తరగతి గదిలోనే టీచర్ దారుణహత్య | man kills women teacher in class room | Sakshi
Sakshi News home page

తరగతి గదిలోనే టీచర్ దారుణహత్య

Published Fri, Apr 21 2017 2:05 AM | Last Updated on Tue, Sep 5 2017 9:16 AM

ప్రేమకుమారి (ఫైల్‌), చంద్రమౌళి

ప్రేమకుమారి (ఫైల్‌), చంద్రమౌళి

చిత్తూరు జిల్లా గంగవరం మండలంలో దారుణం
గంగవరం (పలమనేరు): గురువారం చిత్తూరు జిల్లాలో తరగతి గదిలోనే ఉపాధ్యాయురాలు దారుణహత్యకు గురయ్యారు. చిత్తూరు జిల్లా గంగవరం మండలం మబ్బువాళ్లపేట ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలు ప్రేమకుమారి (32) హత్యకు గురయ్యారు. పోలీసుల కథనం మేరకు.. పలమనేరుకు చెందిన ప్రేమకుమారి మబ్బువాళ్లపేటలో పనిచేస్తున్నారు. సోమల మండలం చిన్నయ్యగారిపల్లె గ్రామానికి చెందిన చంద్ర మౌళి గుండుగల్లు బొమ్మనపల్లెలో టీచర్‌గా పనిచేస్తున్నారు. చంద్రమౌళికి, ప్రేమకుమారికి కొన్నేళ్ల కిందట పరిచయం ఏర్పడింది. వీరిద్దరి మధ్య వివాహేతర సంబంధం, ఆర్థిక లావాదేవీల గొడవలు ఉన్నట్టు సమా చారం.

చంద్రమౌళి 15 రోజులుగా ఆమెను చంపుతానని ఎస్‌ఎంఎస్‌లు పంపుతున్నారు. దీంతో ప్రేమకుమారి విశ్రాంత టీచరైన తన తండ్రిని తోడుగా తీసుకుని స్కూలుకు వస్తున్నారు. అదే స్కూల్లో పనిచేస్తున్న మరో ఉపాధ్యాయుడు గురువారం ఎంఆర్‌సీలో జరుగుతున్న సమావేశానికి వెళ్లారు. ప్రేమకుమారిని స్కూల్లో వదిలి ఆమె తండ్రి బయటకు వచ్చేసరికి నిందితుడు ముఖా నికి ముసుగు వేసుకుని  పాఠశాలలోకి ప్రవేశించి ఆమెపై కత్తితో దాడిచేసి పారిపోయారు.  కుప్పకూలిన ప్రేమకు మారిని పలమనేరు ప్రభుత్వాస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు.

పిల్లల్ని బెదిరించిన నిందితుడు
ఉపాధ్యాయురాలిపై కత్తి దాడిచేస్తూ.. ‘అరిస్తే మిమ్మల్ని కూడా చంపేస్తా. అరవకపోతే మీ మేడమ్‌ను చంపుతా’ అంటూ బెదిరించాడని అందువల్ల అరవలేకపోయామని విద్యార్థులు పోలీసులకు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement