హైదరాబాద్: చదువులు పక్కనపెట్టి తెలంగాణ కోసం ఉద్యమించిన విద్యార్థులపై పెట్టిన కేసులను ఎత్తివేయడంలో జాప్యం ఎందుకు చేస్తున్నారో సీఎం కేసీఆర్ సమాధానం చెప్పాలని మండలిలో కాంగ్రెస్ ఉపనేత షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఏర్పడి ఐదు నెలలైనా కేసుల ఊసే ఎత్తడం లేదని మండిపడ్డారు.
బుధవారం ఆయన గాంధీభవన్‌లో మాట్లాడుతూ ధర్నాలు, దిష్టిబొమ్మల దహనం వంటి ిపీటీ కేసులను మాత్రమే తొలగిస్తున్నారని, ప్రభుత్వ ఆస్తుల విధ్వంసం తదితర తీవ్రత కలిగిన కేసులను పెండింగ్‌లోనే ఉంచారని విమర్శించారు. విద్యార్థులపై కేసులు ఎత్తివేసినట్లు ప్రభుత్వం చెబుతుంటే అడ్వొకేట్లు మాత్రం వారంట్ పెండింగ్‌లో ఉందని పేర్కొంటున్నారని అన్నారు. వారిపై పెట్టిన అన్ని కేసులనూ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.
కేసుల ఎత్తివేతలో రాజకీయం: షబ్బీర్
Published Thu, Oct 30 2014 2:55 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement