
సాక్షి, తిరుమల: తాను కన్నుమూసినా.. మరొకరికి చూపునివ్వాలన్న సంకల్పంతో టీటీడీ ఈఓ కుమారుడు నేత్రదానం చేశారు. వివరాల్లోకి వెళితే.. టీటీ డీ ఈఓ ఏవీ ధర్మారెడ్డి కుమారుడు చంద్రమౌళిరెడ్డి బుధవారం ఉదయం చెన్నై కావేరి ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆయన ఆదివారం మధ్యాహ్నం కార్డియాక్ అరెస్ట్‌తో కావేరి ఆస్పత్రిలో చికిత్సకోసం చేరారు.
(టీటీడీ ఈఓ ధర్మారెడ్డి ఇంట్లో విషాదం.. గుండెపోటుతో కుమారుడు మృతి)
క్లిష్ట పరిస్థితిలో ఉన్న ఆయన్ను కాపాడడానికి వైద్యులు అనేక రకాల ప్రయత్నాలు చేశారు. అయినప్పటికీ ఆయన తుదిశ్వాస విడిచారు. చంద్రమౌళిరెడ్డి గతంలోనే నేత్రదానానికి అంగీకారం తెలుపు తూ సంతకం చేసినందువల్ల అతని కోరిక మేరకు ఆయన కళ్లను వైద్యులు సేకరించారు. ఇదిలా ఉండగా గురువారం ఉదయం నంద్యాల జిల్లా, నందికొట్కూరు సమీపంలోని పారు మంచ గ్రామంలో చంద్రమౌళిరెడ్డి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. చంద్రమౌళి రెడ్డి మృతికి పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.
చదవండి: (తుమ్మలగుంటకు సీఎం జగన్.. ఎమ్మెల్యే చెవిరెడ్డి కుటుంబానికి పరామర్శ)
Comments
Please login to add a commentAdd a comment