
ఎవర్ని మోసం చేయడానికి...: వైఎస్ జగన్
అమరావతి: మూడేళ్లు అయినా ఏపీ రాజధాని నిర్మాణానికి ఇటుక కూడా పెట్టలేదని ప్రతిపక్ష నేత, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. రాజధాని డిజైన్లను ఇవాళ అసెంబ్లీలో ప్రదర్శించారు. అయితే ఆ ప్రజంటేషన్‌కు వైఎస్ జగన్ హాజరు కాలేదు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ ఎవరిని మోసం చేయడానికి రాజధాని డిజైన్లపై పవర్ పాయింట్ ప్రజంటేషన్లు ఇస్తున్నారని వ్యాఖ్యానించారు. ప్రజంటేషన్‌తో మరో గంట సమయం వృథా తప్ప ఒరిగేదేమీ లేదన్నారు.
కాగా మాస్టర్ ఆర్కిటెక్ట్ నార్మన్ ఫోస్టర్ ఇచ్చిన రాజధాని పరిపాలనా నగరం వ్యూహ డిజైన్లకు ముఖ్యమంత్రి చంద్రబాబు మళ్లీ కొన్ని మార్పులు సూచించిన విషయం తెలిసిందే. పాలనా నగరం మీదగా నిర్మించాలనుకుంటున్న జలమార్గం, అందుకు అవసరం అయిన నీరు, రాజధాని భవిష్యత్ జల అవసరాలు, పులిచింతల ప్రాజెక్టు దిగువన నిర్మించబోయే బ్యారేజీ నుంచి వచ్చే నీటిపై జలవనరుల శాఖ, బ్లూ, గ్రీన్ కన్సల్టెంట్లతో చర్చించి తుది ప్రణాళిక ఇవ్వాలని సీఎం సూచనలు చేశారు.