
టాలీవుడ్‌లో విషాదం చోటు చేసుకుంది. సీనియర్ నటుడు ఈశ్వరరావు కన్ను మూశారు. మిచిగాన్‌లోని తన కూతురు ఇంటికి వెళ్లిన ఆయన అనారోగ్య కారణంగా అక్టోబర్ 31న మృతి చెందారు. ఆయన స్వర్గం నరకం చిత్రం ద్వారా సినీరంగ ప్రవేశం చేశాడు. దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ సూపర్‌హిట్‌గా నిలిచింది. తన కెరీర్‌లో దాదాపు 200కు పైగా చిత్రాల్లో నటించారు. ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు.
(ఇది చదవండి: తమిళనాట సూపర్ స్టార్ ఎవరు.. క్లారిటీ ఇచ్చిన విజయ్)
తొలి సినిమా స్వర్గం నరకం హిట్ అందుకున్న ఆయన కాంస్య నంది అవార్డును అందుకున్నారు. ఆ తర్వాత దేవతలారా దీవించండి, ప్రేమాభిషేకం, యుగపురుషుడు, దయామయుడు, ఘరానా మొగుడు, ప్రెసిడెంట్ గారి అబ్బాయి, జయం మనదే, శభాష్ గోపి వంటి విజయవంతమైన చిత్రాల్లో ఈశ్వరరావు నటించారు. చివరిసారిగా చిరంజీవి, నగ్మా నటించిన ఘరానా మొగుడు చిత్రంలో కనిపించారు.
(ఇది చదవండి: ఊర్వశి రౌతేలా షేర్ చేసిన వీడియో.. ట్రోల్ అవుతున్న రిషబ్ పంత్)