'నవిత ఆత్మహత్యకు కేసీఆర్దే బాధ్యత'
'నవిత ఆత్మహత్యకు కేసీఆర్దే బాధ్యత'
Published Thu, Nov 10 2016 3:04 PM | Last Updated on Thu, Mar 21 2019 9:07 PM
హైదరాబాద్: ఇంటర్ విద్యార్థిని గాదం నవిత ఆత్మహత్యకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బాధ్యత వహించాలని శాసన మండలి ప్రతిపక్ష నేత షబ్బీర్‌అలీ అన్నారు. ఫీజులు చెల్లించుకోలేక విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకోకూడదంటే తక్షణం రూ.3 వేల కోట్లు విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 1000 మెగావాట్ల భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్కు కేంద్రం అనుమతి నిరాకరించిందని గుర్తుచేశారు.
ఎలాంటి పనులు జరగకపోయినా ప్రభుత్వం వెయ్యి కోట్లు ఎవరికి చెల్లించారని ప్రశ్నించారు. ఈ కుంభకోణంపై సమగ్ర దర్యాప్తు జరిపించాలన్నారు. కళాశాల ఫీజు చెల్లించేందుకు డబ్బులు లేక ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఉదంతం కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం మోడెగాం గ్రామంలో బుధవారం జరిగిన విషయం తెలిసిందే. మోడెగాంకు చెందిన గాదం నవిత(17) కామారెడ్డిలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్మీడియెట్ సెకండియర్(ఎంపీసీ) చదువుతోంది. ఫీజు చెల్లించలేని పరిస్థితుల్లో మనస్తాపానికి గురై ఇంట్లో ఎవరులేని సమయంలో మంగళవారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
Advertisement