ప విషయం రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహించే ‘కేంద్రీకరణ విధానం’ ప్రజాపాలనకు ప్రధాన సూత్రమైన స్వయం నిర్ణయత్వానికి వుుప్పుతెస్తుంది’’ అన్నారు. ‘‘కొలదివుంది పాలకులు ఎచటనో ఒక చోటు నుండి, సర్వ గ్రావూలకు సంబంధించిన సవుస్యలన్నింటిని పరిష్కరింపబూనుట అసంభవవుు’’గా కూడా తేల్చారు. గ్రామీణ ప్రజలు విద్యావిహీనులు, సదా కలహాలతో కాలం గడుపుతారు... ఇలాంటివారు అధికార నిర్వహణకు అనర్హులు.. అని కొందరు శంకిస్తుంటారని చెబుతూ, ఇది అసవుంజసం అన్నారు. ‘‘చదవను రాయను నేర్చుటయే విద్య కాదు.. ఇట్టి చదువ#కంటే సద్గుణవువసరం. సుచరితులకు సదవకాశ మెుసగినచో సేవాతత్పరులయి, యోగ్యతను బడసి పైకి రాగలరు’’ అన్నారు. ప్రజలు తవుకు విశ్వాసపాత్రులయిన వారినే పంచాయతీ సభ్యులుగా ఎన్నుకుంటారు. ఒకవేళ స్వార్ధపరులనే ఎన్నుకుంటే దాని ప్రతిఫలం వారిని ఎన్నుకున్నవారే అనుభవిస్తారని కూడా చెప్పారు. ప్రజలు తవు అనుభవంతో తప్పులు గ్రహించి సరిదిద్దుకుంటారని చంద్రవ˜ళి భరోసాగా అన్నారు. ప్రభుత్వం చేసిన చట్టం ఉద్దేశం.. గ్రామాలను స్వశక్తితో స్వయం పోషకత్వ స్థితికి తీసుకురావటమే నని చెప్పారు. ఇందుకు సుచరితులు, సుశిక్షితులు అయిన యువకులు అత్యవసరంగా కావాలని అని స్పష్టం చేశారు. – బి.ఎల్.నారాయణ -
పెదపూడి స్థూపం.. స్మారక చిహ్నం
పెదపూడి (తెనాలి): తెనాలికి సమీపంలోని అమృతలూరు మండల గ్రామం పెదపూడి గ్రామ పంచాయతి ఆవరణలో గల సత్రాగ్రహ విజయ స్థూపం ఇప్పుడు జాతీయ దృష్టిని ఆకర్షిస్తోంది. ‘ఆజాదీ కా అమృతోత్సవం’లో భాగంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న ప్రాచీన కట్టడాల గుర్తింపు, పరిరక్షణలో ఈ స్థూపాన్ని చేర్చేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. కేంద్రప్రభుత్వ ఆధ్వర్యంలోని భారత సామాజిక శాస్త్రాల పరిశోధన మండలి గుర్తింపు కలిగిన దేశంలోని ఆరు సంస్థల్లో ఒకటైన తిరుపతి కేంద్రంగా గల భారత గ్రామీణ అధ్యయనం, పరిశోధన అకాడమీ (అగ్రశ్రీ) సంస్థ ఇందుకు పూనుకుంది. పెదపూడిలోని పంచాయతీ కార్యాలయం ఆవరణలో గల స్థూపానికి ఏడు దశాబ్దాల చరిత్ర ఉంది. 25 అడుగుల ఎత్తులో పైభాగాన మూడు సింహాలతో గల స్థూపాన్ని చంద్రమౌళి సత్రాగ్రహ విజయస్థూపంగా పేర్కొంటారు. పెదపూడి నుంచి స్వాతంత్య్ర పోరాటంలో భాగంగా జరిగిన సత్యాగ్రహంలో పాల్గొన్న 16 మంది సత్యాగ్రహుల పేర్లనూ దీనిపై లిఖించారు. నాటి ఉమ్మడి మద్రాస్ ప్రభుత్వంలో పంచాయతీ రాజ్ శాఖ మంత్రి, అమృతలూరు మండలం మోపర్రుకు చెందిన రాజకీయ దిగ్గజం కల్లూరి చంద్రమౌళి స్ఫూర్తితో 1952లో నాటి పెదపూడి పంచాయతీ సర్పంచ్ చదలవాడ వెంకట సుబ్బయ్య ఈ స్థూపాన్ని నిర్మించారు. రఘుపతి రాఘవ రాజారాంతో సహా బాపూజీ సూక్తులను చెక్కించారు. గ్రామ స్వరాజ్యం కోసం కల్లూరి కృషి గాందీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యానికి తొలి పునాదిగా సమగ్ర పంచాయతీ చట్టాన్ని అమల్లోకి తెచ్చిన ధీశాలి కల్లూరి చంద్రమౌళి స్వస్థలం పెదపూడికి సమీపంలోని మోపర్రు. తెనాలి, గుంటూరు, కలకత్తాలో చదివారు. ఇంగ్లండ్‌లో ఉన్నత విద్య చదివారు. అక్కడే ఉద్యోగం వచ్చింది. దేశం కోసం జరిగే పోరాటంలో పాల్గొనాలని భావించి, స్వదేశానికి వచ్చేశారు. దేశవ్యాప్తంగా పర్యటించారు. గాందీజీ ఆశ్రమంలో గడిపారు. స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొని పలుసార్లు జైలుకెళ్లారు. 1933–1962లో జిల్లా కాంగ్రెస్ రాజకీయాలకు పెద్ద దిక్కుగా నిలిచారు. పార్టీ జిల్లా అధ్యక్షుడి హోదాలో 1934లో జిల్లా కాంగ్రెస్ కార్యాలయాన్ని తెనాలిలో ఏర్పాటు చేశారు. జస్టిస్ పార్టీ ఆధిపత్యానికి గండికొట్టి 1937లో మద్రాస్ ప్రావిన్స్‌కు తెనాలి–రేపల్లె నియోజకవర్గ ఎమ్మెల్యేగా, 1938లో జిల్లాబోర్డు అధ్యక్షుడిగా నియమితులయ్యారు. 1945లో ఆంధ్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమితులై, 1946లో మరోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. రాజ్యాంగ పరిషత్ సభ్యుడిగానూ ఎన్నికయ్యారు. 1947 మార్చిలో రామస్వామి రెడ్డియార్ మంత్రివర్గంలో స్థానిక స్వపరిపాలన, సహకారశాఖ మంత్రిగా నియమితులయ్యారు. పంచాయతీ చట్టం రాజ్యాంగ పరిషత్‌లో చట్టరూపం దాల్చలేదని భానవ కలిగిన చంద్రమౌళి, ఉమ్మడి మద్రాసు రాష్ట్ర స్వపరిపాలన మంత్రిగా నియమితులయ్యాక, ఆ చట్టాన్ని తానే రూపొందించారు. మహాత్ముడి ప్రధాన ఆశయమైన గ్రామస్వరాజ్యం కోసం దేశంలోనే మొదటగా సమగ్ర పంచాయతీ చట్టాన్ని తీసుకొచ్చారు. గ్రామాలను పంచాయతీలుగా ఏర్పాటు చేశారు. పంచాయతీలను స్వయంపాలకంగా మార్చటానికి అనేక అంశాలను చేర్చారు. పేదల ఇళ్లపై పన్నుల రాయితీ అధికారాన్ని పంచాయతీలకు కట్టబెట్టారు. సర్పంచ్‌కు చెక్‌పవర్ అప్పగించారు. అన్ని రంగాల్లోనూ గ్రామ జీవనాన్ని వారే నిర్వహించుకుంటూ, గ్రామాల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేయటం చట్టం ప్రధాన ఉద్దేశం. ఇలా గ్రామసీమల అభివృద్ధికి 1950లోనే కల్లూరి చంద్రమౌళి బీజం వేశారు. భారతదేశం రిపబ్లిక్‌గా అవతరించాక కూడా చంద్రమౌళి తనదైన పంథాలోనే పనిచేశారు. 1955లో వేమూరు నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. బెజవాడ గోపాలరెడ్డి మంత్రివర్గంలో రెవెన్యూ, దేవదాయ మంత్రిగా చేశారు. 1960లో దామోదరం సంజీవయ్య మంత్రివర్గంలో దేవదాయ, సహకారశాఖ మంత్రిగా పనిచేశారు. 1962లో మరోసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. తిరుమల తిరుపతి దేవస్థానం అధ్యక్షుడిగానూ వ్యవహరించారు. అధికారంలో ఉన్నంతకాలం ప్రజలకు అవసరమైన సేవలు అందించటంలో చంద్రమౌళి వెనకాడేవారు కాదు. ప్రజాసేవకు ఏవైనా రూల్స్ అడ్డుగా ఉంటే, నిస్సంకోచంగా వాటిని తొలగించమని ఆదేశించేవారు. ‘అయామ్ ది గవర్నమెంట్’ అంటూ భరోసా ఇచ్చేవారు. తిరుగులేని ఆయన నిర్ణయాలకు ఎదురుండేది కాదు. రాజకీయాల్లో నైతిక విలువలకు ప్రాధాన్యతనిచ్చారు. 1965లో రాజకీయాల నుంచి విరమించుకున్నారు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు అవుతున్న సందర్భాన దేశవ్యాప్తంగా స్వాతంత్య్ర అమృతోత్సవాలు జరుగుతున్న వేళ పెదపూడిలోని విజయ స్థూపం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిపై దశాబ్ద కాలానికిపైగా కృషిచేస్తున్న అగ్రశ్రీ సంస్థ దృష్టికొచ్చింది. స్మారక చిహ్నంగా గుర్తించి, ప్రభుత్వాల సాయంతో పరిరక్షణ, సుందరీకరణకు హామీ లభించింది స్మారక చిహ్నంగా గుర్తించాం పెదపూడి స్థూపాన్ని స్మారక చిహ్నంగా గుర్తించాం. ఇటీవల అమృతలూరు మండల, పెదపూడి పంచాయతీ అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామపెద్దలతో జూమ్ సమావేశం నిర్వహించి, అభిప్రాయాలను తెలుసుకున్నాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో పరిరక్షణకు తగిన కృషి చేస్తాం. – డాక్టర్ సుందర రామ్, సంచాలకుడు, అగ్రశ్రీ -
కుప్పం వైఎస్సార్సీపీ ఇన్చార్జ్ కన్నుమూత
-
కుప్పం వైఎస్సార్సీపీ ఇన్చార్జ్ కన్నుమూత
సాక్షి, హైదరాబాద్, శాంతిపురం: చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డాక్టర్ కె.చంద్రమౌళి శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌లో అనారోగ్యంతో మృతి చెందారు. 2019 శాసనసభ ఎన్నికల్లో అనారోగ్యానికి గురై ప్రచారానికి వెళ్లనప్పటికీ ఆయన కుప్పం వైఎస్సార్సీపీ అభ్యర్థిగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు గట్టి పోటీ ఇచ్చారు. ఆయన భౌతికకాయాన్ని హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రి నుంచి నార్సింగిలోని స్వగృహానికి తరలించారు. శనివారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు చంద్రమౌళి కుమారుడు భరత్ తెలిపారు. చంద్రమౌళి సేవలను పార్టీ శ్రేణులు గుర్తు చేసుకుంటున్నాయి. వివిధ శాఖల్లో సేవలు.. ► చంద్రమౌళి 1977లో ఏపీపీఎస్సీ ద్వారా సహకార శాఖలో అధికారిగా నియమితులయ్యారు. వివిధ శాఖల్లో పీడీగా, డీఆర్డీఏ ప్రాజెక్టు అధికారిగా పలు జిల్లాల్లో సేవలు అందించారు. ► 1990 బ్యాచ్ ఐఏఎస్ క్యాడర్‌కు చెందిన ఆయన విజయనగరం, నెల్లూరు జిల్లాల జాయింట్ కలెక్టరుగా, వైఎస్సార్ జిల్లా కలెక్టర్‌గా పని చేశారు. ► డ్వాక్రా గ్రూపుల నిర్వహణ, ఎయిడ్స్ మహమ్మారిపై అవగాహన చర్యల్లో కీలకంగా వ్యవహరించారు. మహిళా స్వావలంబన, బాలల ఆరోగ్యంపై యూనిసెఫ్ కార్యక్రమ నిర్వాహకుడిగా ప్రశంసలు అందుకున్నారు. పంచాయతీ రాజ్ శాఖ కమిషనర్‌గా, అపార్డ్ డైరెక్టర్‌గా ప్రత్యేకతను చాటుకున్నారు. ► ఉద్యోగ విరమణ అనంతరం వైఎస్సార్సీపీ కుప్పం ఎమ్మెల్యే అభ్యర్థిగా రెండు సార్లు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు గట్టి పోటీనిచ్చారు. ► కుప్పం మండలం పెద్దబంగారునత్తం చంద్రమౌళి కుటుంబం స్వగ్రామం. ఆరేళ్లుగా కుప్పంలో ఉంటున్నారు. ఆయనకు భార్య పద్మజ, కుమారులు భరత్, శరత్ ఉన్నారు. సీఎం జగన్ సంతాపం సాక్షి, అమరావతి: కె.చంద్రమౌళి మృతి పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీకి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. కలెక్టర్‌గా, రాజకీయ నేతగా అందించిన సేవలను ప్రజలు చిరకాలం గుర్తు పెట్టుకుంటారన్నారు. చంద్రమౌళి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని దేవున్ని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కాగా, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కూడా సంతాపం తెలిపారు. -
చంద్రమౌళికి వైఎస్ జగన్ పరామర్శ
సాక్షి, హైదరాబాద్ : చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన చంద్రమౌళిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం పరామర్శించారు. అనారోగ్యంతో హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో చంద్రమౌళి చికిత్స పొందుతున్నారు. వైఎస్ జగన్ ఈ సందర్భంగా ఆయనను పరామర్శించి...ఆరోగ్యం గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. వైఎస్ జగన్‌తో పాటు పార్టీ రాజ్యసభ సభ్యుడు వి. విజసాయి రెడ్డి, మాజీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, పుట్టపర్తి నియోజక వర్గ వైఎస్సార్ కాంగ్రెస్ సమన్వయ కర్త శ్రీధర్ రెడ్డి కూడా చంద్రమౌళిని పరామర్శించారు. -
కుప్పంలో వైఎస్సార్సీపీ భారీ బైక్ ర్యాలీ
-
‘కుప్పంలో ఈసారి వైఎస్సార్సీపీ జెండానే’
కుప్పం: రాష్ట్రంలో నెలకొన్న దుర్మార్గపు పాలనతో విసిగిపోయి కుప్పం ప్రజలు సైతం మార్పును కోరుతున్నారని.. వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ చంద్రమౌళి అన్నారు. బుధవారం నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ భారీఎత్తున ద్విచక్ర వాహన ర్యాలీని నిర్వహించారు. రామకుప్పం, శాంతిపురం, గుడుపల్లె మండల కేంద్రాల్లో వైఎస్సార్సీపీ శ్రేణులు ర్యాలీగా బయల్దేరి కుప్పానికి చేరుకున్నారు. బైపాస్ రోడ్డులోని పార్టీ కార్యాలయం నుంచి బయల్దేరిన ర్యాలీ పట్టణ పురవీధుల్లో సాగింది. అనంతరం వైఎస్సార్ విగ్రహానికి నివాళులర్పించి నియోజకవర్గ సమన్వయకర్త చంద్రమౌళి ప్రసంగించారు. చరిత్రలో ఊహించని విధంగా కుప్పంలో జరిగిన ర్యాలీకి వైఎస్సార్సీపీ శ్రేణులు తరలిరావడం హర్షణీయమన్నారు. పట్టణంలో బయల్దేరిన ర్యాలీ వంద పడకల ఆస్పత్రి నుంచి కుప్పం బస్టాండు వరకు వాహనచోదకులతో నిండిపోయిందని ఆయ న తెలిపారు. స్థానికులు మార్పును ఎంత బలంగా ఆకాంక్షిస్తున్నారో.. ఈ ర్యాలీ ద్వారా స్పష్టంగా తెలుస్తోందన్నారు. కుప్పంలో ఈ సారి వైఎస్సార్సీపీ జెండా ఎగురుతుందన్నారు. మండల కేంద్రంలో జరిగే పార్టీ సమావేశాల్లో ప్రతి ఒక్కరికీ తన మనసులో మాటను తెలియజేస్తానని, ప్రస్తుతం ర్యాలీకి తరలివచ్చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేశారు. కుప్పం నుంచే మరో చరిత్రను సృష్టించేందుకు వైఎస్సార్సీపీ బలంగా సిద్ధం అవుతోందని స్పష్టం చేశారు. -
కలలు చెదిరి.. కన్నీళ్లు మిగిలి!
విధి ఎంత బలీయమైనదో.. అమాంతంగా ఆనందాల పల్లకిలో ఊరేగించగలదు.. ఒక్క క్షణంలో జీవితంలో కోలుకోలేని విషాదాన్ని నింపనూగలదు. అందుకు ఉదాహరణే కొత్తకోటకు చెందిన ద్వారపురెడ్డి చంద్రమౌళి దీనావస్థ. ఎన్నో కష్టాలనోర్చి బీటెక్ చదివించిన తల్లిదండ్రుల ఆశలు మరికొద్ది రోజుల్లో ఫలించేవి.. గేట్‌కు సన్నద్ధం అవుతున్న సమయంలో వెతుక్కుంటూ వచ్చిన ఉద్యోగంలోనే ఆనందాలు దొరికేవి.. కొడుకు సంపాదనతో కుటుంబానికి ఒక ఆసరా దొరికేది.. అయితే ఇంతలోనే విధి కన్నెర్ర జేసింది. విద్యుదాఘాతం రూపంలో కాళ్లూచేతులు బలిగొని కుటుంబాన్నంతటినీ కన్నీటి సంద్రంలో ముంచేసింది.. ఉద్యోగం చేసుకుంటూ చేదోడుగా ఉంటాడనుకున్న కొడుకు నిస్సహాయ స్థితిలో పడి ఉంటే సహాయార్థుల కోసం ఎదురుచూస్తోంది... రావికమతం: కొద్ది రోజుల్లో ఉద్యోగంలో చేరి కన్నవారి కలలను తీరుస్తాడనుకున్న కుమారుడి ఆశలను కరెంట్ షాక్ హరించేసింది. చిరునవ్వుకు నిలువెత్తు రూపంగా ఉన్న వారసుడిని దివ్యాంగుడిగా మార్చేసి ఆ కుటుంబానికి కన్నీటినే మిగిల్చింది. కొత్తకోట గ్రామానికి చెందిన ద్వారపురెడ్డి రమణ, సత్యవతిలకు చంద్రమౌళి, ప్రసన్న ఇద్దరు పిల్లలు. బతుకు తెరువు కోసం కొన్నాళ్ల క్రితం నర్సీపట్నం వెళ్లి లక్ష్మీపురంలో అద్దె ఇంట్లో ఉంటున్నారు. చంద్రమౌళి తండ్రి రమణ ఏజెన్సీ సంతల్లో చిన్నపాటి వ్యాపారం చేస్తుండగా తల్లి సత్యవతి ఒక ప్రైవేటు స్కూల్లో టీచర్‌గా పనిచేస్తోంది. చంద్రమౌళి కాకినాడ కైట్‌లో ఇటీవలే బీటెక్ పూర్తి చేశాడు. గేట్‌కు సన్నద్ధం అవుతున్న తరుణంలో వచ్చిన చిన్న ఉద్యోగంలో జాయిన్ తల్లితండ్రులకు చేదోడు ఉందామనే ఆలోచనలో ఉన్నాడు. ఈ లోగా విధి ఆ కుటుంబంపై పంజా విసిరింది. విద్యుత్ ప్రమాదం రూపంలో కుటుంబంలో విషాదం నింపింది. కృత్రిమ చేతుల ఏర్పాటుకు రూ.25లక్షలు చంద్రమౌళి దైన్య స్థితిని అతని మిత్రులు సోషల్ మీడియాలో అప్డేట్ చేయడంతో బెంగళూరుకు చెందిన వైద్యుడు చేతులకు ఆపరేషన్ చేసి సరిచేస్తామని చంద్రమౌళి కుటుంబానికి హామీ ఇచ్చారు. అయితే కృత్రిమ చేతుల ఏర్పాటుకు రూ.25 లక్షల వరకూ ఖర్చవుతుందని చెప్పడంతో వారికి ఏమీ పాలుపోవడం లేదు. ప్రభుత్వం ఆదుకోవాలి ఆపరేషన్ ఖర్చుల కోసం చంద్రమౌళి మిత్రులు, బంధువులు విద్యాసంస్థల్లో విరాళాలు సేకరిస్తున్నారు. చేతనైనంత సహాయంచేసి దాతలు ఆదుకోవాలని మిత్రులు సోమిరెడ్డి అనంత్, బేరా మణికంఠ కోరుతున్నారు. రెండు కాళ్లూ చేతులూ కోల్పోయి అచేతనంగా ఉన్న చంద్రమౌళిని ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఉంగరం తీయబోయి.. ఇరవై రోజుల క్రితం చంద్రమౌళి, అతని చెల్లెలు ప్రసన్న మేడపై ఉండగా తన ఉంగరం చేజారి కింద ఉన్న రేకుల షెడ్డుపై పడింది. దాన్ని చంద్రమౌళి ఇనుప ఊచతో తీస్తుండగా ప్రమాదవశాత్తూ హైటెన్షన్ విద్యుత్‌వైర్లకు తగిలి అఘాతానికి గురయ్యాడు. ప్రసన్న కేకలు వేయడంతో తండ్రి రమణ పరుగున వెళ్లి అచేతనంగా పడిఉన్న చంద్రమౌళిని నర్సీపట్నం ప్రాంతీయ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే అత్యవసర వైద్యానికి విశాఖ కేజీహెచ్‌కు తరలించి ప్లాస్టిక్ సర్జరీ విభాగంలో చికిత్స అందించారు. విద్యుత్ షాక్‌తో కాళ్లూచేతులు పూర్తిగా కాలిపోయాయి. అయితే వాటిని తొలగించకపోతే ప్రాణానికే ప్రమాదమని వైద్యులు తొలగించారు. ప్రస్తుతం రెండు కాళ్లు, చేతులూ లేక అచేతనంగా పడి ఉన్న కుమారుడిని చూసి తల్లిదండ్రులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. 20 రోజులుగా కుటుంబ సభ్యులతో పాటు చంద్రమౌళి స్నేహితులు సైతం రాత్రులు అక్కడే ఉంటూ సహకరిస్తున్నారు. చంద్రమౌళి తండ్రి బ్యాంకు ఖాతా వివరాలు పేరు: ద్వారపురెడ్డి వెంకట రమణ అకౌంట్ నెం: 038310100129977 ఆంధ్రాబ్యాంకు శాఖ, నర్సీపట్నం ,ఐఎఫ్ఎస్సీ: ఏఎన్‌డీబీ0000383 ఫోన్ నంబర్: 94936 15162 -
‘కాళేశ్వరంపై కోదండరాం వ్యాఖ్యలు తగవు’
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టుపై తెలంగాణ జన సమితి పార్టీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం చేసిన ఆరోపణలు సరికావని తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సంగెం చంద్రమౌళి, ప్రధాన కార్యదర్శి మేరెడ్డి శ్యాంప్రసాద్‌రెడ్డి అన్నారు. ప్రాజెక్టుపై ఆయన వ్యక్తం చేసిన అనుమానాలను నివృత్తి చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. కాళేశ్వరం రీ డిజైన్‌లో భాగంగా నిర్మిస్తున్న మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల ద్వారా ఎలాంటి ముంపు లేకుండా రోజుకు 2 టీఎంసీల నీటిని 90 రోజుల పాటు తరలించవచ్చని తెలిపారు. గోదావరిలో 365 రోజులు నీరు ఉండటంతో 150 కి.మీ. మేర అంతర్గత జల రవాణా అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. ఈ జలాశయాల్లో చేపల పెంప కం ద్వారా మత్స్య పరిశ్రమ, పర్యాటకాన్ని అభివృద్ధి చేయడం ద్వారా ప్రజలకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. -
టాలీవుడ్ సీనియర్ నటుడు కన్నుమూత
హైదరాబాద్: సీనియర్ నటుడు, డబ్బింగ్ కళాకారుడు చంద్రమౌళి(57) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం మునగలపాలెంకు చెందిన చంద్రమౌళి 1971లో చంద్రమౌళి చిత్ర రంగంలోకి ప్రవేశించారు. ప్రముఖ నటుడు మోహన్‌బాబు తండ్రి చంద్రమౌళికి గురువు. సుమారు 45 ఏళ్లకు పైబడిన తన సినీ ప్రస్థానంలో నటుడిగా, డబ్బింగ్ కళాకారుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ‘అంతా మన మంచికే’ అనే చిత్రంతో చంద్రమౌళి వెండి తెరకు పరిచయం అయ్యారు. ఆ తర్వాత కృష్ణ, శోభన్‌బాబు, కృష్ణంరాజు, నాగేశ్వరరావు సహా ఇప్పుడున్న అగ్రనటుల సినిమాల్లో కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించారు. రుతురాగాలు సీరియల్లో హీరోయిన్ తండ్రిపాత్రలో చంద్రమౌళి నటనకు మంచి గుర్తింపు వచ్చింది. -
ఏసీబీ వలలో ఇద్దరు ఇరిగేషన్ ఎఈలు
–రూ.48వేలు లంచం తీసుకొంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టివేత నెల్లూరు(క్రైమ్): నీరు-చెట్టు పనుల్లో కాంట్రాక్టర్ వద్ద నుంచి లంచం తీసుకొంటుండగా ఇద్దరు ఇరిగేషన్ ఏఈలను ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొన్నారు. అధికారుల సమాచారం మేరకు.. చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలానికి చెందిన శాకమూరి సుందరనాయుడు క్లాస్–3 కాంట్రాక్టర్. 2016 ఆగస్టులో నీరు-చెట్టు పథకం కింద కొన్ని చెరువుల మరమ్మత్తులు, కోర్‌వెల్ నిర్మాణాలకు టెండర్లు పిలిచారు. సుందరనాయుడు మావూరమ్మ చెరువుకట్టపనికి రూ. 26,25,368తో, వెంకటగిరి ట్యాంకు కోర్‌వెల్ నిర్మాణానికి రూ.32,83,922తో టెండర్లు వేసి పనులు దక్కించుకొన్నాడు. వాటి నిర్మాణ పనులను తన బంధువు అయిన శ్రీరామచౌదరికి అప్పగించి ఈ ఏడాది ఏప్రిల్ 2017 నాటికి పూర్తిచేయించాడు. ఈ క్రమంలో ఈ పనులకు సంబంధించిన ఎం బుక్‌లు ఇరిగేషన్ క్వాలిటీ కంట్రోల్ ఏఈలు చంద్రమౌళి, గిరిధర్ల వద్దకు వచ్చాయి. దీంతో శ్రీరామచౌదరి ఈ నెల 12వ తేదిన ఏఈ గిరిధర్‌రాజుకు ఫోన్ చేయగా మంగళవారం నెల్లూరుకు వచ్చి తనతో, చంద్రమౌళితో మాట్లాడాలని సూచించారు. దీంతో జరిగిన విషయాన్ని శ్రీరామచౌదరి కాంట్రాక్టర్ సుందరనాయుడుకు చెప్పడంతో ఆయన మంగళవారం నెల్లూరుకు వచ్చి ఏఈలను కలిశారు. ఈ సందర్భంగా ఎఈలు ఎం బుక్స్‌ను పరిశీలించి పంపాలంటే రూ.30వేలు, గిరిధర్ వద్ద ఉండే బుక్స్ పంపాలంటే రూ. 18వేలు ఇవ్వాలని లేదంటే బుక్స్ అధికారులకు పంపేది లేదని తేల్చిచెప్పారు. వారికి లంచం ఇవ్వడం ఇష్టంలేని సుందరనాయుడు అదేరోజు జరిగిన విషయాన్ని ఏసీబీ డీఎస్పీ పి.పరమేశ్వర్‌రెడ్డికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి నెల్లూరు ఇరిగేషన్ కార్యాలయంలో బాధితుడు రూ.48వేలు నగదును ఏఈలకు ఇస్తుండగా ఏసీబీ డీఎస్పీ తన సిబ్బందితో నిందితులను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొన్నారు. వారి వద్ద నుంచి నగదు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. దాడుల్లో సీఐలు శివకుమార్‌రెడ్డి, శ్రీహరిరావు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
టీచర్ హత్య కేసులో దర్యాప్తు ముమ్మరం
⇒రంగంలోకి దిగిన మూడు ప్రత్యేక బృందాలు ⇒పోలీసులనే బురిడీ కొట్టించిన నిందితుడు ⇒టీచర్‌కు ముగిసిన అంత్యక్రియలు పలమనేరు: జిల్లాలో సంచలనం రేకెత్తించిన ప్రభుత్వ ఉపాధ్యాయురాలి హత్య కేసులో నిందుతున్ని పట్టుకునేందుకు పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. మూ డు బృందాలు రంగంలోకి దిగాయి. ప్రేమకుమారి మృతదేహానికి శుక్రవారం పలమనేరు ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఆమె భర్త స్వగ్రామమైన బంగారుపాళ్యం మండలం ముంగరమొడుగులో అంత్యక్రియలు చేశారు. మూగబోయిన మబ్బువాళ్లపేట మొన్నటిదాకా ప్రశాంతంగా ఉన్న మబ్బువాళ్లపేటలో ఒక్కసారిగా నిర్మాణుష్యం అలుముకుంది. పట్టపగలే పసిపిల్లల ముందు టీచర్ హత్యకు గురికావడం, పోలీ సులు విచారణల నేపథ్యంలో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. పాఠశాల శుక్రవారం మూతబడింది. హత్యను ప్రత్యక్ష్యంగా చూసిన పిల్లలు భయపడుతున్నారని వారి తల్లిదండ్రులు తెలిపారు. రెండ్రోజుల తర్వాత వేసవు సెలవులు ఉండడంతో అధికారులు పిల్లలకు సెలవు ప్రకటించేశారు. పోలీసులను బురడీ కొట్టించిన నిందితుడు హత్య జరిగిన కొద్ది సేపటికే కొందరు పోలీసులకు ఫోన్ చేసి నిందితుడుగా అనుమానిస్తున్న చంద్రమౌళి సైతం ఆత్మహత్య చేసుకుని ఉంటాడని చెప్పారు. పోలీసులు మబ్బువాళ్లపేట పరిసర ప్రాంతాల్లో చంద్రమౌళి కోసం గాలింపు చర్యలు చేపడుతూ సమయాన్ని వృథా చేశారు. పక్కా ప్లాన్‌తో నిందితుడు ఇలా పోలీసులను పక్కదారి పట్టించి ఉంటాడనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దానికి తోడు ముందుస్తుగానే చంద్రమౌళి పాఠశాలకు మెడికల్ లీవు పెట్టడం కూడా ఇందులో భాగమేననే అంటున్నారు. హత్య జరిగాక రక్తం మరకలతో ఉన్న నిందితుడు అక్కడి నుంచి తప్పించుకోవడం, రక్తపు మరకలు ఎవరికీ కనిపించకుండా జాగ్త్రత్త పడడం, ఇదంతా గంటలో జరిగేపనేనా అనే కోణంలో విచారణ సాగుతోంది. ఈ హత్యకు ఎవరైనా సహకరించారా అనే విషయంపై ఆరాతీస్తున్నారు. శుక్రవారం చంద్రమౌళి సెల్‌ఫోన్ సైతం స్విచ్ ఆఫ్‌లోనే ఉందని పోలీసులు తెలిపారు. దీంతో నిందితునికి బైక్ ఇచ్చిన వ్యక్తితో బాటు చంద్రమౌళి స్నేహితులను సైతం వారు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు తెలిసింది. హత్య కేసులో సెల్‌ఫోన్ టవర్ ఆధారంగా దర్యాప్తును వేగవంతం చేసి క్లూకోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారు. -
తరగతి గదిలోనే టీచర్ దారుణహత్య
చిత్తూరు జిల్లా గంగవరం మండలంలో దారుణం గంగవరం (పలమనేరు): గురువారం చిత్తూరు జిల్లాలో తరగతి గదిలోనే ఉపాధ్యాయురాలు దారుణహత్యకు గురయ్యారు. చిత్తూరు జిల్లా గంగవరం మండలం మబ్బువాళ్లపేట ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలు ప్రేమకుమారి (32) హత్యకు గురయ్యారు. పోలీసుల కథనం మేరకు.. పలమనేరుకు చెందిన ప్రేమకుమారి మబ్బువాళ్లపేటలో పనిచేస్తున్నారు. సోమల మండలం చిన్నయ్యగారిపల్లె గ్రామానికి చెందిన చంద్ర మౌళి గుండుగల్లు బొమ్మనపల్లెలో టీచర్‌గా పనిచేస్తున్నారు. చంద్రమౌళికి, ప్రేమకుమారికి కొన్నేళ్ల కిందట పరిచయం ఏర్పడింది. వీరిద్దరి మధ్య వివాహేతర సంబంధం, ఆర్థిక లావాదేవీల గొడవలు ఉన్నట్టు సమా చారం. చంద్రమౌళి 15 రోజులుగా ఆమెను చంపుతానని ఎస్ఎంఎస్లు పంపుతున్నారు. దీంతో ప్రేమకుమారి విశ్రాంత టీచరైన తన తండ్రిని తోడుగా తీసుకుని స్కూలుకు వస్తున్నారు. అదే స్కూల్లో పనిచేస్తున్న మరో ఉపాధ్యాయుడు గురువారం ఎంఆర్సీలో జరుగుతున్న సమావేశానికి వెళ్లారు. ప్రేమకుమారిని స్కూల్లో వదిలి ఆమె తండ్రి బయటకు వచ్చేసరికి నిందితుడు ముఖా నికి ముసుగు వేసుకుని పాఠశాలలోకి ప్రవేశించి ఆమెపై కత్తితో దాడిచేసి పారిపోయారు. కుప్పకూలిన ప్రేమకు మారిని పలమనేరు ప్రభుత్వాస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు. పిల్లల్ని బెదిరించిన నిందితుడు ఉపాధ్యాయురాలిపై కత్తి దాడిచేస్తూ.. ‘అరిస్తే మిమ్మల్ని కూడా చంపేస్తా. అరవకపోతే మీ మేడమ్‌ను చంపుతా’ అంటూ బెదిరించాడని అందువల్ల అరవలేకపోయామని విద్యార్థులు పోలీసులకు తెలిపారు. -
గ్రామీణ పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నాం
కేంద్ర ఖాదీ గ్రామీణ పరిశ్రమల దక్షిణ రాష్ట్రాల చైర్మన్ చంద్రమౌళి నెల్లూరు(బారకాసు): ఖాదీతో పాటు గ్రామీణ పరిశ్రమలను, చేతి వృత్తులను ప్రోత్సహిస్తున్నామని కేంద్ర గ్రామీణ పరిశ్రమల దక్షిణ రాష్ట్రాల చైర్మన్ జి.చంద్రమౌళి పేర్కొన్నారు. శనివారం స్థానిక బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చేతి వృత్తులకు ఆదరణ లేకపోవడంతో నానాటికి కనుమరుగవుతున్నాయన్నారు. దీంతో గ్రామీణ ప్రాంతాల వారు ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈవిషయాన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం గ్రామీణ పరిశ్రమలు, చేతివృత్తుల అభివృద్ధికి కృషి చేసేందుకు ప్రణాళికా బద్ధంగా తగు చర్యలు చేపట్టిందన్నారు. అలాగే ఖాదీ పరిశ్రమల అభివృద్ధికి దక్షిణ రాష్ట్రాలకు సంబంధించి బెంగళూరులో ప్రధాన కార్యాలయం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇప్పటి వరకు రూ.33వేల కోట్లు ఖాదీ పరిశ్రమలకు ఖర్చు చేసిందన్నారు. దీంతో గత ఏడాది కంటే రూ.16శాతం అదనంగా ఖాదీ ఉత్పత్తులు జరిగాయని చెప్పారు. ఖాదీ ఉత్పత్తులకు విశేష ప్రాచుర్యం కల్పించేందుకు కొత్త అవుట్‌లెట్స్ ఏర్పాటు చేశామన్నారు. ఖాదీతో పాటు, గ్రామీణ పరిశ్రమలు, చేతి వృత్తులకు అంతర్జాతీయ స్థారుు గుర్తింపు తెచ్చేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు. వెంకటగిరి చేనేత కార్మికులకోసం రూ.3కోట్లతో సిల్క్ క్లస్టర్ ఏర్పాటు చేయనున్నామన్నారు. అలాగే కళంకారిని అంతర్జాతీయ స్థారుుకి తీసుకెళ్లేందుకు చిత్తూరు, శ్రీకాళహస్తిలో క్లస్టర్స్ మంజూరు చేశామన్నారు. మూడు గంటల సమయంలో విగ్రహాలు తయారు చేసే విశ్వకర్మలకు కేవలం గంటకే విగ్రహం తయారు చేసేందుకు అనువైన కొత్తరకం పనిముట్లు శ్రీకాళహస్తి, కర్నూలు, ఆళ్లగడ్డలో వారికి అందజేశామన్నారు. పార్టీ పటిష్టత కోసం కృషి బీజేపీని క్షేత్రస్థారుులో పటిష్ట పరిచేందుకు తగిన కృషి చేస్తున్నామని ఆ పార్టీ బూత్‌కమిటీల జిల్లా ఇన్చార్జి బత్తల నరసింహరావు తెలిపారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కర్నాటి ఆంజనేయరెడ్డి, జిల్లా అధ్యక్షుడు పి.సురేంద్రరెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు భాస్కర్‌గౌడ్ పాల్గొన్నారు. -
జిల్లాలో ఖాదీ అభివృద్ధికి చర్యలు
కడప రూరల్ : జిల్లాలో ఖాదీ పరిశ్రమ అభివృద్ధికి చర్యలు చేపడుతున్నట్లు ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీ కమిషన్ సౌత్ ఇండియా రీజియన్ వైస్ చైర్మన్ చంద్రమౌళీ అన్నారు. ఆదివారం స్థానిక భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఖాదీ పరిశ్రమ అభివృద్ధికి చేపట్టే చర్యల్లో భాగంగా రాయలసీమ వ్యాప్తంగా పలు జిల్లాల్లో పర్యటించినట్లు తెలిపారు. ఆ మేరకు వైఎస్సార్ జిల్లాలోని ప్రొద్దుటూరు, జమ్మలమడగు తదితర ప్రాంతాల్లో పర్యటించామన్నారు. జిల్లాలోని పులివెందుల తదితర ప్రాంతాలలో అరటిపంటలు విస్తారంగా ఉన్నాయన్నారు. అరటి కాండంతో ఫ్యాబ్రిక్ కుటీర పరిశ్రమ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. పులివెందులలో రూ. 3 కోట్లతో కుటీర పరిశ్రమను ఏర్పాటు చేస్తామన్నారు. అందుకుగాను ఆ ప్రాంత రైతాంగంతో డిసెంబరులో అవగాహన సదస్సులు చేపడతామన్నారు. అలాగే ప్రొద్దుటూరు, జమ్మలమడుగు ప్రాంతాల్లో ప్రత్యేకమైన అభివృద్ధికి చర్యలు చేపట్టడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. కాగా, జిల్లాలో ఎనిమిది ఖాదీ సొసైటీలు ఉన్నాయని, వీటిని మరింతగా పెంచి ఆర్థిక సహాయాన్ని అందజేయడానికి కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో కర్నూలు జిల్లా ఇన్చార్జి రామకృష్ణారెడ్డి, రాష్ట్ర నాయకుడు శ్రీనివాసులునాయుడు, జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబశివారెడ్డి, నగర అధ్యక్షుడు విజయనరసింహులు, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు బత్తల పవన్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు. -
క్లస్టర్ ఏర్పాటుకు రూ.2 కోట్లు
ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్ దక్షిణ భారత చైర్మన్ చంద్రమౌళి జోగిపేట: స్వాతంత్ర్యం వచ్చి 70 సంవత్సరాలైనా గొల్లకుర్మలు వెనకబడే ఉన్నారని, ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్ దక్షిణ భారత చైర్మెన్ చంద్రమౌళి అన్నారు. బుధవారం జోగిపేట ఉన్ని సహకార సంఘాన్ని పరిశీలించడానికి వచ్చిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మధ్యదళారులవల్లే గొల్లకుర్మలు దోపిడీకి గురవుతున్నారన్నారు. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామీణ స్థాయిలో ఉన్న సహకార సంఘాల అభ్యున్నతి కోసం కృషి చేస్తోందన్నారు. జోగిపేట ఉన్ని సహకార సంఘానికి ఘన చరిత్ర ఉందని, దీనిని క్లస్టర్‌గా ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ద్వారా రూ.2 కోట్లు మంజూరు చేయిస్తానన్నారు. ఇందుకు గాను 25 శాతం నిధులు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి అవుట్లెట్లలో జోగిపేట ఉన్ని సంఘంలో నేసిన బ్లాంకెట్లను ఏర్పాటు చేసే విధంగా కృషి చేస్తానని హమీ ఇచ్చారు. ఘనంగా సన్మానం చంద్రమౌళి జోగిపేటకు చేరుకోగానే గొల్ల కుర్మలు డోలు వాయిద్యాలతో ఘనంగా స్వాగతం పలికారు. హనుమాన్ చౌరస్తా, అంబేద్కర్ చౌరస్తాల మీదుగా సంఘం వరకు ఊరేగింపుగా తీసుకెళ్లారు. అనంతరం చంద్రమౌళి శాలువా పూలమాలలు, నేసిన గొంగడితో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఖాదీ బోర్డు రాష్ర్ట డైరెక్టర్ ఆర్కే.చౌదరి, ఎక్జిటివ్ సభ్యులు ఎం. హరి, రాష్ర్ట బీజేపీ కార్యవర్గ సభ్యులు గోవర్దన్, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రభాకర్‌గౌడ్, జోగిపేట ఉన్ని సంఘం చైర్మెన్ కృష్ణ,య్య, కార్యదర్శి నారాయణ, మాజీ డైరెక్టర్ ఊస శ్రీశైలం, నాయకులు మల్లేశం, వెంకటేశం, పట్టణ బీజేపీ అధ్యక్షుడు ఎర్రారం సతీష్ తదితరులు పాల్గొన్నారు. మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు ఖాదీబోర్డు చేయూత సంగారెడ్డి రూరల్: మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు ఖాదీ బోర్డు కృషి చేస్తుందని చంద్రమౌళి తెలిపారు. బుధవారం సంగారెడ్డి మండలం చెర్యాలలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడుతూ గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో నెలకొల్పే అన్ని రకాల గ్రామీణ పరిశ్రమలు, స్వయం ఉపాధి పథకాలకు ఖాదీ బోర్డు ద్వారా మహిళలకు 35 శాతం సబ్సిడీ ఆందజేయడం జరుగుతుందన్నారు. రాష్ట్ర ఖాదీ బోర్డు అధికారి ఆర్కే చౌదరి మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోని మహిళలు లబ్ధిపొందాలని సూచించారు. అనంతరం జాతీయ కమిషన్ చైర్మెన్, తదితరులను గ్రామ సర్పంచ్ చంద్రకళ , ఎంపీటీసీ కవిత సన్మానించారు. సదస్సులో ఉప సర్పంచ్ శ్రీధర్, బిజెపి నాయకులు శివరాజ్‌తో పాటు గ్రామ స్వయం సహాయక సంఘాల సభ్యులు పాల్గొన్నారు. -
ఫంక్షన్ హాళ్లే అతడి టార్గెట్
చోరీలకు పాల్పడుతున్న నిందితుడి అరెస్ట్ వరంగల్ క్రైం : కల్యాణ మండపాల్లో చోరీలకు పాల్పడుతున్న వ్యక్తిని వరంగల్ కమిషనరేట్ సీసీఎస్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. అతడి నుంచి సుమారు రూ.2.50 లక్షల విలువైన 93 గ్రాముల బంగారు ఆభరణాలు, ఒక మోటార్ సైకిల్, ఒక సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. క్రైం ఏసీపీ ఈశ్వర్రావు కథనం ప్రకారం.. సంగెం మండలం గవిచర్ల గ్రామానికి చెందిన గట్టికొప్పు ల చంద్రమౌళి డిగ్రీ చదువును మధ్యలోనే ఆపివేసి జీవనోపాధి కోసం హైదరాబాద్ ఉప్పల్ రామాంతపూర్‌లోని జెర్సీ మిల్క్‌డైరీలో ఏడాది పాటు పనిచేశాడు. ఇదే సమయంలో అతడు తాగుడు, జల్సాలకు అలవాటుపడి ఉద్యోగానికి గైర్హాజర్ కావడంతో యాజమాన్యం ఉద్యోగం నుంచి తొలగించింది. దీంతో అతడు స్వగ్రామానికి చేరుకుని తొలుత 2015, నవంబర్‌లో హం టర్ రోడ్డులోని కడెం కల్యాణ మండపంలో వివాహం జరుగుతున్న సమయంలో నిందితుడు ఓ చిన్నారి మెడలో 18 గ్రాముల బంగారు ఆభరణాన్ని అపహరించాడు. డిసెంబర్ లో ఇదే కళ్యాణ మండపంలో డ్రెస్సింగ్ రూంలో ఉన్న హ్యాండ్‌బ్యాగ్‌లోని 45 గ్రాముల రెండు బంగారు నల్లపూసల గొలుసులతోపాటు ఒక సెల్‌ఫోన్‌ను చోరీకి పాల్పడ్డాడు. అలాగే నవంబర్‌లో పెళ్లి ఊరేగింపు లో ఓ మహిళ మెడలో నుంచి 30 గ్రాముల బం గారు ఆభరణాన్ని చోరీ చేశాడు. ఇలా చోరీలకు పాల్పడిన నిందితుడు చోరీ సొత్తును వరంగల్ బులియన్ మార్కెట్లో అమ్మేందు కువచ్చినట్లుగా కచ్చితమైన సమాచారం రావడంతో క్రైం ఏసీపీ కె.ఈశ్వర్రావు ఆదేశాల మేరకు సీసీఎస్ ఇన్స్పెక్టర్ కె.శ్రీధర్ తన సిబ్బందితో వెళ్లి నింది తుడిని గుర్తించి అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా నిందితుడు వద్ద బంగారు ఆభరణాలు లభ్యమయ్యాయి. పోలీసుల విచారణలో తాను చేసిన నేరాలను వెల్లడించాడు. దీంతో అతడిని అరెస్ట్ చేసి, చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్ట్ చేయడంలో కృషిచేసిన ఇన్స్పెక్టర్ కె.శ్రీధర్, ఎస్సై బి.సుమన్, హెడ్‌కానిస్టేబుళ్లు, టి.వీరస్వామి, కె.శివకుమార్, కానిస్టేబుళ్లు మహేశ్, జంపయ్య, రాజును క్రైం ఏసీపీ అభినందించారు. -
మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుడికి యావజ్జీవ శిక్ష
కరీంనగర్ : మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుడిగా పని చేసిన ఉగ్గే చంద్రమౌళికి మధ్యప్రదేశ్‌లోని బాల్గఢ్ న్యాయస్థానం యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఈ మేరకు శుక్రవారం బాల్గఢ్ న్యాయస్థానం తన తీర్పును వెలువరించింది. కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలం మాణిక్యాపూర్ గ్రామానికి చెందిన ఉగ్గే చంద్రమౌళి 1981లో మావోయిస్ట్ దళ సభ్యుడిగా చేరాడు. అనతి కాలంలోనే మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుడి స్థాయికి ఎదిగారు. కాగా, 2005లో మధ్యప్రదేశ్ రవాణాశాఖ మంత్రి హత్య కేసులో చంద్రమౌళిని ప్రధాన నిందితుడిగా పోలీసులు గుర్తించారు. ఆ క్రమంలో అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. దాంతో 2005లో మహరాష్ట్రలోని నాగ్‌పూర్‌లో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఈ కేసును విచారించిన బాలాగఢ్ న్యాయస్థానం శుక్రవారం చంద్రమౌళిని ప్రధాన నిందితుడిగా గుర్తించి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. -
రక్షణ రంగానికే తలమానికం ‘ఆకాష్’
దేశానికి కీలకమైన ఆయుధం ♦ ఆనాటి రక్షణ మంత్రికి అప్పట్లో వివరించిన కలాం ♦ ‘సాక్షి’తో డీఆర్డీఎల్ ఆకాష్ {పాజెక్టు డెరైక్టర్ చంద్రమౌళి మధిర : భారతీయ పరిజ్ఞానంతో శాస్త్రవేత్తలు రూపకల్పన చేసిన ఆకాష్ క్షిపణి దేశ రక్షణ రంగానికే తలమానికమని హైదరాబాద్‌లోని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లేబరేటరీ(డీఆర్డీఎల్) ఆకాష్ ప్రాజెక్టు డెరైక్టర్ గడ్డమణుగు చంద్రమౌళి అన్నారు. మధిరలో జన్మించి, మధిరలోనే చదువుకుని ఉన్నత స్థాయికి చేరుకున్న ఆయన ప్రస్తుతం డీఆర్డీఎల్లో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు. డాక్టర్ అబ్దుల్ కలాంతో ఉన్న అనుబంధాన్ని మంగళవారం ఆయన ‘సాక్షి’కి ఫోన్లో వివరించారు. 1981లో డీఆర్డీఎల్లో చేరిన అబ్దుల్ కలాం శిష్యరికంలో ఒకడిగా పనిచేసిన అదృష్టం దక్కిందన్నారు. 1983లో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఆధ్వర్యంలో పృథ్వీ, అగ్ని, ఆకాష్, నాగ్, త్రిశూల్ వంటి ఐదు బాలిస్టిక్ మిసైల్స్ రూపకల్పనకు అంకురార్పణ జరిగిందన్నారు. ఆకాష్ ప్రాజెక్టును తనకు అప్పగించినట్లు తెలిపారు. అమెరికా, రష్యా, ఇజ్రాయిల్, ఫ్రాన్స్ వంటి అభివృద్ధి చెందిన ప్రపంచ దేశాలు అసూయపడేలా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఈ క్షిపణిని రూపొందించినట్లు తెలిపారు. ఆకాష్ క్షిపణి రూపకల్పన కోసం డీఆర్డీఎల్లోని 13 లేబరేటరీలు, 11 ప్రభుత్వ రంగసంస్థలు, ఐదు ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు, ఐదు అకడమిక్ ఇన్స్టిట్యూట్లు ఏర్పాటు చేసి 20 ఏళ్లపాటు చేసిన కృషి ఫలితంగా ఈ క్షిపణికి రూపం వచ్చిందన్నారు. ఆకాష్ విజయవంతమయ్యేందుకు రూ.588కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు. భారత ప్రభుత్వంలోని ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్, నేవీలు ఈ క్షిపణి పనితీరు పట్ల సంతృప్తి వ్యక్తంచేసి తమ అమ్ముల పొదిలో రక్షణ కవచంగా పెట్టుకునేందుకు 2,500 క్షిపణుల తయారీకి రూ.22వేల కోట్ల ఆర్డర్ డీఆర్డీఎల్కు వచ్చిందన్నారు. దేశంలో ఇదే అతిపెద్ద ఆర్డర్ అన్నారు. ఈ క్షిపణి తయారీకి ఉపయోగించిన రామ్‌జెట్ రాకెట్ టెక్నాలజీ ఇండియా, రష్యా దేశాల్లోనే ఉందన్నారు. పూర్తి కంప్యూటర్ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ సూపర్ సానిక్ ఆకాష్ క్షిపణి మిస్సైల్ 30 సెకండ్లలో 90 కిలోమీటర్ల దూరంలోని ఏకకాలంలో ఎటునుంచి వచ్చే లక్ష్యాన్నైనా ఛేదిస్తుందన్నారు. ఆకాష్ క్షిపణి భారత రక్షణ రంగంలో అత్యంత కీలకమైన ఆయుధమన్నారు. ఆకాష్ క్షిపణి ప్రాజెక్టు విజయవంతం కావడంతో ఇటువంటి మరిన్ని ప్రాజెక్టులు చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. 2013లో బెంగళూరులో జరిగిన ఏరో ఇండియా షోలో ఈ క్షిపణి సామర్థ్యాన్ని ప్రదర్శించినట్లు తెలిపారు. కార్యక్రమంలో అప్పుడు 72దేశాలు పాల్గొని తమ శక్తి సామర్థ్యాలను ప్రదర్శించగా.. ఆకాష్‌కు అద్భుతమైన ప్రశంసలు వచ్చాయన్నారు. ఈ ఘనత అబ్దుల్ కలాం ఆశీస్సులతోనే సాధించినట్లు తెలిపారు. ఆయనతో 13 ఏళ్లకుపైగా పనిచేసిన అనుభవం ఉందన్నారు. తెలియని విషయాన్ని ఆయన అర్థమయ్యే విధంగా చెప్పేవారని, ఆయన ప్రోత్సాహంతోనే శాస్త్రవేత్తగా మరింత గుర్తింపు వచ్చిందన్నారు. మెచ్చుకున్న కలాం.. 1987లో ఆకాష్ క్షిపణిని రూపొందించినట్లు డాక్టర్ చంద్రమౌళి తెలిపారు. నేను డెరైక్టర్‌గా ఉండి ఆకాష్ క్షిపణిని డిజైన్ చేసి రూపొందించాను. మిస్సైల్ లాంచింగ్‌కు ముందుగా పరిశీలించేందుకు వచ్చిన కలాం సార్ అతితక్కువ సమయంలో రూపొందించిన ఆకాష్ క్షిపణి అద్భుతంగా ఉందని సంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో చాలా సంబరపడ్డాను. అప్పట్లో రక్షణ మంత్రి కేసీ పంత్‌కు కలాం సార్ ఆకాష్ క్షిపణి శక్తిసామర్థ్యాలను స్వయంగా వివరించారు. కలాం మృతి దేశ ప్రజలతోపాటు వ్యక్తిగతంగా కూడా నాకు తీరనిలోటని చెప్పారు. -
ప్రతి చినుకు బొట్టును ఒడిసి పడదాం
అనంతపురం అగ్రికల్చర్ : ప్రతి వర్షపు నీటి బొట్టును ఒడిసి పడదాం.. అనంతపురం జిల్లాలో కరువును పారదోలుదాం అని వ్యవసాయ, సాగునీటి రంగ నిపుణులు పిలుపునిచ్చారు. భూ గర్భ జలాలను పెంపొందించే లక్ష్యంతో ‘సాక్షి’ మీడియా, తెలంగాణ విశ్రాంత ఇంజనీర్ల వేదిక ఆధ్వర్యంలో తాడిపత్రి, అనంతపురంలో సోమవారం సాక్షి సాగుబడి డెస్క్ ఇన్చార్జి పంతంగి రాంబాబు అధ్యక్షతన రైతు అవగాహన సదస్సులు నిర్వహిం చారు. కరువుకు నిలయమైన అనంతపురంలో వర్షం నీరు పొలం దాటిపోకుండా సులభంగా నిర్మించుకునే కందకాలే సరైన మార్గమని తెలంగాణా విశ్రాంత ఇంజనీర్ల వేదిక అధ్యక్షుడు చంద్రమౌళి పేర్కొన్నారు. ప్రస్తుత క్లిష్ట పరిస్థితులను అధిగమించి వ్యవసాయంలో మంచి ఫలసాయం పొందాలంటే వర్షపు నీటిని ఎవరి పొలంలో వారు ఇంకేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అందుకోసం పొలం వాలును బట్టి ప్రతి 50 మీటర్లకు ఒక మీటర్ వెడల్పు ఒక మీటర్ లోతు కలిగిన కందకాన్ని తవ్వుకోవాలన్నారు. అప్పుడే ప్రతి రైతూ ఒక అన్నా హజారే... ప్రతి ఊరూ ఒక రాలేగావ్సిద్ధికీలా మారుతుందని ఉద్ఘాటించారు. -
కడుపులో కత్తితో 4 కిలోమీటర్ల ప్రయాణం!
నెల్లూరు జిల్లాలో కోళ్ల వ్యాపారిపై దుండగుల దాడి వరదయ్యుపాళెం: దుండగుల దాడిలో తీవ్రంగా గాయపడి.. కడుపులో కత్తితో రక్తమోడుతున్న ఓ వ్యాపారి మోటార్‌సైకిల్‌పై నాలుగు కిలోమీటర్లు ప్రయాణించటం సోమవారం చిత్తూరు - నెల్లూరు జిల్లాల సరిహద్దులో కలకలం సృష్టించింది. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటకు చెందిన కోళ్ల వ్యాపారి చంద్రమౌళి కొన్నేళ్లుగా శ్రీకాళహస్తి, బుచ్చినాయుడుకండ్రిక, వరదయ్యపాళెం, తడ, తమిళనాడులోని ఆరంబాకం ప్రాంతాలకు బాయిలర్ కోళ్లు సరఫరా చేస్తుంటారు. వారానికి ఒకసారి డబ్బు వసూలు చేసుకుని వెళుతుంటాడు. ఆ కోవలోనే సోమవారం దుకాణాల నుంచి వసూలు చేసుకున్న పెద్ద మొత్తంతో బయలుదేరాడు. వుధ్యాహ్నం 1.20 గంటల సవుయుంలో వరదయ్యుపాళెం - బత్తలవల్లం గ్రావూల వుధ్య అటవీ ప్రాంతమైన ఎనవూలగుంట సమీపంలో ఆయనను ముగ్గురు దుండగులు అడ్డగించి కత్తితో దాడి చేశారు. మెడపై కత్తితో నరికి, చాకుతో కడుపులో, చేతిపై పొడిచారు. అదే సవుయుంలో రోడ్డుపై వాహనాలు రావడం గమనించిన ఆ యువకులు పరారయ్యారు. పొట్టలో చాకు దిగబడి, తీవ్ర గాయూలతో రక్తం కారుతున్నా లెక్క చేయకుండా చంద్రమౌళి తన మోటార్‌సైకిల్‌పై సంఘటన స్థలం నుంచి 4 కిలోమీటర్ల దూరంలోని నెల్లూరు జిల్లా తడలోని ఓ కోళ్ల దుకాణం వద్దకు చేరుకుని జరిగిన సంఘటనను వివరించి సృ్పహ కోల్పోయూడు. రక్తమోడుతున్న అతని పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో స్థానికులు చెన్నైలోని ఆస్పత్రికి తరలించారు. వరదయ్యుపాళెం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.