హైదరాబాద్: అసెంబ్లీ హాలులో పవర్పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం సభా నిబంధనలకు విరుద్ధమని తెలంగాణ శాసనమండలిలో ప్రతిపక్షనేత షబ్బీర్ అలీ అన్నారు. పవర్పాయింట్ ప్రజెంటేషన్కు ఏ ప్రాతిపదికన అనుమతి ఇస్తున్నారని అడుగుతూ తాము స్పీకర్కు రెండు సార్లు లేఖ రాసినా సమాధానం ఇవ్వలేదని ఆయన విమర్శించారు. బడ్జెట్ మాదిరిగానే పవర్పాయింట్ ప్రజెంటేషన్ ఉండాలని తాము సూచించామన్నారు.
కమిటీ హాలులో ప్రజెంటేషన్, అసెంబ్లీ హాలులో చర్చ జరపాలని తాము సూచించినా ప్రభుత్వం పట్టించుకోలేదని షబ్బీర్ అలీ ఆవేదన వ్యక్తం చేశారు. పవర్పాయింట్ ప్రజెంటేషన్కు దూరంగా ఉండటం ద్వారా కాంగ్రెస్ పారిపోవటం లేదని, అసెంబ్లీ గౌరవాన్ని కాపాడటానికే దూరంగా ఉన్నాం అని ఆయన స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ మొండిగా వ్యవహరించి సభలోనే ప్రజెంటేషన్ ఇవ్వడం, ఆయన చెప్పినట్లుగానే సభ జరగాలనడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామన్నారు.