అనంతపురం అగ్రికల్చర్ : ప్రతి వర్షపు నీటి బొట్టును ఒడిసి పడదాం.. అనంతపురం జిల్లాలో కరువును పారదోలుదాం అని వ్యవసాయ, సాగునీటి రంగ నిపుణులు పిలుపునిచ్చారు. భూ గర్భ జలాలను పెంపొందించే లక్ష్యంతో ‘సాక్షి’ మీడియా, తెలంగాణ విశ్రాంత ఇంజనీర్ల వేదిక ఆధ్వర్యంలో తాడిపత్రి, అనంతపురంలో సోమవారం సాక్షి సాగుబడి డెస్క్ ఇన్‌చార్జి పంతంగి రాంబాబు అధ్యక్షతన రైతు అవగాహన సదస్సులు నిర్వహిం చారు.
కరువుకు నిలయమైన అనంతపురంలో వర్షం నీరు పొలం దాటిపోకుండా సులభంగా నిర్మించుకునే కందకాలే సరైన మార్గమని తెలంగాణా విశ్రాంత ఇంజనీర్ల వేదిక అధ్యక్షుడు చంద్రమౌళి పేర్కొన్నారు. ప్రస్తుత క్లిష్ట పరిస్థితులను అధిగమించి వ్యవసాయంలో మంచి ఫలసాయం పొందాలంటే వర్షపు నీటిని ఎవరి పొలంలో వారు ఇంకేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అందుకోసం పొలం వాలును బట్టి ప్రతి 50 మీటర్లకు ఒక మీటర్ వెడల్పు ఒక మీటర్ లోతు కలిగిన కందకాన్ని తవ్వుకోవాలన్నారు. అప్పుడే ప్రతి రైతూ ఒక అన్నా హజారే... ప్రతి ఊరూ ఒక రాలేగావ్‌సిద్ధికీలా మారుతుందని ఉద్ఘాటించారు.
ప్రతి చినుకు బొట్టును ఒడిసి పడదాం
Published Tue, May 26 2015 3:00 AM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM
Advertisement
Advertisement