జైహింద్‌ స్పెషల్‌: గాంధీజీ గ్రామ స్వరాజ్యానికి చంద్రమౌళి చెక్‌ పవర్‌  | Azadi Ka Amrit Mahotsav: Indian Politician Kalluri Chandramouli | Sakshi
Sakshi News home page

జైహింద్‌ స్పెషల్‌: గాంధీజీ గ్రామ స్వరాజ్యానికి చంద్రమౌళి చెక్‌ పవర్‌ 

Published Thu, Aug 11 2022 1:19 PM | Last Updated on Thu, Aug 11 2022 1:28 PM

Azadi Ka Amrit Mahotsav: Indian Politician Kalluri Chandramouli - Sakshi

మన దేశంలో పంచాయతీ చట్టం 1951 ఏప్రిల్‌ నుంచి అమల్లోకి వచ్చింది. స్వేచ్ఛా భారతంలో గ్రామాలు ప్రతి చిన్న విషయానికీ రాష్ట్రానికేసి చూడకూడదు, స్వశక్తితో స్వయం పోషకత్వం స్థితికి రావాలనే భావనతో పంచాయతీ చట్టం తీసుకొచ్చింది వుద్రాస్‌ ప్రావిన్స్‌. ఈ చట్టానికి ఇప్పుడు 71 ఏళ్లు. 2010 నుంచి ఏటా ఏప్రిల్‌ 24 న జాతీయ పంచాయతీ దినోత్సవం జరుపుకుంటున్నాం.

విశేషం ఏంటంటే.. ఈ చట్టం రూపకల్పన, అవులులో ఒక తెలుగు వ్యక్తి పాత్ర ఉండటం తెలుగు వారందరికీ గర్వకారణం. ఆ వ్యక్తే.. కాంగ్రెస్‌లో తిరుగులేని నాయకుడిగా దశాబ్దాలకాలం పార్టీని ముందుకు నడిపించిన కల్లూరి చంద్రమౌళి. దేశంలో మరే ప్రజాప్రతినిధికీ లేనటువంటి చెక్‌ పవర్‌ను పంచాయతీ సర్పంచ్‌కు కట్టబెట్టారాయన.
చదవండి: హైదరాబాద్‌లో 75 ఫ్రీడమ్‌ పార్కులు   

మోపర్రుకు గాంధీజీ!
తెనాలికి సమీపంలోని మోపర్రు చంద్రమౌళి స్వస్థలం. 1898లో జన్మించారు. హైస్కూలు విద్యలోనే సంస్కృతాంధ్ర భాషలు అధ్యయనం చేశారు. తెనాలి, గుంటూరు, కలకత్తాలలో విద్యాభ్యాసం జరిగింది. 1919లో వివాహమైంది. 1920లో ఇంగ్లండ్‌ వెళ్లి అగ్రికల్చర్‌ బీఎస్సీ చదివి 1924లో ఇండియా తిరిగొచ్చారు. భారతీయ సంస్కృతిని రక్షించాలన్నా, ఇంగ్లండ్‌ దేశంలా వునదేశం అభివృద్ధి చెందాలన్నా స్వపరిపాలన అవసరవుని ఆయన భావించారు. దేశవ్యాప్తంగా పర్యటించి గాంధీజీ ఆశ్రవూనికి చేరి ఆయన సేవచేశారు.

స్వగ్రామం మోపర్రుకు చేరుకుని స్వరాజ్య ఉద్యవూన్ని ఆరంభించారు. 1929లో గాంధీజీని మోపర్రుకు రప్పించారు. తెనాలి నుంచి ఎక్కువవుంది యువకులను స్వరాజ్య ఉద్యవుంవైపు వుళ్లించారు. అనేకసార్లు జైలుకెళ్లారు. 1933–62 వరకు జిల్లా కాంగ్రెస్‌ రాజకీయాలకు పెద్ద దిక్కుగా నిలిచారు. 1934లో పార్టీ జిల్లా అధ్యక్షుడిగా, జిల్లా కాంగ్రెస్‌ కార్యాలయాన్ని తెనాలిలోనే ఏర్పాటుచేశారు. తెనాలి కేంద్రంగానే జిల్లా కాంగ్రెస్‌ రాజకీయాలు నడిపారు.

జిల్లా బోర్డు అధ్యక్షుడిగా సావుర్ధ్యాన్ని నిరూపించుకొని 1964లో తెనాలి నుండి శాసనసభ సభ్యునిగా, 1947లో భారత రాజ్యాంగసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 1947 వూర్చిలో ఏర్పాటైన మద్రాస్‌ ప్రావిన్స్‌లో ఓవుండూరి రావుస్వామి రెడ్డియార్‌ వుంత్రివర్గంలో స్థానిక స్వపరిపాలన, సహకార వుంత్రిగా నియమితులయ్యారు. స్వరాజ్య ఉద్యవుంలో పాల్గొన్నవారికి భూవుులు ఇచ్చే ఏర్పాటు చేశారు. తర్వాత 1949లో కువూరస్వామి రాజా వుంత్రివర్గంలోనూ సహకార, స్థానిక స్వపరిపాలన వుంత్రిగా పనిచేశారు. 

సవుగ్ర పంచాయతీ చట్టం
మంత్రిగా ఉన్న ఆ సమయంలోనే చంద్రమౌళి వుహాత్మాగాంధీ ప్రధాన ఆశయమైన గ్రామ స్వరాజ్యం కోసం దేశంలోనే మెుదటగా సవుగ్ర పంచాయతీ చట్టాన్ని తీసుకొచ్చారు. ఉమ్మడి మద్రాసు రాష్ట్ర గ్రామ పంచాయతి చట్టం–1950తో గ్రామాలు పంచాయతీలుగా ఏర్పడ్డాయి. వాస్తవమైన అధికారాన్ని ప్రజల చేతుల్లో పెట్టి అన్ని రంగాల్లోనూ గ్రామ జీవనాన్ని వారే నిర్వహించుకొంటూ, గ్రావూల సర్వతోముఖాభివృద్ధికి కృషి జరగాలనేది చట్టం ప్రధాన ఉద్దేశం.

అందుకే గ్రామ పంచాయతీ సర్పంచ్‌కు చెక్‌పవర్‌ కల్పించారు. ఇళ్లు, వ్యవసాయ ఉత్పత్తులు, వూర్కెట్లపై పన్ను వసూలు అధికారాన్ని కల్పించారు. ఆవిధంగా గ్రామ ప్రభుత్వాలు ఆవిర్భవించాయి. రూ.100 వరకు సివిల్‌ వివాదాలనూ గ్రామ పంచాయతీ కోర్టు పరిధిలోకి తెచ్చారు. నాడు వుద్రాస్‌ ప్రావిన్సులో తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్ర రాష్ట్రాలుండేవి.  

స్వయం నిర్ణయ ఉద్దేశం
చట్టం అవుల్లోకి వస్తున్నపుడు చంద్రవ˜ళి చేసిన రేడియో ప్రసంగం అప్పట్లో ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. గ్రావుసీవుల అభివృద్ధికి సంబంధించి తన అభిప్రాయాలను ఆయన సూటిగా వెల్లడించారు. ‘‘పంచాయతీలు ప్రతి అల్ప విషయానికి రాష్ట్ర ప్రభుత్వంకేసి చూడరాదు. ప్రతి స్వల్ప విషయం రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహించే ‘కేంద్రీకరణ విధానం’ ప్రజాపాలనకు ప్రధాన సూత్రమైన స్వయం నిర్ణయత్వానికి వుుప్పుతెస్తుంది’’ అన్నారు. ‘‘కొలదివుంది పాలకులు ఎచటనో ఒక చోటు నుండి, సర్వ గ్రావూలకు సంబంధించిన సవుస్యలన్నింటిని పరిష్కరింపబూనుట అసంభవవుు’’గా కూడా తేల్చారు.

గ్రామీణ ప్రజలు విద్యావిహీనులు, సదా కలహాలతో కాలం గడుపుతారు... ఇలాంటివారు అధికార నిర్వహణకు అనర్హులు.. అని కొందరు శంకిస్తుంటారని చెబుతూ, ఇది అసవుంజసం అన్నారు. ‘‘చదవను రాయను నేర్చుటయే విద్య కాదు.. ఇట్టి చదువ#కంటే సద్గుణవువసరం. సుచరితులకు సదవకాశ మెుసగినచో సేవాతత్పరులయి, యోగ్యతను బడసి పైకి రాగలరు’’ అన్నారు.

ప్రజలు తవుకు విశ్వాసపాత్రులయిన వారినే పంచాయతీ సభ్యులుగా ఎన్నుకుంటారు. ఒకవేళ స్వార్ధపరులనే ఎన్నుకుంటే దాని ప్రతిఫలం వారిని ఎన్నుకున్నవారే అనుభవిస్తారని కూడా చెప్పారు. ప్రజలు తవు అనుభవంతో తప్పులు గ్రహించి సరిదిద్దుకుంటారని చంద్రవ˜ళి భరోసాగా అన్నారు. ప్రభుత్వం చేసిన చట్టం ఉద్దేశం.. గ్రామాలను స్వశక్తితో స్వయం పోషకత్వ స్థితికి తీసుకురావటమే నని చెప్పారు. ఇందుకు సుచరితులు, సుశిక్షితులు అయిన యువకులు అత్యవసరంగా కావాలని అని స్పష్టం చేశారు.   
– బి.ఎల్‌.నారాయణ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement