మళ్లీ మోసం చేశారు | Muslim reservation on Shabbir Ali Accusation | Sakshi
Sakshi News home page

మళ్లీ మోసం చేశారు

Published Tue, Jun 28 2016 1:55 AM | Last Updated on Tue, Oct 16 2018 5:59 PM

మళ్లీ మోసం చేశారు - Sakshi

మళ్లీ మోసం చేశారు

ముస్లిం రిజర్వేషన్ల వ్యవహారంలో కేసీఆర్‌పై షబ్బీర్ ఆరోపణ
సాక్షి, హైదరాబాద్: ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చిన సీఎం కేసీఆర్ మరోసారి మోసం చేస్తున్నారని శాసనమండలిలో ప్రతిపక్షనేత షబ్బీర్ అలీ అన్నారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ముస్లింలకు రిజర్వేషన్లపై అసెంబ్లీ లో తీర్మానం చేసి, కేంద్రంపై నెట్టేయడానికి కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారన్నారు. ఇఫ్తార్లు, ముస్లింలకు బట్టలు వంటి తాయిలాలతో వారిని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు.

ముస్లింలకు అసలైన ప్రతినిధులమని చెప్పుకుంటున్న మజ్లిస్ నేతలు ఎందుకు నోరువిప్పడం లేదన్నారు. మల్లన్నసాగర్‌కు వెళ్లే ధైర్యం సీఎం కేసీఆర్‌కు, మంత్రులకు లేదన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement