కేసీఆర్ పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ చరిత్రాత్మకం
Published Fri, Apr 1 2016 1:49 AM | Last Updated on Tue, Aug 14 2018 10:54 AM
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులపై గురువారం అసెంబ్లీలో సీఎం కేసీఆర్ చేసిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చరిత్రాత్మకమని రాష్ట్ర ఇంధన, దళిత అభివృద్ధి, సహకార శాఖల మంత్రి జి. జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. తన అద్భుత ప్రెజెంటేషన్‌తో తెలంగాణ సమాజాన్ని జాగృతం చేసిన ముఖ్యమంత్రి అభినందనీయుడని తెలిపారు. సీఎం పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ పూర్తయిన అనంతరం ఆయన గురువారం సాయంత్రం మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. ‘ జిల్లాలో విస్తరించిన ఫోర్లిన్ పాపానికి ఆరు దశాబ్దాలు పాలించిన కాంగ్రెస్, టీడీపీలే కారకులు.
పరిష్కార మార్గాలున్నా ఇంతకాలం పాలించి పరిష్కరించకుండా, ఫ్లోరిన్ బాధితుల పాపాన్ని కాంగ్రెస్, టీడీపీ నాయకులు మూట కట్టుకున్నారు. అటువంటి పరిస్థితుల్లో చేసిన పాపం బయటపడుతుందనే సభ కు రాకుండా మొహం చాటేశారు.’ అని ఆ ప్రకటనలో ఆయన ఎద్దేవా చేశారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలలో అధికారం అనుభవించిన జి ల్లాకు చెందిన జానారెడ్డి, సుఖేందర్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీలో మంత్రి పదవులు పొందిన దామోదర్‌రెడ్డి, వెంకటరెడ్డిలు ఆంధ్ర పాలకులకు వంత పాడి పదవులు దక్కించుకున్నారని, దేవరకొండ, మునుగోడు ప్రాంతాల్లో ఫ్లోరిన్ విస్తరించడానికి వారే కారకులని ఆ ప్రకటనలో ఆయన ఆరోపించారు.
ఎస్సెల్బీసీ, ఎస్సారెస్పీ ప్రాజెక్టులను పూర్తి చేయాలని నాటి పాలకులపై ఒత్తిడి చేయలేని జిల్లా నాయకులు, రాష్ట్ర కాంగ్రెస్‌కు నాయకత్వం వహిస్తూ తెలంగాణ రాష్ట్రానికే ద్రోహం చేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ప్రాజెక్టుల రీడిజైనింగ్‌ను వ్యతిరేకించడం, మిషన్ భగీరథకు మోకాలడ్డేలా ఉత్తరాలు రా యడం ద్వారా కొత్త కుట్రలకు తెరతీస్తున్నారని ఆరోపించారు.ఈ ప్రాజెక్టులు పూర్తయితే తమకు పదవులు రా వని, ఎమ్మెల్యేలు, ఎం పీలుగా గెలవలేరనే నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ రాజకీయాలు గమనించి అపరభగీరథుడిలా శ్రమిస్తున్న కేసీఆర్‌కు ప్రజలుఅండగా నిలవాలని ఆయన కోరారు.
Advertisement