న్యూఢిల్లీ: సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్‌గా ఉండే ముస్లిం మహిళల ఫొటోలను అసభ్యంగా మార్చి బుల్లి బాయ్ యాప్‌లో వేలానికి పెట్టిన కేసులో ప్రధాన నిందితుడు నీరజ్ బిష్ణోయ్ తన పనిని సమర్థించుకున్నాడు. ముస్లిం మహిళల్ని వేధించడం కరెక్టేనని విచారణలో చెబుతున్నట్టుగా పోలీసు వర్గాలు వెల్లడించాయి. బుల్లి బాయ్ యాప్‌ను రూపొందించడానికి వినియోగించిన పరికరాలన్నీ నీరజ్ దగ్గర నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ యాప్‌ని నీరజ్ నవంబర్‌లో రూపొందించాడని డిసెంబర్ 31న ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తెచ్చినట్టుగా పోలీసుల విచారణలో వెల్లడించాడు. ఇక నీరజ్ ముస్లిం మహిళలనే కాకుండా ముంబై పోలీసుల్ని హేళన చేయడానికి ట్విట్టర్‌లో పలు ఖాతాలను సృష్టించాడు. ముస్లిం మహిళల ఫోటోలను వేలానికి పెట్టినప్పటికీ వాటిని అమ్మలేదని, నీరజ్ అసలు ఉద్దేశ్యం వారిని కించపరచి వేధించడమేనని పోలీసులు చెబుతున్నారు. భోపాల్‌లో వెల్లూరు ఇంజనీరింగ్ కళాశాలలో రెండో సంవత్సరం చదువుతున్న నీరజ్‌ను పోలీసులు అరెస్ట్ చేయడంతో అతనిని కాలేజీ నుంచి సస్పెండ్ చేసినట్టుగా యాజమాన్యం తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment