
చంద్రమౌళి ఫైల్ ఫోటో
హైదరాబాద్: సీనియర్ నటుడు, డబ్బింగ్ కళాకారుడు చంద్రమౌళి(57) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం మునగలపాలెంకు చెందిన చంద్రమౌళి 1971లో చంద్రమౌళి చిత్ర రంగంలోకి ప్రవేశించారు. ప్రముఖ నటుడు మోహన్‌బాబు తండ్రి చంద్రమౌళికి గురువు. సుమారు 45 ఏళ్లకు పైబడిన తన సినీ ప్రస్థానంలో నటుడిగా, డబ్బింగ్ కళాకారుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
‘అంతా మన మంచికే’ అనే చిత్రంతో చంద్రమౌళి వెండి తెరకు పరిచయం అయ్యారు. ఆ తర్వాత కృష్ణ, శోభన్‌బాబు, కృష్ణంరాజు, నాగేశ్వరరావు సహా ఇప్పుడున్న అగ్రనటుల సినిమాల్లో కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించారు. రుతురాగాలు సీరియల్‌లో హీరోయిన్ తండ్రిపాత్రలో చంద్రమౌళి నటనకు మంచి గుర్తింపు వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment