కడుపులో కత్తితో 4 కిలోమీటర్ల ప్రయాణం! | 4 km journey to the stomach with a knife! | Sakshi
Sakshi News home page

కడుపులో కత్తితో 4 కిలోమీటర్ల ప్రయాణం!

Published Tue, Dec 2 2014 4:15 AM | Last Updated on Sat, Sep 2 2017 5:28 PM

కడుపులో కత్తితో 4 కిలోమీటర్ల ప్రయాణం!

కడుపులో కత్తితో 4 కిలోమీటర్ల ప్రయాణం!

  • నెల్లూరు జిల్లాలో కోళ్ల వ్యాపారిపై దుండగుల దాడి
  • వరదయ్యుపాళెం: దుండగుల దాడిలో తీవ్రంగా గాయపడి.. కడుపులో కత్తితో రక్తమోడుతున్న ఓ వ్యాపారి మోటార్‌సైకిల్‌పై నాలుగు కిలోమీటర్లు ప్రయాణించటం సోమవారం చిత్తూరు - నెల్లూరు జిల్లాల సరిహద్దులో కలకలం సృష్టించింది. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటకు చెందిన కోళ్ల వ్యాపారి చంద్రమౌళి  కొన్నేళ్లుగా శ్రీకాళహస్తి, బుచ్చినాయుడుకండ్రిక, వరదయ్యపాళెం, తడ, తమిళనాడులోని ఆరంబాకం ప్రాంతాలకు బాయిలర్ కోళ్లు సరఫరా చేస్తుంటారు. వారానికి ఒకసారి డబ్బు వసూలు చేసుకుని వెళుతుంటాడు.

    ఆ కోవలోనే సోమవారం దుకాణాల నుంచి వసూలు చేసుకున్న పెద్ద మొత్తంతో బయలుదేరాడు. వుధ్యాహ్నం 1.20 గంటల సవుయుంలో వరదయ్యుపాళెం - బత్తలవల్లం గ్రావూల వుధ్య అటవీ ప్రాంతమైన ఎనవూలగుంట సమీపంలో ఆయనను ముగ్గురు దుండగులు అడ్డగించి కత్తితో దాడి చేశారు. మెడపై కత్తితో నరికి, చాకుతో కడుపులో, చేతిపై పొడిచారు. అదే సవుయుంలో రోడ్డుపై వాహనాలు రావడం గమనించిన ఆ యువకులు పరారయ్యారు.

    పొట్టలో చాకు దిగబడి, తీవ్ర గాయూలతో రక్తం కారుతున్నా లెక్క చేయకుండా చంద్రమౌళి తన మోటార్‌సైకిల్‌పై సంఘటన స్థలం నుంచి 4 కిలోమీటర్ల దూరంలోని నెల్లూరు జిల్లా తడలోని ఓ కోళ్ల దుకాణం వద్దకు చేరుకుని జరిగిన సంఘటనను వివరించి సృ్పహ కోల్పోయూడు. రక్తమోడుతున్న అతని పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో స్థానికులు చెన్నైలోని ఆస్పత్రికి తరలించారు. వరదయ్యుపాళెం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement