సాక్షి, న్యూఢిల్లీ: ఆధార్‌పై సుప్రీంకోర్టులో కొనసాగుతున్న ఆధార్ విచారణలో కేంద్రానికి స్వల్ప ఊరట లభించింది. ఆధార్ గోప్యతపై దాఖలైన పిటిషన్లు విచారిస్తున్న అత్యున్నత న్యాయస్థానం..ఆధార్ కార్డు జారీ సంస్థ యుఐడీఏఐ (యూనిక్ ఐడెంటిఫికేషన్ ఆథారిటీ ఆఫ్ ఇండియా) గురువారం కీలక అనుమతి నిచ్చింది. సాంకేతిక సమస్యలపై పలువురు లేవనెత్తిన అంశాల నేపథ్యంలో పవర్ పాయింట్ ప్రెజంటేషన్‌ను ఇవ్వనున్నారు.. దీంతో యుఐడీఏఐ సీఈవో అజయ్ భూషణ్ పాండే ఈ మధ్యాహ్నం 2.30గంటలకు కోర్టుముందు ఈ ప్రెజంటేషన్ ఇవ్వనున్నారు. మరోవైపు యుఐడీఏఐ పీపీపీ ప్రదర్శన అనంతర తమ ప్రశ్నల జాబితాను సిద్ధం చేయాలని పిటిషనర్లను సుప్రీం కోరింది. అనేకమంది లేవనెత్తిన సందేహాలు, భయాలకు ఈ పీపీపీలో సంస్థ నివృత్తి చేయనుందని అంచనా.
Comments
Please login to add a commentAdd a comment